Sunday, November 20, 2011

అందాల రాముడు--1973


చిమ్మట లోని మరో ఆణిముత్యం వినండి

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ


పల్లవి::

రాముడేమన్నాడోయ్..సీతా రాముడేమన్నాడోయ్
రాముడేమన్నాడోయ్..సీతా రాముడేమన్నాడోయ్

మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్
రాముడేమన్నాడోయ్..సీతా రాముడేమన్నాడోయ్

చరణం::1

మురగ పెట్టుకొన్న పాలు విరుగునన్నాడీయ్
పంచుకొన్న పాలు మంచి పెంచునన్నాడోయ్..2
పూచిక పుల్లైన వెంట రాదన్నాడోయ్
పూచిక పుల్లైన వెంట రాదన్నాడోయ్
పుణ్యమొక్కటే చివరకు మిగులునన్నాడోయ్
డోయ్..డోయ్..డోయ్..

రాముడేమన్నాడోయ్..
సీతా రాముడేమన్నాడోయ్

చరణం::2

మాయ నగలు మోతచేటు బరువన్నాడోయ్
న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్
మాయ నగలు మోతచేటు బరువన్నాడోయ్
అహా..న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్
గొప్ప కొరకు పెద్ద పరుగులొద్దన్నా డోయ్..2
అప్పుచేసి పప్పుకూడు వలదన్నా డోయ్

రాముడేమన్నాడోయ్..
సీతా రాముడేమన్నాడోయ్

చరణం::3

కొండమీది కోతులను కొనలేరోయ్ డబ్బుతో
బండరాతి గుండెలనూ మార్చెనోయ్ మంచితో
నేడు రాజులంత మంత్రులైతె మెచ్చుకొన్నాడోయ్..2
కొందరు మంత్రులు మారాజులైతె నొచ్చుకొన్నాడోయ్

రాముడేమన్నాడోయ్..
సీతా రాముడేమన్నాడోయ్

చరణం::4

రావణుడే కాష్టమింక రగులునన్నాడోయ్
నేటి రావణులకు వేల వేల శిరసులన్నాడోయ్..2
నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడోయ్..2
నీలోగల సైతానుని చంప మన్నాడోయ్

డోయ్..డోయ్..డోయ్..

రాముడేమన్నాడోయ్..
సీతా రాముడేమన్నాడోయ్
మనుషుల్లారా మాయా మర్మం వద్దన్నాడోయ్
రాముడేమన్నాడోయ్..సీతా రాముడేమన్నాడోయ్