Saturday, September 20, 2014

భలే తమ్ముడు--1969




సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::మొహమ్మద్ రఫీ,P.సుశీల 
తారాగణం::N.T.రామారావు, K.R.విజయ,రేలంగి,రాజనాల,రమాప్రభ,మిక్కిలినేని,ప్రభాకరరెడ్డి  

పల్లవి::

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
కై పెక్కిన కన్నులతోనే మత్తెక్కించీ
కవ్వించే బొమ్మ..ఈ ముద్దుల గుమ్మ
ఉసికొలిపే వొంపులతోనే..మరులెత్తించీ
ఊగించే రెమ్మ..ఈ ముద్దులగుమ్మ 

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ

చరణం::1

విసుగెత్తిన..బ్రతుకులలోన 
ఏముంది..పస ఏముంది
విసుగెత్తిన..బ్రతుకులలోన 
ఏముంది..పస ఏముంది
సిసలైన సారం ఈ క్లబ్బులు కౌగిట దాగుంది
సిసలైన సారం ఈ క్లబ్బులు కౌగిట దాగుంది
సరదాగా సీతాకోక..చిలకల్లాగ
తిరగాలి రోజూ..తీరాలి మోజు
రేపన్నది లేనేలేదు..రానేరాదు
ఉందొకటే నేడు..నీ ముందుంది చూడు 

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ

చరణం::2

గుమ్మా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాకి కోకిల అవుతుందా..కంచు కనకం అవుతుందా
క్లబ్బు కాపురమవుతుందా..వెలయాలు ఇల్లాలు అవుతుందా
కాకి కోకిల అవుతుందా..కంచు కనకం అవుతుందా
క్లబ్బు కాపురమవుతుందా..వెలయాలు ఇల్లాలు అవుతుందా

జబ్బలదాకా జాకెట్టు..సిగ్గూ ఎగ్గూ తీసికట్టు
బారెడు జుట్టు..జానెడాయె
బొడ్డు క్రింద చీరకట్టు..మోజులాయె 
బారెడు జుట్టు..జానెడాయె
బొడ్డు క్రింద చీరకట్టు..మోజులాయె..హేయ్..య్యా
ఓరయ్యో ఉన్నది..అంతా ఉన్నట్టంటే
ఊరంతా ఉలుకు..గుండెల్లో కలుకు 
ఓరయ్యో ఉన్నది..అంతా ఉన్నట్టంటే
ఊరంతా ఉలుకు..గుండెల్లో కలుకు

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ