Saturday, April 25, 2015

మేలుకొలుపు--1978



సంగీతం::మాస్టర్ వేణు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
Film Directed By::B.V.Prasad
తారాగణం::N.T.రామారావు,జయప్రద,K.R.విజయ,చలం నాగభూషణం,జయమాలిని.

పల్లవి::

దారి తప్పిన బాలల్ల్లరా..దగా పడిన యువకుల్లారా
చెడు అనవద్దు..చెడు వినవద్దు..చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు..ఇదే మేలుకొలుపు..ఇదే మేలుకొలుపు 

చెడు అనవద్దు..చెడు వినవద్దు..చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు..ఇదే మేలుకొలుపు..ఇదే మేలుకొలుపు 

చరణం::1

ఇంటిని కాల్చే మంటల్లాగా ఎందుకు బ్రతకాలి
ఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగా ఎపుడూ వెలగాలి

ఇంటిని కాల్చే మంటల్లాగా ఎందుకు బ్రతకాలి
ఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగా ఎపుడూ వెలగాలి
మానవతయే మన దైవం..మంచితనమే మన ధర్మం 
మానవతయే మన దైవం..మంచితనమే మన ధర్మం

చెడు అనవద్దు..చెడు వినవద్దు..చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు..ఇదే మేలుకొలుపు..ఇదే మేలుకొలుపు

చరణం::2

పచ్చని తెలివి విషమించిందా రక్కసులౌతారు
అది మంచిదారిలో మలచుకొంటిరా మహాత్ములౌతారు
మహాత్ములౌతారు..ఊఊఉ 
పరోపకారం పరమగుణం..పరమగుణం
సహనం మన ఆభరణం..ఆభరణం..ఆ

చెడు అనవద్దు..చెడు వినవద్దు..చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు..ఇదే మేలుకొలుపు..ఇదే మేలుకొలుపు

Melukolupu--1978
Music::Mastar Venu
Lyrics::D.C.Narayana Reddi
Singer::S.Janaki
Film Directed By::B.V.Prasad
Cast::N.T.Raama Rao,Jayaprada,K.R.Vijaya,Chalam Naagabhooshanam,Jayamaalini.

::::::::::

daari tappina baalalllaraa..dagaa paDina yuvakullaaraa
cheDu anavaddu..cheDu vinavaddu..cheDu kanavaddu
idi baapoojee pilupu..idE mElukolupu..idE mElukolupu 

cheDu anavaddu..cheDu vinavaddu..cheDu kanavaddu
idi baapoojee pilupu..idE mElukolupu..idE mElukolupu

::::1

inTini kaalchE manTallaagaa enduku bratakaali
aa inTiki challani jyOtullaagaa epuDoo velagaali

inTini kaalchE manTallaagaa enduku bratakaali
aa inTiki challani jyOtullaagaa epuDoo velagaali
maanavatayE mana daivam..manchitanamE mana dharmam 

cheDu anavaddu..cheDu vinavaddu..cheDu kanavaddu
idi baapoojee pilupu..idE mElukolupu..idE mElukolupu

::::2

pachchani telivi vishaminchindaa rakkasulautaaru
adi manchidaarilO malachukonTiraa mahaatmulautaaru
mahaatmulautaaru..uuuuu
parOpakaaram paramaguNam..paramaguNam
sahanam mana aabharaNam..aabharaNam..aa

cheDu anavaddu..cheDu vinavaddu..cheDu kanavaddu
idi baapoojee pilupu..idE mElukolupu..idE mElukolupu

పాలు నీళ్ళు--1981


సంగీతం::సత్యం
రచన::వీటూరి
గానం::P.సుశీల
తారాగణం::మోహన్‌బాబు,జయప్రద 

పల్లవి:: 

నేనే నేనే నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని
నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
ఆదిశక్తిని ఆగమవర్తిని
నేనే స్త్రీ మూర్తిని..ఈఈఈ

చరణం::1

ప్రణయానికి నే ప్రాణశక్తిని
ప్రళయానికి నే మూలశక్తిని నిర్మూలశక్తిని
వినయానికినే..విమల ధాత్రిని
విమల శీలా..నిత్యాగ్నిహోత్రిని
కల్లోలిత సంసారాజలధిలో ఊళ్ళోలితమో జీవిత నౌకకు
కల్లోలిత సంసారాజలధిలో ఊళ్ళోలితమో జీవిత నౌకకు
ఉత్తర దిక్కున వెలిగే చుక్కని చుక్కానినీ
నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని

చరణం::2

కళకు అంకితం నేనైనా కళంకితను గానూ
అబల అబల అని ఎవరన్నా బలహీనను నే గానూ
పతికి అనురాగవల్లిని సుతుల మురిపాల తల్లిని
పతికి అనురాగవల్లిని సుతుల మురిపాల తల్లిని
తరతరాల వరవరాల నల్లిన భారతీయ సంస్కృతిని
కవిరాయలేని కృతిని రవిచూడలేని ప్రకృతిని
నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
ఆదిశక్తిని ఆగమవర్తిని
నేనే స్త్రీ మూర్తిని..ఈఈఈ

తాతయ్య ప్రేమలీలలు--1980


సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు, S.జానకి
Film DirecTed By::B.V.Prasaad
తారాగణం::చిరంజీవి,గీత,సీమ,నుతన్‌ప్రసాద్,దీప,నిర్మలమ్మ.

పల్లవి::

వెన్నెల్లో విన్నాను..సన్నాయి గీతం
నీవేలే ఆ గానం.. నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను..కల్యాణ దీపం
నీవేలే ఆ రూపం..నీవేలే నా ప్రాణం

వెన్నెల్లో విన్నాను..సన్నాయి గీతం
కన్నుల్లో కన్నాను..కల్యాణ దీపం

చరణం::1

ఆమని రమ్మంది..అలవోకగా
అరుదైన అందాలు..చవి చూడగా
ఆమని రమ్మంది..అలవోకగా
అరుదైన అందాలు..చవి చూడగా
కోయిల కూసింది..సరి కొత్తగా
శతకోటి భావాలు..మొలకెత్తగా
కోయిల కూసింది..సరి కొత్తగా
శతకోటి భావాలు..మొలకెత్తగా
విరజాజిలో..నిను చూసితి
చూసి చేయ్ సాచి..దరి చేరితి
చేరి నిలువెల్ల ముద్దాడితి
కన్నుల్లో కన్నాను..కల్యాణ దీపం
నీవేలే ఆ రూపం..నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను..కల్యాణ దీపం

చరణం::2

ఆహా..లలలలలాలా
లలలలలాలా..అహా
లలలలలాలా..లలలలలాలా
అహా..లలలలలాలా
సందిట జాబిల్లి..జతకూడెను
చలి తీరి రేరాణి..చెలరేగెను 
సందిట జాబిల్లి..జతకూడెను
చలి తీరి రేరాణి..చెలరేగెను 
వాకిలి తీసింది..వనమాలికా
వగలెన్నో పోయింది..చెలి కోరికా 
వాకిలి తీసింది..వనమాలికా
వగలెన్నో పోయింది..చెలి కోరికా 
చిరుగాలినై..దరి చేరితి
చేరి మనసారా..నిను తాకితి
తాకి పులకించి..తరియించితి 

వెన్నెల్లో విన్నాను..సన్నాయి గీతం
నీవేలే ఆ గానం..నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను..కల్యాణ దీపం
నీవేలే ఆ రూపం..నీవేలే నా ప్రాణం
లలాలా..అహా..హా..లలాలా..ఉ..ఉ

Taatayya PrEmaleelalu--1980
Music::Rajan - Nagendra
Lyrics::Mallemaala
Singer's::S.P.Balu,S.Janaki
Film DirecTed By::B.V.Prasaad
Cast::Chiranjeevi,Geeta,Seema,Nootan Prasad,Deepa,Nirmalamma

::::::::::::

vennellO vinnaanu..sannaayi geetam
neevElE aa gaanam.. neevElE naa praaNam
kannullO kannaanu..kalyaaNa deepam
neevElE aa roopam..neevElE naa praaNam

vennellO vinnaanu..sannaayi geetam
kannullO kannaanu..kalyaaNa deepam

::::1

aamani rammandi..alavOkagaa
arudaina andaalu..chavi chooDagaa
aamani rammandi..alavOkagaa
arudaina andaalu..chavi chooDagaa
kOyila koosindi..sari kottagaa
SatakOTi bhaavaalu..molakettagaa
kOyila koosindi..sari kottagaa
SatakOTi bhaavaalu..molakettagaa
virajaajilO..ninu choositi
choosi chEy^ saachi..dari chEriti
chEri niluvella muddaaDiti
kannullO kannaanu..kalyaaNa deepam
neevElE aa roopam..neevElE naa praaNam
kannullO kannaanu..kalyaaNa deepam

::::2

aahaa..lalalalalaalaa
lalalalalaalaa..ahaa
lalalalalaalaa..lalalalalaalaa
ahaa..lalalalalaalaa
sandiTa jaabilli..jatakooDenu
chali teeri rEraaNi..chelarEgenu 
sandiTa jaabilli..jatakooDenu
chali teeri rEraaNi..chelarEgenu 
vaakili teesindi..vanamaalikaa
vagalennO pOyindi..cheli kOrikaa 
vaakili teesindi..vanamaalikaa
vagalennO pOyindi..cheli kOrikaa 
chirugaalinai..dari chEriti
chEri manasaaraa..ninu taakiti
taaki pulakinchi..tariyinchiti 

vennellO vinnaanu..sannaayi geetam
neevElE aa gaanam..neevElE naa praaNam
kannullO kannaanu..kalyaaNa deepam
neevElE aa roopam..neevElE naa praaNam

lalaalaa..ahaa..haa..lalaalaa..u..u