సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,జయప్రద,రోజారమణి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,ప్రభాకర రెడ్డి,రావు గోపాల రావు
పల్లవి::
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే
కుర్రదానికి ఏ వైఫైనా..అందమొక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా..కోక ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా..కోక ఒక్కటే
ఈ కుర్రడికి ఏ పొద్ధూ కోరికోక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే
చరణం::1
పడవెంత చిన్నదైనా..గెడవేసి నడపాలి
పడుచెంత సొ౦తమైనా..ముడివేసి అడగాలి
పడవెంత చిన్నదైనా..గెడవేసి నడపాలి
పడుచెంత సొ౦తమైనా..ముడివేసి అడగాలి
గాలి చూసి వాలు చూసి..తెరచాప ఎత్తాలి
గాలి చూసి వాలు చూసి..తెరచాప ఎత్తాలి
ఎంత వీలైన వేళైనా..తెరచాటు ఉండాలీ
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే
చరణం::2
పోటోచ్చిన ఏటికి ఎత్తుపల్ల మొక్కటే
పొంగోచ్చిన వయసుకు పగలు రేయి ఒక్కటే
పగలు రేయి కలుసుకునే హద్దు ఒక్కటే
పలుకరాని పెదవులకి ముద్దు ఒక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా..కోక ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా..కోక ఒక్కటే
ఈ కుర్రడికి ఏ పొద్ధూ..కోరికోక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే