Wednesday, May 13, 2009

సీతా రాములు ~~ 1980 ~~ రాగం:::భూపాళం

సంగీతం::సత్యం
రచన::దాసరి నారాయణ రావ్
గానం::SP. బాలు


రాగం:::భూపాళం

తొలి సంధ్య వేళలో
తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో

వినిపించే రాగం భూపాళం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

తొలి సంధ్య వేళలో
తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో

వినిపించే రాగం భూపాళం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం

గడిచే ప్రతినిమిషం ఎదిగే ప్రతిబింబం
గడిచే ప్రతినిమిషం ఎదిగే ప్రతిబింబం

వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ ఉదయం సంధ్యారాగం మేలుకొలుపే అనురాగం

తొలి సంధ్య వేళలో...ఓ...

ఆ...ఆఆ....ఆఆఆ....
సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్య సమయం
సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్య సమయం

వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం

లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలుపే అనురాగం

తొలి సంధ్య వేళలో
తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో

వినిపించే రాగం భూపాళం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

సీతా రాములు ~~ 1980



సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::SP.బాలు,P.సుశీల


హేయ్..బుంగమూతి బుల్లెమ్మా..దొంగచూపు చూసింది
అహా..బుంగమూతి బుల్లెమ్మా..దొంగచూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటూరాయి..అబ్భా..
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ

కోడెకారు చిన్నోడు..చేతిలో చెయ్ ఏసాడు..
కోడెకారు చిన్నోడు..చేతిలో చెయ్ ఏసాడు..
ఆ చేతిలో ఏముందో..ఆకురాయి..అబ్భా..
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ

మరుమల్లె తీగలాగ..నిలువెల్లా చుట్టేస్తుంది
అణువణువు నాలో నిండీ..మనసంతా పండిస్తుందీ
మనసులో ఏముందో అంత గారం..నన్ను..
కొరుక్కొ..కొరుక్కొ తింటుంది..ఆశింగారం..ఓ..
కొరుక్కొ..కొరుక్కొ తింటుంది..ఆశింగారం

వద్దన్న ఊరుకోడు..కలలోకి వచ్చేస్తాడు
మొగ్గలంటి బుగ్గలమీద..ముగ్గులేసి పోతుంటాడు
ముచ్చటలో ఏముందో చెప్పలేను..అబ్భా..
ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేనూ..
ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేనూ..

అహా..బుంగమూతి బుల్లెమ్మా..దొంగచూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటూరాయి..అబ్భా..
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ..అహా
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ

చుక్కల్లో చక్కదనం..వెన్నెల్లో చల్లదనం
అడుగడుగున అందిస్తుందీ..చిరునవ్వులు చిలికిస్తుందీ
నవ్వుల్లో ఏముందో ఇంద్రధనస్సు..అబ్భా
ఖలుక్కు ఖలుక్కు మంటోంది నాలో వయసూ
ఖలుక్కు ఖలుక్కు మంటోంది నాలో వయసూ

ఉడికించే రాతిరిలో..ఊరించే సందడిలో
బాసలనే పానుపు చేసి..ఆశలనే కానుకచేసి
స్వర్గాలు చూడాలి ఆ మనసులో..నేన్..
ఇరుక్కుని ఇరుక్కోని పోవాలి ఆ గుండెలో
ఇరుక్కుని ఇరుక్కోని పోవాలి ఆ గుండెలో

కోడెకారు చిన్నోడు..చేతిలో చెయ్ ఏసాడు..
ఆ చేతిలో ఏముందో..ఆకురాయి..అబ్భా..
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ

చిలిపి క్రిష్ణుడు--1978









సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల


చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడూ
వాడికన్న వీడుమరీ కొంటేవాడూ..

మల్లెపూల పడవలో..ఆ..ఆ
మంచుతెరల మాటులో..ఆ..ఆ
ఏటి నీటి పోటులా..మాట వినని వయసులో
మల్లెపూల పడవలో..
మంచుతెరల మాటులో..
ఏటి నీటి పోటులా..మాట వినని వయసులో
నీవే నా మురళివని పెదవి చేర్చినాడూ
నీవే నా మురళివని పెదవి చేర్చినాడూ
ఆ పెదవిమీద తనపేరు రాసి చూసుకొన్నాడు
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు

మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తడిసిపోయి యవ్వనం వెతుకుతుంది వెచ్చదనం
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు

పొన్నచెట్టు నీడలో..ఓ..ఓ..
ఎన్ని ఎన్ని ఊసులో..ఆ..ఆ..ఆ..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
పొన్నచెట్టు నీడలో..
ఎన్ని ఎన్ని ఊసులో..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాగము ఈనాటి ప్రణయగీతిలో
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడూ
వాడికన్న వీడుమరీ కొంటేవాడూ.
.

సీతారాములు ~~ 1980



రచన::దాసరి నారాయణ రావ్
సంగీతం::సత్యం
గానం::SP.బాలు,జయప్రద

హ్మ్..
ఏవండోయ్ శ్రీమతి గారూ..లేవండోయ్ పొద్దెక్కిందీ
ఏవండోయ్ శ్రీమతి గారూ..లేవండోయ్ పొద్దెక్కిందీ
ఇల్లు ఊడ్చాలి..కళ్ళాపు చల్లాలి..నీళ్ళు తోడాలి..ఆపై కాఫీ కాయాలీ


ఏవండోయ్ శ్రీమతి గారూ లేవండోయ్ పొద్దెక్కిందీ

'అబ్బ ! ప్లీజ్..ఒక్క గంటండీ..

గంటా గంటని అంటూ ఉంటే లోనుంచి ఆకలి మంటా
మంటా మంటని గిజ గిజ మంటే అమ్మా నాన్నతో తంటా
మంటను మరిచేసి..తలుపులు మూసేసి..దుప్పటి ముసుగేసి
సరిగమ పాడేసి..ఆఫీసుకు నామం పెడితే ఆడ బాసుతో తంటా

'హ్మ్..who is that రాక్షసి ?'
ఉన్నది ఒక శూర్పణఖా..లేటైతే నొక్కును నా పీకా
ఆపై ఇచ్చును ఒక లేఖా..ఆ లేఖతో ఇంటికి రాలేక
నలిగి నలిగి..కుమిలి కుమిలి..చచ్చి చచ్చి..బ్రతికి బ్రతికి

' అయ్యబాబోయ్ !'
'అందుకే ..'
ఏవండోయ్ శ్రీమతి గారు లేవండోయ్ పొద్దెక్కిందీ..అబ్బా

'కాఫీ..కాఫీ..'
కాఫీ..కాఫీ..అంటూ ఉంటే ఉలకరు పలకరు ఏంటంటా
కాఫీ..కాఫీ..అంటూ ఉంటే ఉలకరు పలకరు ఏంటంటా

వంటా వార్పు చేసేది ఇంటికి పెళ్ళామేనంట

'Ofcourse..నాకు రాదే ! ఒక్కసారి చేసి చూపించండీ'

పాలను మరిగించీ..గ్లాసులో పోసేసీ
పౌడరు కలిపేసీ..స్పూనుతో తిప్పేసి
వేడిగా నోటికి అందిస్తే..

'Nonsence! చెక్కెర లేదూ '

అబ్బా ! అరవకు అరవకు ఓ తల్లీ..
అరిస్తే ఇల్లే బెంబెల్లి..ఇరుగుపొరుగు బైదెల్లీ..నిన్నూ నన్నూ చూసెళ్ళి..
ఇంటా బయటా..ఊరు వాడా..గుస గుసలాడేస్తే

'నిజంగా ? '

'నీ తోడు..అందుకే..'
ఏవండోయ్ శ్రీమతి గారూ..ఆగండోయ్ చల్లారండీ..
మ్మ్..హు..అబ్బా..
ఏవండోయ్ శ్రీమతి గారూ..ఆగండోయ్ చల్లారండీ..
ఇల్లు ఊడ్చాలి..అబ్బా..కళ్ళాపు చల్లాలి..మ్మ్ హు..
నీళ్ళు తోడాలి..ఆపై ఆగండోయ్ చల్లారండీ

తేనె మనసులు--1987 ( New)




సంగీతం::బప్పీల హరి
రచన::?
గానం::రాజ్‌సీతారాం,P.సుశీల


మమ్మీ మమ్మీ మమ్మీ పిలిచె రారా సామీ
ఎందుకుపిలిచె మమ్మీ..ఇంటికి రారా సామీ
మమ్మీ మమ్మీ మమ్మీ పిలిచె రారా సామీ
ఎందుకుపిలిచె మమ్మీ..ఇంటికి రారా సామీ
గదందగం పలహారం ఇదినా ఆహ్వానం..ఆహా
పెళ్ళికిదే..పేరంటం..ఎందుకు ఆలస్యం....
నా అందం..ఇక నీ సొంతం..అరెరెరెరె
నా అందం..ఇక నీ సొంతం...

అమ్మి అమ్మి అమ్మీ..ఇంతకు ఏది సామీ
అందం నాకె అమ్మీ..పిలుచుకు పో ఓ లమ్మీ
వరకట్నం..వడిలాసం..ఎంతో చెప్పందే
వలపులతో వలవిసిరే..ఒడుపే మీదండీ..
తెలిసిందీ..నీ పన్నాగం..తెలివైనా.. అరె నీ పధకం

నిను వినా ఎవరినీ..పిలువనే పిలువనూ..
పిలిచినా..ఎవరినీ..ఏనాడు ప్రేమించనూ
హే..ఎవరినీ..తలవను..తలచినా..వలచనూ..
తలచినా..వలచినా..సయ్యాటలే ఆడనూ..
మారనీ..స్నేహమే..పెళ్ళిగా..నిల్లుగా..ఆ ఆ ఆ
అమ్మీ.....
మమ్మీ మమ్మీ మమ్మీ పిలిచె రారా సామీ
అందం నాకె అమ్మీ..పిలుచుకు పో ఓ లమ్మీ

తొలి తొలి పరిచయం..తొలకరీ పరిమెళం
మనసులా పరిణయం..ఆనాడే సాగిందిలే..
ఆ..ఆ..మధురమే..అనుభవం..నిదురలో కలవరం
వలపులే..అనుదినం..వల్లించుకొంటానులే..
సాగనీ..బంధమే..పచ్చగా..చల్లగా..ఆ..ఆ..ఆ.....మమ్మీ.....
అమ్మి అమ్మి అమ్మీ..ఇంతకు ఏది సామీ
అందం నాకె అమ్మీ..పిలుచుకు పో ఓ లమ్మీ
వరకట్నం..వడిలాసం..ఎంతో చెప్పందే
వలపులతో వలవిసిరే..ఒడుపే మీదండీ..
తెలిసిందీ..నీ పన్నాగం..తెలివైనా.. అరె నీ పధకం

మమ్మీ మమ్మీ మమ్మీ పిలిచె రారా సామీ
ఎందుకుపిలిచె మమ్మీ..ఇంటికి రారా సామీ
మమ్మీ మమ్మీ మమ్మీ పిలిచె రారా సామీ
ఎందుకుపిలిచె మమ్మీ..ఇంటికి రారా సామీ
గదందగం పలహారం ఇదినా ఆహ్వానం..ఆహా
పెళ్ళికిదే..పేరంటం..ఎందుకు ఆలస్యం....
నా అందం..ఇక నీ సొంతం..
తెలివైనా.. అరె నీ పధకం
నా అందం..ఇక నీ సొంతం..
తెలివైనా.. అరె నీ పధకం..హెయ్...