Wednesday, May 09, 2007

జీవిత చక్రం--1971

సంగీతం::శంకర్ జైకిషన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల,B.వసంత   
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి::

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో

పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో

నానోము పండింది ఉయ్యాలో నీనోము పండిందా ? ఉయ్యాలో 
మావారు వచ్చిరి ఉయ్యాలో మీవారు వచ్చిరా ? ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో మీవారు వచ్చిరా ? ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో
పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో

చరణం::1

ఊరంత ఈరోజు బతుకమ్మ పండుగ నాబావ వస్తే..వస్తే
నాబావ వస్తే..నా బతుకంత పండుగ..ఆఆఆ 
బావా నీ బావ వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా

బావ..నాబావ వస్తాడు ఆగవే భామా అవునే అతడౌనే అందాల చందమామా..బావా

చరణం::2

మాబావ నవ్వితే మరుమల్లె లెందుకే మాబావ తాకితే సిరివెన్నెల లెందుకే
నింగిని దిగివస్తాడే ముంగిట అగుపిస్తాడే ఒక్కసారి చూశారా సొక్కి సోలి పోతారే..ఆ ఆ
బావా..నా బావా..వస్తాడు ఆగవే భామా ఔనే అతడౌనే అందాల చందమామా

బావా..ఆ 

చరణం::3

ముత్యాల పందిరి వేయించమందువా మేఘాల పల్లకీ తెప్పించమందువా?
ఒంటరిగా వస్తాడే జంటగ కొనిపోతాడే ఊరిని మరిపిస్తాడే నీ వారిని మరిపిస్తాడే..ఆ..ఆ
బావా..నా బావా..వస్తాడు ఆగవే భామా ఔనే అతడౌనే అందాల చందమామా 
బావా నీ బావ వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా
బావా నీ బావ వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా
బావా..నా బావా..వస్తాడు ఆగవే భామా ఔనే అతడౌనే అందాల చందమామా  
బావా..నీ..బావ..వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా
బావా..ఆ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో..ఆఆ 