Monday, June 04, 2012

గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు


కురుక్షేత్రం--1977
సంగీతం::S..రాజేశ్వర రావ్
రచన::శ్రీశ్రీ
గానం::S.P.బాలు

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం .
ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం
కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం
రధగజహయపదాతిదళసరభసగమనం
ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం
రధగజహయపదాతిదళసరభసగమనం
ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం
కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం

కపిధ్వజాంచిత సితాశ్వరంజిత రధస్థితులు కృష్ణార్జునులు !!2!!
విజయుడు రాధీ.. గోవిందుడు సారధీ
ఉభయులు నర నారాయణులు
ఉభయులు నర నారాయణులూ
గ్రీష్మాధిత్యుడు భీష్మాచార్యుడు తాళపతాక విరాజితుడు
రంగత్తుంగ మదేభనిభాంకుడు రారాజు ధుర్యోధనుడు
మానవ జీవితమే ఒక మహాభారతం ఆ..ఆ....
మానవ జీవితమే ఒక మహాభారతం
అది మంచి చెడుల రెంటి నడువ నిత్యఘర్షణం
నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే ..ఆ...
ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే..
ధర్మయుద్ధమే...

ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం
కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం

స్థితప్రజ్ఞుడతి నిర్మలచరితుడు ధర్మాయుధుడు యుధిష్టిరుడు
నిపుమర్ధన దోర్దాముడు భీముడు శబధనిబద్ధ గాధాయుధుడు
ధనురాగమనిష్ణాతుడు ద్రోణుడు కదన వ్యూహ విశారదుడు
బాహుబలోదగ్రులు బడబాగ్ని శిఖావిజ్ఞోతులు
మొహరించిరాహవమున తనయులు తండ్రులు తాతలు ఆ..
బాహుబలోదగ్రులు బడబాగ్ని శిఖావిజ్ఞోతులు
మొహరించిరాహవమున తనయులు తండ్రులు తాతలు
అనివార్యం యుద్ధం..
అనివార్యం యుద్ధం
శరసంధానమే ధర్మం
శరసంధానమే ధర్మం ఆధర్మ పరిక్షాంగణమే కురుక్షేత్రం...కురుక్షేత్రం...కురుక్షేత్రం

ప్రళయకాళుడై విలయరుద్రుడై ద్రోణాచార్యుడు
భయదాస్త్రంభుల పాండవ సేనల ఛండాడే

ధర్మజుడసత్యమాడకున్న గురుడస్తమించడని
హరిపలికే అదే.. సమయమున భీముడు
చంపెను అశ్వద్ధామ భయఝురినీ..
ఆశ్వద్ధమహతః కుంజరః అనెను
విధిలేక ధర్మాత్మజుడు

తనయుడే మరణించెను శోకభారాన
కురుదస్త్రశస్త్రాలు ధరణి పడవేసే
ద్రుష్టద్యుమని మనో భీష్టంబు నెరవేర
కురునిపై లంఘించి శిరము ఖండించే
ద్రోణ అంతమునుగాంచి కౌంతేయప్రదముండు
అంతరంగమునందుకొంతశాంతించే కురువృద సింహము గురువృద్ధ కుంజరము
కూలెనని కురురాజు కుమిలి దురపిల్లె
ద్రోణ దుర్మాణానికి అశ్వద్ధామ
రెండవరుద్రుడై అగ్నిముఖ నారాయణస్త్రము
నంపె పండవసేనపై
ఆయుధంమ్ముల విడచి శరణ ఆనచేసేను శ్రీహరీ.. ..

శ్రీమతి ఒక బహుమతి--1987
సంగీతం::శంకర్-గణేష్ 
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు 
Film Directed By::Vissu 
తారాగణం::చంద్రమోహన్,నరేష్,విస్సు,జయప్రద,కల్పన.తులసిరాం,అరుణ,

పల్లవి::

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం::1

కోతిమంద చేత సేతువే నిర్మింపచేసింది ఆడదిరా
నాడు తాళికోసం యముడి కాలపాశంతోనే పోరింది ఆడదిరా
ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండ ఆపింది ఆడదిరా
అల్ల బాలచంద్రుడి చండ్రభాను తేజము వెనుక వెలిగింది ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
ఇతగాన్ని నడుపుతుంది అటువంటి ఆడదిరా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం::2

దశరధున్ని నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా
అయ్యో భీష్ముడంతటివాణ్ణి అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరా
అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ఠ చెరిపింది ఆడదిరా
అహ పల్నాడు నేలంతా పచ్చినెత్తుట్లోన తడిపింది ఆడదిరా
కోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరా
కోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరా
ఈ మగవాన్ని నేడు చెరిచింది ఆడదిరా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం::3

పంచపాండవులకు కీర్తి కిరీటలు పెట్టింది ఆడదిరా
అయ్యో ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరా
పోత పోసిన పున్నమంటి తాజ్‌మహలు పునాది ఆడదిరా
అయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూలగొట్టింది ఆడదిరా
మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా
మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా
చరిత్రలో ప్రతి పుట ఆమె కథే పాడునురా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

Sreemati Oka Bahumati--1987 
Music::Sankar-Ganesh
Lyrics::Sirivennela
Singer::S.P.Baalu 
Film Directed By::Vissu 
Cast::Chandramohan,Naresh,vissu,Jayaprada,Kalpana.Tulasiraam,Aruna,

:::::::::::

aaDadE aadhaaram mana katha aaDane aarambham
aaDadE santOsham manishiki aaDade santaapam
aaDadE aadhaaram mana katha aaDane aarambham
aaDadE santOsham manishiki aaaDade santaapam

::::1

kOtimanda chEta sEtuvE nirmimpachEsindi aaDadiraa
naaDu taaLikOsam yamuDi kaalapaaSamtOnE pOrindi aaDadiraa
khaDga tikkana katti tuppu paTTakunDa aapindi aaDadiraa
alla baalachandruDi chanDrabhaanu tEjamu venuka veligindi aaDadiraa
vEmana vEdaaniki naadam oka aaDadiraa
vEmana vEdaaniki naadam oka aaDadiraa
itagaanni naDuputundi aTuvanTi aaDadiraa

aaDadE aadhaaram mana katha aaDane aarambham
aaDadE santOsham manishiki aaDade santaapam
aaDadE aadhaaram mana katha aaDane aarambham
aaDadE santOsham manishiki aaaDade santaapam

::::2

daSaradhunni naaDu dikkulEni daSaku techchindi aaDadiraa
ayyO bheeshmuDantaTivaaNNi ampaSayyanu peTTi champindi aaDadiraa
andaala aggilO viSvaamitruDi nishTha cheripindi aaDadiraa
aha palnaaDu nElantaa pachchinettuTlOna taDipindi aaDadiraa
kODalni tagalapeTTE atta kooDaa aaDadiraa
kODalni tagalapeTTE atta kooDaa aaDadiraa
ee magavaanni nEDu cherichindi aaDadiraa

aaDadE aadhaaram mana katha aaDane aarambham
aaDadE santOsham manishiki aaDade santaapam
aaDadE aadhaaram mana katha aaDane aarambham
aaDadE santOsham manishiki aaaDade santaapam

::::3

panchapaanDavulaku keerti kireeTalu peTTindi aaDadiraa
ayyO indruDu chandruDu apakeerti paalaina kaaraNam aaDadiraa
pOta pOsina punnamanTi taaj^mahalu punaadi aaDadiraa
ayyO mETi saamraajyaala kOTalennO koolagoTTindi aaDadiraa
manchikainaa cheDukainaa moolam oka aaDadiraa
manchikainaa cheDukainaa moolam oka aaDadiraa
charitralO prati puTa aame kathE paaDunuraa

aaDadE aadhaaram mana katha aaDane aarambham
aaDadE santOsham manishiki aaDade santaapam
aaDadE aadhaaram mana katha aaDane aarambham

aaDadE santOsham manishiki aaaDade santaapam