Tuesday, November 25, 2008

రైతు బిడ్డ--1971






















సంగీత::సాలూరు హనుమంతరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు, వాణిశ్రీ,అనూరాధ,శాంతకుమారి,సత్యనారాయణ

పల్లవి::
అ అమ్మ..ఆ ఆవు..అ అమ్మ..ఆ ఆవు
అమ్మవంటిదే ఆవు..అది తెలుసుకో నీవు

ఇ ఇల్లు..ఈ ఈ...ఈశ్వరుడు..ఆ..
ఇంటిని ఇలనూ కాచేదెవడు ఈశ్వరుడు పరమేశ్వరుడు 

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ..ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః అం అః
క ఖ గ ఘ జ్ఞ..చ ఛ జ ఝ ఞ..ట ఠ డ ఢ ణ..త థ ద ధ న 
ప ఫ బ భ మ..య ర ల వ శ ష స హ ళ క్ష 
అ..మొదలుకొని..క్ష..వరకు..అ..మొదలుకొని 
క్ష...వరకు మన అక్షరాలు యాభైయారూ
అక్షరమాల నేర్చుకొని ఆపై బ్రతుకులు దిద్దుకొని 
చక్కని పౌరులు కావాలీ..మన జాతికి పేరు తేవాలి
    
అ అమ్మ..ఆ ఆవు..అమ్మవంటిదే ఆవు..అది తెలుసుకో నీవు
ఇంటిని ఇలనూ కాచేదెవడు..ఈశ్వరుడు..పరమేశ్వరుడు  

చరణం::1
   
అందరిదీ ఒకే కులం..అందరమూ మానవులం 
కండలు పెంచితె...సరిపోదు
కావాలయ్యా.. బుద్ధిబలం..కావాలయ్యా బుద్ధిబలం            
మనభాషలు వేరే ఐనా..మన మతాలు వేరే ఐనా 
జీసస్...ఈశ్వర్...అల్లా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
ఈశ్వర అల్లా తేరేనామ్..సబకో సన్మతి దే భగవాన్ర
ఘుపతి రాఘవ రాజారామ్..పతీత పావన సీతారామ్
ఈశ్వర్ అల్లా తేరేనామ్..సబ్ కో సన్మతీ దే భగవాన్ర
ఘుపతి రాఘవ రాజారామ్..పతీత పావన సీతారామ్

చరణం::2

మన భాషలు వేరే ఐనా..మన మతాలు వేరే ఐనా 
పాలూ పైరూ...ఒకటే  
భూమాత అందరికొకటె...భూమాత అందరికొకటె

పేదా గొప్పా భేదాలు...పెళ్ళగించుకొని పోవాలి
పేదా గొప్పా భేదాలు...పెళ్ళగించుకొని పోవాలి
గిరిజనుడే..ఏ..పురజనుడై..గిరిజనుడే పురజనుడై  
ధరాచక్రమును తిప్పాలి..ఈ ధరాచక్రమును తిప్పాలి 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
   
అ అమ్మ..ఆ ఆవు..అమ్మవంటిదే ఆవు అది తెలుసుకో నీవు
ఇంటిని ఇలనూ కాచేదెవడు..ఈశ్వరుడు..పరమేశ్వరుడు
ఈశ్వరుడు..ఊ..పరమేశ్వరుడు..ఊ..