Saturday, July 31, 2010

నాగులచవితి--1956





















సంగీతం::R.గోవర్ధనం మరుయు R.సుదర్శనం
రచన::పరశురాం
గానం::P.సుశీల
తారాగణం: R. నాగేంద్రరావు, K. రఘురామయ్య, నాగభూషణం, జమున, జానకి, పద్మనాభం

పల్లవి::

ఓ దేవ ఫణీశా శరణమయా..నా నాదును బ్రోవుమయా
నా నాదును బ్రోవుమయా
ఓ దేవ ఫణీశా శరణమయా..నా నాదును బ్రోవుమయా..ఆ
ఓ దేవ ఫణీశా శరణమయా..నా నాదును బ్రోవుమయా

చరణం::1

ప్రేమభావన లేమో ఏమో..ఊహాజగతి నేపారే
ప్రేమభావన లేమో ఏమో..ఊహాజగతి నేపారే
కాంచిన కలలే నిజమగుదరినే..నిజమే తొలగా నగునే

ఓ..దేవమహాత్మ మరులుమయా..నా నాధుని బ్రోవుమయా..ఆ
ఓ దేవ ఫణీశా శరణమయా..నా నాదును బ్రోవుమయా

చరణం::2

వలపు తేనియల సోనలనానే ప్రధమ సమాగమమయ్యా
వలపు తేనియల సోనలనానే ప్రధమ సమాగమమయ్యా
యవ్వన జీవన సుధానిధులలో..విషబింధువు చిందకయా
ఆ..విషబింధువు చిందకయా..ఆ
నా పసుపు కుంకుమా నిలుపుమయా..నా నాదును బ్రోవుమయా 
నా పసుపు కుంకుమా నిలుపుమయా..నా నాదును బ్రోవుమయా 

చరణం::3

శోభనరాత్రే కాళరాత్రిగా..చేయుటే న్యాయమా..దేవా
శోభనరాత్రే కాళరాత్రిగా..చేయుటే న్యాయమ దేవా
కరువదలచినా కరువుమిరువురా..మరణింతుము ఒకమారే 
మరణింతుము ఒకమారే..
నిలిపినాడవా నా తండ్రీ..నిరుపమాన కరుణ 
నా గళసీమ మాంగల్య శోభా..ఆ.. 
నిలిపినాడవా నా తండ్రీ..అందుకొనుమయ్యా ఓ దేవా
ఆశ్రితుల కృతజ్ఞతపూర్వకంబు..వందనశతంబు 
అందుకొనుమయ్యా..ఓఓఓ..దేవా..ఆఆఆ    
   

NaagulaChaviti--1956
Music::R.Govardhanam & R.SudarSanam
Lyrics::Parasuram
Singer::P.Suseela
Cast::R.Nagendra rao,K.Raghuraamayya,Naagabhushanam,Jamuna,Jaanaki,Padmanaabham.

:::

O dEva phaNiiSaa SaraNamayaa..naa naadunu brOvumayaa
naa naadunu brOvumayaa
O dEva phaNiiSaa SaraNamayaa..naa naadunu brOvumayaa..aa
O dEva phaNiiSaa SaraNamayaa..naa naadunu brOvumayaa

:::1

prEmabhaavana lEmO EmO..Uhaajagati nEpaarE
prEmabhaavana lEmO EmO..Uhaajagati nEpaarE
kaanchina kalalE nijamagudarinE..nijamE tolagaa nagunE

O..dEvamahaatma marulumayaa..naa naadhuni brOvumayaa..aa
O dEva phaNiiSaa SaraNamayaa..naa naadunu brOvumayaa

:::2

valapu tEniyala sOnalanaanE pradhama samaagamamayyaa
valapu tEniyala sOnalanaanE pradhama samaagamamayyaa
yavvana jeevana sudhaanidhulalO..vishabindhuvu chindakayaa
aa..vishabindhuvu chindakayaa..aa
naa pasupu kunkumaa nilupumayaa..naa naadunu brOvumayaa 
naa pasupu kunkumaa nilupumayaa..naa naadunu brOvumayaa 

:::3

SObhanaraatrE kaaLaraatrigaa..chEyuTE nyaayamaa..dEvaa
SObhanaraatrE kaaLaraatrigaa..chEyuTE nyaayama dEvaa
karuvadalachinaa karuvumiruvuraa..maraNintumu okamaarE 
maraNintumu okamaarE..
nilipinaaDavaa naa tanDrii..nirupamaana karuNa 
naa gaLaseema maangalya SObhaa..aa.. 
nilipinaaDavaa naa tanDrii..andukonumayyaa O dEvaa
ASritula kRtajnatapoorvakambu..vandanaSatambu 
andukonumayyaa..OOO..dEvaa..aaaaaaaaa    
   

దీపారాధన--1981



















'





సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణరావ్ 
గానం::S.P.బాలు  
తారాగణం::శోభన్ బాబు, జయప్రద,మురళీ మోహన్, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆ ఆ ఆ ఆ ఆ

తెల్ల కాగితం మనిషి జీవితం 
ఒకో అక్షరం ప్రతి నిమిషం 
తెల్ల కాగితం మనిషి జీవితం 
ఒకో అక్షరం ప్రతి నిమిషం
చెయ్యి మారితే రాత మారుతుంది 
చెయ్యి మారితే రాత మారుతుంది
చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది 

తెల్ల కాగితం మనిషి జీవితం 
ఒకో అక్షరం ప్రతి నిమిషం 

చరణం::1 

బాష ఏది ఐనా చూసేందుకు అక్షరాలు కొన్నే 
అక్షరాలు కొన్నైనా రసేందుకు భవాలు ఎన్నో 
అనుకున్నవి రాయలేరు కొందరు 
రాసినా చెయ్యలేరు కొందరు 
చేసినా..ఆ..పొందలేరు కొందరు 
పొందినా..ఆ..ఉందలేరు కొందరు 
పొందినా..ఉందలేరు కొందరు

తెల్ల కాగితం మనిషి జీవితం 
ఒకో అక్షరం ప్రతి నిమిషం 

చరణం::2 

బంగారం కురిసినా పట్టెందుకు చేతులు రెండే 
చెతులెన్ని ఉన్నా తినడానికి నోరు ఒక్కటే 
తినడానికి లేనివారు కొందరు 
తిని అరిగించుకొలేనివారు కొందరు 
ఉండి..ఈ..తినలేనివారు కొందరు 
తిన్నా..ఆ..ఉండలెనివారు కొందరు 
తిన్నా ఉండలెనివారు కొందరు

తెల్ల కాగితం మనిషి జీవితం 
ఒకో అక్షరం ప్రతి నిమిషం 

Friday, July 30, 2010

మాంగల్య బలం--1958::తిలక్‌కామోద్::రాగం



సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి
తిలక్‌కామోద్::రాగం 

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడే నా హృదయం

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::1

కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::2

రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు..ఊ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::3

అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

Thursday, July 29, 2010

ఆడబ్రతుకు--1965





సంగీతం::విశ్వనాదన్,రామమూర్తి 
రచన::D.C.నారాయణరెడ్డ్య్
గానం::L.R.ఈశ్వరీ,పిఠాపురం
తారాగణం::N.T.రామారావు, దేవిక,రాజనాల, రేలంగి

పల్లవి::

హేయ్..కాలి మువ్వలు ఘల్లు ఘల్లుమని
ఎందుకో మరి ఎందుకో..
ఈ కోడెకాడు నీ జోడికూడినందుకే అందుకే అందుకే

కాలి మువ్వలు ఘల్లు ఘల్లుమని
ఎందుకో హోయ్ ఎందుకో..ఏందుకో..
ఈ కోడెకాడు నీ జోడికూడినందుకే అందుకే అందుకే

చరణం::1

పట్టుచొక్కా వేసుకొని..పైన అత్తరు పూసుకొని
ఎదురై నువు నవ్వుతు ఉంటే..ఏ ఏ ఏ ఏ ఏ..హేయ్
ఎదురెదురై నువు నవ్వుతు ఉంటే ఏమో అవుతాది ఓబుల్లిమావా
అహా..ఆఆహ్హా..ఓ బుల్లిమావా

వన్నెచీర కట్టుకొని సన్నజాజులు పెట్టుకొని
గిత్తలా నువు నడుస్తు ఉంటే..ఏ ఏ ఏ ఏ ఏ..హోయ్
మెత్త మెత్తగా నువు నడుస్తు ఉంటే చిత్తై పోతానే చిన్నారిభామా
ఓహో..ఆఆహ్హా..చిన్నారి భామా..

చరణం::2

మీది మీదికి వస్తావు నీవ్..మీద చేయ్ వేస్తావు
సిగ్గుతో నే తలవంచుకొంటే చెంగులాగుతావు సింగారిమావా..ఆ
ఆహా..ఓఓఓఓఓ..సింగారిమావా..

ఓరగా చూస్తుంటావు నా దారికడ్డమౌతుంటావు
ఓరగా చూస్తుంటావు నా దారికడ్డమౌతుంటావు
పక్కనే నివ్ నిలుచుకొని ఉంటే ప్రాణమాగదే బంగారిభామా..ఆ
ఆహా..ఓఓఓఓఓ..బంగారిభామా

కాలి మువ్వలు ఘల్లు ఘల్లుమని
ఎందుకో హోయ్ ఎందుకో..ఏందుకో..
ఈ కోడెకాడు నీ జోడికూడినందుకే అందుకే అందుకే అందుకే..హైయ్య 

AdaBratuku--1965
Music::Viswanaadan,Raamamoorti 
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::L.R.Iswarii,Pithaapuram
Cast::N.T.Ramarao,Devika,Rajanala,Relangi,Geetanjali,Padmanabham.

:::

hEy..kaali muvvalu ghallu ghallumani
endukO mari endukO..
ii kODekaaDu nee jODikooDinandukE andukE andukE

kaali muvvalu ghallu ghallumani
endukO hOy endukO..EndukO..
ii kODekaaDu nee jODikooDinandukE andukE andukE

:::1

paTTuchokkaa vEsukoni..paina attaru poosukoni
edurai nuvu navvutu unTE..E E E E E..hEy
eduredurai nuvu navvutu unTE EmO avutaadi Obullimaavaa
ahaa..aaaaahhaa..O bullimaavaa

vannechiira kaTTukoni sannajaajulu peTTukoni
gittalaa nuvu naDustu unTE..E E E E E..hOy
metta mettagaa nuvu naDustu unTE chittai pOtaanE chinnaaribhaamaa
OhO..aaaaaahhaa..chinnaari bhaamaa..

:::2

meedi meediki vastaavu neev..meeda chEy vEstaavu
siggutO nE talavanchukonTE chengulaagutaavu singaarimaavaa..aa
aahaa..OOOOO..singaarimaavaa..

Oragaa chUstunTaavu naa daarikaDDamoutunTaavu
Oragaa chUstunTaavu naa daarikaDDamoutunTaavu
pakkanE niv niluchukoni unTE praaNamaagadE bangaaribhaamaa..aa
Ahaa..OOOOO..bangaaribhaamaa

kaali muvvalu ghallu ghallumani
endukO hOy endukO..EndukO..

ii kODekaaDu nee jODikooDinandukE andukE andukE andukE..haiyya 


మయూరి--1985




సంగీతం::S.P.బాలు
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

ధితై తాం తై ధిధితై
తా తై ధిధితై తాతై ధిధితై
తాతై ధిధితై తాతై ధిధితై
తాతై ధిధితై..లలలలలాలలల
లాలలలాలలలలా 

మౌనం గానం మధురం మధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో
మౌనం గానం మధురం మధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం

చరణం::1

చైత్ర పవనాలు వీచే..మైత్రి గంధాలు పూసేను
వయసు ముంగిళ్ళు తీసి..వలపులే ముగ్గులేసేను
సుమ వీధుల్లో భ్రమరాలెన్నో
చెలి కన్నుల్లో భ్రమలేన్నెన్నెన్నో
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సాగేనులే శ్రుతిలో కృతిగా

మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం

చరణం::2

సససనీపమా నీపా మమమగామగా
దదదదా నీసదా పామ పపప పామారి
పపపపామారీదా

అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను
ముదిత పాదాల మువ్వే మువ్వ గోపాల పాడేను
అవి మోహాలో మధు దాహలో
చెలి హాసాలో తొలి మాసాలో
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
హంసధ్వనీ కళలే కలగా

మౌనం గానం మధురంమధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో
మౌనం గానం మధురం మధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
మౌనం గానం మధురం మధురాక్షరం 

Wednesday, July 28, 2010

శుభోదయం--1980




సంగీతం::K.V.మహాదేవన్
రచన::త్యాగరాజ స్వామి::కీర్తన
గానం::S.P.బాలు,P.సుశీల

తారాగణం::చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్

పల్లవి::

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అను పల్లవి::

అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ గంధము పుయ్యరుగా

తిలకము దిద్దరుగా..కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

చరణం::1

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

చరణం::2

పూజలు సేయరుగా..మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

తిలకము దిద్దరుగా..కస్తూరి తిలకము దిద్దరుగా
చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
పూజలు సేయరుగా..మనసార పూజలు సేయరుగా

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా

శుభోదయం--1980::అమృతవర్షిణి::రాగం




సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్
అమృతవర్షిణి::రాగం 

పల్లవి::

తాతకజం తకజం తరికిటతక
తత్తకజం తకజం తరికిటతక
తాతకజం తరికిటతక తత్తకజం తరికిటతక తాతకజం తత్తకజం
తజం తజం తరికిట తక
తాతత్తకజం తజం తజం తరికిటతక
తాతకజం తకజం తకజం తరికిటతక
[అతడు] తత్తరిత్తధిమితద్దిమ తక్కిట
తక్కిట తఝుణు తరిగిడ తరిగిడ తోం
తత్తరిత్తధిమితద్దిమి తక్కిట తక్కిట
తఝుణు తరిగిడ తరిగిడతోం
తకతరిత్తధిమి తరిగిడ తరిగిడతోం
తరిగిడ తరిగిడతోం తరిగిడ తరిగిడ
తరిగిటతక తరిగిటతక - తత్తరికిట
తత్తరి తఝుణు తళాంగుతోంకిట తరిగిటతోం
తత్తరి తఝణు తళాంగుతోం కిట తరిగిట తోం

నటనం ఆడేనే..ఏ..ఏ..ఏ..
నటనం ఆడేనే భవ తిమిరహంసుడా
ఆ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని 

నటనం ఆడేనే..ఏ..
నటనం ఆడేనే భవ తిమిరహంసుడా
ఆ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని 
నటనం ఆడేనే..ఏ..

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారాద్రి విడి 
విశాలాక్షితో తాళ లయగతుల

నటనం ఆడేనే..

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల

నిటాలాక్షుడే తుషారాద్రి విడి 
విశాలాక్షితో తాళ లయగతుల
నటనం ఆడేనే..ఏ..

శివగంగ శివమమెత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా
హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము
గరుడా నాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడేనే..ఆడేనే..ఆడేనే..

శివగంగ శివమమెత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా

ఆఆఆ..శివగంగ శివమమెత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా

హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము
హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము

గరుడా నాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడేనే..ఆడేనే..

వసుధ వసంతాలు ఆలపించగా
సురలు సుధను ధరలో కురిపించగా

వసుధ వసంతాలు ఆలపించగా
సురలు సుధను ధరలో కురిపించగా

రతీ మన్మధులు కుమార సంభవ
శుభోదయానికి నాంది పలుకగా

రతీ మన్మధులు కుమార సంభవ
శుభోదయానికి నాంది పలుకగా

నటనం ఆడేనే భవ తిమిరహంసుడా
ఆ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని 
నటనం ఆడేనే..ఏ..

భవతిమిరహంసుడా
ఈ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని 
నటనం ఆడేనే..ఏ..

తత్తరిత ధిమితద్దిమితక్కిట తక్కిట
తఝుణు తరిగిడ తరిగిడతా
తత్తరిధిమి తధిమి తక్కిట తక్కిట
తఝుణు తక తరిగిట తకతా
తత్తరి తధిమి తక తరిగిట తా తక్కిట
తఝుణుతక తరిగిటతకతా
తకతరికిటతకతా తక తరిగిటతకతా
తకటతా తకిటతా తకిటతా తకిటతా
తత్తరి తకజంతాతకజం
తత్తకజం తత్తకజం తాతకజం
తరికిట తరికిటతో తత్తత్తకజం
తత్తరి తఝుణు తరిగిడతోంతోం 

శుభోదయం--1980






















సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్

పల్లవి::

కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా..ఆ
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ

చరణం::1

మ్మ్.మ్మ్.మ్మ్ మ్మ్ మ్మ్..ఆ..ఆ..ఆహాహా
ఆ..త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా..మ్మ్ మ్మ్
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా

ముసిముసినవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా..మువ్వగోపాలా
మువ్వగోపాలా..అన్నట్టుందమ్మా
అడుగుల సవ్వళ్ళు..కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు..లేవమ్మా
అడుగుల సవ్వళ్ళు..కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు..లేవమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ

చరణం::2

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళకంత నిదరరాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళకంత నిదరరాదమ్మా
మ్మ్ మ్మ్ మ్మ్
ముసిరిన చీకటి ముంగిట
వేచిందీ కొమ్మా
ముద్దు మురిపాల..మువ్వగోపాల
నీవు రావేలా..అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా

కంచికి పోతావ కృష్ణమ్మా
ముద్దు మురిపాల
ఆకంచి వార్తలేమి కృష్ణమ్మా
మువ్వగోపాల
కంచిలో ఉన్నది బొమ్మ
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
నీవు రావేలా..ఆ..ఆ..ఆ..ఆ

కంచికి పోతావ కృష్ణమ్మా..ఆ
ఆకంచి వార్తలేమి కృష్ణమ్మా..ఆ
పొంచి వింటున్నావా కృష్ణమ్మా..మ్మ్
అన్నీ మంచి వార్తలే కృష్ణమ్మా..హా

మాధవయ్య గారి మనవడు--1992




రచన::వేటూరి 
సంగీతం::విద్యా సాగర్ 
గానం::S. P.బాలు, చిత్ర
తారాగణం::A.N.R, హరీష్, సుజాత, నందిని

పల్లవి::

నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం 
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం 
ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం 
నీ పాట పాడి నే పల్లవైతి 
నీ పదము తప్ప యే పదములు దొరకక 

నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం 
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం 
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ జంట కోరి నే కీర్తనైతి 
నీ స్వరము తప్ప యే వరములు అడగక

చరణం::1

లలలలలా లలలలలా
లలలాలలలాలాలలాలలాలలలా 
పూతల్లో పురివిడిచిన పులకింత 
చేతల్లో మునుపెరగని చమరింత 
వులికి పడిన నీ నలక నడుములో 
మెలిక పడితినే వీణలో తీగనై 
తగిలిందే తాళం రగిలిందే రాగం 
చినుకల్లే నా ఒణుకేతీరా తడికోరేటి తాపాలలో 

నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం 
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం..మ్మ్ 

చరణం::2

ఆఆఆ ఆఆఆఅ ఆఆఆఅ
మ్మ్ మ్మ్ మ్మ్
  
ఓ కే లే ముద్దెరగని సాయంత్రం 
ఛీ పో లే సిగ్గేరిగిన తాంబూలం 
కధలు తెలిసెలే యదల కనులలో 
పురుడుకడిగిపో పువ్వుకే తేనెతో 
నులిపెట్టే దీపం శీలలోనే శిల్పం 
వలపల్లేరా వయసేతీరా జతలూగేటి జంపాలలో 

నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ పాట పాడి నే పల్లవైతి 
నీ పదము తప్ప యే పదములు దొరకక
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం

లంబాడోళ్ళ రాందాసు--1978




సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::D.C. నారాయణ రెడ్డి
గానం::S. P.బాలు,P.సుశీల,  
తారాగణం::చలం,రోజారమణి, జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,పండరీబాయి,రాజబాబు,
రావు గోపాల రావు,జయలక్ష్మి

పల్లవి::

ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో 
ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో 
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ? 
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ? 

ఈ పాలవెన్నెల్లో నా జాలి కళ్ళల్లో 
ఈ పాలవెన్నెల్లో నా జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే 
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే 

చరణం::1

చుక్కలే నిను మెచ్చీ..పక్కనే దిగివచ్చీ 
చుక్కలే నిను మెచ్చీ..పక్కనే దిగివచ్చీ
మక్కువే చూపితే నన్ను మరచేవో..ఓఓఓ
నన్ను మరచేవో

చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కటే కాదా 
చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కటే కాదా
లక్షల మగువలు ఉన్నా నా లక్ష్యమొక్కటే కాదా
నా లక్ష్మి ఒక్కటే కాదా..నా లక్ష్మి ఒక్కటే కాదా

ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో 
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ? 
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే

చరణం::2

తుంటరి చిరుగాలి కొంటెగా..నిను చూసి 
తుంటరి చిరుగాలి కొంటెగా..నిను చూసి
పైటనే కాజేస్తే ఏమి చేస్తావో..ఏమి చేస్తావో

ఐతే ఏమవుతుందీ..నీ చేతిలోన అది ఉంటే 
ఐతే ఏమవుతుందీ..నీ చేతిలోన అది ఉంటే
స్వర్గం దిగి వస్తుందీ..నా సామి తోడుగా ఉంటే
నా రాముని నీడ ఉంటే..

ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో 
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ? 
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నీవేలే
ఆఆఆఆ  లాలాలలామ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్  

Monday, July 26, 2010

మా ఇద్దరి కథ--1977

Labels

సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::P.సుశీల
Film Directed By::N.Ramesh
తారాగణం::N.T.రామారావు,సత్యనారాయణ,మంజుల, జయప్రద,హలం.

పల్లవి::

నల్లనయ్యా..ఆ..ఆ..ఆ..ఎవరని అడిగావా నన్నూ
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ
మురళిని కాలేను..పింఛమైనా కాను
మురళిని కాలేను..పింఛమైనా కాను
ఎవరని చెప్పాలీ..నేనూ..ఏమని చెప్పాలీ నేనూ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

నల్లనయ్యా..ఆ..ఆ..ఆ..ఎవరని అడిగావా నన్నూ

చరణం::1

వలచిన రాధమ్మనూ..ఊ..ఊ..విరహాన దించావు
పెంచినమ్మ యశోధనూ..ఊ..ఊ..ఊ..మోసాన ముంచావూ

నీవు నేర్చినదొకటే..నిను వలపించుకోవటం
నాకు తెలియినదొకటే..నా మనసు దాచుకోవటం
ఏమని చెప్పాలీ నేనూ..ఎవరని చెప్పాలీ..నేనూ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

నల్లనయ్యా..ఆ..ఆ..ఆ..ఎవరని అడిగావా నన్నూ

చరణం::2

వెన్నైనా మన్నయినా..ఆ..ఆ..ఆ..ఆ..ఒక్కటే అన్నావూ
దొంగవయినా గానీ..ఈ..ఈ..ఈ..దొరవయీ నిలిచావూ
ఎంతా మరవాలన్నా..మనసును వీడిపోననంటావు
ఎంతా కలవరించిన..కంటికి కానరాకున్నావు
ఏమని చెప్పాలీ నేనూ..ఎవరనీ చెప్పాలీ నేనూ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

నల్లనయ్యా..ఆ..ఆ..ఆ..ఎవరని అడిగావా నన్నూ
మురళిని కాలేను..పింఛమైనా కాను
మురళిని కాలేను..పింఛమైనా కాను
ఎవరని చెప్పాలీ..నేనూ..ఏమని చెప్పాలీ నేనూ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నల్లనయ్యా..ఆ..ఆ..ఆ..ఎవరని అడిగావా నన్నూa

Tuesday, July 20, 2010

త్రినేత్రుడు--1988



సంగీతం::రాజ్ కోటి
రచన::?
గానం::బాలు,సుశీల

నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే

ఈడు దుప్పట్లో మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లో మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలో సిగ్గు బలి గాలి బలి యమో యమో
నాటుకొట్టుడు వీరకొట్టుడు ...


ముట్టడించి కొట్టాలా బుగ్గల్లో నా ముద్దు
మట్టగించి తొక్కాలా మంచాలే ఈ పొద్దు
కోకపల్లి రాజ్యంలో కొటగుమ్మమేడుందో
ఆనతీసి పట్టేదాకా ఆరాటాలమ్మో


చుట్టుముట్టి పట్టాలా కౌగిట్లో నా సోకు
కట్టుతప్పి పోవాలా చీరమ్మే కాసేపు
రైకపల్లి రాజ్యంలో ముళ్ళుపడ్డ ముంగిట్లో
చిక్కులిప్పతీసే దాకా మోమాటాలమ్మో

శృంగారానికి సింగంలాంటి చిన్నోడొస్తుంటే
సిగ్గు ఎగ్గు పుట్టిళ్ళల్లో నుగ్గైపోతుంటే
తాకిడి వేళా చెలి తట్టుకోవాలా
కస్సుబుస్సు పూజలతో కాముడికి నమో నమో
నాటుకొట్టుడు వీరకొట్టుడు ...


చప్పరింత కొట్టాలా మైకంలో ఓమాటు
అప్పగింతలియ్యాలా మెత్తంగా ఈనాడు
పైటపల్లి తాలూకా పాలకొల్లు సంతల్లో
పండుకోసుకెళ్ళేదాకా పంతాలేనమ్మో

దండయాత్ర చెయ్యాలా దండల్తో ఓనాడు
ఎండ వెన్నెలవ్వాలా ఏనాడో ఓనాడు
పూలపల్లి తాలూకా పూతరేకు సందుల్లో
తేనేబొట్టు పెట్టిన్నాడే పేరంటాలమ్మో

వయ్యారానికి ఉయ్యాలోచ్చే వూహే చూస్తుంటే
ఉట్టి పట్టి చట్టే కొట్టే ఊపే వస్తుంటే
గుద్దులాటల్లో తొలి ముద్దులాటల్లో
మొగ్గే విచ్చే మోజులతో ప్రేమలకే ఘుమో ఘుమో
నాటుకొట్టుడు వీరకొట్టు
డు

Monday, July 19, 2010

పెళ్ళి చేసి చూడు--1952



సంగీతం::ఘంటసాల
రచన::పింగళినాగేంద్రరావు 
గానం::ఘంటసాల 
తారాగణం::N.T.R., S.V.R. G.వరలక్ష్మి,సావిత్రి,S.V.రంగారావు,జోగారావు,  
మాష్టర్ కుందు,దొరస్వామి,పుష్పలత

పల్లవి::

రాధనురా..అ..నీ రాధనురా..ఆ
రాధనురా..అ..నీ రాధనురా..ఆ
రాసలీలలా..ఊసే తెలియని 
కసుగాయలకారాధనురా..ఆ
వలపున కుమిలే ప్రణయజీవులకు 
వల్లమాలిన..బాధనురా..ఆ
రాధనురా..ఆ..నీ రాధనురా..ఆ

చరణం::1

ఎంతో తెలిసిన..వేదాంతులకే 
అంతు దొరకని..గాధనురా..ఆ
ఎంతో తెలిసిన..వేదాంతులకే 
అంతు దొరకని..గాధనురా..ఆ
మధురానగరి..మర్మమెరిగిన 
మాధవ నీకె సుబోధనురా
రాధనురా..ఆ..నీ రాధనురా..ఆ
రాధనురా..ఆ..నీ రాధనురా..ఆ

Friday, July 16, 2010

ఇంటిదొంగలు--1973





సంగీతం::SP.కోదండపాణి
సాహిత్యం::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల


కొండపై....న..వెండివా....నా....
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలీ
కొండపై....న..వెండివానా....

మబ్బులు వస్తూ పోతుంటాయీ నిలిచేదొకటే నీలాకాశం
కలతలు వస్తూ పోతుంటాయీ మిగిలేదొకటే వలచేహౄదయం
కన్నీళ్ళలో కలకల నవ్వీ కలహాలలో చెలిమిని పెంచీ
కలలాగా బ్రతుకంతా జీవించాలీ
కొండపై....న..వెండివానా.....


నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వానొస్తుందీ
ఆకులు రాల్చే కాలంతోనే చిగురులు తొడిగే ఘడియొస్తుందీ
అనురాగమే తీయనివరమై అనుబంధమే తరగని సిరియై
కలకాలం కాపురం సాగించాలీ

కొండపై....న వెండివా....నా....
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలీ
కొండపై....న..వెండివానా...
.

Thursday, July 15, 2010

ముద్దుల కొడుకు--1979



సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి 
గానం::S.P.బాలు 
తారాగణం::అక్కినేని,మురళీమోహన్,జయసుధ,శ్రీదేవి,గిరిజ,జయమాలిని

పల్లవి::

ఎదలో రగిలే జ్వాలా..ఏమని పాడను జోలా
ఎదలో రగిలే జ్వాలా..ఏమని పాడను జోలా
కన్నతల్లి కనిపించదనా..ఉన్నతల్లి కరుణించదనా
కన్నతల్లి కనిపించదనా..ఉన్నతల్లి కరుణించదనా 
తల్లడిల్లి నువు ఏడ్చే వేళా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
ఎదలో రగిలే జ్వాలా..ఏమని పాడను జోలా

చరణం::1

సూర్యుడికైనా చంద్రుడికైనా..తూర్పు పడమర ఇద్దరు తల్లులూ
సూర్యుడికైనా చంద్రుడికైనా..తూర్పు పడమర ఇద్దరు తల్లులూ 
ఒకరు విడిస్తే ఒకరున్నారు..ఎవరో ఒకరు లాలిస్తారు
ఒకరు విడిస్తే ఒకరున్నారు..ఎవరో ఒకరు లాలిస్తారు 
బొమ్మ నడిగితే నేనిస్తాను..అమ్మ నడిగితే ఏంచేస్తాను 
ఎదలో రగిలే జ్వాలా..ఏమని పాడను జోలా

చరణం::2

బ్రతుకు చీకటై తాగిననాడు..ప్రాణం నీవై వెలిగావూ
బ్రతుకు చీకటై తాగిననాడు..ప్రాణం నీవై వెలిగావూ
మైకంలో పడి వూగిన నాడు..మమతే నీవై ఉదయించావూ
మైకంలో పడి వూగిన నాడు..మమతే నీవై ఉదయించావూ 
అమ్మ అంటే ఎవరొస్తారు?..నాన్నా అంటూ నేనొస్తాను
ఎదలో రగిలే జ్వలా..ఏమని పాడను జోలా
కన్నతల్లి కనిపించదనా..ఉన్నతల్లి కరుణించదనా
తల్లడిల్లి నువు ఏడ్చే వేళా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
ఎదలో రగిలే జ్వాలా..ఏమని పాడను జోలా

Muddula Koduku--1979
Music::K.V.Mahadevan
Lyrics::Veturi Sundararamamoorti
Singer's::S.P.Balu 
Cast::Akkineni,Sridevi,Jayasudha,Muralimohan,Girija,Jayamaalini.

:::

edalO ragilE jwaalaa..Emani paaDanu jOlaa
edalO ragilE jwaalaa..Emani paaDanu jOlaa
kannatalli kanipinchadanaa..unnatalli karuNinchadanaa
kannatalli kanipinchadanaa..unnatalli karuNinchadanaa 
tallaDilli nuvu EDchE vELaa..aa..aa..aa..aa..aa 
edalO ragilE jwaalaa..Emani paaDanu jOlaa

:::1

sooryuDikainaa chandruDikainaa..toorpu paDamara iddaru talluluu
sooryuDikainaa chandruDikainaa..toorpu paDamara iddaru talluluu 
okaru viDistE okarunnaaru..evarO okaru laalistaaru
okaru viDistE okarunnaaru..evarO okaru laalistaaru 
bomma naDigitE nEnistaanu..amma naDigitE EmchEstaanu 
edalO ragilE jwaalaa..Emani paaDanu jOlaa

:::2

bratuku chiikaTai taaginanaaDu..praaNam neevai veligaavuu
bratuku chiikaTai taaginanaaDu..praaNam neevai veligaavuu
maikamlO paDi vuugina naaDu..mamatE neevai udayinchaavuu
maikamlO paDi vuugina naaDu..mamatE neevai udayinchaavuu 
amma anTE evarostaaru?..naannaa anTuu nEnostaanu
edalO ragilE jwalaa..Emani paaDanu jOlaa
kannatalli kanipinchadanaa..unnatalli karuNinchadanaa
tallaDilli nuvu EDchE vELaa..aa..aa..aa..aa..aa 
edalO ragilE jwaalaa..Emani paaDanu jOlaa 

Wednesday, July 14, 2010

మన వూరి కథ--1976


సంగీతం::J.V.రాఘవులు
రచన::మైలవరపుగోపి  
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ,జయప్రద,రోజారమణి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,ప్రభాకర రెడ్డి,రావు గోపాల రావు

పల్లవి::

వచ్చిందీ కొత్త పెళ్లికూతురు
మనసుకు తెచ్చింది
కొండంత వెలుతురు
అహ..హా..ఆ..హా..ఆ
వచ్చిందీ కొత్త పెళ్లికూతురు
మనసుకు తెచ్చింది
కొండంత వెలుతురు

చరణం::1

అహ..హా..ఆ..హా..ఆ..ఓహోహో
లలలలలాల...లలలలలాల
నడయాడే వెన్నెలలా..ఆ
చిరుగాలి తెమ్మెరలా..ఆ
నడయాడే వెన్నెలలా
చిరుగాలి తెమ్మెరలా
ఎలమావి లే చిగురులా
సొగసు విరిబోణిలా నిండు తరవాణిలా     

వచ్చిందీ కొత్త పెళ్లికూతురు
మనసుకు తెచ్చింది
కొండంత వెలుతురు

చరణం::2

అహ..హా..ఆ..హా..ఆ..ఓహోహో
లలలలలాల...లలలలలాల
పరువాలా మిసమిసలు..ఆ
చిరునవ్వు దొ౦తరలు..ఆ
పరువాలా మిసమిసలు  
చిరునవ్వు దొ౦తరలు
నడిచేను రాయంచలా
ముద్ద చామంతిలా
ముద్దు పూబంతిలా
వచ్చిందీ కొత్త పెళ్లికూతురు
మనసుకు తెచ్చింది
కొండంత వెలుతురు

Tuesday, July 13, 2010

మన వూరి కథ--1976


సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ,జయప్రద,రోజారమణి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,ప్రభాకర రెడ్డి,రావు గోపాల రావు

పల్లవి::

గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే
కుర్రదానికి ఏ వైఫైనా..అందమొక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా..కోక ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా..కోక ఒక్కటే
ఈ కుర్రడికి ఏ పొద్ధూ కోరికోక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే  

చరణం::1

పడవెంత చిన్నదైనా..గెడవేసి నడపాలి
పడుచెంత సొ౦తమైనా..ముడివేసి అడగాలి
పడవెంత చిన్నదైనా..గెడవేసి నడపాలి
పడుచెంత సొ౦తమైనా..ముడివేసి అడగాలి

గాలి చూసి వాలు చూసి..తెరచాప ఎత్తాలి
గాలి చూసి వాలు చూసి..తెరచాప ఎత్తాలి
ఎంత వీలైన వేళైనా..తెరచాటు ఉండాలీ
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే

చరణం::2

పోటోచ్చిన ఏటికి ఎత్తుపల్ల మొక్కటే
పొంగోచ్చిన వయసుకు పగలు రేయి ఒక్కటే
పగలు రేయి కలుసుకునే హద్దు ఒక్కటే
పలుకరాని పెదవులకి ముద్దు ఒక్కటే 
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే 
కొంగులు రెండూ వేరైనా..కోక ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా..కోక ఒక్కటే
ఈ కుర్రడికి ఏ పొద్ధూ..కోరికోక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా..నీరు ఒక్కటే  

Wednesday, July 07, 2010

అందాల రాముడు--1973::ఆనందభైరవి::రాగం
















సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ

తారాగణం::అక్కినేని,లత,రాజబాబు,అల్లు రామలింగయ్య,నాగభూషణం,ధూళిపాళ,రావికొండలరావు,
నూతన్‌ప్రసాద్,సూర్యకాంతం 

ఆనందభైరవి::రాగం

ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా..ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారూ
జో జో..జో జో ............
జో జో..జో జో..........

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో..జో జో..జో జో..........

ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలీ
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలీ
చదవకుంటె పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుపడితె..ఫెయిల్ ఐతే బిక్కమొగం వెయ్యాలి

కాలేజి సీట్లు అగచాట్లురా..అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తైతే మొదలవ్వును పాట్లురా..
అందుకే..

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో....

ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలీ
అడ్డమైనవాళ్ళకీ గుడ్మార్ణింగ్ కొట్టాలీ
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్వూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి

పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా..మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావీ నీకెపుడూ దోస్తురా..
అందుకే....

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో.....

B.A ను చదివి చిన్న బంట్రోతు పనికెళితే..
M.A.లు అచట ముందు సిద్దము..నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో..
పదినెల్ల దాక జీతమివ్వరూ..నువ్వు బతికావో చచ్చేవో చూడరు

ఈ సంఘం లో ఎదగడమే దండగా..మంచికాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగ....
అందాకా....

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో..టాటా..టాటా..టాటా..టాటా.
...


Andaala Raamudu--1973
Music::K.V.Mahadevan
Lyricis::Arudra
Singer's::V.Ramakrishna

Cast::Akkineni,Latha,Naagabhushanam,Raajabaabu,Alluramalingayya,Dhulipaala,Raavikondalaraavu,Nootanprasad,sooryakaantam.

Anandabhairavi::raagam

::::

yedavaku yedavaku verri naganna
yeduste ne kallu neelaalu karu
jojo..jojo..jojo..jojo

yedagadanikendukura tondaraa
yedara batukantaa chindara vandara
jojo..jojo..jojo jojo

:::1

yedigevo badilonu yennenno chadavali
panikirani patalu batteeyam pettali
chadavakunte pareekshalo kapeelu kottali
pattubadite failayite bikkamoham veyyali
college seetlu agachatluraa
avi kondaniki undali notluraa
chaduvu purtayite modalavvunu patluraa
anduke

:::2

udyogam vetalona urantaa tiragali
addamainavallakee goodmorning kottali
amyamya arpinchi hastalu tadapali
interview antuu Q antuu poddantaa nilavali
pilupu rakunte ne asha wasturaa
malla pettali inko darakhasturaa
yendamavi nekepuduu dosturaa
anduke 

:::3

BAnu chadivi chinna bantrotu panikelite
MAlu achata mundu siddamu
nevu cheyalevu vaallato yuddamu
batakaleka badipantulu pani nuvvu chesevo
padinelladaakaa jeetamivvaru
nuvvu batikavoo chachevo chudaru
ee sanghamlo yedagadame dandagaa
manchi kalamokati vastundi nindugaa
apudu yedagadame balalaku pandagaa
andakaa
jojo..jojo..jojo jojo

tata tata..tata tata

Saturday, July 03, 2010

దేవుడు చేసిన బొమ్మలు--1976


సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ 
గానం::V.రామకృష్ణ 
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,చలం,జయసుధ,ప్రభ,కల్పన,సాక్షి రంగారావు

పల్లవి::

ఈ జీవితమూ అంతే తెలియని స్వప్నమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ ఈ జీవితమూ

చరణం::1

కలలు చెదిరిపోతుంటాయి మరల మరల వస్తుంటాయి 
కలలు చెదిరిపోతుంటాయి మరల మరల వస్తుంటాయి
విడిపోయేవి ఈ దేహాలు మిగిలుండేవి అనుబంధాలు
ఈ జీవితమూ అంతే తెలియని స్వప్నమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ ఈ జీవితమూ

చరణం::2

తలచిన కోర్కెలు కూలినవి తలవనివెన్నో జరిగినవి 
తలచిన కోర్కెలు కూలినవి తలవనివెన్నో జరిగినవి
తగిలిన కాలికే తగిలేటప్పుడు జరిగినదే జరగకూడడా  
ఈ జీవితమూ అంతే తెలియని స్వప్నమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ ఈ జీవితమూ

చరణం::3

బొట్టును ఎవరో తుడిపేస్తారు మోడుకు ఎవరు చిగురిస్తారో  
ఇచ్చాడమ్మా ఈ బ్రతుకు ముందేమివ్వాలో వాడికే తెలుసు  
ఈ జీవితమూ అంతే తెలియని స్వప్నమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ

Friday, July 02, 2010

వయసొచ్చిన పిల్ల--1975


సంగీతం::T.చలపతిరావు  
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల ,రమేష్ 
తారాగణం::లక్ష్మీ,మురళిమోహన్,గిరిబాబు,జి.వరలక్ష్మి

పల్లవి::

జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా

చరణం::1

తారలు ప్రతీ రేయి వస్తాయి
పున్నమి మాసానికి ఒకేసారి ఒకేసారి
పువ్వులు ప్రతిరోజూ పూస్తాయి
వసంతం ఏడాదికి ఒకేసారి ఒకేసారి
ఎన్ని కోర్కెలున్నాకలలేవో కంటున్నా
ఎన్ని కోర్కెలున్నా కలలేవో కంటున్నా

చరణం::2

కన్నె మనసు వలచెది ఒకేసారి
బ్రతుకులో ఒకేసారి
జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా

చరణం::3

నింగిని విడిపోదు నీలిమ
రంగుల మబ్బులెన్నో ముసిరినా ముసిరినా
కెరటం విడిపోదూ కడలినీ
పెను తుఫానులెన్నెన్నో విసిరినా విసిరినా
కాలం కాదన్నా ఆ దైవం ఏమన్నా
కాలం కాదన్నా ఆ దైవం ఏమన్నా
ఏనాడు విడిపోదు ఈ భంధము
అదేలే...అనుబంధం
జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా

Thursday, July 01, 2010

వయసొచ్చిన పిల్ల--1975


సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::లక్ష్మీ,మురళిమోహన్,గిరిబాబు,G.వరలక్ష్మి

పల్లవి::

చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
వయసొచ్చిన పిల్లకు..ఆన్నిటి కంటే
వలపే అందము..వలపే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ

చరణం::1

కొమ్మకు పువ్వులందము..పూలకు తావులందమూ
రేయికి చుక్కలందము..చుక్కలకు చంద్రుడందమూ
రేయికి చుక్కలందము..చుక్కలకు చంద్రుడందమూ
నీ నల్లని సిగలో...తెల్లని మల్లెలు 
తళుకే అందము...తళుకే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ

చరణం::2

పాటకు రాగమందము..ఆ ఆ ఆ ఆ ఆ
పాటకు రాగమందము..ఆటకు తాళమందమూ
కళ్లకు కాటుకందము..కాళ్లకు గజ్జలందమూ
కళ్లకు కాటుకందము..కాళ్లకు గజ్జలందమూ
నీ వెచ్చని కౌగిట...ఊయలలూగే
బ్రతుకే అందము..బ్రతుకే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ

చరణం::3

నింగికి మబ్బులందము..మబ్బుకు మెరుపులందమూ
మోముకు తిలకమందము..పెదవికి నవ్వులందమూ
మోముకు తిలకమందము..పెదవికి నవ్వులందమూ 
నీ నీడను తోడును...కోరే
నాకు నీవే అందము..నీవే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ