Friday, June 26, 2015

వియ్యాలవారి కయ్యాలు--1979



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::P.సుశీల,S.P.బాలు
 తారాగణం::కృష్ణ,జయప్రద,నాగభూషణం,రావు గోపాలరావు,సూర్యకాంతం,S.వరలక్ష్మి,జయమాలిని 

పల్లవి::

పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే 

పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే

చరణం::1

చల్లకొచ్చి ముంత దాచే చక్కని గుంట
నువ్ సల్లగుండ
రావే నా వెంట రాగాల పంట
పగలు రేయి పండించుకుంట..ఓ..ఓ..ఓ

అల్లరెందుకు అందాల విందుకు
పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే

చరణం::2

మాటలెందుకు మగసిరుంటే
పాటలెందుకు నీ పక్కనుంటే
అరుపులెందుకు నిన్నల్లుకుంటే
అర్ధరాత్రి ఎవరేనా వింటే..ఓ..ఓ..ఓ

హద్దులెందుకు ముద్దాడుకొందుకు
పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే

చరణం::3

పాత రోజులు గుర్తుకొచ్చే
కొత్త మోజులు పుట్టుకొచ్చే
బండబారిన పడుచుదనము
పడగ విప్పి పైపైకి వచ్చే
ఏ..ఏహె..ఏహె

అల్లరెందుకు అందాల విందుకు
పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే
అహ..అహ..హ..హ..హా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ