Tuesday, July 05, 2011

బాబు--1975::తిలంగ్::రాగం




సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు

తిలంగ్::రాగం 

స్నేహంపండి ప్రేమై నిండిన

చెలియా రావేలా నా చేరువకావేలా
నా స్నేహంపండి ప్రేమై నిండిన

చెలియా రావేలా నా చేరువకావేలా

కనులలో కన్నకలలలో..కదలిఆడే కన్నెరూపమా
చెలియా రావేలా నా చేరువకావేలా


లేమిలోనా కలిమిలోనా..లేతమనసూ చెలిమిలోనా
లేమిలోనా కలిమిలోనా..లేతమనసూ చెలిమిలోనా
కలసివున్ననీవే..నను తెలుసుకొన్న నీవే
నా వెలుగు కాలేవా..నను కలుపుకోలేవా..ఆ..
చెలియా రావేలా నా చేరువకావేలా..

నీకూ నాకిక దూరమెందుకూ..ఉండీలేనటు ఉన్నావెందుకు
నీకూ నాకిక దూరమెందుకూ..ఉండీలేనటు ఉన్నావెందుకు
పగలులేని దినమై..ఒక సగము లేని ??
ఒంటరైనానే వలపు మంటనైనానే..ఎ..

చెలియా రావేలా నా చేరువకావేలా..

నా స్నేహంపండి ప్రేమై నిండిన
చెలియా రావేలా నా చేరువకావేలా

బాబు--1975




సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల


ఓయమ్మా ఎంతలేసి..సిగ్గొచ్చిందీ
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ
ఓయమ్మా ఎంతలేసి..సిగ్గొచ్చిందీ
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ
బూరెలాంటి బుగ్గల్లో ఎరుపొచ్చిందీ..
పువ్వులాంటి కన్నుల్లో మెరుపొచ్చిందీ
మూ..ఛి పో..ఓయమ్మో..
ఓయమ్మా ఎంతలేసి..సిగ్గొచ్చిందీ
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ

దాచుకొమ్మ ఈ వగలూ..కాచుకొమ్మ కొన్నాళ్ళు
దాచుకొమ్మ ఈ వగలూ..కాచుకొమ్మ కొన్నాళ్ళు
తప్పదులే తలంబ్రాలూ..ఆపైన తురుణాళ్ళు..
తలచుకొని తలచుకొని..నిదుర రాని నీ కళ్ళు
తలచుకొని తలచుకొని..నిదుర రాని నీ కళ్ళు
చల్లారిపోతాయి చెంగల్వ రేకులు..
చల్లారిపోతాయి చెంగల్వ రేకులు..
మూచ్..అబ్భా ఓరుకో..ఓయమ్మో..
ఓయమ్మా ఎంతలేసి..సిగ్గొచ్చిందీ
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ

పూలజడ వేసుకొని..బుగ్గచుక్కపెట్టుకొనీ
పూలజడ వేసుకొని..బుగ్గచుక్కపెట్టుకొనీ
బోలెడన్ని ఆశలతో..బోధపడని బెదరుతో..ఒ..
తడపడుతు గదిలోకి అడుగుపెట్టగానే..
తడపడుతు గదిలోకి అడుగుపెట్టగానే..
ఇలా..అబ్భా..వాటేసుకొంటాడు..వాటమైన మొనగాడు
వాటమైన మొనగాడు..మూచ్..చీపో..ఓయమ్మో..
ఓయమ్మా ఎంతలేసి..మ్మ్..సిగ్గొచ్చిందీ..అబ్బబ్బబ్బా..
సిగ్గొచ్చీ మగమెంతో..ముద్దొంచ్చిందీ
ఓయమ్మా ఎంతలేసి..మ్మ్..సిగ్గొచ్చిందీ

బాబు--1975























సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల


అయ్యబాబోయ్..
అయ్యబాబోయ్ అదిరిపోయిందీ..
అయ్యబాబోయ్ అదిరిపోయిందీ..
ఆడపిల్లతో ఇలాగేనా..ఆటలాడేదీ..చెలగాటమాడేదీ
అమ్మబాబోయ్ అదురుపుట్టిందీ..అమ్మబాబోయ్ అదురుపుట్టిందీ
హద్దుమీరితే ఆడదాన్ని ఏమిచేసెది..ఇంతకన్న ఏమిచేసేదీ

కొలతలన్ని తెలిసినవాడా..కోతకోసికుట్టేవాడా
బబూ.....మ్మ్..హు...మూ..హూ..
కొలతలన్ని తెలిసినవాడా..కోతకోసికుట్టేవాడా
కుర్రదాని కోర్కెలన్ని కొలిచి చూస్తావా..ఓ..హోయ్..
గుండెకోస్తావా...ఆ...
షోకులమ్మె షాపులోన..ఫోజులిచ్చే పిల్లదాన
షోకులమ్మె షాపులోన..ఫోజులిచ్చే పిల్లదాన
గాజుబొమ్మకు చీరకడితే..గాజుబొమ్మకు చీరకడితే
మోజుపుడుతుందా..హే హే..ముద్దువస్తుందా..ఆ
ఢీ..అమ్మా..
అమ్మబాబోయ్ అదిరిపోయిందీ..అమ్మబాబోయ్ అదురుపుట్టిందీ..

నడుముచూడు ఇరబైఐదే..చాతీకొలత ముప్పైఐదు..
నడుముచూడు ఇరబైఐదే..చాతీకొలత ముప్పైఐదు..
రెండుకలిపి లెక్కవేసి..మనసులోతెంతో
..హొయ్ హొయ్..తెలుసుకొంటావా..
చూపుతోనే లెక్కపెట్టి..వయసుఎంతో చెప్పగలను
మనసులోతు చెప్పజాలని..మనసులోతు చెప్పజాలని
మనిషి నేనమ్మా..హో ఓ..మరచిపోవమ్మా..అమ్మా..
అయ్యబాబోయ్ అదిరిపోయిందీ..
ఆడపిల్లతో ఇలాగేనా..ఆటలాడేదీ..చెలగాటమాడేదీ
అమ్మబాబోయ్ అదురుపుట్టిందీ..
హద్దుమీరితే ఆడదాన్ని ఏమిచేసెది..ఇంతకన్న ఏమిచేసేదీ

గృహలక్ష్మి--1967




సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::సముద్రాలరాఘవాచార్య(సీనియర్)
గానం::P.భానుమతి

తారాగణం::అక్కినేని,P.భానుమతి,S.V.రంగారావు,పద్మనాభం,సూర్యకాంతం,రమణరెడ్డి.

పల్లవి::

లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ

పొద్దుపోయే నిదురించవయ్య ముద్దులయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ
మేడ మీద బూచివాడు జాగుచేస్తే వచ్చేస్తాడు
జాలి తలచి పవళించవయ్య చల్లనయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ

చరణం::1

బొజ్జనిండ పాలారగించి సెజ్జమీద బజ్జోవయ్య
బొజ్జనిండ పాలారగించి సెజ్జమీద బజ్జోవయ్య
వింతకధనే చెపుతా నీకు నీవు వింటే అంతే చాలు
కధకు మూలం నీవే కదయ్య చక్కనయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ

చరణం::2

నిండుజాబిలి తారాడసాగే నీటకలువ నింగి చూసే
నిండుజాబిలి తారాడసాగే నీటకలువ నింగి చూసే
నీలమేఘం నడుమ నిలిచే నీకు నిదుర రానేరాదా
తెల్లవారే వేళాయెనయ్య నల్లనయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ
పొద్దుపోయే నిదురించవయ్య ముద్దులయ్య
లాలి లాలీ..గోపాలబాలా లాలి..లాలీ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

గృహలక్ష్మి--1967




సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::సముద్రాలరాఘవాచార్య(సీనియర్)
గానం::P.భానుమతి
తారాగణం::అక్కినేని,పి.భానుమతి,ఎస్.వి.రంగారావు,పద్మనాభం,సూర్యకాంతం,రమణరెడ్డి.

పల్లవి::

మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ
మేలుకోవయ్య

చరణం::1

తెల్లవారెనురా విహగాలి లేచెనురా
తెల్లవారెనురా విహగాలి లేచెనురా
అల్లదే ఉదయాద్రి పైన
అల్లదే ఉదయాద్రి పైన అరుణకాంతి విరిసెరా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య

చరణం::2

చల్ల చిలికే భామల కంకణాల మోతలవిగో
చల్ల చిలికే భామల కంకణాల మోతలవిగో
ఝుమ్మని నిను లెమ్మని
ఝుమ్మని నిను లెమ్మని పిలిచేను తేటి తియ్యగా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య

చరణం::3

పసిడి వాకిటిలో విరజాజి మాలలతో
పసిడి వాకిటిలో విరజాజి మాలలతో
దాసకోటి వేచినారు
దాసకోటి వేచినారు నీకు సేవలు చేయగా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య

చండీరాణి--1953::యమున్ కల్యాణి::రాగం




సంగీతం::C.V.సుబ్బరామన్
lరచన:::సముద్రాల
Produced by::P.S..రామకృష్ణారావు
Directed by::భానుమతి
గానం::ఘంటసాల,భానుమతి
Studioభరణి పిక్చర్స్
నటీ,నటులు::రామారావు,భానుమతి
Release date(s)1953


రాగం:::యమున్ కల్యాణి:::

ఓ...తారక...ఓ
ఓ...జాబిలి...ఓ
ఓ...తారక...నవ్వులేల ననుగని
ఓ...తారక...నవ్వులేల ననుగని
ఓ...తారక...నవ్వులేల ననుగని
అందాలు చిందెడి..చందమామ..నీవని
అందాలు చిందెడి..చందమామ..నీవని
ఓ...జాబిలి..ఆ..తారక..నవ్వునోయి..నినుగని

వినువీధిలోని..తారాకుమారి
దరిచేరెనౌనా..ఈ..చందమామ
చేరువె తార..రేరాజుకు
ఆ..తారక నవ్వునోయి..నినుగని
అందాలు చిందెడి..చందమామ..నీవని
ఓ..జాబిలి..ఆ..తారక..నవ్వునోయి నినుగని

మనోగాధ నీతో..నివేదించలేను
నివేదించకున్న..జీవించలేను
నెరజాణవేలే..ఓ..జాబిలి
ఓ..ఆ..తారక..నవ్వునోయి..నినుగని
అందాలు చిందెడి..చందమామ..నీవని
ఓ..జాబిలి..ఆ..తారక..నవ్వునోయి నినుగని

తొలిచూపులోని..సంకేతమేమో
చెలి నవ్వులోని..ఆ శిల్పమేమో
నీ నవ్వు వెన్నెలే..ఓ జాబిలి
ఓ..ఆ తారక..నవ్వునోయి..నినుగని
అందాలు చిందెడి..చందమామ..నీవని
ఓ..జాబిలి..ఆ..తారక..నవ్వునోయి నినుగని