Sunday, October 28, 2012

ఊరికి మొనగాడు--1981






సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల 

పల్లవి::

మొగ్గా పిందాల నాడే..బుగ్గా గిల్లేసినాడే
హాయ్..మొగ్గా పిందాల నాడే
హాయ్..బుగ్గా గిల్లేసినాడే
కోనేటి గట్టుకాడ కొంగు పట్టి..ముద్దు పెట్టి
చెంపలోని కెంపులన్నీ దోచినాడే

హోయ్..మొగ్గా పిందాల నాడే..బుగ్గా గిల్లేసినాదే
అహ..మొగ్గా పిందాల నాడే  
హాయ్..బుగ్గా గిల్లేసినాదే
గుండెల్లో వాలిపోయి గూడు కట్టి..జోడుకట్టి
పాలుగారు అందమంత పంచినాదే 

చరణం::1

అబ్బోసి వాడి వగలు..ఊ..లగ్గోసి పట్టపగలు..ఊ.....
గుమ్మెక్కి గుబులుగుంటది..అబ్బ..దిమ్మెక్కి దిగులుగుంటది....
వల్లంకి పిట్టవంటు వళ్లంత నిమిరి నిమిరి వాటేస్తే..అంతేనమ్మో...
హాయ్ వయసొస్తే..ఇంతేనమ్మో.......

అయ్యారే..తేనే చిలుకు..హోయ్..వయ్యారి జాణ కులుకు
ఎన్నెల్లో పగలుగుంటది..అబ్బా
మల్లెల్లో..రగులుగుంటుంది
వరసైనవాడవంటు..సరసాలే చిలికి చిలికి
మాటిస్తే మనసేనమ్మో..హా మనసిస్తే మనువేనమ్మో..ఓ ఓ ఓ ఓ

మొగ్గా పిందాల నాడే..హోయ్..బుగ్గా గిల్లేసినాడే
హాయ్..హోయ్..హోయ్..మొగ్గా పిందాల నాడే..హోయ్..బుగ్గా గిల్లేసినాదే

చరణం::2

వాటారే పొద్దుకాడా..హోయ్..దాటాలా దాని గడప
లేకుంటే తెల్లవారదు...హబ్బ..నా కంట నిద్దరుండదు
కొత్తిమేర చేనుకాడ పొలిమేర మరచిపోతే
వాడంత గగ్గోలమ్మో..హోయ్..ఊరంతా అగ్గేనమ్మో

తెల్లారే పొద్దుకాడా..హోయ్..పిల్లాడు ముద్దులాడి 
పోకుంటే..సోకు నిలవదు..వాడు రాకుంటే వయసు బతకదు
చెక్కిళ్ళ నునుపు మీద..చెయ్యేస్తే ఎరుపు మిగిలి
పక్కిళ్లు నవ్వేనమ్మో...ఈ నొక్కుళ్లు..ఏం చేసేనమ్మో

హోయ్ మొగ్గా పిందాల నాడే..అహ..బుగ్గా గిల్లేసినాదే
లాలాలలా..ల..లా..ల..ల..లా..ల....

రెండు రెళ్ళు ఆరు--1986














http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11559
సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.జానకి

పల్లవి::

విరహ వీణ..హా..ఆ..నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో..పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో..ఓఓఓఓ
విరహ వీణ..నిదుర రాక వేగే వేళలో
ఆ..ఆ..ఆ..ఆ..వేగే వేళలో

చరణం::1

జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా
సా..పదసరిగ..గా..దపదసరి..గాదపాగ
గాపరీగ..సరిగరి..సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా..
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ 
జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా
లేలేత వలపు..సన్నాయి పిలుపు..రావాలి సందిళ్ళ దాకా
మన పెళ్ళి పందిళ్ళ దాకా..ఆ..ఆ
విరహ వీణ..హా..ఆ..నిదుర రాక వేగే వేళలో..ఆ..వేగే వేళలో

చరణం::2

ఎదలో కదిలే ఏవో కథలు..ఏమని తెలిపేదిరా
చీకటి పగలు వెన్నెల సెగలు..నీ నీడ కోరేనురా
ఈ నాటకాలు మన జాతకానా..రాశాయిలే ప్రేమలేఖా
ఈ దూరమెన్నాళ్ళ దాకా..ఆ..ఆ..ఆ 
విరహ వీణ..హా..నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో..ఓఓఓఓ
విరహ వీణ..నిదుర రాక వేగే వేళలో..ఆఆఅ..వేగే వేళలో

ఉండమ్మా బొట్టు పెడతా--1968




సంగీతం::K.V. మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ  
గానం::S.P.బాలు , P.సుశీల

పల్లవి::

చుక్కలతో చెప్పాలని..ఏమని
ఇటు చూస్తే తప్పని..ఎందుకని
ఇక్కడ ఏకాంతంలో..ఏమో..ఏమేమో..అని

చుక్కలతో చెప్పాలని..ఏమని
ఇటు చూస్తే తప్పని..ఎందుకని
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని

చరణం::1

చెదిరే ముంగురులు..కాటుకలు
నుదురంతా పాకేటి..కుంకుమలు
చెదిరే ముంగురులు..కాటుకలు
నుదురంతా పాకేటి..కుంకుమలు
సిగపాయల పువ్వులే..సిగ్గుపడేను
సిగపాయల పువ్వులే..సిగ్గుపడేను
చిగురాకుల గాలులే..ఒదిగొదిగేను
ఇక్కడ ఏకాంతంలొ..ఏమో..ఏమేమో..అని

చుక్కలతో చెప్పాలని..ఏమని
ఇటు చూస్తే తప్పని..ఎందుకని
ఇక్కడ ఏకాంతంలో..ఏమో..ఏమేమో..అని

చరణం::2

మనసులో ఊహకనులు కనిపెట్టే..వేళ
చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే..వేళ
మనసులో ఊహకనులు కనిపెట్టే..వేళ
చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే..వేళ
మిసిమి పెదవి మధువులు..తొణికేనని
మిసిమి పెదవి మధువులు..తొణికేనని
పసికట్టే తుమ్మెదలు..ముసిరేనని
ఇక్కడ ఏకాంతంలో..ఏమో..ఏమేమో..అని

చుక్కలతో చెప్పాలని..ఏమని
ఇటు చూస్తే తప్పని..ఎందుకని..
ఇక్కడ ఏకాంతంలో..ఏమో..ఏమేమో..అని

ఉండమ్మా బొట్టు పెడతా--1968




సంగీతం::K.V. మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ  
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

చాలులే నిదరపో..జాబిలి కూనా
ఆ దొంగ కలవరేకుల్లో..తుమ్మెదలాడేనా
ఆ సోగకనుల రెప్పల్లో..తూనీగలాడేనా
చాలులే నిదరపో జాబిలి కూనా
ఆ దొంగ కలవరేకుల్లో..తుమ్మెదలాడేనా
ఆ సోగకనుల రెప్పల్లో..తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా..తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా..తూనీగలాడేనా

చరణం::1

అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా
ఓసి..వేలెడేసి లేవు బోసి నవ్వులదానా
అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా
ఓసి..వేలెడేసి లేవు బోసి నవ్వులదానా

మూసే నీ కనుల..ఎటుల పూసేనే నిదర
అదర..జాబిలి కూనా
ఆ దొంగ కలవరేకుల్లో..తుమ్మెదలాడేనా
ఆ సోగకనుల రెప్పల్లో..తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా..తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా..తూనీగలాడేనా

చరణం::2

అమ్మను బులిపించి..నీ అయ్యను మరిపించావే
కాని చిట్టి తమ్ముడొకడు..నీ తొట్టిలోకి రానీ
అమ్మను బులిపించి..నీ అయ్యను మరిపించావే
కాని చిట్టి తమ్ముడొకడు..నీ తొట్టిలోకి రానీ

ఔరా కోరికలు..కలలు..తీరా నిజమైతే
ఐతే... జాబిలి కూనా
ఆ దొంగ కలవరేకుల్లో..తుమ్మెదలాడేనా
ఆ సోగకనుల రెప్పల్లో..తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా..తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా..తూనీగలాడేనా
ఉహ్మ్..ఉహ్మ్..ఉహ్మ్..ఉహ్మ్.......

ఉండమ్మా బొట్టు పెడతా--1968



సంగీతం::K.V. మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ  
గానం::P.సుశీల

పల్లవి::

ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి
ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి
తొందర తొందరలాయె..విందులు విందులు చేసే
ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి

చరణం::1

ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
పరుగు పరుగునా త్వర త్వరగా
ప్రభుని పాదముల వాలగ
తొందర తొందరలాయే
విందులు విందులు చేసే
ఎందుకీ సందెగాలి
సందెగాలి తేలి మురళి

చరణం::2

ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని
ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని..విని..విని
ఏదీ ఆ..యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావన మిక..ఏదీ విరహ గోపిక

ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి
తొందర తొందరలాయె..విందులు విందులు చేసే
ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి

ఉండమ్మా బొట్టు పెడతా--1968





సంగీతం::K.V. మహదేవన్
రచన::దేవులపల్లికృష్ణశాస్త్రీ
గానం::P.సుశీల

పల్లవి::

అడుగడుగున గుడి ఉంది..అందరిలో గుడి ఉంది
అడుగడుగున గుడి ఉంది..అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది..అదియే దైవం

అడుగడుగున గుడి ఉంది..అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది..అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది..అందరిలో గుడి ఉంది

చరణం::1

ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ..ఈశుని కొలువనిపించాలి
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ..ఈశుని కొలువనిపించాలి

ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి..తెరలూ పొరలూ తొలగాలి

అడుగడుగున గుడి ఉంది..అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది..అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది..అందరిలో గుడి ఉంది

చరణం::2

తల్లీ తండ్రీ గురువు పెద్దలు..పిల్లలు కొలిచే దైవం
తల్లీ తండ్రీ గురువు పెద్దలు..పిల్లలు కొలిచే దైవం

కల్లా కపటం తెలియని పాపలు..తల్లులు వలచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు..తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం..ప్రతి పులుగూ ఎగిరే దైవం

అడుగడుగున గుడి ఉంది..అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది..అదియే దైవం
అడుగడుగున గుడి ఉంది..అందరిలో గుడి ఉంది