Wednesday, November 28, 2012

బాలభారతము--1972


















సంగీత::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల  
తారాగణం::S.V.రంగారావు,అంజలీదేవి,బేబి శ్రీదేవి,కాంతారావు,S.వరలక్ష్మి,హరనాధ్ 

పల్లవి::

తారంగం తారంగం..తాండవకృష్ణా తారంగం  
దైవం నీవే తారంగం..ధర్మం నీవే తారంగం  
తారంగం తారంగం..తాండవకృష్ణా తారంగం  
దైవం నీవే తారంగం..ధర్మం నీవే తారంగం  

చరణం::1

దేవతలూ దానవులూ..పాల సముద్రం తరిచారు
దేవతలూ దానవులూ..పాల సముద్రం తరిచారు
అప్పుడు అమృతం పుట్టింది..అందరికీ నూరూరింది 
మాదే మాదే అమృతమని..వాదులాడు సోదరుల గని
అప్పుడు నువ్వేం చేెశావు...ఆడవేషం వేశావు 
ఆ కులుకు ఆ తళుకు..ఆ కిలకిల నవ్వుల బెళుకు  
ఇంకా నువ్వేం...చేెశావు  
తగినవారికి సుధను పంచిపెట్టావు..పొగరు బోతులకేమో సున్నా చుట్టావు  
తారంగం తారంగం...తాండవకృష్ణా  తారంగం  
దైవం నీవే తారంగం...ధర్మం నీవే తారంగం  

చరణం::2

ఇంద్ర పదవినే చేపట్టితినని..ఎగిరి ఎగిరి పడె బలి 
వాని గర్వముని అణచి వెయగా..వామనుడాయెను హరి
వడుగై వానిని చేరెను..మూడడుగుల నేలను కోరెను
అడ్డుపడిన ఆ శుక్రుని...కంటిని 
దర్భ పుల్లతో పొడిచెను..ఆ కన్నే లొట్టగ చెసెను 
ఇంతై వటుడంతై మరి ఎంతో ఎంతో పెరిగెను..పెరిగీ  
భువినొక్క అడుగుతో మూసెను..దివినొక్క అడుగుతో దాచెను  
మూడవ అడుగు ఏదని బలినే..పాతాళానికి తొక్కెను  
తారంగం తారంగం..తాండవకృష్ణా  తారంగం  
దైవం నీవే తారంగం..ధర్మం నీవే తారంగం  

చరణం::3

అన్నలారా విన్నారా..చిన్న కృష్ణుని గాథలు  
అసూయలన్నవి లేకుంటే..బ్రతుకులు  కళకళ లాడునులే
చెప్పుడు మా టలు వినకుంటే..ఎప్పటికైనా శుభమౌలే 
అన్నదమ్ములు కలిసుంటే..అందరికీ ఆనందం
ఆపై దేవుడు తోడుంటే..ఆనందం పరమానందం   
తారంగం తారంగం..తాండవకృష్ణా  తారంగం  
దైవం నీవే తారంగం...ధర్మం నీవే తారంగం  
దైవం నీవే తారంగం...ధర్మం నీవే తారంగం
ధర్మం నీవే తారంగం...ధర్మం నీవే తారంగం 

బాలభారతము--1972



















సంగీత::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి,బృందం  
తారాగణం::S.V.రంగారావు,అంజలీదేవి,బేబి శ్రీదేవి,కాంతారావు,S.వరలక్ష్మి,హరనాధ్ 

పల్లవి::

విందు భోొజనం..పసందు భోొజనం
ఏటిగట్టు తోటలోన..మేటి భోొజనం
విందు భోొజనం..పసందు భోొజనం
ఏటిగట్టు తోటలోన..మేటి భోొజనం

చరణం::1

నేతి గారెలు...నేతి బూరెలు
జాతివడ్ల పులిహోర..పరమాన్నాలు
నేతి గారెలు...నేతి బూరెలు
జాతివడ్ల పులిహోర...పరమాన్నాలు
అప్పడాలు దప్పళాలు..ఆవకూరలు ఫేరు
చెప్పగానె నోరూరె...పిండివంటలు
భలే పిండివంటలు...భలే పిండివంటలు                          
విందు భోొజనం..పసందు భోొజనం
ఏటిగట్టు తోటలోన..మేటిభోొజనం

చరణం::2

ఆరు రుచుల మేళవింపె..నిండు భోజనం
అన్నదమ్ములారగింపె..దండి భోజనం
ఒంటి పిల్లి రాకాసిది...ఉత్తభొజనం
ఒంటి పిల్లి రాకాసిది...ఉత్తభోొజనం 
కన్నుల పంటయను..పండుగౌను బంతి భోజనం
సహ...బంతి భోజనం            
విందు భోొజనం...పసందు భోొజనం
ఏటిగట్టు తోటలోన..మేటి భోొజనం

చరణం::3

బొబ్బట్లు మినపట్లు..పొంగళ్ళు నంజుళ్ళు
దబ్బకాయలంత..పెద్ద లడ్డుండలు
బొబ్బట్లు మినపట్లు..పొంగళ్ళు నంజుళ్ళు
దబ్బకాయలంత..పెద్ద లడ్డుండలు
పులుపు తీపి కారాలు ముక్కుదాకా బాగా 
కలిపికొట్టి తిన్నదే...కమ్మని విందు
భలే కమ్మని విందు..భలే కమ్మని విందు             
విందు భోొజనం..పసందు భోొజనం
ఏటిగట్టు తోటలోన..మేటిభోొజనం
విందు భోొజనం..పసందు భోొజనం
ఏటిగట్టు తోటలోన..మేటి భోొజనం

బాలభారతము--1972























సంగీత::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల 
తారాగణం::S.V.రంగారావు,అంజలీదేవి,బేబి శ్రీదేవి,కాంతారావు,S.వరలక్ష్మి,హరనాధ్ 

పల్లవి::

నారాయణ నీ లీల...నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం..బాలభారతం  
నారాయణ నీ లీల...నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం..బాలభారతం   

ముని శాపముచే...వగచే సతీపతులకూ
తనయుల నొందే మార్గము...తాపసి తెలిపే
మును దుర్వాసుడు చెప్పిన..మంత్రముచేతా..ఆ..ఆ  
మును దుర్వాసుడు..చెప్పిన మంత్రముచేతా
తన వంశము నిలపమని...జనపతి కోరే 
నారాయణ నీ లీల...నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం..బాలభారతం   

చరణం::1

కృష్ణాగ్రజుడై బలరాముడు..గోకులమున జనియించే
కుంతికి ధర్ముని అనుగ్రహంబున..కులదీపకు డుదయించే
ఆ శుభవార్తకు గాంధారీ..సతి అసూయ చెందినదీ
ఈసున గర్భ తాడన..మింతి తానొనరించినదీ 
వ్రయ్యలైన గర్భమ్మును..వ్యాసుడు సంరక్షించెనూ
పిండమును నూటొక్క..కుండల విభజించెనూ
వరమునిచ్చెను వాయుదేవుడు..అంత వనిత కుంతికి పుట్టె భీముడు 
మొదటి కడవ జొచ్చెను...కలిపురుషుడు
కలిగే గాంధారికి తొలి పుత్రుడూ..కలిగే గాంధారికి తొలి పుత్రుడూ
దుర్యోధన జననముచే....దుశ్శకునమ్ములు దోచే
దుర్భర రావమ్ములకు..ధు:ఖించెను జగతీ 
దుష్టుల శిక్షించుటకై..శిష్టుల రక్షించుటకై 
అష్టమి శుభలగ్నమున..హరి సరుగున వెలసే 
నారాయణ నీ లీల...నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం..బాలభారతం   

చరణం::2

జనియించిన హరి జననీ జనకుల..జ్ఞానుల గావించే
తనయుని చేకొని వసుదేవుడు..తా వ్రేపల్లెకు జేర్చే
యశోద సుతయౌ యోగమాయ..నా నిశీధమున తెచ్చే 
నశింపజేయగ దలచెడి కంసుడు..అశెక్త దిగ్బ్రముడాయే  
అమరేంద్రుని అతినిష్టతొ..అర్చించెను కుంతి
అతని వరముచే నరుడే..అర్జునుడై పుట్టె
నరనారాయణ జననము..ధరణికి ముదమాయే
సురలు మురిసి సుధలు చిందు..విరివానలు విరిసే  
శతపుత్రుల పిదప నొక్కసుతను..గాంచె గాంధారీ
శకుని కూడ సుతుని బడసి..సంతోషము తానొందె
నాతి మాద్రి అశ్వినులను..ప్రీతితో భజించే 
నకులుడు సహదీవుడనే..నందనులను గాంచే
కౌరవులూ పాండవులూ..కమనీయులు యాదవులూ
కారణ జన్ములు సర్వులు..ధారుణి ప్రవర్దమానులైరి 
దారుణ హింసా కాండల..దానవ పతి కంసుడూ
ధనుర్యాగమని బలరామకృష్ణుల..తన వద్దకు రప్పించే

బాలభారతము--1972





సంగీత::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల 
తారాగణం::S.V.రంగారావు,అంజలీదేవి,బేబి శ్రీదేవి,కాంతారావు,S.వరలక్ష్మి, హరనాధ్ 

పల్లవి::

మానవుడే...మహనీయుడు
మానవుడే...మహనీయుడూ 
శక్తి యుతుడు..యుక్తి పరుడు
మానవుడే...మాననీయుడూ
మంచిని తలపెట్టినచో..మనిషి కడ్డులేదులే
ప్రేరణ దైవానిదైన...సాధించును నరుడే

చరణం::1

దివిజ గంగ భువి దిపిన..భగీరథుడు మానవుడే
సుస్థిర తారగమారిన..ద్రువుడు కూడ మానవుడే
సృష్టికి ప్రతి సృష్టి చేయు..విశ్వామిత్రుడు నరుడే
జీవకోటి సర్వములో..శ్రేష్టతముడు మానవుడే 
మానవుడే మహనీయుడు..మానవుడే మహనీయుడూ 

చరణం::2

గ్రహరాశుల నధిగమించి..ఘనతారల పథమునుంచి 
గ్రహరాశుల నధిగమించి..ఘనతారల పథమునుంచి 
గగనాంతర రోదసిలో..గధర్వగోళ తతుల దాటి 
చంద్రలోకమైనా...దేవేంద్ర లోకమైనా
చంద్రలోకమైనా...దేవేంద్ర లోకమైనా
బొందితో జయించి మరల..భువికి తిరిగి రాగలిగే 
మానవుడే మహనీయుడు..మానవుడే మహనీయుడూ 
శక్తి యుతుడు యుక్తి పరుడు..మానవుడే మాననీయుడూ

Baala Bharatham--1972
Music::Saluri Rajeshwara Rao
Lyricist::Arudra
Singer's::Ghantasala

:::

mAnavuDE mahanIyuDu
mAnavuDE mahanIyuDu
SaktiyutuDu yuktiparuDu mAnavuDE
mAnanIyuDu
mAnavuDE mahanIyuDu

anupallavi:
maMchini talapeTTinachO 
maniShikaDDulEdulE
prEraNa daivAnidaina 
sAdhiMchunu naruDE
mAnavuDE mahanIyuDu
mAnavuDE mahanIyuDu

::1

divija gaMga Buvi diMpina
BagIrathuDu mAnavuDE
susthira taaraga mArina
dhruvuDu kUDa mAnavuDE
sRuShTiki pratisRuShTi 
chEyu viSvAmitruDu naruDE
jIvakOTi sarvamulO 
SrEShTatamuDu mAnavuDE
mAnavuDE mahanIyuDu
mAnavuDE mahanIyuDu

:::2

graharASulanadhigamiMchi
GanatArala pathamu nuMchi
graharASulanadhigamiMchi
GanatArala pathamu nuMchi
gaganAMtara rOdasilO
gaMdharvagOLa tatula dATi
chaMdralOkamainA dEvEMdralOkamainA
chaMdralOkamainA dEvEMdralOkamainA
boMditO jayiMchi marala
Buviki tirigi rAgaligE

mAnavuDE mahanIyuDu

mAnavuDE mahanIyuDu

బాలభారతము--1972





సంగీత::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరీ 

పల్లవి::

బలె బలె బలె బలె...పెదబావా
భళిర భళిర...ఓ చినబావా
కని విని ఎరుగని...విడ్డూరం
సరిసాటిలేని మీ...ఘనకార్యం 
బలె బ బలె బలె...పెదబావా
భళిర భళిర...ఓ చినబావా

చరణం::1

మీరు నూరుగురు...కొడుకులు
అహ మారుమ్రోగు..చలి పిడుగులు
మీరు నూరుగురు...కొడుకులు
అహ మారుమ్రోగు..చలి పిడుగులు
మట్టితెచ్చి గంభీర..గుట్టలేసి
జంభారి పట్టపేనుగు బొమ్మచేయు ఘటికులు
అహా..జంభారి పట్టపేనుగు బొమ్మచేయు ఘటికులు 
వీరాధి వీరులైన..శూరాతి శూరులైన
మీ కాలిగోటికి...చాలరు  
బలె బ బలె బలె...పెదబావా
భళిర భళిర...ఓ చినబావా

చరణం::2

దైవమేది వేరులేదు...తల్లికంటె
ఆ తల్లికోర్కె తీర్చువారె..బిడ్డలంటె
దైవమేది వేరులేదు...తల్లికంటె
ఆ తల్లికోర్కె తీర్చువారె..బిడ్డలంటె
ఏ తల్లి నోచలేదు...ఇంతకంటె..ఆహా
ఏ తల్లి నోచలేదు...ఇంతకంటె
ఈ మాట కల్ల...కాదు
ఈ రేడు...జగములందు
మీ లాంటివాళ్ళు..ఇంక పుట్టరంటే..ఆహా  
బలె బ బలె బలె...పెదబావా
భళిర భళిర...ఓ చినబావా

చరణం::3

మేళాలు తాళాలు..ముత్యాల ముగ్గులు
రత్నాల గొడుగులు...సంబరాలు..హ్హా 
మేళాలు తాళాలు..ముత్యాల ముగ్గులు
రత్నాల గొడుగులు...సంబరాలు 
ఊరంతా పచ్చని తోరణాలు..వీరణాలు తందనాలు 
ఊరంతా పచ్చని తోరణాలు..వీరణాలు తందనాలు 
ఊరేగే వైభవాలు...బంగారు వాయనాలు
ఆనంద భరితమౌను....జీవితాలు   
బలె బ బలె బలె..పెదబావా
భళిర భళిర..ఓ చినబావా
కని విని ఎరుగని...విడ్డూరం
సరిసాటిలేని...మీ ఘనకార్యం