Tuesday, February 17, 2015

మేలుకొలుపు--1978




సంగీతం::మాస్టర్ వేణు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::B.V.Prasad 
తారాగణం::N.T.రామారావు,జయప్రద,K.R.విజయ,చలం,నాగభూషణం,జయమాలిని.

పల్లవి::

కనరాని నీవే::కనిపించినావే
అనురాగ వీణ::పలికించినావే

కనరాని నీవే..అహా 
కనిపించినావే..ఆహా
అనురాగ వీణ..ఆ
పలికించినావే..ఆ

చరణం::1

కలలన్ని నేడు..నిజమాయె చూడు
కలలన్ని నేడు..నిజమాయె చూడు
ఏనాటికైనా..విడిపోదు తోడూ 

ఇన్నాళ్ళు నీకై..వేచాను నేను..ఊ
ఇనాళ్ళు నీకై..వేచాను నేను
ఎడబాటు దాటి చేరాను నిన్ను..చేరాను నిన్ను

ఉందాము మనము..ఒక గూటిలోనే
నడిచేము మనము..ఒక బాటలోనే

చరణం::2

మ్రోగింది అందె..నా రాజు కోసం
వేసింది చిందు..నా మూగ హృదయం

హృదయాలు రెండు..ఉయ్యాలలూగే
హృదయాలు రెండు..ఉయ్యాలలూగే
జత చేరి నేడు..సైయ్యాటలాడే

కనుపాపలాగా..నిను చూసుకోనా
పసిపాపలాగా..నిను దాచుకోనా
కనరాని నీవే..కనిపించినావే
అనురాగ వీణ..పలికించినావే 

Melukolupu--1978
Music::Master Venu
Lyrics::Dasarathi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::B.V.Prasad 
Cast::N.T.RamaRao,Jayaprada,K.R.Vijaya,Chalam,Naagabhooshanam,Jayamaalini.

:::::::::::::::

kanaraani neevE::kanipinchinaavE
anuraaga veeNa::palikinchinaavE

kanaraani neevE..ahaa 
kanipinchinaavE..aahaa
anuraaga veeNa..aa
palikinchinaavE..aa

::::1

kalalanni nEDu..nijamaaye chooDu
kalalanni nEDu..nijamaaye chooDu
EnaaTikainaa..viDipOdu tODuu 

innaaLLu neekai..vEchaanu nEnu..uu
inaaLLu neekai..vEchaanu nEnu
eDabaaTu daaTi chEraanu ninnu..chEraanu ninnu

undaamu manamu..oka gooTilOnE
naDichEmu manamu..oka baaTalOnE

::::2

mrOgindi ande..naa raaju kOsam
vEsindi chindu..naa mooga hRdayam

hRdayaalu renDu..uyyaalaloogE
hRdayaalu renDu..uyyaalaloogE
jata chEri nEDu..saiyyaaTalaaDE

kanupaapalaagaa..ninu choosukOnaa
pasipaapalaagaa..ninu daachukOnaa
kanaraani neevE..kanipinchinaavE
anuraaga veeNa..palikinchinaavE 

దత్తపుత్రుడు--1972



సంగీతం::T.చలపతిరావు 
రచన::కోసరజురాఘవయ్య 
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,కైకాల సత్యనారాయణ,అల్లురామలింగయ్య,వెన్నిరాడైనిర్మల,రమాప్రభ,సూర్యకాంతం. 

పల్లవి::


ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే   
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే   
మా చేను బంగారం పండిందిలే 

చరణం::1

ఏలూరు కాల్వకింద పాలంకి వెయ్యంగ
ఏలూరు కాల్వకింద పాలంకి వెయ్యంగ
K.C.కెనాలుకింద కేసరాలు చల్లంగ
K.C.కెనాలుకింద కేసరాలు చల్లంగ
నెలకు మూడు వానలూ నిలబెట్టీ కురవంగ
నెలకు మూడు వానలూ నిలబెట్టీ కురవంగ 
చెయ్యెత్తునా పైరు చెండించి పెరిగింది     
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే 

చరణం::2

నల్లగొండ బత్తుడుచే నాగళ్ళు చేయించి
నాగళ్ళు...చేయించి
కొండపల్లి కమ్మరిచే కొడవళ్ళు సరిపించి
కొడవళ్ళు....సరిపించి
దూపాటి గిత్తలచే దుక్కులు దున్నించాము
దూపాటి గిత్తలచే దుక్కులు దున్నించాము
మట్టిలో నూనెడు పోసి..పుట్టెడు పండించాము                  
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే 

చరణం::3

చెమట తీసి రైతు పాటు చెయ్యకపోతే
పాటు...చెయ్యకపోతే
గొమాత గుమ్మపాలు ఇయ్యక పోతే
గుమ్మపాలు...ఇయ్యక పోతే
కుక్కలనే పీక్కుతినే డొక్కల కరువొస్తుందీ
కుక్కలనే పీక్కుతినే డొక్కల కరువొస్తుందీ
తిని తిరెగే సోంబేరుల తిక్క వదిలి పోతుంది         
మా చేను బంగారం పండిందిలే
మా యింట మహాలక్ష్మి నిలిచిందిలే
మా చేను బంగారం పండిందిలే