Wednesday, December 16, 2009

చిలిపి క్రిష్ణుడు--1978








సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల


ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్..హేయ్
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్
ఎల్లిపోయాననీ ఏడుస్త కూర్చోకు..హయ్యో పాపం
ఎల్లిపోయాననీ ఏడుస్త కూర్చోకు
మళ్ళోచేసరికి నన్ను మరచిపోకు..డర్..
మామ..మామ..మామ..మామ..
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్

నిద్దరొచ్చి తొంగొంటే కలనౌతాను
నిదురమాని మేల్కొంటే నిజమౌతాను 2
యెనకముందు జనుమలెన్నో ఎరిగినట్టె వుంటాను..ఆ
యెనకముందు జనుమలెన్నో ఎరిగినట్టె వుంటాను
ఎవరూ..నే ఎవరంటే..ఎవరు..
నువ్ ఎవరంటే..వివరంగా చెప్పలేను

ఆహ్హా..ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్

గుడికాడ కలుసుకొన్న గురుతుందా..
ఈ కొత్తలంగ తెచ్చిచ్చావ్ బావుందా 2
మొదటిచ్చిన ముద్దు..హాయ్ మొదటిచ్చిన ముద్దు
ఇంక తియ్యగుందా..
మొదటిచ్చిన ముద్దు..ఇంక తియ్యగుందా..
నీ మొరటు తనం ఇకనైన మారిందా మారిందా
మావ..మావ..మావా..మావా..
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్

ప్రేమకే ప్రేమరా నువ్వంటేనూ
అది పిచ్చిగా మారుతుంది నేనుంటేనూ 2
ఇంటిదాక వెంటపడి రావొద్దు అంటాను
ఆ..హ్హ..ఇంటిదాక వెంటపడి రావొద్దు అంటాను
ఎందుకూ?..నే ఎందుకూ?..
ఎందుకంటే ఆడనేను గయ్యాళిగ వుంటాను..హాయ్..హాయ్
మావ..మావ..మావా..మావా..
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్..డర్ర్...
మావ..మావ..మావా..మావా..
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్

దసరాబుల్లోడు--1971






సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


అరెరెరే..
ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అమ్మీ..ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ..ఓసీ..
అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ

మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్ళూ మెరుస్తుంటే 2
పొదచాటునా నేను మాటేసి చూస్తుంటే
నువ్ తానాలు ఆడావు ఓ లమ్మీ
నా ప్రాణాలు తీసావే చిన్నమ్మీ

అరెరెరే..
ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ

మొగ్గలు ఒక్కొక్క రేకిప్పుకొన్నట్లు
నీ చక్కదనాలునే..ఒకటొకటే చూసాను 2
జడ చూస్తి...హుమ్మ్...
మెడ చూస్తి...ఆహా..
జబ్బల నునుపు చూస్తి...హా..
కనరాని ఒంపులన్ని ఓలమ్మీ
కసి కసిగ చూస్తినే చిన్నమ్మీ

అరెరెరే..
ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ

తడిసీ నీ తెల్లకోక తపాతపా మన్నదీ
తడబడి నా గడుసు మనసు దడా దడా మన్నదీ..ఓర్నీ 2
కళ్ళుమూసుకొచ్చిననీ ఘోల్లున నువ్ నవ్వితే
హా..హా..చురకల్లె తగిలింది ఓలమ్మీ
వుడుకెక్కిపోయిందే చిన్నమ్మీ..

అరెరెరే..
ఎట్టగొ ఉన్నాది ఓ లమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరెరే.....అట్టాగే ఉంటాది ఓ రబ్బీ
ఎట్టాగో అవుతాది చిన్నబ్బీ

దసరాబుల్లోడు--1971







సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

పాడుకొన్న పాటలూ పాతవని ఊరుకో 2
ఆ మాటలన్ని మాపేసి కొత్తపాట పాడుకో

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

మాటతప్పిపోయినా మనిషి బ్రతికితే చాలూ 2
మన మమత చంపుకొన్న ఒక మంచి మిగిలితేచాలు

చేతిలో చెయ్యేసి చెప్పు బావా

తెలియక మనసిచ్చినా తెలిసికుమిలిపోతున్నా 2
మిమ్ము కలపమనీ ముక్కోటి దేవతలకు మొక్కుతున్న

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

రాముని మించిన రాముడు--1975



సంగీతం::T.చలపతి రావ్
రచన::దాసరి నారాయణ రావ్
గానం::S.P.బాలు,P.సుశీల


చిన్నారి నారాణి చిరునవ్వులే నవ్వితే
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

అందాల నారాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

నా నోము పండింది నేడు..నాకు ఈనాడు దొరికింది తోడు
నారాణి అధరాల పిలుపు..నాకు తెలిపేను కలలోని వలపూ..నిండు వలపూ

అందాల నారాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

ఎన్నెన్ని జన్మాల వరమో..నేడు నావాడవైనావు నీవు
నావెంట నీవున్న వేళా..కోటిస్వర్గాల వైభోగమేల..భోగమేలా

చిన్నారి నారాణి చిరునవ్వులే నవ్వితే
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే

ఈ తోట మనపెళ్ళి పీటా
పలికె మంత్రాలు గోరింక నోటా
నెమలి పురివిప్పి ఆడింది ఆట
వినగ విందాయే చిలకమ్మ పాటా..పెళ్ళి పాట

అందాల నారాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది..పూలవాన కురిసింది
లోకమే..పులకించి మైకంలో..ఉయ్యాలలే ఊగెలే