Monday, December 03, 2012

దేవుడమ్మ--1973




















Producer::చలం
సంగీత::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,జయలలిత,లక్ష్మి,రాజసులోచన,గీతాంజలి,రామకృష్ణ,
రాజబాబు,రమణారెడ్డి

పల్లవి::

నీ మాటంటే నాకూ అదే వేదమూ
నీ తోడుంటే చాలూ అదే లోకమూ 
నీ మాటంటే నాకూ అదే వేదమూ
నీ తోడుంటే చాలూ అదే లోకమూ 
ఓహో ఓ ఓ ఓ ఓ ఓ
లాలా లలలా లాలా లలలా

చరణం::1

పెడదారిలోనా..పడిపోవు వేళా
రహదారి నీవే...చూపావూ
పెడదారిలోనా..పడిపోవు వేళా
రహదారి నీవే...చూపావూ
నీ అడుగులలో...నడిచేనూ
నీలో నేనూ...నిలిచేనూ
నీ మాటంటే నాకూ అదే వేదమూ
నీ తోడుంటే చాలూ అదే లోకమూ 
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
అహా అహా ఆ ఆ హా హా హా 

చరణం::2

నా జీవితానా..తొలిపూల వానా
కురిపించే నేడూ..నీ నవ్వులే
బడివైన నీవే..గుడివైన నీవే
గురువూ దైవం...నీవేలే
తరగని కలిమీ..మన స్నేహం
నీదీ..నాదీ..ఒక ప్రాణం
నీ మాటంటే నాకూ అదే వేదమూ
నీ తోడుంటే చాలూ అదే లోకమూ 
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

దేవుడమ్మ--1973












Producer::చలం
సంగీత::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,మోహనరాజు,P.సుశీల
తారాగణం::చలం,జయలలిత,లక్ష్మి,రాజసులోచన,గీతాంజలి,రామకృష్ణ,
రాజబాబు,రమణారెడ్డి

పల్లవి::

చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ..ఊఊఊ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ
ఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో 
ఓఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో  

చరణం::1

ఈ యింటి సిరిమల్లేవె..నీవు నేడూ
ఏ యింటి జాబిల్లివవుతావో..రేపూ
ఈ యింటి సిరిమల్లేవె..నీవు నేడూ
ఏ యింటి జాబిల్లివవుతావో..రేపూ
పల్లకిలో సాగి...చల్లగ ఊరేగీ
పల్లకిలో సాగి...చల్లగ ఊరేగీ
పచ్చగ నూరేళ్ళుగ..బ్రతకాలి చెల్లీ
బ్రతకాలి...చెల్లీ..ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా..మా ప్రాణమూ

చరణం::2

ఈ పూట వెలిగే..మతాబాల కన్నా
నీ పాల నవ్వుల..దీపాలె మిన్న
ఈ పూట వెలిగే..మతాబాల కన్నా
నీ పాల నవ్వుల..దీపాలె మిన్న
ఈ యింట ఉన్నా..మరో యింట ఉన్నా
ఈ యింట ఉన్నా..మరో యింట ఉన్నా
నీవున్న ఆ యింటె...దీపావళీ
దీపావళీ...నిత్య దీపావళీ
దీపావళీ...నిత్య దీపావళీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ

చరణం::3

ఏ పూర్వ జన్మల..పుణ్యాల ఫలమో
ఈ జన్మలో నేను..మీ చెల్లినయ్యానూ
ఏ పూర్వ జన్మల..పుణ్యాల ఫలమో
ఈ జన్మలో నేను..మీ చెల్లినయ్యానూ
ఏ చోట ఉన్నా..ఇదే మాట అన్నా
ఏ చోట ఉన్నా..ఇదే మాట అన్నా
మీ పేరు నా పేరు...నిలిపేనన్నా
నిలిపేనన్నా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా..మా ప్రాణమూ
ఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో 
ఓఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో