Sunday, November 28, 2010

భార్యాబిడ్డలు--1972






















సంగీత::K.V..మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల  
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి , జగ్గయ్య, జయలలిత, గుమ్మడి, రాజబాబు

పల్లవి::

భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు
అబ్బాయి గారు...ఏమంటారూ 
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు

చరణం::1

ఏ మత్తు చల్లారో...తొలిచూపులో 
ఏ మంత్రం వేశారో...తొలిపాటలో
ఏ మత్తు చల్లారో...తొలిచూపులో 
ఏ మంత్రం వేశారో...తొలిపాటలో
కాళ్ళతో నడిపించి..కళ్ళు దోచుకున్నారు 
నడవలేని నన్నిలా..పరుగులు తీయించారు  
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు

చరణం::2

కొంటిచూపు..గుచ్చుకున్నదెక్కడో 
చిలిపి నవ్వు..తొలిచినది ఎక్కడో
కొంటిచూపు..గుచ్చుకున్నదెక్కడో 
చిలిపి నవ్వు తొలిచినది...ఎక్కడో
వొంటరిగా ఒక్క క్షణం..వుండలేకున్నాను 
చెలరేగే వయసుపోరు..చెప్పలేకున్నాను   
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు 
అబ్బాయిగారు...ఏమంటారూ 
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు

చరణం::3

తోడొచ్చి దోబూచు...లెందుకండి 
దొరగారి దొంగాటలు...చాలులెండి
తోడొచ్చి దోబూచు...లెందుకండి 
దొరగారి దొంగాటలు...చాలులెండి
చెలిమిలో ఈమోడు..చిగిరించి వున్నది 
అదనులో దానికొక్క..అంటు కట్టమన్నది   
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు..మెచ్చాలీ అమ్మాయిగారు 
అబ్బాయిగారు...ఏమంటారూ 
భలే భలే నచ్చారు..అబ్బాయిగారు 
ముందు ముందు మెచ్చాలీ..అమ్మాయిగారు