సంగీతం::సత్యం
రచన::గోపి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని
పల్లవి::
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా
కండలు పిండి మన కండలు పిండి
పనిచేస్తే కొండలు పిండై పోవునురా
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా
కండలు పిండి మన కండలు పిండి
పనిచేస్తే కొండలు పిండై పోవునురా
చరణం::1
దోచుకునేందుకు దాచుకునేందుకు
నిన్నటి వరకే చెల్లింది
దోచుకునేందుకు దాచుకునేందుకు
నిన్నటి వరకే చెల్లింది
కష్ట మెవడిదో సుఖం వాడికే
దక్కేరోజు వచ్చింది దక్కేరోజు వచ్చింది
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా
కండలు పిండి మన కండలు పిండి
పనిచేస్తే కొండలు పిండై పోవునురా
చరణం::2
పేద ఎవడురా పెద్ద ఎవడురా
అందరి రక్తం ఒకటేరా
పేద ఎవడురా పెద్ద ఎవడురా
అందరి రక్తం ఒకటేరా
చావు పుట్టుకకు లేని తేడాలు
బ్రతికేటప్పుడు..ఎందుకురా
బ్రతికేటప్పుడు..ఎందుకురా
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా
కండలు పిండి మన కండలు
పిండి పనిచేస్తే కొండలు పిండై పోవునురా
చరణం::3
కన్న తల్లిని జన్మభూమిని
ఏమిచ్చారని అడగొద్దు
కన్న తల్లిని జన్మభూమిని
ఏమిచ్చారని అడగొద్దు
వారి కన్నీరు తుడిచే భారం
మనపై వుందని మరవద్దు
మనపై వుందని మరవద్దు
రెక్కల కష్టం చెయ్యనిదే
ఎవ్వరి డొక్కలు నిండవురా
కండలు పిండి మన కండలు పిండి
పనిచేస్తే కొండలు పిండై పోవునురా
కండలు పిండి పనిచేస్తే కొండలు పిండై పోవునురా