సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ
గానం::L.R.ఈశ్వరీ
తారాగణం::కృష్ణ,జమున,రాజబాబు,శుభ,అల్లురామలింగయ్య,రావుగోపాలరావు
పల్లవి::
ఎవ్వరి కిచ్చేదీ..ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ..నీకా..నీకా..నీకా
ఎవ్వరి కిచ్చేదీ..ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ..నీకా..నీకా..నీకా
చరణం::1
ఒక్కసారి యిచ్చానంటే..ఉక్కిరి బిక్కిరి ఔతారు
మళ్ళీ మళ్ళీ కావాలంటూ..మారాము చేస్తారు
ఒక్కసారి యిచ్చానంటే..ఉక్కిరి బిక్కిరి ఔతారు
మళ్ళీ మళ్ళీ కావాలంటూ..మారాము చేస్తారు
వెచ్చ వెచ్చని కౌగిలింతకు..వెచ్చ వెచ్చని కౌగిలింతకు
రెచ్చిపోతారు...వెర్రెత్తి చచ్చిపోతారు
ఎవ్వరి కిచ్చేదీ..ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ..నీకా..నీకా..నీకా
చరణం::2
నిగనిగ లాడే బుగ్గలమీద..వగరు ముద్దు నీదంటావూ
నల్ల నల్లని కన్నులలోని..అల్లరి ముద్దు నీదంటావ్
ఎర్రని పెదవి..తీయని తేనె..ఎర్రని పెదవి
తీయని తేనె జుర్రాలంటావు..అందరిలో కుర్రాడంటావూ
ఎవ్వరి కిచ్చేదీ...ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ..నీకా..నీకా..నీకా
చరణం::3
ఈరేయి పోతేరాదని..ఎందుకు తొందర పడతావు
మోవీ మోవీ కలిపేద్దామని..మోమాట పెడతావు
పచ్చ పచ్చని పడుచు...వయసుకు
పచ్చ పచ్చని పడుచు...వయసుకు
ఖరీదు వుందోయి..అందుకు షరాబు ఎవరోయి
ఎవ్వరి కిచ్చేదీ...ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ...నీకా..నీకా..నీకా