Wednesday, August 15, 2012

అక్కా చెల్లెలు--1970
సంగీతం:: K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,సుశీల

Film Directed By::Akkineni Sanjeevi
 తారాగణం::అక్కినేని,జానకి,కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,పద్మనాభం,రమాప్రభ,శాంతకుమారి,విజయలలిత,అల్లురామలింగయ్య,ప్రభాకర్ రెడ్డి,చిత్తూర్‌నాగయ్య

పల్లవి::
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా..శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా..శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన

చరణం::1

చెట్టా పట్టగ కాలంగీలం..నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ..చుట్టుకు నేపోనా
చెట్టా పట్టగ కాలంగీలం..నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ..చుట్టుకు నేపోనా
గిలిలేని కౌగిలిలోన..చలికి చెలికి చెర వేయనా
కలలూరే కన్నుల్లోన..తొలి చూపుతో బందీ చేయనా
శ్రీవారేమనుకున్నా..శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన

చరణం::2

పొద్దేతెలియని ముద్దూముచ్చట..నీలో వింటున్నా
హాద్దేచూడని ఆవేశాలు..నీలో కంటున్నా
పొద్దేతెలియని ముద్దూముచ్చట..నీలో వింటున్నా
హాద్దేచూడని ఆవేశాలు..నీలో కంటున్నా
వేగంఉన్నది నాలోనా..బిగువులు ఉన్నవి నీలోనా
ఒదిగి ఒదిగి నీ ఎదలోనా..నేనోడి పోదు నీ ఒడిలోన
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా..శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన

చరణం::3

పొంగే పొంగుకు కట్టలు వేసి..నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే..నేను ఊర్కున్నా
పొంగే పొంగుకు కట్టలు వేసి..నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే..నేను ఊర్కున్నా
మనసు కుదురుగా ఉంటున్నా..సొగసూరించెను పంతానా
పంతాలెందుకు మనలోనా..నీ సొంతం కానని అన్నానా
శ్రీవారేమనుకున్నా..శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన..శ్రీవారు తందాన తాన
ఊహూహు హుహుహుహు..

చదువుకొన్న అమ్మాయిలు--1963::ఆభేరి::రాగం

సంగీతం::రాజేశ్వరరావ్
రచన::దాశరధి
గానం::ఘంటసాల,P.సుశీల

ఆభేరి::రాగం 


గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను

రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోశము
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోశము
ఒకటే హృదయం కోసమూ


ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దర అతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా..ఆ..

ఆ...ఓ..
జతగా చెలిమీ చేసిరీ..అతిగా కరుణే చూపిరీ..ఆ..
చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోశము
ఒకటే హృదయం కోసము


ఓ..
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము..ఆ..
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము

ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోశము
ఒకటే హృదయం కోసము

ఏ దేశమేగినా ఎందు కాలెడినారాయప్రోలు సుబ్బారావు గారు - ఒరిజినల్ ఫుల్ సా౦గ్

ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.

లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు.
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
ఓడలా ఝండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ వీర భావ భారతము.

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
సౌర్య హారముల్ రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక

దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర

వెలిగినదీ దివ్య విశ్వంబుపుత్ర
దీవించె నీ దివ్య దేశంబు పుత్ర
పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట

పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ
కానలా కస్తూరి కాచరా మనకు.

అవమానమేలరా ? అనుమానమేలరా ?
భారతీయుడన౦చు భక్తితో పాడ!

దేశభక్తి గీతాలు
శ్రీలు పొంగిన జీవగడ్డయు
పాలు పాఱిన భాగ్యసీమయు
వ్రాలినది యీ భరతఖండము
భక్తి పాడర;తమ్ముడా!

వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యంబందె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!

విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిదె తమ్ముడా!

సూత్ర యుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్ర దాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెనే చెల్లెలా!

మేలి కిన్నెర మేలవించీ
రాలు కరగగ రాగ మెత్తీ
పాల తీయని బాల భారత
పదము పాడర తమ్ముడా!

నవరసమ్ములు నాట్యమాడగ
చివుర పలుకులు చెవుల విందుగ
కవిత లల్లిన కాంత హృదయం
గౌరవింపవె చెల్లెలా!

దేశ గర్వము దీప్తిచెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశ మరసిన దీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!

పాండవేయమల పదును కత్తులు
నుండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కవి. తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా!

లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవ పదముల
చేర్చిపాడర తమ్ముడా!

తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని పొడిది త్రుళ్ళీ
భంగపడని తెలుంగు నాధుల
పాట పాడవె చెల్లెలా!

రచన : శ్రీ. రాయప్రోలు సుబ్బారావు

Sreelu Pongina JeevaGaddai
Paalu Paarina BhagyaSeemai

Sreelu Pongina JeevaGaddai
Paalu Paarina BhagyaSeemai
Vraalinadhi Ee BharathaKandamu
Bhakthipaadara Thammuda..!
Vraalinadhi Ee BharathaKandamu
Bhakthipaadara Thammuda..!

Sreelu Pongina JeevaGaddai
Paalu Paarina BhagyaSeemai

Deshagarvamu Deepthi Chandaga
Deshacherithamu Tejarillaga
Deshamarasina Deerapurushula
Telisi Paadara Thammudaa..!
Deshamarasina Deerapurushula
Telisi Paadara Thammudaa..!

Sreelu Pongina JeevaGaddai
Paalu Paarina BhagyaSeemai
Vraalinadhi Ee BharathaKandamu
Bhakthipaadara Thammuda..!

Lyricist: Sri Rayaprolu Subba Rao

సారే జహాసె అచ్ఛాదేశభక్తి గీతాలు

సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కే
యే గుల్ సితా హమారా


పరబత్ వో సబ్ సే ఊంఛా
హమ్‌సాయా ఆస్‌మాన్ కా
వో సంతరీ హమారా
వో పాస్‌బా హమారా


గోదిమే ఖేల్‌తీహై
ఇస్‌కీ హజారో నదియా
గుల్‌షన్ హై జిన్‌కే
దమ్‌సే రష్‌కే జినా హమారా


మజ్ - హబ్ నహీ సిఖాతా
ఆపస్‌మె బైర్ రఖ్‌నా
హిందీ హై హమ్ వతన్ హై
హిందుస్తాన్ హమారా

దేశమును ప్రేమించుమన్నా1::దేశమును ప్రేమించుమన్నా
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్


2::పాడిపంటలుపొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్

3::ఈసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయ్
జల్డుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్


4::అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకులు నమ్మవెలె నోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్


5::వెనుక చూసిన కార్యమేమోయ్
మంచిగతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుక పడితే వెనుకేనోయ్


6::పూను స్పర్దను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్


7::దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పకోకోయ్
పూని యేదైనాను, వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్


8::ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసె నోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్


9::పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్ల లోయి


10::సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్


11::చెట్ట పట్టాల్ పట్టుకుని
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి


12::మతం వేరైతేను యేమోయి
మనసు వొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగీ
లోకమున రాణించు నోయి


13::దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలె నోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలె నోయి


14::ఆకులందున అణగి మణగీ
కవిత పలకవలె నోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయి

తల్లీ భారతి వందనము
తల్లీ భారతి వందనము
తల్లీ భారతి వందనము

నీ ఇల్లే మా నందనము
మేమంతా నీ పిల్లలము

నీ చల్లని ఒడిలో మల్లెలము
తల్లి తండ్రులను గురువులను

ఎల్లవేళల కొలిచెదమమ్మ
చదువులు బాగాచదివెదమమ్మ

జాతిగౌరవము పెంచెదమమ్మ
కుల మత భేదము మరచెదము

కలతలు మాని మెలగెదము
మానవులంతా సమానులంటూ

మమతను సమతను పెంచెదము
తెలుగుజాతికి అభ్యుదయం

నవభారతికి నవోదయం
భావిపౌరులం మనం మనం

భారత జనులకు జయం జయం
భావిపౌరులం మనం మనం

mitrulu andarikii independence day 2012. Subhaakaankshalu

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

1::సాగరమేఖల చుట్టుకొని
సురగంగ చీరలా మలచుకొని
స్వేచ్చగానం పాడుకొని
మనదేవికి ఇవ్వాలి హారతులు

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

2::గంగజఠాధర భావనలో
హిమశైల రూపమే నిలుపుకొని
గలగలపారే నదులన్ని
ఒక బృందగానమే చేస్తూవుంటే

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

3::ఎందరో వీరుల త్యాగఫలం
మననేటి స్వేచ్చకు మూలబలం
వారందరిని తలచుకొని
మనమానసవీధిని నిలుపుకొని

తేనెలతేటల మాటలతో
మనదేశ మాతనే కొలిచెదమా
భావం, భాష్యం చూసుకొని
సుఖజీవనయానం చేయుదమా

**************************************************************************************
2::ఇదే ఇదే నా దేశం - ఇదే ఆంధ్రదేశం

తరతరాల చరిత్రలో తడిసిన సందేశం
శాతవాహనుల నాటి శౌర్యము ఊపిరిగా
కాకతీయ రాజుల సంగ్రామ దీక్ష సిరిగా
త్యాగరాజు గానసుధ ధారలు సంపదగా
పోతరాజు భాగవతపు గాధలు నా ఎదగా
హంసి అమరావతి నాకమరినని శ్రీకళలై
గోదానది కృష్ణవేణి కూరిమి నిచ్చెలులై
కూచిపూడి నాట్యము నా గొప్పను పెన్నిధిగా
విలసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా
అంధత్వం అన్ని దిశల ఆలోచన రేపగా
తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించగా
ఇది కోస్తా తెలంగాణా ఇది రాయలసీమగా
ఏడు కోట్ల గొంతులచే రాగము వినిపించగా

**************************************************************************************

మన జన్మభూమి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము


ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో
జనయించినవాడ నీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్ ప్రేమించినావో
నినుమొసె ఈ తల్లి కనక గర్భమున


లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేదురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల ఝండాలు ఆడునందాక


అందాక గల ఈ అనంత భూతల్లిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ గీతములు

mitrulu andarikii independence day 2012.


జన గణమన జనగణమన అధినాయక జయహే !భారత భాగ్య విధాతా!
పంజాబ్ ఆంధ్ర గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా
తవశుభనామే జాగే! తవశుభ ఆశిష మాగే!
గాహే తవజయ గాధా!
జనగణ మంగళ దాయక జయహే! భారత భాగ్య విధాతా!
జయహే !జయహే! జయహే! జయజయ జయ జయహే!
జై జై జై భారత భాగ్య విధాతా!

అహరవతవ ఆహ్వాన ప్రచారిత సుని తవ ఉదార వాణీ
హింద్, బౌధ్ధ, శిఖ, ,జైన , పారశిక,ముసల్మాన్
క్రిస్తానీ,పూరణ,పశ్చిమ ,ఆశే,తవ సిమ్హాసన సాపే
ప్రేమ హార హొయ గాధా,జనగణ ఐక్య విధాయక
జయహే భారత భాగ్య విధాతా!

పతన_అభ్యుదయ బంధుర వందా యుగ-యుగ ధావిత యాత్రీ
హేచర సారధి-తవ రధ చక్రే ముఖరిత పధ దిన రాత్రీ
దారుణ విప్లవ మాఝే,తవశంఖ ధ్వని బాజే
సంకట దు:ఖ త్రాతా ,జనగణమన పధ పరిచాయక జయహే!

ఘొర తిమిర ఘన నిబిడ నిశీధేపీడిత మూర్చిత దేశే
జాగ్రత చిల తవ అవిచల మంగళ నత నయనే అనిమేషీ
దుస్వప్నే,ఆతంకే రక్షా కరివే అంకే!స్నేహమయీ తుం మాతా!
జనగణ దు:ఖ త్రాయక జయహే!

రాత్రి ప్రాభాతిల ఉదిల రవి చ్చవి పూర్వ ఉదయ గిరి భాలే!
గాహే విహంగమ పుణ్య సమీరణ నవ జీవన పర పఢాఆలే!
తవకరుణారుణ రాగే! నిద్రిత భారత జాగే! తవచరణే పిత మాతా.
రచన శ్రీ రవీంద్ర నాథ్ ఠాగొర్ {పూర్తిగేయం }బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గీతం పూర్తిగా.....

వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం