Friday, March 19, 2010

దేశోద్ధారకులు--1973
























సంగీతం::K.V.మహదేవన్
రచన::V.విశ్వేశ్వరరావు 
గానం::S.P.బాలు
తారాగణం::N.T. రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం

పల్లవి:: 

హ..హ..హ..
ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు..ఊ 
హ..హ..హ..కడుపు మండి న్యాయం అడిగితే
ఎర్రోడు అన్నారు నాయాళ్ళు..నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు 

ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు 
కడుపు మండి న్యాయం అడిగితే
ఎర్రోడు అన్నారు నాయాళ్ళు..నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు

చరణం::1

పెళ్ళాము పుస్తి తాకట్టు పెట్టి పచారు కొట్టుకు సామనుకెళితే 
హ..హ..బాబూ..పెళ్ళాము పుస్తి తాకట్టు పెట్టి పచారు కొట్టుకు సామనుకెళితే 

కొలిచారు రాళ్ళు నాయాళ్ళూ..నాకు కొలిచారు రాళ్ళు నాయాళ్ళూ
కొలిచారు రాళ్ళు నాయాళ్ళూ..నాకు కొలిచారు రాళ్ళు నాయాళ్ళూ 

ఇచ్చిన సరుకులో పుచ్చింది సగపాలూ..
ఊ..ఊ..ఆ..ఓ..ఓ..హ..హ..హ 

ఇచ్చిన సరుకులో పుచ్చింది సగపాలూ..ఊ..ఊ 
కొలిచిన సరుకులో మిగిలేది అరపాలు..ఊ..బాబూ 

ఇచ్చిన సరుకులో పుచ్చింది సగపాలూ..ఊ..ఊ 
కొలిచిన సరుకులో మిగిలేది అరపాలు..ఊ.. 

రివాజు తప్పి లంచాలు పెట్టి కలిపారు మట్టి నాయాళ్ళు 
రివాజు తప్పి లంచాలు పెట్టి కలిపారు మట్టి నాయాళ్ళు 

మనిషి తిండిలో..హో..కలిపారు మట్టి నాయాళ్ళు..హ హ హ 

ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు..ఊ
హ హ హ కడుపు మండి న్యాయం అడిగితే.. 
ఎర్రోడు అన్నారు నాయాళ్ళు..నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు 

చరణం::2

దేశాన్ని ఉద్ధరించడానికే..పుట్టామంటారు నాయాళ్ళు 
దేశానికే చీడ పురుగులు..ఈ దొంగనాయాళ్ళూ 
దేశాన్ని ఉద్ధరించడానికే..పుట్టామంటారు నాయాళ్ళు 
దేశానికే చీడ పురుగులు..ఈ దొంగనాయాళ్ళూ

పుచ్చిపోయిన సరుకులాగనే..పుచ్చిపోతారు నాయాళ్ళు
పుచ్చిపోయిన సరుకులాగనే..పుచ్చిపోతారు నాయాళ్ళు

పురుగులు పడి చస్తారు..ఈ దొంగనాయాళ్ళూ 
పురుగులు పడి చస్తారు..ఈ దొంగనాయాళ్ళూ 

నాయాళ్ళు..దొంగనాయాళ్ళూ..ఈ..నాయాళ్ళు దొంగనాయాళ్ళూ 

ఆకలై  అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు..ఊ
హ..హ..హ..కడుపు మండి న్యాయం అడిగితే 
ఎర్రోడు అన్నారు నాయాళ్ళు..నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు
నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు...............

యువరాజు--1982




సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావు   
గానం::S.P.బాలు,P.సుశీల 

పల్లవి::

ఎవరో చెప్పారు..చిన్నప్పుడు 
నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు 
కార్తీక పున్నమి..తొలిపొద్దులో 
కృష్ణా గోదారి..నడిబొడ్డులో 
ఒక యువరాజు..పుట్టాడని 
ఒక యువరాజు..పుట్టాడని 
వాడే వాడే నారాజు.అవుతాడని

ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు 
నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు 
వైశాఖ పున్నమి..తొలిపొద్దులో 
కృష్ణా కావేరి..నడిబొడ్డులో 
ఒక యువరాణి..పుడుతుండని 
ఒక యువరాణి..పుడుతుండని 
ఆమే ఆమే నారాణి..అవుతుందని 
ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు 
నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు 

చరణం::1

కనులు..నిండుగుంటాయనీ 
కామాక్షి కాదని..కంచిలో లేదని 

ప్రణయానికి..రారాజని 
దేవేంద్రుడు కాడని..స్వర్గంలో లేడని 

కనుముక్కు తీరు..చూసేటి జోరు 
కనుముక్కు తీరు..చూసేటి జోరు 
ఎవరికీ ఇంకెవరికీ..లేదని లేనే లేదని 
ఆమే ఆమే నారాణి..అవుతుందని 

ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు 
నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు 

చరణం::2

సిరులున్న..చిన్నోడనీ 
శ్రీనివాసు కాడని..తిరుపతిలో లేడని 

చిన్నిముక్కు..చిలకమ్మనీ 
చిత్రాంగి కాదని..చిత్రాలు లేవని 

చిరునవ్వు నోరు..చిందాడే తీరు 
చిరునవ్వు నోరు..చిందాడే తీరు 
ఎవరికీ ఇంకెవరికీ..లేదని లేనే లేదని 
వాడే వాడే నారాజు..అవుతాడని 

ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు 
నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు 

వైశాఖ పున్నమి..తొలిపొద్దులో 
కృష్ణా గోదారి..నడిబొడ్డులో 

ఒక యువరాణి..పుడుతుండని 
ఒక యువరాజు..పుట్టాడని 
ఆమే ఆమే నారాణి..అవుతుందని 

ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు 
నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు

YuvaRaaju--1982
Music::Chakravarti
Lyrics::Dasari naaraayana Rao   
Singer's::S.P.Baalu,P.Suseela 
CAST::Akkineni,Jayasudha,Sujatha.
:::

evarO cheppaaru..chinnappuDu 
naakevarO cheppaaru..chinnappuDu 
kaarteeka punnami..tolipoddulO 
krshnaa gOdaari..naDiboDDulO 
oka yuvaraaju..puTTaaDani 
oka yuvaraaju..puTTaaDani 
vaaDe vaaDe naaraaju.avutaaDani

aaaa..evarO cheppaaru..chinnappuDu 
naakevarO cheppaaru..chinnappuDu 
vaiSaakha punnami..tolipoddulO 
krshnaa kaaveri..naDiboDDulO 
oka yuvaraani..puDutunDani 
oka yuvaraani..puDutunDani 
aame aame naaraani..avutundani 
aaaa..evarO cheppaaru..chinnappuDu 
naakevarO cheppaaru..chinnappuDu 

:::1

kanulu..ninDugunTaayanee 
kaamaakshi kaadani..kanchilO ledani 

pranayaaniki..raaraajani 
devendruDu kaaDani..svargamlO leDani 

kanumukku teeru..chooseTi jOru 
kanumukku teeru..chooseTi jOru 
evarikee inkevarikee..ledani lenae ledani 
aame aame naaraani..avutundani 

aaaa..evarO cheppaaru..chinnappuDu 
naakevarO cheppaaru..chinnappuDu 

:::2

sirulunna..chinnODanee 
Sreenivaasu kaaDani..tirupatilO leDani 

chinnimukku..chilakammanee 
chitraangi kaadani..chitraalu levani 

chirunavvu nOru..chindaaDe teeru 
chirunavvu nOru..chindaaDe teeru 
evarikee inkevarikee..ledani lenae ledani 
vaaDe vaaDe naaraaju..avutaaDani 

aaaa..evarO cheppaaru..chinnappuDu 
naakevarO cheppaaru..chinnappuDu 

vaiSaakha punnami..tolipoddulO 
krshnaa gOdaari..naDiboDDulO 

oka yuvaraani..puDutunDani 
oka yuvaraaju..puTTaaDani 
aame aame naaraani..avutundani 

aaaa..evarO cheppaaru..chinnappuDu 
naakevarO cheppaaru..chinnappuDu


చదువుకున్న అమ్మాయిలు--1963




















సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కొసరాజు
గానం::మాధవపెద్ది సత్యం, స్వర్ణలత
తారాగణం::ANR , సావిత్రి , కృష్ణకుమారి , గుమ్మడి , శోభన్‌బాబు , పద్మనాభం , ఇ.వి. సరోజ

పల్లవి::

ఆ..ఏమిటే..
ఏమిటి ఈ అవతారం..ఎందుకు ఈ సింగారం
ఏమిటి ఈ అవతారం..ఎందుకు ఈ సింగారం
పాత రోజులు గుర్తొస్తున్నవి..ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం..ఈ సొగసంతా మీ కోసం

చరణం::1

పౌడర్ దెచ్చెను నీకందం..బాగా వెయ్ వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం..బాగా వెయ్ వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని..తయారైతివా చిట్టి వర్ధనం
చాలును మీ పరిహాసం..ఈ సొగసంతా మీ కోసం

చరణం::2

ఆ..ఆ..ఓ..ఓ..
వయసులోన నే ముదురుదాననా..వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా..వయ్యారానికి తగనిదాననా
వరుసకాన్పులై వన్నె తగ్గినా..అందానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధం..ఎందుకు ఈ అవతారం

చరణం::3

దేవకన్య ఇటు ఓహో..దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా..మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా..చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం..నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది..నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది..నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు..ఏమిటి ఈ అవతారం
చాలును మీ పరిహాసం..ఈ సొగసంతా మీ కోసం

చదువుకున్న అమ్మాయిలు--1963





























సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దాశరథి
గానం::ఆశాలత కులకర్ణి
తారాగణం::ANR , సావిత్రి , కృష్ణకుమారి , గుమ్మడి , శోభన్‌బాబు , పద్మనాభం , ఇ.వి. సరోజ 

పల్లవి:

ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఎందుకు కలలో..కలవరింత
ఎవరిని తలచి..పలవరింత
ఎదుటకురాగా..ఏల ఈ మగత
ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం::1

ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి..ముచ్చట
ముందు జరుగుట..చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా..కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం..ఇంక చాలండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం::2

యువతులు దగ్గర చేరినచో..యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే..కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే..కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ..నటన మానండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం::3

నేనే వలచి రానిచో..చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి..బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే..ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే..ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు..ఇంక క్లోజండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్

చదువుకున్న అమ్మాయిలు--1963






సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్,ఆశాలత కులకర్ణి
తారాగణం::ANR , సావిత్రి , కృష్ణకుమారి,గుమ్మడి, శోభన్‌బాబు, పద్మనాభం, ఇ.వి. సరోజ 

పల్లవి:::

ఆఅ ఆఅ ఆఅ హా..ఓఓ ఓఓ ఓఓ హోయ్ 
ఆఅ ఆఅ ఆఅ హా..ఓఓ ఓఓ ఓఓ హోయ్ 
ఓహొ చక్కని చిన్నది..వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో..నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది..నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు..లేనే లేరన్నది

చరణం::1

వెచ్చగ జవ్వని తాకితే..పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన..ప్రేమ నిండేనే
అయ్యో పాపం..తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి..పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు..ముళ్ళ బాణాలు

ఓహొ చక్కని చిన్నది..వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో..నన్నే చూడన్నది

చరణం::2

పెద్దల అనుమతి..తీసుకో
ప్రేమను సొంతం..చేసుకో
హద్దుపద్దు మీరినా..ఆటకట్టేను
యస్! అంటారు..మావాళ్ళు
నో! అంటేను..జతరారు
తల్లి తండ్రి కూడంటే..గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా..దారి చూపావు

చిన్నది చాలా మంచిది..నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు..లేనే లేరన్నది

చరణం::3

మనసే దోచిన సుందరి..మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు..మరచి పరవశించాలి
అపుడే కాదు..ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు..అందరిముందు వేయగానే
తోడు నీడై కలకాలం..సాగిపోదాము

ఓహొ చక్కని చిన్నది..వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో..నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది..నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు..లేనే లేరన్నదీ

ఓఓ ఓఓ ఓఓ హోయ్..ఓఓ ఓఓ ఓఓ హోయ్
ఓఓ ఓఓ ఓఓ హోయ్..ఓఓ ఓఓ ఓఓ హోయ్
ఓఓ ఓఓ ఓఓ హోయ్..ఓఓ ఓఓ ఓఓ హోయ్
ఓఓ ఓఓ ఓఓ హోయ్..ఓఓ ఓఓ ఓఓ హోయ్

ఆడాళ్ళు మీకు జోహార్లు --1981




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.P.బాలు, P.సుశీల  
తారాగణం::కృష్ణం రాజు,చిరంజీవి,రాజేంద్ర ప్రసాద్, జయసుధ, సరిత

పల్లవి::

రేపు..మాపు..రూపు..మెరుపు
ఎరుపు..పసుపు..మైమరపు
ఆఁ..చూపు..తూపు..తెలుపు..నలుపు
వలపు..తలపు..కలగలుపు

రేపు మాపు రూపు  మెరుపు
ఎరుపు పసుపు మైమరపు
చూపు  తూపు  తెలుపు  నలుపు 
వలపు తలపు  కలగలుపు

అరెం..ఆఁ..అలాకాదు
రేపు..మాపు..తెలుపు..నలుపు
ఎరుపు..పసుపు..కలగలుపు
చూపు..తూపు..రూపు..మెరుపు
వలపు..తలపు..మైమరపు

రేపు మాపు తెలుపు నలుపు
ఎరుపు పసుపు కలగలుపు
చూపు తూపు రూపు మెరుపు
వలపు తలపు మైమరపు

చరణం::1

పారు నీరు పేరు ఏరు
ఏరు చేరు మున్నీరు
కదులు ఎదలు కథలు నదులు

ఊహూ..కదిలే ఎదలో కథలా నదులు
ఆ కథలను చదివే చదువే చదువు 

రేపు..మాపు తెలుపు నలుపు
ఎరుపు పసుపు కలగలుపు
చూపు తూపు రూపు మెరుపు
వలపు తలపు మైమరపు

చరణం::2

మాట..తోట..ఆట..పూట..పాట..తేట
తేట తేట మాటలతోట పాట
పూట పూట పాటలతోటి ఆట
తేట తేట మాటలతోట పాట
పూట పూట పాటలతోటి ఆట

మాటలకున్నది అర్థం
అవి కుప్పగ పోస్తే వ్యర్థం
ప్రతి మనిషికి ఉన్నది పరమార్థం
అది తెలియని బ్రతుకే అనర్థం 

రేపు మాపు తెలుపు నలుపు
ఎరుపు పసుపు కలగలుపు
చూపు తూపు రూపు మెరుపు
వలపు తలపు మైమరపు..మైమరపు

Aadaallu Meeku Joharlu--1981
Music::K.V.Mahadevan
Lyrics::Achaarya Atreya 
Director::K.Balachandar
Singer's::S.P.Baalu, P.Suseela  
CAST::Krishnam Raaju,Chiranjeevi,Raajendra Prasaad Jayasudha, Sarita

:::

repu..maapu..roopu..merupu
erupu..pasupu..maimarapu
aa..choopu..toopu..telupu..nalupu
valapu..talapu..kalagalupu

repu maapu roopu  merupu
erupu pasupu maimarapu
choopu  toopu  telupu  nalupu 
valapu talapu  kalagalupu

aa..aa..aa..alaakaadu
repu..maapu..telupu..nalupu
erupu..pasupu..kalagalupu
choopu..toopu..roopu..merupu
valapu..talapu..maimarapu

repu maapu telupu nalupu
erupu pasupu kalagalupu
choopu toopu roopu merupu
valapu talapu maimarapu

:::1

paaru neeru peru Eru
Eru cheru munneeru
kadulu edalu kathalu nadulu

oohoo..kadile edalO kathalaa nadulu
aa kathalanu chadive chaduve chaduvu 

repu..maapu telupu nalupu
erupu pasupu kalagalupu
choopu toopu roopu merupu
valapu talapu maimarapu

:::2

maaTa..tOTa..aaTa..pooTa..paaTa..teTa
teTa teTa maaTalatOTa paaTa
pooTa pooTa paaTalatOTi aaTa
teTa teTa maaTalatOTa paaTa
pooTa pooTa paaTalatOTi aaTa

maaTalakunnadi artham
avi kuppaga pOste vyartham
prati manishiki unnadi paramaartham
adi teliyani bratuke anartham 

repu maapu telupu nalupu
erupu pasupu kalagalupu
choopu toopu roopu merupu

valapu talapu maimarapu..maimarapu