సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::పింగళి
గానం::ఘంటసాల,P.లీల,సత్యం,P.సుశీల
దయచేయండి దయచేయండి..తమంత వారిక లేరండి
దయచేయండి దయచేయండి..తమంత వారిక లేరండి
తమంత వారిక లేరండి జై..తమంత వారిక లేరండి
అతి ధర్మాత్ములు..అతి పుణ్యాత్ములు
అతి థీమంతులు..మీరండి
అతి థీమంతులు..మీరండి
తగువైకారం తగు సత్కారం..తగు మాత్రంగా గైకోండి
తమంతవారిక తమరండి ఈ..తతంగమంతా తమకండి
హై హై వై వై కై కై గై గై జియ్యా
చరణం::1
పెళ్ళికుమారా రావయ్యా..మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా
ఆ ఆ ఆ ఆ ఆ...
పెళ్ళికుమారా రావయ్యా..మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా
ముల్లోకాలను వెతకి తెచ్చిన..అల్లుడ వంటే నీవయ్యా
ముల్లోకాలను గాలించి తెచ్చిన..అల్లుడ వంటే నీవయ్యా
పల్లకి దిగిదిగి రావయ్యా..తతంగమంతా నీకయ్యా
ఈ తతంగమంతా..నీకయ్యా
హై హై వై వై కై కై గై గై జియ్యా
చరణం::2
కిరీటాలు కిరీటాలు..వజ్రాల కిరీటాలు..దగ దగ కిరీటాలు
ధరించినంతనే..తలలో మెరయును..భలే యోచనలు బ్రహ్మాండముగా
భలే యోచనలు..బ్రహ్మాండముగా
శిరస్త్రాణములు శిరో ధార్యములు..శిరోజ రక్షలు కిరీటాలివే
అందుకోండయ్యా దొరలు..ముందుకురండయ్యా
అందుకోండయ్యా దొరలు..ముందుకురండయ్యా
చరణం::3
హారాలు మణిహారాలు..హారాలు మణిహారాలు..పతకాలు నవ పతకాలూ
హారాలు మణిహారాలు..పతకాలు నవ పతకాలూ
మణిబంధాలు భుజ బంధాలు..అందాలకు అనుబంధాలు
అందాలకు..అనుబంధాలు..
వింత చీరలు..వింత ముసుగులు
వింత చీరలు వింత ముసుగులు..సంతోషాలకు సంబంధాలు
అందుకోండమ్మా..తల్లులు ముందుకు రండమ్మా
అందుకోండమ్మా..తల్లులు ముందుకు రండమ్మా
చరణం::4
రక్షలు రక్షలు పాదరక్షలు..నాట్య శిక్షలో బాలా శిక్షలు
రక్షలు రక్షలు పాదరక్షలు..నాట్య శిక్షలో బాలా శిక్షలు
తొడిగిన తోడనే..తోదిమి తోదిమి
అడుగు వేయంగానే..తైతక్క తైతక్క
తొడిగిన తోడనే..తోదిమి తోదిమి
అడుగు వేయంగానే..తైతక్క తైతక్క
నేల మీద నిక నిలవనీయక..కులాసాగ మిమ్ము నర్తింప చేసే
రక్షలు రక్షలు పాదరక్షలు..నాట్య శిక్షలో బాల శిక్షలు
రక్షలు రక్షలు పాదరక్షలు..నాట్య శిక్షలో బాల శిక్షలు
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
నయగారము నా కళరా వయ్యారము నా వలరా
నయగారము నా కళరా వయ్యారము నా వలరా
హోయ్ నేనే నీ జోడురా నేనే నీ ఈడురా
వన్నె చిన్నె లెన్నేరావో రాజా
వన్నె చిన్నె లెన్నేరావో రాజా
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సరసతలో ఇది జాణరా..రసికతలో ఇది రాణిరా
సరసతలో ఇది జాణరా..రసికతలో ఇది రాణిరా
హోయ్ని..న్నే కోరితిరా..నిన్నే చేరితిరా
వన్నెచిన్నె..లెన్నరావో..రాజా
వన్నెచిన్నె..లెన్నరావో..రాజా
ఒకటే మా వయసు..ఓ రాజా ఒకటే మా సొగసు
ఒకటే మా వయసు..ఓ రాజా ఒకటే మా సొగసు