Wednesday, April 11, 2012

తూర్పు వెళ్ళె రైలు--1979




సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు

కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో

కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో.. కో....కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో

కోటేరు పట్టినోడుకో.... పూటకొడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడికో...సేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదు ఒకడికి...తిన్నది అరగదు ఒకడికి
ఆశచావదొకడికి...ఆకలాడదొకడికి

మేడిపండు మేలిమెందుకో...పొట్ట గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో...పాములొస్తే కర్రపట్టుకో...కో..
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
వేమన్న వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో...కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో

తుర్పు ఇంటి ఆంకాళమ్మ కో... కో ... పడమటింటి పోలేరమ్మ కొక్కో
... దక్షిణాన గంగానమ్మ కో.. కో .. ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా పంట చేను కాపలాకునేనుఎందుకో .. కో... కాసుకో ...

తూరుపు వెళ్ళె రైలు--1979




సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం
రచన::ఆరుద్ర
గానం::S.P..శైలజ

పల్లవి::

వస్తాడే నారాజు వస్తాడే ఒకరోజు
రావలసిన వేళకే వస్తాడే తేవలసిందేదో తెస్తాడే
వస్తాడే..కూ..చికుబుకు చికిబుకు చికుబుకు చికుబుకు

వస్తాడే నారాజు వస్తాడే ఒకరోజు
రావలసిన వేళకే వస్తాడే తేవలసిందేదో తెస్తాడే

చిలకా చిలకా ఓ రామ చిలకా
రావాలసిన వేళకే వస్తాడే
తేవలసినదేదో తెస్తాడే..వస్తాడే..కూ..

చరణం::1

నల నల్ల మబ్బులు కమ్ముతుంటే
నా మనసు ఊయల ఊగుతుంటే
చిటపట చినుకులు7 కురుస్తుంటే
జిలిబిలి సొగసులు తడుస్తుంటే
మెల్లగా దొంగలాగ వస్తాడే
నా కళ్ళు మూసి పేరు చెప్పమంటాడే

వస్తాడే నా రాజు వస్తాడే3 ఒకరోజు
వస్త్డే..కూ....

చరణం::2

మేళాలు తాళాలు మోగుతుంటే
బాజాలు బాకాలు రేగుతుంటే
ఊరంత తోరణాలు కడుతుంటే
ఊరేగి సంబరం చేస్తుంటే
తూరుపు బండి లోంచి దిగుతాడే
నను కోరి కోరి పెళ్ళి చేసుకొంటాడే

వస్తాడే నా రాజు వస్తాడే3 ఒకరోజు
వస్త్డే..కూ....

తూర్పూ వెళ్ళే రైలు--1979






సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం
రచన::జాలాది
గానం::P.సుశీల,S.P.బాలు

పల్లవి::

సందెపొద్దు అందాలున్న చిన్నదీ చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

సందెపొద్దు అందాలున్న చిన్నదీ చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

బొమ్మలా ముద్దుగుమ్మలా పువ్వులా పాలనవ్వులా
మెరుపు తీగమల్లే తళుక్కుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా

సందెపొద్దు అందాలున్న చిన్నదీ చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

చరణం::1

అకతాయి బుల్లోడల్లే అల్లరెడితే
రాలుగాయి రాగాలన్నీ రచ్చబెడితే
ఎవరైన చూసారంటే అల్లరైపోతానయ్యో
ఎన్నలంటి బతుకంతా చీకటైపోతాదయ్యో

దీపమల్లె నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను
దీపమల్లె నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను
కలువపువ్వు నీవై వెలుగు నేనై ఎలతేటి పాటల్లే చెలరేగిపోనా

చరణం::2

ముత్తెమంటి ఒళ్ళు తడిసి ముద్దు పుడితే
గుండెలోన ఎండకాసి ఆరబెడితే
ఆశలారిపోకుండ ఊసులాడుకోవాలి
ఊసిలెండిపోకుండా ఊట కోర్కెలుండాలి
గువ్వలాంటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి
గువ్వలాంటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి
నిన్ను నన్ను చూసి దిష్టి తీసి ఆ లోకాల దేవుళ్ళే దీవించిపోవాలి

సందెపొద్దు అందాలున్న చిన్నదీ చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

తూర్పు వెళ్ళె రైలు--1979




సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల

కన్నె మా చిన్నారి కాఫాడవమ్మ
నిండుగా మన ఊరు నిలబెట్టవమ్మ
కన్నె మా చిన్నారి కాఫాడవమ్మ
నిండుగా మన ఊరు నిలబెట్టవమ్మ

నీవు ఊరేగితే నిలుచు వానల్లు
నీవు దయ చూపితే నిలుచు ఇల్లిల్లు
కన్నె మా చిన్నారి కాఫాడవమ్మ
నిండుగా మన ఊరు నిలబెట్టవమ్మ

తలమీద అంటేము సంపంగి నూనె
ఒంటిపై పూసేము చిరుబంతి పసుపు
ఇంటికొక కడవగా గంగ పోసేము
ఇంటికొక కడవగా గంగ పోసేము.
కంటి కొక వెలుగుగా హరతిచ్చేము
కన్నె మా చిన్నారి కాఫాడవమమ
నిండుగా మన ఊరు నిలబెట్టవమమ

వాన వెలిసింది వరద తీసింది
అయినను మా మొక్కు మానలేమమ్మ
కాగడ చేపట్టి కడగంటి నవ్వుతో
కాగడ చేపట్టి కడగంటి నవ్వుతో
కన్నె దిశములతో కదలి పోవమ్మా...కదలి పోవమ్మా