సంగీతం::S.రాజేశ్వర రావ్,చలపతి రావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల
రాననుకున్నావేమో..ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో..ఏమో
ఏమనుకున్నారేమో..తమరేమనుకున్నారేమో
మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో..ఏమో
చక్కని కన్యవు ముక్కున కోపం నీకేలా..నీకేలా
చల్లగాలిలో ఆటలాడగా రావేలా..రావేలా
పిలిచినవెంటనె పరుగున చెంతకు చేరాలా..చేరాలా
వలచివచ్చి నే చులకనైతిగా ఈవేళా..ఈవేళా
ఏమనుకున్నారేమో..తమరేమనుకున్నారేమో
మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో..ఏమో
దొరగారేదో తొందరపనిలో మునిగారా..మునిగారా
అందుచేతనే అయినవారినే మరిచారా..మరిచారా
నిజమే తెలియక నిందలు వేయకు నామీదా..నామీదా
మాటవిసురులు మూతివిరుపులు మరియాదా..మరియాదా
రాననుకున్నావేమో..ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో..ఏమో
క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానే..నిలిచానే
నిన్ను చూడగా యుగమె క్షణముగా గడచేనే..గడచేనే
ఎడబాటన్నది ఇకపై లేదని అందామా..అందామా
ఈడుజోడుగా తోడునీడగా ఉందామా..ఉందామా
ఆ . . . ఓ . . .