Wednesday, May 30, 2012

చెట్టు కింద ప్లీడరు--1989సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,K.S.చిత్ర 
తారాగణం::రాజేంద్రప్రసాద్,కిన్నెర.

పల్లవి::

అల్లిబిల్లి..కలలా రావే
అల్లుకున్న..కధలా రావే
అల్లిబిల్లి..కలలా రావే
అల్లుకున్న..కధలా రావే
మల్లెపూల..చినుకై రావే
పల్లవించు..పలుకై రావే
వేచే ఎదలో..వెలుగై రావే

అల్లిబిల్లి కలలా రానా..ఆహ
అల్లుకున్న కధలా రానా..ఆహ
మల్లెపూల..చినుకై రానా
పల్లవించు..పలుకై రానా
వేచే ఎదలో..వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే..ఆహ
అల్లుకున్న కధలా రావే..ఆహ
అల్లిబిల్లి..కలలా

చరణం::1

సోగకళ్ళ విరిసే సొగసే..గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే..మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు..రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు..నిన్నుకోరి నిలిచే
ఏల బిగువా ఏలుకొనవా..ప్రేమకధ వినవా
అల్లిబిల్లి కలలా రానా..ఆహ
అల్లుకున్న కధలా రానా..ఆహ
అల్లిబిల్లి..కలలా

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జావళీలు పాడే జాణ..జాబిలమ్మ తానై
గుండె నిండి పోయే చానా..వెండి మబ్బు తానై
సంగతేదొ తెలిపే తలపే..సంగతులు పలికే
దూరమింక చెరిపే వలపే..దోరనవ్వు చిలికే
మేనికులుకే తేనెచినుకై..పూల జల్లు కురిసే

అల్లిబిల్లి కలలా రావే..ఆహ
అల్లుకున్న కధలా రావే..ఆహ
అల్లిబిల్లి కలలా రానా..ఆహ
అల్లుకున్న కధలా రానా..ఆహ
మల్లెపూల..చినుకై రావే
పల్లవించు..పలుకై రావే
వేచే ఎదలో..వెలుగై రానా
అల్లిబిల్లి..కలలా రావే
అల్లుకున్న..కధలా రానా
అల్లిబిల్లి..కలలా