Thursday, January 20, 2011

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్--1976




















సంగీతం::పెండ్యల నాగేశ్వరరావ్ 
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరీ 
దర్శకత్వం::బాపు 
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,జగ్గయ్య,G.వరలక్ష్మి,రమాప్రభ,కాంతారావు,
అల్లు రామలింగయ్య

పల్లవి::

ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్నుఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ
ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్ను ఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ
కన్నెర్ర చెయ్యవద్దు నీ కత్తి నూరవద్దు
కన్నతల్లివని నిన్ను తలుచుకుందుమేపొద్దు         
ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్ను ఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ

చరణం::1

గుండె ఝల్లు మనిపించు..నీ రూపు
అమ్మ కొట్టవచ్చినట్టుండు..నీ చూపు
అమ్మో..అమ్మా..అమ్మో..అమ్మా
అమ్మా..అమ్మా..అమ్మా..అమ్మా
అమ్మలగన్నమ్మ ఆంకాళ శక్తివమ్మ
నీ కన్నా దైవం ఈ లోకంలో లేదమ్మా
నీ కన్నా దైవం ఈ లోకంలో లేదమ్మా                
అమ్మ ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్ను ఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ

చరణం::2

ముడుపులుగట్టీ మొక్కేవాళ్ళను
ముందు నిలిచి కాపాడేవమ్మా
అమ్మో..అమ్మో..అమ్మో..అమ్మో 
కుంభాలను చెల్లించే వాళ్ళకు కోరిక లిచ్చేనమ్మా
అమ్మా..అమ్మా..అమ్మా..అమ్మా..అమ్మా
ముడుపులుగట్టీ మొక్కేవాళ్ళను
ముందు నిలిచి కాపాడేవమ్మా
కుంభాలను చెల్లించే వాళ్ళకు కోరిక లిచ్చేనమ్మా
ఆపదలను దీర్చేవమ్మా మమ్మాదుకునే దేవతవమ్మా
సంబరాలతో చిందులు తొక్కీ జాతర చేస్తామే మాయమ్మా  
ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్ను ఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ

చరణం::3

మహిషాసురుని బట్టి మర్ధించినావు
ఊరూరా నీ మహిమ చూపించినావు
మహిషాసురుని బట్టి మర్ధించినావు
ఊరూరా నీ మహిమ చూపించినావు
నిన్ను గొల్వనివాళ్ళ నిన్ను నమ్మనివాళ్ళ
బలిబలోయని పట్టి తలలు రాల్చేవమ్మో..ఓఓ