సంగీతం::S.P.బాలసుబ్రహ్మణ్యం
రచన::వేటూరి
గానం::S.P.శైలజ
పల్లవి::
ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాలగమనాల గమనాల గ్రంథం
చరణం::1
ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆనాటి బలికి అంతం
తనలోన గంగమ్మ ఉప్పొంగగా
శిలలోన ఆ గౌతమే పొంగగా
పాట పాటలో తను చరణమైన వేళా
కావ్యగీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్ర్రాణమై
లయలు హొయలు విరిసే
ఈ పాదం ఇలలోన నాట్యవేదం
ఈపాదం నటరాజుకే ప్రమోదం
కాలగమనాల గమనాల గ్రంథం
ఈ పాదం ఇలలోన నాట్యవేదం
చరణం::2
ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీ హస్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీ చందమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్యపధమై
తుంబుర వర నారద
మునులు జనులు కొలిచే
ఈ పాదం ఇలలోన నాట్యవేదం
ఈ పాదం నటరాజు కే ప్రమోదం
కాలగమనాల గమనాల గ్రంథం
ఈ పాదం ఇలలోన నాట్యవేదం