Wednesday, May 07, 2014

నా పేరే భగవాన్--1976

























http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4621
సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::రామకృష్ణ,మంజుల,ప్రభాకర్ రెడ్డి,జయమాలిని,గిరిజ,గిరిబాబు,అల్లురామలింగయ్య,సత్యనారాయణ.

పల్లవి::

ఎంత బాగుంటు౦ది..ఎంత బాగుంటు౦ది 
ఎంత బాగుంటు౦ది..పడుచు పిల్ల కెంత బాగుంటు౦ది
అరెరెరె..ఎంత బాగుంటు౦ది 
పడుచు పిల్లకెంత బాగుంటు౦ది..పట్టుచీర కట్టుకుంటే
ఆ చీర పట్టు తప్పుతుంటే..నా సామిరంగా  
పట్టుచీర కట్టుకుంటే..ఆ చీర పట్టు తప్పుతుంటే
ఎంత బాగుంటు౦ది పడుచు పిల్లకెంత బాగుంటు౦ది
అబ్బబ్బబ్బ..ఎంత బాగుంటు౦ది 
పడుచు పిల్లకెంత బాగుంటు౦ది
ఫైటకొంగు జారుతు౦టే దాన్ని..పడుచువాడు సర్దుతుంటే
నా సామిరంగా..ఫైటకొంగు జారుతు౦టే
దాన్ని పడుచువాడు సర్దుతుంటే 

చరణం::1

మసక మసక చీకటి పడితే
ఆ చీకటిలో చినుకులు పడితే
మసక మసక చీకటి పడితే
ఆ చీకటిలో చినుకులు పడితే
ఆ చీకటిలో ఎంత మైకమో
ఆ చినుకులలో ఎంతటి సుఖమో
చిక్కుపడిన కౌగిలి చెబుతుందే ఓ చెలీ
ఎరుపేక్కిన చెక్కిలి చెబుతుందే ఓ చెలీ
తెల్లారిపోతుంటే తీపి గుర్తు కోస్తుంటే
బరువెక్కిన కళ్లతో మరు మల్లెలు చూస్తుంటే
ఎంత బాగుంటు౦ది..ఎంత బాగుంటు౦ది 
అరెరెరెరె..ఎంత బాగుంటు౦ది 
పడుచు పిల్లకెంత బాగుంటు౦ది
పట్టుచీర కట్టుకుంటే ఆ చీర పట్టు 
తప్పుతుంటే..నా సామిరంగా  
ఫైటకొంగు జారుతు౦టే 
దాన్ని పడుచువాడు సర్దుతుంటే  

చరణం::2

పిల్లగాలి జోలపాడితే ఆ జోలలోన జ్వాల రేగితే
పిల్లగాలి జోలపాడితే జోలలోన జ్వాల రేగితే
ఆ గాలిలో ఎంత మైకమో..ఆ జోలలో ఎంతటి సుఖమో
తడి యారని పెదవులను అడగాలి ఓ చెలీ
చెరిగిపోని చిన్నెలే చెబుతాయి ఓ చెలీ
వయసు తిరిగ బడుతుంటే వలపు ఉలికి పడుతుంటే  
ఒంటిలోని అణువణువూ ఉయ్యాల లూగుతుం౦టే 
ఎంత బాగుంటు౦ది..ఎంత బాగుంటు౦ది 
ఎంత బాగుంటు౦ది పడుచు పిల్లకెంత బాగుంటు౦ది
పట్టుచీర కట్టుకుంటే ఆ చీర పట్టు తప్పుతుంటే సామిరంగా 
ఫైటకొంగు జారుతు౦టే దాన్ని పడుచువాడు సర్దుతుంటే 

గాజుల కిష్టయ్య--1975


సంగీతం::K.V.మహదేవాన్
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::P.సుశీల,S.P.బాలు
Director::Adurthi Subba Rao 
తారాగణం::కృష్ణ,కాంతారావు,చంద్రమోహన్,గిరిబాబు,జరీనా,అంజలీదేవి,శుభ,సూర్యకాంతం   

పల్లవి::
రేపు వస్తానన్నావు ఈ మాపు ఎక్కడ వుంటావు
నీ కళ్ళలోనే తెల్లవార్లు కాపురముంటాను రేపటికొస్తాను

చరణం::1

రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ

చరణం::2

నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి
నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి
కొత్త కొత్త  సోయగాలు కునుకు తీస్తూ ఉంటాయి
మెత్త మెత్తగ కౌగిలిస్తే మేలుకొఒ౦టాయి మిడిసిపడతాయి
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ

చరణం::3

ముసుగు తీయని తామరల్లె నీవు ఉంటావు
ముసురు వీడిన సూర్యుడల్లె  నీవు వస్తావు
రేకు రేకు గడియ తీసి లేత వయసు తలపు తెరచి
రేపు ఒడిలో రకరకాల రుచులు చూస్తాము గెలుచుకుందాము
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ