Sunday, June 01, 2008

ముద్దుల కొడుకు--1979



సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,మురళీమోహన్,జయసుధ,శ్రీదేవి,గిరిజ,జయమాలిని

పల్లవి::

దగాలుచేసి దిగాలుపడ్డ దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
దగాలుచేసి దిగాలుపడ్డ దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా..చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా

చరణం::1

మనసునే కదిలించావు..మమతలే వెలిగించావు
మనిషిలా ప్రేమించావు..ప్రేమకై జీవించావు
మనసునే కదిలించావు..మమతలే వెలిగించావు
మనిషిలా ప్రేమించావు..ప్రేమకై జీవించావు
ఆరాధనే మరచీ..ఈ..అంతస్తులే వలచీ..ఈ  
ఆరాధనే మరచీ..అంతస్తులే వలచీ ఆస్తిపరుల 
ముద్దులకొడుకై..ఆదమరచి ఉన్నావా? ఆత్మబలం విడిచావా?

లేదు..లేదు..మరచిపోలేదు..Never
చిన్నోడా..దసరబుల్లోడా..చిన్నోడా..దసరబుల్లోడా

దగాలుచేసి దిగాలుపడ్డ దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా

చరణం::2

బంగారుబాబుల ఆట..బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే..అల్లరిచిల్లరి వేలంపాట
బంగారుబాబుల ఆట..బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే..అల్లరిచిల్లరి వేలంపాట 
నీ ఆటపాటలలో..ఓ..నీ ఆడుగుజాడలలో..ఓఓఓ
నీ ఆటపాటలలో..ఓ..నీ ఆడుగుజాడలలో..ఓఓఓ 
అందాల జాబిలి బ్రతుకే..అమావాస్య చేసావా సమాధి కట్టేసావా

నేను సమాధి కట్టానా..NO..NO

ఉన్న మాటకే ఉలికిపడి..లేని మనసునే 
తడుముకునే..మోసగాడు ఒక మనిషేనా..ఆ

ఏమిటి..ఏవర్ని గురించి నువ్వనేది?

నిప్పులాంటిది నీ గతం..తప్పతాగినా ఆరదు
ఎంత దాచినా దాగదు..నిన్ను దహించక తప్పదు

Stop it 

తప్పదు
Stop it 

తప్పదు
Stop it 

తప్పదు
I Say Stop it 


Muddula Koduku--1979
Music::K.V.Mahadevan
Lyrics::Veturi Sundararamamoorti
Singer's::S.P.Balu,P.Suseela
Cast::Akkineni,Sridevi,Jayasudha,Muralimohan,Girija,Jayamaalini.

:::

dagaaluchEsi digaalupaDDa dasaraabullODaa
savaalu chEstaa javaabu cheppara saradaa chinnODaa
dagaaluchEsi digaalupaDDa dasaraabullODaa
savaalu chEstaa javaabu cheppara saradaa chinnODaa
chinnODaa..aa..dasaraabullODaa..chinnODaa..aa..dasaraabullODaa

:::1

manasunE kadilinchaavu..mamatalE veliginchaavu
manishilaa prEminchaavu..prEmakai jeevinchaavu
manasunE kadilinchaavu..mamatalE veliginchaavu
manishilaa prEminchaavu..prEmakai jeevinchaavu
AraadhanE marachii..ii..antastulE valachii..ii  
AraadhanE marachii..antastulE valachii Astiparula 
muddulakoDukai..Adamarachi unnaavaa? Atmabalam viDichaavaa?

lEdu..lEdu..marachipOlEdu..Never
chinnODaa..dasarabullODaa..chinnODaa..dasarabullODaa

dagaaluchEsi digaalupaDDa dasaraabullODaa
savaalu chEstaa javaabu cheppara saradaa chinnODaa

::::2

bangaarubaabula ATa..bangaarubommala vETa
adRshTavantulu paaDE..allarichillari vElampaaTa
bangaarubaabula ATa..bangaarubommala vETa
adRshTavantulu paaDE..allarichillari vElampaaTa 
nee ATapaaTalalO..O..nee ADugujaaDalalO..OOO
nee ATapaaTalalO..O..nee ADugujaaDalalO..OOO 
andaala jaabili bratukE..amaavaasya chEsaavaa samaadhi kaTTEsaavaa

nEnu samaadhi kaTTaanaa..NO..NO

unna maaTakE ulikipaDi..lEni manasunE 
taDumukunE..mOsagaaDu oka manishEnaa..aa

EmiTi..Evarni gurinchi nuvvanEdi?

nippulaanTidi nee gatam..tappataaginaa Aradu
enta daachinaa daagadu..ninnu dahinchaka tappadu

Stop it 

tappadu

Stop it 

tappadu

Stop it 

tappadu

I Say Stop it