సంగీతం::వేద
రచన::సినారే
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::G.V.R.Seshagiri Rao
తారాగణం::కృష్ణ,గుమ్మడి,కైకాల.సత్యనారాయణ,K.V.చలం,పొట్టిప్రసాద్,బేబి శ్రీదేవి,కాంచన,శకుంతల,సురేఖ.
పల్లవి::
పాలరాతి మందిరాన..పడతి బొమ్మ అందం
అనురాగ గీతిలోన..అచ్చతెలుగు అందం
పాలరాతి మందిరాన..పడతి బొమ్మ అందం
చరణం::1
రతనాల కోట ఉంది..రాచకన్నె లేదు
రంగైన తోట ఉంది..రామ చిలుక లేదు
ఆ రాచకన్నెవు నీవై అలరిస్తే అందం
ఆ రామచిలుకవు నీవై నవ్వితే అందం
పాలరాతి మందిరాన..పడతి బొమ్మ అందం
అనురాగ గీతిలోన..అచ్చతెలుగు అందం
పాలరాతి మందిరాన..పడతి బొమ్మ అందం
చరణం::2
కన్నెమనసు ఏనాడు..సన్నజాజి తీగ
తోడులేని మరునాడు..వాడిపోవు కాదా
ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం
ఆ కన్నెకు తోడుగా నిలచి అల్లుకుంటే అందం
పాలరాతి మందిరాన..పడతి బొమ్మ అందం
అనురాగ గీతిలోన..అచ్చతెలుగు అందం
పాలరాతి మందిరాన..పడతి బొమ్మ అందం
చరణం::3
నీ సోగకన్నుల పైన బాస చేసినాను
నిండు మనసు కోవెలలోన నిన్ను దాచినాను
ఇరువురిని ఏకం చేసే ఈ రాచబందం
ఎన్నెన్ని జన్మలకైనా చెరిగిపోని అందం
చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం
అనురాగ గీతిలోన..అచ్చ తెలుగు అందం
లాల లాల లాలా..లాల లాల లాలా
naenoo manishinae--1971
Music::vaeda
Lyrics::sinaarae
Singer's::baalu,suSeela
Film Directed By::G.V.R.Seshagiri Rao
Cast::Super Star Krishna, Gummadi, Satyanarayana,K.V.Chalam,
Baby Sridevi,Potti Prasad, Sakuntala, Kaanchana,Surekha.
pallavi::
paalaraati maMdiraana..paDati bomma aMdaM
anuraaga geetilOna..achchatelugu aMdaM
paalaraati maMdiraana..paDati bomma aMdaM
::::1
ratanaala kOTa uMdi..raachakanne laedu
raMgaina tOTa uMdi..raama chiluka laedu
aa raachakannevu neevai alaristae aMdaM
aa raamachilukavu neevai navvitae aMdaM
paalaraati maMdiraana..paDati bomma aMdaM
anuraaga geetilOna..achchatelugu aMdaM
paalaraati maMdiraana..paDati bomma aMdaM
::::2
kannemanasu aenaaDu..sannajaaji teega
tODulaeni marunaaDu..vaaDipOvu kaadaa
aa teegaku paMdiri neevai aMdukuMTae aMdaM
aa kanneku tODugaa nilachi allukuMTae aMdaM
paalaraati maMdiraana..paDati bomma aMdaM
anuraaga geetilOna..achchatelugu aMdaM
paalaraati maMdiraana..paDati bomma aMdaM
::::3
nee sOgakannula paina baasa chaesinaanu
niMDu manasu kOvelalOna ninnu daachinaanu
iruvurini aekaM chaesae ee raachabaMdaM
ennenni janmalakainaa cherigipOni aMdaM
cheluni valapu niMpukunna cheliya bratuku aMdaM
anuraaga geetilOna..achcha telugu aMdaM
laala laala laalaa..laala laala laalaa