Monday, June 09, 2014

మొగుడు కావాలి--1980



సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి సుందర రామూర్తి
గానం::S.P.బాలు, P.సుశీల, S. P. శైలజ 
తారాగణం::చిరంజీవి,గాయిత్రి,సువర్ణ,నూతన్ ప్రసాద్,S. వరలక్ష్మి,రమణమూర్తి

పల్లవి::

ఓ చిలకా..పలుకే బంగారమా
అహాహ..నీ అలకే చిలిపి సింగారమా
నేల మీద ఉన్న చందమామ..ఏలనమ్మ నీకు ఇంత ధీమా
ఓ ప్రియతమా..కోపమా..తాపమా..తాపమా..తాపమా
ఓ చిలకా..పలుకే బంగారమా
ఆహాహాహ..నీ అలకే చిలిపి సింగారమా

చరణం::1

వయసులో ఎందుకీ మనసులు అందుకో సొగసులు
హో హో హో హో..హాయిగా
వయసులో ఎందుకీ మనసులు అందుకో సొగసులు
వయ్యారాలే నీదిగా..కలుసుకో..కరిగిపో
వెన్నెల వేళకు వెలిగిపో..ఆ పాత కథ మరిచిపో
కౌగిలిగింతకు కడ లేదు..ఈ చక్కిలిగింతకు తుదిలేదు
ఓ చిలకా..పలుకే బంగారమా
ఆహాహాహ..నీ అలకే చిలిపి సింగారమా

చరణం::2

వలపులో రోజుకో మలుపులు..మోజుతో పిలుపులు
హో హో హో హో..చెల్లవు
వలపులో రోజుకో మలుపులు..మోజుతో పిలుపులు
హో హో హో హో..చెల్లవు తెలుసుకో..కలుసుకో
మనసున మనసై మసులుకో..నీ పగటి కల మరిచిపో
మల్లెల మాసం మరి రాదు..అది మన కోసం రాబోదు 
ఓ చిలకా..పలుకే బంగారమా
అహాహ..నీ అలకే చిలిపి సింగారమా
నేల మీద ఉన్న చందమామ..ఏలనమ్మ నీకు ఇంత ధీమా
ఓ ప్రియతమా..కోపమా..తాపమా..తాపమా..తాపమా
ఓ చిలకా..పలుకే బంగారమా
ఆహాహాహ..నీ అలకే చిలిపి సింగారమా

పెళ్ళీడు-పిల్లలు--1982




సంగీతం::M.S.విశ్వనాథన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ  
గానం::P.సుశీల,S.P.బాలు
Film Directed By::Baapu 
తారాగణం::సురేష్,శరత్‌బాబు,సోమయాజులు,సాయిచంద్,సంగీత,విజయశాంతి,సూర్యకాంతం,సుమలత,రమాప్రభ

పల్లవి::

హరి..హో..ఓఓఓఓఓఓ..ఆహహా
నననా నననా..నననా నననా
నననా నననా..నననా నననా

పదహారు ప్రాయం..ఇరవైతో స్నేహం
చేస్తేనే అనురాగం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్  
పగ్గాలు తెంచి..పంతాలు పోయి 
చెలరేగితే అందం..మ్మ్..హరి..ఓ
ఓఓఓఓఓఓ..ఓహో..నననా..నననా
నననా..నననా..నననా..నననా

పదహారు ప్రాయం..ఇరవైతో స్నేహం
చేస్తేనే అనురాగం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్  
పగ్గాలు తెంచి..పంతాలు పోయి 
చెలరేగితే అందం..మ్మ్..మ్మ్..మ్మ్

చరణం::1

ఆ అందాలూ వడబోసి..ఆనందం కలబోసి
అనుకోని ఒక ఊర్వశీ..ఈ..హ్హా ఆ ఆ ఆ
అయింది నా ప్రేయసీ..ఈ

హా..ఆ..అనురాగం..పెనవేసీ
అనుబంధం..ముడివేసీ
అనుకోని ఈ చోరుడూ..హా ఆ ఆ ఆ
అయ్యాడు నా దేవుడూ..

ఆ ఆ ఆ..మనసున్నవాడు..నిన్ను దోచినాడు
తన వలపంతా..ఎరవేసి
హరి..ఓ
ఓఓఓఓఓఓ..ఓహో..నననా..నననా
నననా..నననా..ఆ ఆఅ

చరణం::2

ఆ..హా..జాబిల్లికి..ప్రేమించీ
సాగరమూ..తపియించీ
ఎగిసింది కెరటాలుగా..ఆ హా ఆ ఆ
వేచింది ఇన్నేళ్ళుగా..ఆ

ఆ ఆ ఆ..దివినించి..నెలరాజూ
దిగివచ్చీ..ప్రతి రోజూ
ఉప్పొంగు కెరటాలలో..హా ఆ ఆ ఆ
ఊగాడు..ప్రియురాలితో..

ఆ ఆ ఆ..ఏ హద్దులేదనీ..మా ముద్దు నాదని
ఈ పొద్దు ఈలా..నిలవేసీ..

హరి..ఓ
ఓఓఓఓఓఓ..ఓహో..నననా..నననా
నననా..నననా..ఆ ఆఅ

Pelleedu-Pillalu-1967
Music::M.S.Viswanath
Lyrics::Achaarya-Atreya
Singer's::P.Suseela,S.P.Baalu
Film Directed By::Baapu 
Cast::Suresh,SaratBabu,Somayajulu,Saayichand,Sangeeta,Vijayasaanti,Sooryakantam,Sumalata,Ramaprabha.

::::::::::::::::::::::::::::

hari..hO..OOOOOO..aahahaa
nananaa nananaa..nananaa nananaa
nananaa nananaa..nananaa nananaa

padahaaru praayam..iravaitO snEham
chEstEnE anuraagam..mm mm mm mm  
paggaalu tenchi..pantaalu pOyi 
chelarEgitE andam..mm..hari..O
OOOOOO..OhO..nananaa..nananaa
nananaa..nananaa..nananaa..nananaa

padahaaru praayam..iravaitO snEham
chEstEnE anuraagam..mm mm mm mm  
paggaalu tenchi..pantaalu pOyi 
chelarEgitE andam..mm..mm..mm

::::1

aa andaaluu vaDabOsi..aanandam kalabOsi
anukOni oka UrvaSii..ii..hhaa aa aa aa
ayindi naa prEyasii..ii

haa..aa..anuraagam..penavEsii
anubandham..muDivEsii
anukOni ii chOruDuu..haa aa aa aa
ayyaaDu naa dEvuDuu..

aa aa aa..manasunnavaaDu..ninnu dOchinaaDu
tana valapantaa..eravEsi
hari..O
OOOOOO..OhO..nananaa..nananaa
nananaa..nananaa..aa aaaa

::::2

aa..haa..jaabilliki..prEminchii
saagaramuu..tapiyinchii
egisindi keraTaalugaa..aa haa aa aa
vEchindi innELLugaa..aa

aa aa aa..divininchi..nelaraajuu
digivachchii..prati rOjuu
uppongu keraTaalalO..haa aa aa aa
UgaaDu..priyuraalitO..

aa aa aa..E haddulEdanii..maa muddu naadani
ii poddu iilaa..nilavEsii..

hari..O
OOOOOO..OhO..nananaa..nananaa
nananaa..nananaa..aa aaaa

పెళ్ళీడు-పిల్లలు--1982




సంగీతం::M.S.విశ్వనాథన్ 
రచన::శ్రీ శ్రీ 
గానం::P.సుశీల
Film Directed By::Baapu 
తారాగణం::సురేష్,శరత్‌బాబు,సోమయాజులు,సాయిచంద్,సంగీత,విజయశాంతి,సూర్యకాంతం,సుమలత,రమాప్రభ

పల్లవి::

ముసి ముసి నవ్వుల..రుస రుసలూ
చిరు చిరు అలకలే..సరదాలు

ముసి ముసి నవ్వుల..రుస రుసలూ..ఊ
చిరు చిరు అలకలే..ఏఏఏ..సరదాలు

నడివయసులో శృంగారం..మ్మ్..నడివయసులో శృంగారం
ఆ..వెలుగు నీడలే..ఏఏ..సరసాలు
ఆ..వెలుగు నీడలే..ఏఏ..సరసాలు..ఊఊఊ 

ముసి ముసి నవ్వుల..రుస రుసలూ..ఊ
చిరు చిరు అలకలే..ఏఏఏ..సరదాలు

చరణం::1

పూవూ దారం తీపి సారం..ఇంతే సంసారం
ఆలూ మగలూ రాజీ పడితే..ఎంతో శృంగారం..మ్మ్
ఆ బతుకే..ఏఏఏ..బంగారం

ముసి ముసి నవ్వుల..రుస రుసలూ..ఊ
చిరు చిరు అలకలే..ఏఏఏ..సరదాలు

చరణం::2

సన్నజాజులూ..సంపెంగలూ
అవి పెంచును మమతలు రెండింతలూ
సన్నజాజులది...చల్లదనం
సంపెంగ పూలది..వెచ్చదనం
తాపం శాపం..రాజీపడితే ఎంతో సింగారం
ఆ బతుకే..ఏఏఏ..బంగారం

ముసి ముసి నవ్వుల..రుస రుసలూ..ఊ
చిరు చిరు అలకలే..ఏఏఏ..సరదాలు
మ్మ్ మ్మ్ మ్మ్ హుహుహు..మ్మ్ మ్మ్ మ్మ్ హుహుహూ

Pelleedu-Pillalu-1967
Music::M.S.Viswanath
Lyrics::Sree Sree
Singer's::Suseela
Film Directed By::Baapu
Cast::Suresh,SaratBabu,Somayajulu,Saayichand,Sangeeta,Vijayasaanti,Sooryakantam,Sumalata,Ramaprabha.

::::::::::::::::::::::::::::

musi musi navvula..rusa rusaluu
chiru chiru alakalE..saradaalu

musi musi navvula..rusa rusaluu..uu
chiru chiru alakalE..EEE..saradaalu

naDivayasulO SRngaaram..mm..naDivayasulO SRngaaram
A..velugu neeDalE..EE..sarasaalu
A..velugu neeDalE..EE..sarasaalu..uuuuuu 

musi musi navvula..rusa rusaluu..uu
chiru chiru alakalE..EEE..saradaalu

::::1

poovuu daaram teepi saaram..intE samsaaram
Aluu magaluu raajee paDitE..entO SRngaaram..mm
A batukE..EEE..bangaaram

musi musi navvula..rusa rusaluu..uu
chiru chiru alakalE..EEE..saradaalu

::::2

sannajaajuluu..sampengaluu
avi penchunu mamatalu renDintaluu
sannajaajuladi...challadanam
sampenga pooladi..vechchadanam
taapam Saapam..raajeepaDitE entO singaaram
A batukE..EEE..bangaaram

musi musi navvula..rusa rusaluu..uu
chiru chiru alakalE..EEE..saradaalu
mm mm mm huhuhu..mm mm mm huhuhuu