Sunday, April 03, 2011

ఆనంద భైరవి--1984

సంగీతం::రమేశ్ నాయుడు 
రచన::దేవులపల్లి 
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::గిరీష్ కర్నాడ్,మాళవిక,రాజేష్.రమణమూర్తి,కాంచన,సుత్తివేలు 

పల్లవి:: 

కొలువైతివా..రంగశాయి 
హాయి..కొలువైతివా..రంగశాయి 
కొలువైన నిను చూడ..కలవా కన్నులు వేయి 
కొలువైన నిను చూడ..కలవా కన్నులు వేయి 
కొలువైతివా..రంగశాయి 

చరణం::1

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి 
సిరి మదిలో పూచి తరచి రాగము రేపి 
చిరునవ్వు విరజాజులేవోయి..ఏవోయి
చిరునవ్వు విరజాజులేవోయి..ఏవోయి 
కొలువైతివా..రంగశాయి 

చరణం::2 

సిరి మోవి దమ్మికై..మరి మరి క్రీగంట 
సిరి మోవి దమ్మికై..మరి మరి క్రీగంట 
పరచేటి ఎలదేటులేవోయి..ఏవోయి 
పరచేటి ఎలదేటులేవోయి..ఏవోయి 
కొలువైతివా..రంగశాయి 

చరణం::3

ఔరా..ఔరౌరా..ఔరా..ఔరౌరా
రంగారు జిలుగు బంగారు..వలువ సింగారముగ ధరించి 
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి 
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి 
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి 
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి 
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి 
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి 
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి 

జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి 
జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి 
ముజ్జగములు మోహంబున తిలకింపగ..పులకింపగ 
ముజ్జగములు మోహంబున తిలకింపగ..పులకింపగ 
శ్రీ రంగ మందిర నవసుందరా పరా..ఆఆ.. 
శ్రీ రంగ మందిర నవసుందరా పరా..ఆఆ.. 
శ్రీ రంగ మందిర నవసుందరా పరా..ఆఆ..  

కొలువైతివా..రంగశాయి 
హాయి..కొలువైతివా..రంగశాయి
కొలువైన నిను చూడ..కలవా కన్నులు వేయి 
కొలువైన నిను చూడ..కలవా కన్నులు వేయి 
కొలువైతివా..రంగశాయి

బంగారు పాప--1954

సంగీతం::అద్దెపల్లి
రచన::దేవులపల్లి
గానం::A.M.రాజ,P.సుశీల
తారాగణం::S.V. రంగారావు,జగ్గయ్య,కృష్ణకుమారి,రామశర్మ,రమణారెడ్డి,హేమలత 

పల్లవి::

ఈఈఈ..వెన్నెల మల్లి విరిపందిరిలోన..ఆ ఆ ఆ 
చిరునవ్వుల హారతి..శేఖరుకీనా..ఆ ఆ ఆ 

వెన్నెల పందిరిలోన..చిరునవ్వుల హారతులీన
పండు వెన్నెల..మనసు నిండా వెన్నెల
కొండపైన కోనపైన..కురిసే వెన్నెల..విరిసే వెన్నెల

చరణం::1

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మబ్బుల దారి..ఈ..ఓ బాటసారి
నీ వొంటరి..పయణం కాదా
నీ జంటగ..నీ సఖి లేదా 
నీ వొంటరి..పయణం కాదా
నీ జంటగ..నీ సఖి లేదా

నాకై వేచె..నవ్వులు పూచె 
నా చెలి కన్నుల..కాచే వెన్నెల
పైన వెన్నెల..మనసులోన వెన్నెల
పైన లోన చందమామ..పరచే వెన్నెల
పాలవెన్నెల

చరణం::2

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
చల్లని రేయి..మెలమెల్లని..గాలి
అలనల్లన..మమతలు..మూగే 
తియతీయని..తలపులు..రేగే
అలనల్లన..మమతలు..మూగే 
తియతీయని..తలపులు..రేగే

తీయని వలపులు..తెచ్చేదెవరు
నాకై పరుగున..వచ్చేదెవరొ
పండు వెన్నెల..మనసు నిండా వెన్నెల
కొండపైన..కోనపైన..కురిసే వెన్నెల..విరిసే వెన్నెల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

జానకిరాముడు--1988

సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, S.జానకి
నటీ,నటులు::నాగార్జున,విజయశాంతి,సత్యనారాయణ,జీవిత,సుత్తివేలు  

పల్లవి::

నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు..నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు..ఏడేడు జన్మాలు…

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు..నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు..ఏడేడు జన్మాలు..ఊఊఊఊ

నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
సనిదమ గమదా..నిరిసని గమదా..

చరణం::1

మువ్వలు పలికే మూగతనంలో..మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో..చూపున సంధ్యారాగాలు
మువ్వలు పలికే మూగతనంలో..మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో..చూపున సంధ్యారాగాలు

అంగ అంగమున అంద చందములు..ఒంపు ఒంపున హంపి శిల్పములు
అంగ అంగమున అంద చందములు..ఒంపు ఒంపున హంపి శిల్పములు
ఎదుటే నిలిచిన చాలు..ఊఊఊ..ఆరారు కాలాలు…ఊఊఊఊ..

నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం

చరణం::2

జతులే పలికే జాణతనంలో..జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో..పల్లవించిన పరువాలు
జతులే పలికే జాణతనంలో..జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో..పల్లవించిన పరువాలు
అడుగు అడుగున రంగవల్లికలు..పెదవి అడుగున రాగమాలికలు
అడుగు అడుగున రంగవల్లికలు..పెదవి అడుగున రాగమాలికలు
ఎదురై పిలిచినా చాలు..ఊఊఊఊ..ఆఆఆ..నీ మౌన గీతాలు

నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు..నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు..ఏడేడు జన్మాలు…ఊఊఊఊఊఊ