సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
Film Director::V.B.Rajendra Prasad
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,జయంతి,రాజబాబు,S.వరలక్ష్మీ,కృష్ణ,శోభన్‌బాబు,
నాగభూషణం,పద్మనాభం.
:::::::::
ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో..జన్మల అనుబంధం
ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో..జన్మల అనుబంధం
::::1
ఎన్నో ఊసులు ఎదలో మెదిలే తొలిరోజు
అవి మాటలకందక మారాం చేసేదీరోజు
ఎన్నో ఊసులు ఎదలో మెదిలే తొలిరోజు
అవి మాటలకందక మారాం చేసేదీరోజు
ఈ రోజు కోసమే కన్నులు కాయలు కాచినవి
ఈ రోజు కోసమే కన్నె సొగసులు దాచినది
ఈ రోజు కోసమే కన్నె సొగసులు దాచినది
ఇది..ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో..జన్మల అనుబంధం
::::2
మోజులు పెరగాలివాటిని చేతలు చెయ్యాలి
సుఖాల లోతులు చూడాలి ఒడిలో సోలిపోవాలి
మోజులు పెరగాలి వాటిని చేతలు చెయ్యాలి
సుఖాల లోతులు చూడాలి ఒడిలో సోలిపోవాలి
అలుపు సొలుపు ఎరగని పరువం అంతు చూడాలి
ఎండ వాన రెండూ చూస్తూ పండిపోవాలి
అలుపు సొలుపు ఎరగని పరువం అంతు చూడాలి
ఎండ వాన రెండూ చూస్తూ పండిపోవాలి
ఇది..ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో..జన్మల అనుబంధం
::::3
ఆలుమగలుగ ఆనందం చవిచూశాము
అనురాగం పండి అమ్మానాన్నలమైనాము
ఆలుమగలుగ ఆనందం చవిచూశాము
అనురాగం పండి అమ్మానాన్నలమైనాము
ఈ రోజు కోసమే ఆడది తపస్సు చేసేది
ఈ రోజు కోసమే ఆడది తపస్సు చేసేది
ఈ బోసినవ్వుకే మగాడు జోలలు పాడేది
ఈ బోసినవ్వుకే మగాడు జోలలు పాడేది
ఇది..ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో..జన్మల అనుబంధం