Wednesday, August 03, 2011

పరువు ప్రతిష్ట-- 1963





















సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

విను విను విను నిను వదలను..నిరాశ చేయకు
నడు నడు నడు నా దారిని విడు..చిరాకు చేయకు

చరణం::1

వలచి నేను వెంటబడితె..అదో నేరమా
పిలిచి నీకు బానిసనైతె..యింత కోపమా
పిలిచి నీకు బానిసనైతె..యింత కోపమా
ఆ..పిలువకనే పేరంటానికి..తయారౌదువా?
చిలిపితనం ఆపి మనసు..చిత్తగించవా 

విను విను విను నిను వదలను..నిరాశ చేయకు
నడు నడు నడు నా దారిని విడు..చిరాకు చేయకు

చరణం::2

అనాదిగా ఆడవారు ఇదే మోస్తరు
అలకతోనె కాలమంతా..వృధా చేతురు
అలకతోనె కాలమంతా..వృధా చేతురు
ఆ..అలా అలిగి హృదయము..ఏమో తెలిసికొందురు
ఆకతాయి కుర్రాడైతే..ఆగమందురు 

ఆహ్హా..
విను విను విను నిను వదలను..నిరాశ చేయకు
నడు నడు నడు నా దారిని విడు..చిరాకు చేయకు

చరణం::3

మనసంతా తెలుపుటవలనే..మరీ లోకువా
చెంతచేరి బాసలు నీతో..చేయనీయవా
చెంతచేరి బాసలు నీతో..చేయనీయవా
ఆ..చెంతచేరి తెలుపకపోతే..వూహ తెలియదా
ఎంత దూరమైనా మనసు..నీకు చేరువా 

ఆహ్హా..ఆ..హ్హా..ఆహ్హా..ఓఓహ్హో..హో..
ఆఆఆఆఆఆ..

ఆదర్శకుటుంబం--1969



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::కోసరాజురాఘవయ్య
గానం::ఘంటసాల  
తారాగణం::అక్కినేని,జయలలిత,అంజలీదేవి,గుమ్మడి,నాగభూషణం,పద్మనాభం,సూర్యకాంతం,రాజనాల,గిరిజ,రేలంగి,వాసంతి. 

పల్లవి::

ఏడుకొండల వేంకటేశ్వర నీవైన 
ఈ మనుషులకు..బుద్ధి చెప్పరా

ఏడుకొండల వేంకటేశ్వర నీవైన 
ఈ మనుషులకు..బుద్ధి చెప్పరా 
పదవిలోన ఉన్నప్పుడు..కాక పడుతుంటారు
అది కాస్త ఊడిపోతే..నెత్తిన రాళ్ళేస్తారుof course.అహా

ఏడుకొండల వేంకటేశ్వర నీవైన 
ఈ మనుషులకు..బుద్ధి చెప్పరా  

చరణం::1

గడ్డి తిని ఈ పశువులు..కమ్మని పాలిస్తాయీ
పాలు తాగిన మనుషులు..విషమును కక్కేస్తారు
ఎక్కడుంది ఈ మర్మం..ఏమిటయ్య ఈ ధర్మం
ఇలా ఉంది ఈ లోకం..ఏంజేస్తం మన ఖర్మం

of course.ఆహా హా హా
ఏడుకొండల వేంకటేశ్వర నీవైన 
ఈ మనుషులకు..బుద్ధి చెప్పరా  

చరణం::2

ఏ ఎండకు ఆ గొడుగు..పడతాది నంబర్ల్
ఏ పూటకు ఆ పూటే..ఏడిపించుక తింటారు
మెజార్టీని చూస్తారు..మెల్లగ జారేస్తారు
ఊహూ..ఆ..వీలు చిక్కితె..నీకు షటకోపం పెడతారు
పెడ్తారు..షటకోపం పెడతారు..ఆహా..

of course.ఆహా హా హా
ఏడుకొండల వేంకటేశ్వర నీవైన 
ఈ మనుషులకు..బుద్ధి చెప్పరా 

చరణం::3

ఇక్కడి వాడిని చూస్తే..అక్కడి వాడికి ద్వేషం 
ఇరుగు వాడు బాగుపడితే..పొరుగు వాడి కుక్రోషం
ఈ గందర గోళమేంది..ఈ బిత్తర చూపులేంది
నువ్వే దిగి రాకుంటే..తమ కొర్సిక గోవింద
గోవిందా..ఆ..గోవింద 

of course.ఆహా హా హా
ఏడుకొండల వేంకటేశ్వర నీవైన 
ఈ మనుషులకు..బుద్ధి చెప్పరా 

of course.ఆహా హా హా
ఏడుకొండల వేంకటేశ్వర నీవైన 
ఈ మనుషులకు..బుద్ధి చెప్పర్రా 

Adarsha Kutumbham--1969
Music::S.RajeswaraRao
Lyrics::K.Raghavayya
Singer's::Ghantasala garu
Cast::Akkinaeni,Jayalalita,Gummadi,Sooryakaantam,Nagabhushanam,Padmanabham,Rajanala,Girija,Relangi,Vaasanti.

:::::::

EDukonDala vEnkaTESwara neevaina 
ii manushulaku..buddhi chepparaa

EDukonDala vEnkaTESwara neevaina 
ii manushulaku..buddhi chepparaa 
padavilOna unnappuDu..kaaka paDutunTaaru
adi kaasta UDipOtE..nettina raaLLEstaaru of course..ahaa

EDukonDala vEnkaTESwara neevaina 
ii manushulaku..buddhi chepparaa  

:::::1

gaDDi tini ii paSuvulu..kammani paalistaayii
paalu taagina manushulu..vishamunu kakkEstaaru
ekkaDundi ii marmam..EmiTayya ii dharmam
ilaa undi ii lOkam..EmjEstam mana kharmam

of course..aahaa haa haa
EDukonDala vEnkaTESwara neevaina 
ii manushulaku..buddhi chepparaa  

::::2

E enDaku A goDugu..paDataadi nambarl
E pooTaku A pooTE..EDipinchuka tinTaaru
mejaarTeeni chuustaaru..mellaga jaarEstaaru
uuhuu..aa..veelu chikkite..neeku shaTakOpam peDataaru
peDtaaru..ShaTakOpam peDataaru..aahaa..

of course..aahaa haa haa
EDukonDala vEnkaTESwara neevaina 
ii manushulaku..buddhi chepparaa 

::::3

ikkaDi vaaDini chUstE..akkaDi vaaDiki dwEsham 
irugu vaaDu baagupaDitE..porugu vaaDi kukrOsham
ii gandara gOLamEndi..ii bittara chUpulEndi
nuvvE digi raakunTE..tama korsika gOvinda
gOvindaa..aa..gOvinda 

of course..aahaa haa haa
EDukonDala vEnkaTESwara neevaina 
ii manushulaku..buddhi chepparaa 

of course..aahaa haa haa
EDukonDala vEnkaTESwara neevaina 

ii manushulaku..buddhi chepparraa