Sunday, February 22, 2009

సీతారామకల్యాణం--1961::ఆరభి :::రాగం



సంగీతం::గాలి పెంచల నరసింహారావు 
రచన::సముద్రాల రాఘవాచార్యులు
గానం::ఘంటసాల
ఆరభి :::రాగం


హే పార్వతీనాథ కైలాస శైలాగ్రవాసా
శశాంకార్థ మౌళీ ఉమా దేవతోల్లాసి తవ్యాంగభాగా
శ్రితానందదాయి స్మితాపాంగా
భస్మీకృతానంద గంగాధరా
సర్వసంతాప హరా హరా
శివా సదాశివా - 


మాయామాళవగౌళ::రాగం 
నీయున్న చందంబు నేనెంత
యూహింపగా వచ్చు - వేదమ్ములున్నీవ వాదమ్ములున్నీవ
ధైర్యంబులున్నీవ మర్మంబులున్నీవ
సర్వంబులున్నీవ - నీ లెంకలైనట్టి దాసుండనైనట్టి
నన్నుం దయాళుండవై ప్రీతి రక్షింపవే
తప్పు సైరింపవే దేవ మన్నింపవే - దేవదేవా మహాదేవా
నమస్తే నమస్తే నమః

సీతారామకల్యాణం--1961::శంకరాభరణం::రాగ





















సంగీతం::గాలి పెంచల నరసింహారావు 
రచన::సముద్రాల రాఘవాచార్య 
గానం::ఘంటసాల 

రాగ:::శంకరాభరణం

కానరార కైలాసనివాస
బాలేందుధరా జటాధరా!
కానరార కైలాసనివాస
 



భక్తజాల పరిపాల దయాళా 
భక్తజాల పరిపాల దయాళా
హిమశైల సుతా ప్రేమలోలా
కానరార కైలాస నివాస 
బాలేందుధరా జటాధరా
కానరార

నిన్నుచూడ మది కోరితిరా...
నిన్నుచూడ మది కోరితిరా
నీ సన్నిధానమున నిలచితిరా...
నిన్నుచూడ మది కోరితిరా
నీ సన్నిధానమున నిలచితిరా...
నిన్నుచూడ మది కోరితిరా
నీ సన్నిధానమున నిలచితిరా...
కన్నడసేయక కన్నులుచల్లగ
మన్ననసేయర గిరిజారమణా..
కానరార కైలాసనివాస


సర్పభూషితాంగా కందర్పదర్పభంగా
సర్పభూషితాంగా కందర్పదర్పభంగా
భవపాపనాశ పార్వతీమనొహర
హేమహేశ వ్యోమకేశ త్రిపురహర
కానరార కైలాసనివాస







స్తోత్రం:
జయత్వదభ్ర విభ్రమత్ భ్రమద్భుజంగమస్ఫురత్ 
ధగద్ధగద్వినిర్గమత్ కరాళఫాల హవ్యవాట్!
ధిమిద్ధిమిద్ధిమిద్ద్వనన్‌ మృదంగ తుంగ మంగళ
ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః
ఓం నమః శివాయ 

అగ(ఖ)ర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధూవ్రతం
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే
ఓం నమః హరాయ 

ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మఝ్ఝటా
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం
స్మరచ్ఛిదం, పురచ్ఛిదం, భవచ్ఛిదం, మఖచ్ఛిదం
గజచ్ఛికాంధకచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే