Sunday, March 15, 2015

చల్లని నీడ--1968సంగీతం::T.చలపతి
రచన::దాశరతి
గానం::S.జానకి
Film Directed By::Tatineni Ramarao
తారాగణం::హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు,ప్రభకర్ రెడ్డి.

పల్లవి::

మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి లాలిజో..చల్లని పాపాయి లాలిజో 

చరణం::1

లోకాలు నిదురుంచు వేళాయెరా..కలలందు విహరించ రావేలరా
లోకాలు నిదురుంచు వేళాయెరా..కలలందు విహరించ రావేలరా
తారలతో ఆడుకోవాలిరా..మేఘాలలో తేలిపోవాలిరా..ఆ
మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి లాలిజో.. చల్లని పాపాయి లాలిజో

చరణం::2

అందాలు చిందించు నీ మోమున..కస్తూరి తిలకమ్ము తీర్చేనురా
అందాలు చిందించు నీ మోమున..కస్తూరి తిలకమ్ము తీర్చేనురా
నీ మీద ఏ నీడ పడబోదురా..ఏ గాలి ఏ ధూళి రాబోదురా
మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి రావోయి..చల్లని పాపాయి రావోయి

చరణం::3

నీ వారు లేరన్న భయమేలరా..నేనుండగా నీకు లోటేమిరా
నీ వారు లేరన్న భయమేలరా..నేనుండగా నీకు లోటేమిరా
కన్నులలో దాచుకుంటానురా..కనుపాపలా చూచుకుంటానురా
మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి రావోయి .. చల్లని పాపాయి రావోయి