Friday, July 16, 2010

ఇంటిదొంగలు--1973





సంగీతం::SP.కోదండపాణి
సాహిత్యం::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల


కొండపై....న..వెండివా....నా....
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలీ
కొండపై....న..వెండివానా....

మబ్బులు వస్తూ పోతుంటాయీ నిలిచేదొకటే నీలాకాశం
కలతలు వస్తూ పోతుంటాయీ మిగిలేదొకటే వలచేహౄదయం
కన్నీళ్ళలో కలకల నవ్వీ కలహాలలో చెలిమిని పెంచీ
కలలాగా బ్రతుకంతా జీవించాలీ
కొండపై....న..వెండివానా.....


నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వానొస్తుందీ
ఆకులు రాల్చే కాలంతోనే చిగురులు తొడిగే ఘడియొస్తుందీ
అనురాగమే తీయనివరమై అనుబంధమే తరగని సిరియై
కలకాలం కాపురం సాగించాలీ

కొండపై....న వెండివా....నా....
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలీ
కొండపై....న..వెండివానా...
.