Wednesday, May 08, 2013

ఆడవాళ్ళు మీకు జోహార్లు--1981


సంగీతం::K.V. మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణం రాజు,చిరంజీవి,రాజేంద్ర ప్రసాద్, జయసుధ, సరిత

పల్లవి::

ఆడాళ్ళు..మీకు జోహార్లు
ఓపిక..ఒద్దిక..మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు..మీకు జోహార్లు
ఓపిక..ఒద్దిక..మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు..మీకు జోహార్లు

చరణం::1

ఒకరు దబ్బ పండు..ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం..ఒకరిది కానరాని తియ్యదనం
ఒకరు దబ్బ పండు..ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం..ఒకరిది కానరాని తియ్యదనం

ఇద్దరి మంచితనం..నాకు ఇస్తుంది ప్రాణం
ఇది తలచుకుంటే..మతిపోతుంది ఈదినం

ఆడాళ్ళు..మీకు జోహార్లు

చరణం::2

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం

ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం
ఇదే పనా మీకూ..ఇందుకే పుట్టారా

ఆడాళ్ళు..మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక..మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు..హ హ హ హAdavaaLLu meeku jOhaarlu--1981
Music::K.V. Mahadaevan
Lyricist::Achaarya Atraeya
Singer::S.P.baalu
Cast::Krishnamraju , Chiranjeevi , Raajendraprasad , Jayasudha , Sarita.

::1

Adavallu..meeku johaarlu
opika..oddika..mee perlu
meeru okarikante okaru goppollu

Adavallu..meeku johaarlu

opika..oddika..mee perlu
meeru okarikantae okaru goppollu

Adavallu..meeku johaarlu


::2

okaru dabba pandu..okaru panasa pandu
okaridi kanapadae chakkadanam..okaridi kaanaraani tiyyadanam

okaru dabba pandu..okaru panasa pandu
okaridi kanapadae chakkadanam..okaridi kaanaraani tiyyadanam


iddari manchitanam..naaku istundi praanam
idi talachukuntae..matipotundi eedinam


Adavallu..meeku johaarlu


::3

ravvanta pasupu kaasanta kumkumaku
magavaadini nammadam manishi chaeyadam
manasu nidara laepadam mamata nimpadam
ravvanta pasupu kaasanta kumkumaku
magavaadini nammadam manishi chaeyadam
manasu nidara lepadam mamata nimpadam

aa panilo bratukantaa aragadeeyadam
kanneelle navvugaa maarchukovadam
ide panaa meekoo..induke puttaaraaAdavallu..meeku johaarlu
opika..oddika..mee perlu
meeru okarikante okaru goppollu


AdaaLLu..ha ha ha ha...బంగారు కుటుంబం--1971


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,రాజశ్రీ,రామకృష్ణ,గుమ్మడి,అంజలీదేవి 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ హా హా..ఆ ఆ ఆ ఆ
పిల్లగాలి ఊయలలో
పల్లవించు ఊహలలో 
ఉందామా నీవే నేనుగా                           
పిల్లగాలి ఊయలలో
పల్లవించు ఊహలలో 
ఉందామా నీవే నేనుగా                           

చరణం::1

నీలినింగి అంచులదాకా
కేలుసాచి పోదామా
పాలమబ్బు పల్లకిలోన
పరవశించి పోదామా
పరిమళాల దారులలోనా
మరులు పెంచుకొందామా
మరకతాల కోనలలోన
మనసు కలుపుకొందామా
పగలుకాయు వెన్నెలలో
పలవరించు కన్నులలో
ఉందామా నీవే నేనుగా                        

చరణం::2

చిలిపివాగు తరగలలోనా
పిలుపులేవో విందామా 
పులకరించు నురుగులలోనా
వలపుపొంగు కందామా
సొంపులొలుకు సందెలలోన
కెంపులేరుకొందామా
పలుకలేని గుండెలలోన
పాటలల్లు కొందామా
వాడిపోని రాతిరిలో 
వీడిపోని కౌగిలిలో
ఉందామా నీవే నేనుగా   
పిల్లగాలి ఊయలలో
పల్లవించు ఊహలలో
ఉందామా నీవే నేనుగా                           

నేనంటే నేనే--1968సంగీతం::S.P.కోదండపాణి 
రచన::అప్పలాచార్య  
గానం::S.P.బాలు,కౌసల్య
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,జగ్గయ్య,నాగభూషణం,కృష్ణంరాజు,చంద్రమోహన్,నెల్లూరుకాంతారావు,రావికొండలరావు,K.V.చలం,కాంచన,సంధ్యారాణి,శ్రీరంజని,రాధాకుమారి,సూర్యకాంతం,సుంకర్లలక్ష్మి,రాజేశ్వరి,మధుమతి,విద్యశ్రీ,బేబిశాంతికళ. 

పల్లవి::

రేయ్..బలె బలె బలె బలె..బలె బలె బలె బలె
నరసింగ సామినిరా..నిన్ను నరక్క తింటారా
బలె బలె బలె బలె..బలె బలె బలె బలె
హిరణ్య కసిపుడరా..నిన్నూ యిరసక తింటారా
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ 
పిస్టలు వీరునిరా..ఇక నీ ఇష్టము సాగదురా
కట కట కట కట కట కట కట కట
చచ్చిన వాడినిరా..నీకై మళ్ళీ బతికారా 
ఏయ్.....ఏయ్.....ఏయ్.....

చరణం::1

మామ మామా మామా మామ మామా మామా
పట్టుకొంటె కందిపోయే పువ్వులాంటి బిడ్డనలా
నీళ్ళలోకి నెడ్తావు..మతిలేదా 
నిన్ను తన్నకుండా విడిచిపెడితే..తప్పుకాదా    
మామ మామా మామా మామ మామా మామా
మామ మామా మామా మామ మామా మామా

చరణం::2

నెత్తిమీద గుడ్డవేసి..చెత్త మొహందాచుకొన్న సోమారీ
ఒరే..ఒరే..ఒరే..ఒరే..సోంబేరీ
పందికొక్కులాగ బలిసి..పాడుపన్లు నేర్చుకొన్న ఏబ్రాసీ
ఒరే..ఒరే..ఒరే..ఒరే..సన్యాసీ

దున్న పోతా...బేబి నివ్వూ 
తిండి పోతా...బేబి నివ్వూ..ఊఊఊ 
తాగుబోతా...బేబి నివ్వూ

నెత్తిమీద గుడ్డవేసి..చెత్త మొహందాచుకొన్న సోమారీ
ఒరే..ఒరే..ఒరే..ఒరే..సోంబేరీ

చరణం::3

నీ బంగారు చేతులు..కందేను పాపం
ఎందుకు ఆ..రాయి..టక్కరిదానా..ఆ..నిన్నొదులుతానా

అనుకొన్నదొకటి..అయ్యేదిఒకటి 
బోల్తా కొడ్తావులే..బుల్ బుల్ పిట్టా..ఏహేY
అనుకొన్నదొకటి..అయ్యేదిఒకటి 
బోల్తా కొడ్తావులే..బుల్ బుల్ పిట్టా

కత్తి గుండెల్లో..దిగబోదులే
ఉత్త డ్రామాల..సరుకేనులే
కత్తి గుండెల్లో..దిగబోదులే
ఉత్త డ్రామాల..సరుకేనులే

ఏమారిపోతివి...చాలా..నామీద కోపమదేలా
నీ మూతి మీసము కాలా..ఏ మాత్రమూ నిన్ను విడజాలా
హేండ్సప్....హేండ్సప్...హేండ్సప్....హేండ్సప్...హేండ్సప్..హేండ్సప్

Nenante Nene--1968
Music::S.P.Kodandapaani
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,Kousalya
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Jaggayya,Naagabhooshanam,Krishnamraaju,Chandramohan,NellooruKaantaaRao,RaavukondalRao,K.V.Chalam,Kaanchana,Sandhyaaraani,Sreeranjani,Raadhaakumaari,Sooryakaantam,SunkarlaLakshmi,Raajeswari,Madhumati,Vidyasree,BabySaantiKala.

::::::::::::::::::::::::::::::::::::::::::

rEy..bale bale bale bale..bale bale bale bale
narasinga saaminiraa..ninnu narakka tinTaaraa
bale bale bale bale..bale bale bale bale
hiraNya kasipuDaraa..ninnuu yirasaka tinTaaraa
Dhama Dhama Dhama Dhama Dhama Dhama Dhama Dhama 
pisTalu veeruniraa..ika nee ishTamu saagaduraa
kaTa kaTa kaTa kaTa kaTa kaTa kaTa kaTa
chachchina vaaDiniraa..neekai maLLii batikaaraa 
Ey.....Ey.....Ey.....

::::1

maama maamaa maamaa maama maamaa maamaa
paTTukonTe kandipOyE puvvulaanTi biDDanalaa
neeLLalOki neDtaavu..matilEdaa 
ninnu tannakunDaa viDichipeDitE..tappukaadaa    
maama maamaa maamaa maama maamaa maamaa
maama maamaa maamaa maama maamaa maamaa

::::2

nettimeeda guDDavEsi..chetta mohamdaachukonna sOmaarii
orE..orE..orE..orE..sOmbErii
pandikokkulaaga balisi..paaDupanlu nErchukonna Ebraasii
orE..orE..orE..orE..sanyaasii

dunna pOtaa...bEbi nivvuu 
tinDi pOtaa...bEbi nivvuu..uuuuuu 
taagubOtaa...bEbi nivvuu

nettimeeda guDDavEsi..chetta mohamdaachukonna sOmaarii
orE..orE..orE..orE..sOmbErii

::::3

nee bangaaru chEtulu..kandEnu paapam
enduku aa..raayi..Takkaridaanaa..aa..ninnodulutaanaa

anukonnadokaTi..ayyEdiokaTi 
bOltaa koDtaavulE..bul bul piTTaa..EhEY
anukonnadokaTi..ayyEdiokaTi 
bOltaa koDtaavulE..bul bul piTTaa

katti gunDellO..digabOdulE
utta Draamaala..sarukEnulE
katti gunDellO..digabOdulE
utta Draamaala..sarukEnulE

EmaaripOtivi...chaalaa..naameeda kOpamadElaa
nee mooti meesamu kaalaa..E maatramuu ninnu viDajaalaa
hEnDsap....hEnDsap...hEnDsap....hEnDsap...hEnDsap..hEnDsap

మానస వీణ--1983సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::K.J.ఏసుదాస్, P.సుశీల
తారాగణం::రాజ్‌కుమార్,రేవతి,సుమిత్ర. 

పల్లవి::

ఎవ్వరిది..ఈ పిలుపు
ఎక్కడిది..ఈ వెలుగు
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినది..ఈ
నీలో పలికినది..ఈ..ఈ
నీవై వెలిగినది..ఈ
నీలో పలికినది
పిలిచిన పిలుపెల్లా 
నాదలై..ఆ మ్రోగినవి
ఆ రాగాలై..సాగినవి
మానసవీణై వెలసినది
ఎవ్వరిది ఈ వీణా
ఎక్కడిది ఈ జాణా
నాలోని..నీ రూపమే
ఆ..ఆ..నాలోని..నీ భావమే
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినదీ
నీలో పలికినది

చరణం::1

చుక్కల్నీ ఒలిచీ..చక్కంగా మలిచి
నీ కంఠహారాన్ని చేయించనా..ఆ..ఆ
సూర్యుణ్ణి అడిగి..కిరణాలు తొడిగి
నీ ముంగిటే ముగ్గు వేయించనా..ఆ..ఆ
ప్రాణాలు ఐదు..నీలోనా ఖైదై
ఆరోది నీవై జీవించనా
ప్రాణాలు ఐదు..నీలోనా ఖైదై
ఆరోది నీవై జీవించనా
ఎవ్వరిది..ఈ వీణా
ఆ..ఎక్కడిది..ఈ జాణా
నాలోని నీ రూపమే
ఆ..ఆ..నాలోని నీ భావమే

చరణం::2

తనువెల్లా మనసై..మనసెల్లా కనులై
నెలలన్నీ దినమల్లే గడిపేయనా
నాకున్న రుచులు..నీకున్నా కళలు
కలబోసి ప్రతిరోజు విందివ్వవా
నేనివ్వగలది..ఈ..ఏ జన్మములది
ఇక ముందు ఎంతో..మిగిలున్నది
ఎవ్వరిది ఈ వీణా
ఎక్కడిది ఈ జాణా
నాలోని నీ రూపమే
ఆ..ఆ..నాలోని నీ భావమే
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినదీ..ఈ
నీలో పలికినది..ఈ
నీవై వెలిగినదీ..ఈ
నీలో పలికినది