Tuesday, January 26, 2010

మంచిమనుషులు--1974






సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల


శ్రీమద్రమా రమణ గోవిందో హ్హా..
హరిలో రంగ హరీ..అమ్మాయిగారిపని హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలో రంగ హరీ..అమ్మాయిగారిపని హరి

శ్రీమద్రమా రమణ గోవిందో హ్హా..
హరిలో రంగ హరీ..అబ్బాయిగారిపని హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలో రంగ హరీ..అబ్బాయిగారిపని హరి

చల్లగాలి తగిలిందంటే..పిల్లదానికి రెపరెపలూ
చల్లగాలి తగిలిందంటే..పిల్లదానికి రెపరెపలూ
పిల్లగాలి సోకిందంటే..కుర్రవాడికి గుబగుబలూ
పిల్లగాలి సోకిందంటే..కుర్రవాడికి గుబగుబలూ
గుబులురేగిన కుర్రవాడు..కూడకూడ వస్తానంటే
గూబమీద చెయ్యి ఒకటి గుయ్యిమంటు మ్రోగిందంటే

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలో రంగ హరీ..అమ్మాయిగారిపని హరి

వెంటబడినా కొంటెవాణ్ణి..ఇంటిదాక రానిచ్చీ
తోడువచ్చిన చొరవిస్తా పోయిరమ్మని తలుపే మూస్తే
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
వెంటబడినా కొంటెవాణ్ణి..ఇంటిదాక రానిచ్చీ
తోడువచ్చిన చొరవిస్తా పోయిరమ్మని తలుపే మూస్తే
తలుపుమూసిన తలపుల్లోన తరుముకొస్తూ వాడేవుంటే
తలుపుమూసిన తలపుల్లోన తరుముకొస్తూ వాడేవుంటే
తెల్లవార్లూ కలలోకొచ్చి అల్లరల్లరీచేసాడంటే
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలో రంగ హరీ..అబ్బాయిగారిపని హరి

దోరవయసు జోరులోన కన్నుమిన్నూ కానరాక
జారి జారి కాలుజారి గడుసువాని వడిలో పడితే
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
దోరవయసు జోరులోన కన్నుమిన్నూ కానరాక
జారి జారి కాలుజారి గడుసువాని వడిలో పడితే
మనసుజారిపోతేగానీ..కాలుజారదు కన్నెపిల్లా
మనసుజారిపోతేగానీ..కాలుజారదు కన్నెపిల్లా
గడుసువాడది తెలుసుకోకా..వడినిపట్టి లొట్టలేస్తే
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలో రంగ హరీ..అమ్మాయిగారిపని హరి

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలో రంగ హరీ..అబ్బాయిగారిపని హరి

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరి హరి హరి హరి హరి హరి హ
రి

మంచిమనుషులు--1974





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు


నిన్నుమరచిపోవాలనీ
అన్నివిడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకొన్నా..
మనసురాక మానుకొన్నా
మనసురాక మానుకొన్నా..2
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నువ్వు విడిచి వెళ్ళినా
నీ రూపు చెరిగిపోలేదూ
నువ్ మరలి రాకున్నా
నీ చోటెవ్వరికీ వెళ్ళలేదూ..2
తలుపు తెరిచి వుంచుకొనీ
తలవాకిట నించొన్నా..
వలపు నెమరు వేసుకొంటూ
నీ తలపులలో బ్రతికున్నా..

నిన్నుమరచిపోవాలనీ
అన్నివిడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకొన్నా..
మనసురాక మానుకొన్నా
మనసురాక మానుకొన్నా

ఎందుకిలా చేసావో....
నీకైనా తెలుసా..?
నేనెందుకింక ఉన్నానో..
నాకేమో తెలియదూ..2
నేను చచ్చిపోయినా..
నా ఆశ చచ్చిపోదులే..
నిన్ను చేరువరకూ..నా
కళ్ళు మూత పడవులే...

నిన్నుమరచిపోవాలనీ
అన్నివిడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకొన్నా..
మనసురాక మానుకొన్నా
మనసురాక మానుకొన్నా

ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

గుండెలోన చేసావూ..
ఆరిపోని గాయాన్నీ..
మందుగా ఇచ్చావూ..
మన వలపు పంట పసివాణ్ణీ..2
ఆ లేతమనసు తల్లికోసం
తల్లడిల్లుతున్నదీ..
నీ తల్లిమనసు తెలియకనే..
దగ్గరౌతు వున్నదీ

నిన్నుమరచిపోవాలనీ
అన్నివిడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకొన్నా..
మనసురాక మానుకొన్నా
మనసురాక మానుకొ
న్నా

మంచిమనుషులు--1974





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ,ఆచార్య
గానం::SP.బాలు,S.జానకి


పడకు పడకు వెంట పడకు
పడుచుపిల్లకు ఆశపడకు
పోపోరా...చినవాడా...2

పడకు పడకు అడ్డుపడకు
పడుచువాణ్ణి చేయి విడకు
పోలేనే...చినదానా...2

లైలా...ఆ...మజునూ...
మేలిముసుగులో పైడిబొమ్మలా
మిసమిసలాడే లైలా
నీ సొగసుకు సలాము చేస్తున్నా
నీ సొగసుకు సలాము చేస్తున్నా

సొగసును మించిన మగసిరితో
నా మనసునుదోచిన మజునూ..
నీ మమతకు గులామునౌతున్నా
నీ మమతకు గులామునౌతున్నా

పెళ్ళికూతురై..వెలుతున్నావా..
మన ప్రేమను ఎడారి చేసావా
మన ప్రేమను ఎడారి చేసావా
పెళ్ళి తనువుకే..చేసారూ...
మన ప్రేమ మనసుకే వదిలాను
మన ప్రేమ మనసుకే వదిలాను
లైలా.....ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

పడకు పడకు వెంట పడకు
పడుచుపిల్లకు ఆశపడకు
పోపోరా...చినవాడా...

హే..ఏ..ఏ..
పడకు పడకు అడ్డుపడకు
పడుచువాణ్ణి చేయి విడకు
పోలేనే...చినదానా...

అనార్...సలీం...
గులాబి పూలతోటలో..ఓ..
హవాయి తీపి పాటలో..
గులాబి పూలతోటలో..
హవాయి తీపి పాటలో..
సలీము లేక గుండెకు
షరాబు మత్తు చూపినా..
ఆ..ఆ..ఆ..అనార్కలీవి నీవు
అనార్కలీవి..నీవు...

ఆఆఆ..మొగల్ సింహాస నానికి.
ఆఆఅ..కసాయి సాసనానికీ
మొగల్ సింహాస నానికి
కసాయి సాసనానికీ
సవాలుగా..జవాబుగా..
గరీబునే వరించినా..ఆ..ఆ
జహాపనావు నువ్వు..జహాపనావు నువ్వు

సలీం..సలీం..సలీం
అనార్....పవిత్ర ప్రేమకు..
సమాధి లేదులే..చరిత్ర మొత్తమే..
విషాధ గాధలే..విషాధ గాధలే

పడకు పడకు వెంట పడకు
పడుచుపిల్లకు ఆశపడకు
పోపోరా...చినవాడా...

హే..ఏ..ఏ..
పడకు పడకు అడ్డుపడకు
పడుచువాణ్ణి చేయి విడకు
పోలేనే...చినదానా...
పోపోరా...చినవాడా...
హే..ఏ..ఏ..
పోలేనే...చినదానా...
పోపోరా...చినవాడా...

మంచిమనుషులు--1974





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::బాలు,జానకి


నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

తీగల్లో నువ్వు నేనే అల్లుకొనేది
పూవుల్లో నువ్వు నేనే మురిసివిరిసేది
తీగల్లో నువ్వు నేనే అల్లుకొనేది
పూవుల్లో నువ్వు నేనే మురిసివిరిసేది
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేది
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేది
తేనెకు మన ముద్దేలే తీపిని ఇచ్చేది..తీపిని ఇచ్చేది

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడది
నువ్వు లేక వానమబ్బుకు మెరుపే ఎక్కడది
సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరము
జీవితాన నువ్వూ నేనై కలిశామిద్దరము

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

కొండల్లే నువ్వున్నావు నాకు అండగా
మంచల్లే నువ్వున్నావు నాకు నిండుగా
కొండల్లే నువ్వున్నావు నాకు అండగా
మంచల్లే నువ్వున్నావు నాకు నిండుగా
ఎన్ని జన్మలైనా ఉందాము తోడునీడగా
ఎన్ని జన్మలైనా ఉందాము తోడునీడగా
నిన్న నేడు రేపే లేని ప్రేమజంటగా..ప్రేమజంటగా

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు