Wednesday, November 21, 2007

కులగోత్రాలు--1962



సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల


హయ్య..హ్హా హ్హ హ్హా హయ్యా
హయ్య..హ్హా హ్హ హ్హా హయ్యా
రావయ్యా...రావయ్యా
రావయ్య మాయింటికి..రమ్మంటే
రావేల మాయింటికి..
రావయ్య మాయింటికి..రమ్మంటే
రావేల మాయింటికి..

రావయ్య మాయింటికి..రమ్మంటే
రావేల మాయింటికి..క్రిష్ణయ్యా

ఓహోయ్..దొంగ చాటునదూరి వెన్న తిన్నావంట
దొంగ చాటునదూరి వెన్న తిన్నావంట
తలుపుమూసి పట్టబోతే..తప్పుకొన్నావంట
తలుపుమూసి పట్టబోతే..తప్పుకొన్నావంట
భలే ఊళ్ళ తోటకాడ మాటువేసినావంట
గొల్లెమావు మీదచేరి కన్నుగీటినావంట

రావయ్యా..ఓహో..య్..
రావయ్య మాయింటికి
రమ్మంటే రావేల మాయింటికీ..క్రిష్ణయ్యా

ఆహా ఆఆఆఆ ఆహా..ఆఆఆఆ అహా
ఓ..హో..హో..ఒహో ఓహో ఓహో..
గొల్లవాడ వాడలకు క్రిష్ణమూర్తి
నీ వెందుకయా వచ్చినావు క్రిష్ణమూర్తి
నీ వేమి పనికి వచ్చినావు క్రిష్ణమూర్తీ
గొల్లవాడ వాడలకు క్రిష్ణమూర్తి
నీ వెందుకయా వచ్చినావు క్రిష్ణమూర్తి
ఓహోయ్..గుమ్మపాలు తాగిపోను వచ్చినాను
గోపెమ్మలతో ఆడుకోను వచ్చినాను
గోపెమ్మలతో ఆడుకోను వచ్చినాను
ఎన్ని నేర్చినాడవయ్యా..ఎంతమోసగాడివయ్యా
ఆ ఆ ఓహో..ఆహా..ఆహా..
ఎన్ని నేర్చినాడవయ్యా..ఎంతమోసగాడివయ్యా
అమ్మమ్మ నమ్మరాదు అపద్దాలపుట్టవయ్య

రావయ్యా..ఓహోయ్..
రావయ్య మాయింటికీ..రమ్మంటే
రావేల మాయింటికీ..

మాయదారీ గోపాలబాలుడమ్మా..హ్హా..ముద్దులగుమ్మా
మరువరానీ..యశోద పుత్రుడమ్మా..ముద్దులగుమ్మా
సాటిలేనీ వయ్యారి జానడమ్మా..ఓ..బంగరుబొమ్మ
చక్కనయ్యా చిక్కాడో..చోడవమ్మా..ఓ..బంగరుబొమ్మ..3

కులగోత్రాలు--1962


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల, P. సుశీల


బలె..బలె..బలె.బలె..బలేయ..
ఓయ్..యహా.ఓయ్..యహాఓయ్..యహా.

ఓ..వన్నెల చిన్నెల కన్నియా..
నీ నల్లని జడలో పూలు..
నా గుండెలలో బాణాలూ
ఓ పిల్లా..నీ నల్లని జడలో పూలు..
నా గుండెలలో బాణాలూ
ఎవరికి మనసిచ్చావే..
నీ వెవరికి మనసిచ్చావే..యహా

ఈ చల్లని వెన్నెలరేయి..
నా మనసును దోచితివోయి
ఓ రాజ..ఈ చల్లని వెన్నెలరేయి..
నా మనసును దోచితివోయి
నా సొగసులు నీకొరకేలే..
నా సొగసులు నీకొరకేలే..యహా

ఆ చక్కని చుక్కలరేడు..
నీ అందము చూచెను నేడు..అహా..ఆ
ఆ చక్కని చుక్కలరేడు..
నీ అందము చూచెను నేడు..
ఎదో కలతపడి..తన మనసు చెడి
ఎదో కలతపడి..తన మనసు చెడి
ఎదలో దాగే ఎందుకే?

నీ నల్లని జడలో పూలు..
నా గుండెలలో బాణాలూ
ఎవరికి మనసిచ్చావే..
నీ వెవరికి మనసిచ్చావే..యహా

నీ చక్కని మనసులు చూసి..
తన మచ్చను మదిలో తలచి..ఆహ్హా
నీ చక్కని మనసులు చూసి..
తన మచ్చను మదిలో తలచి.
ఏదో కలతపడి..తన మనసుచెడి
ఏదో కలతపడి..తన మనసుచెడి
తెరలోదాగే..అందుకే..ఓహో..

ఈ చల్లని వెన్నెలరేయి..
నా మనసును దోచితివోయి
నా సొగసులు నీకొరకేలే..
నా సొగసులు నీకొరకేలే..యహా

ఆఆఆ ఆఆఆఅ..ఓఓఓఓఓఓ
నీవలచిన వాడే నవాబు
నీవు మరచిన నాడు గరీబూ..
నీవు మరచిన నాడు గరీబూ..
నీవు పిలిచిన నాకు ఉషారూ..
నను తలవనిచో బేజారూ..
మము తలవనిచో బేజారూ..
నే మెచ్చినాను రావే..
నీవు నచ్చినావు లేవోయ్..
నే మెచ్చినాను రావే..
నీవు నచ్చినావు లేవోయ్
పదవే..పోదాం..హాయిగా

ఈ చల్లని వెన్నెలరేయి..
నా మనసును దోచితివోయి
నా సొగసులు నీకొరకేలే..
నా సొగసులు నీకొరకేలే..యహా

హాయ్ హాయ్ జిగిలగి జిగిలగి జిగీ
హాయ్ హాయ్ జిగిలగి జిగిలగి జిగీ
హాయ్ హాయ్ జిగిలగి జిగిలగి జిగీ
హాయ్ హాయ్ జిగిలగి జిగిలగి జిగీ
హ్హ్హా హ్హా హ్హా హ్హా బలె బలె బలే...

కులగోత్రాలు--1962


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::D.C. నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల, P. సుశీల


ఓ...ఆ ఆ ఆ...ఓ...
చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా..
నిలుపుకొందురా వెల్గులమేడ

నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయాల

కనులముందు అలలు పొంగెనూ..ఓ..
మనసులోన కలలు పండెనూ..2

అలలే కలలై
కలలే అలలై..2
గిలిగింతలు సలుపసాగెనూ..
చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ

కొండలు కోయని పిలిచినవీ..ఆ..
గుండెలు హోయని పలికినవీ..2
కోరికలన్నీ బారులుతీరీ..2
గువ్వలుగా ఎగురుతున్నవీ...
నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయాల

జగము మరచి ఆడుకొందమా...ఆ...
ప్రణయగీతి పాడుకొందమా...2
నింగీ నేలా కలిసిన చోటా..2
నీవు నేను చేరుకొందమా....

చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ
ఓ.......జంటగ..ఓ...

కులగోత్రాలు--1962


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,స్వర్ణలత,P.సుశీల


స్వర్నలత::-సఖీ శకుంతలా
రెక్కలు ధరించి ప్రియుని సన్నిధిని రివ్వున వాలగలేవా
మనసులోని భావములే విహంగములు కావా
మధురమైన లేఖ వ్రాసి పంపించగరాదా

సుశీల::-వినుమా ప్రియతమా నా విరహగీతీ
కనుమా ప్రియతమా నా హృదయరీతీ

ఎరుగక జాలీ మది రగిలించే (2)
మదనుని శరముల వేడీ
వినుమా ప్రియతమా నా విరహగీతీ

ఘంటసాల::-ఓ లలనా కమలనయనా (2)
నా మనసే, నా మనసే దాచగలనా, ఓ లలనా కమలనయనా

తాపము తీరగ చల్లదనాల తామరవీవన గాలులతో
వేడుక మీరా వీచెద బాలా, నిలిచెద నీ కనునీడలలో
లలనా, కమలనయనా, ఓ లలనా కమలనయనా

కులగోత్రాలు--1962


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::P.B.శ్రీనివాస్,జమునా రాణి


రావే రావే బాలా
హలో మైడియర్ లీల
రావే రావే బాలా
హలో మైడియర్ లీల
ఇటురావే ఇటురావే
ఐ లవ్ యు

పోవోయ్ పోవోయ్ బావా
ఎందుకీ పెడత్రోవా
పోవోయ్ పోవోయ్ బావా
ఎందుకీ పెడత్రోవా
ఇ పల్లెల్లో మన పల్లెల్లో
ఇ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీవేషాలూ
చాలునే సరసాలు
ఇకచాల్లే...ఇక చాల్లే

టిప్పుటాపు దొరసాని
అప్టుడేటు అలివేణి
టిప్పుటాపు దొరసాని
అప్టుడేటు అలివేణి
ఈ రోజుల్లో మనఫోజుల్లో
ఈ రోజుల్లో మనఫోజుల్లో
ఇది దొరలపేటనే రాణీ

పెద్దవాళ్ళు చూస్తారు
దేహశుధిచేస్తారు
" వా " !!!!....
పెద్దవాళ్ళు చూస్తారు
దేహశుధిచేస్తారు
పచ్చి పచ్చి లవ్ చూపావంటే
పిచ్చాస్పత్రిలో వేస్తారు
" నో...నో.... "
పచ్చి పచ్చి లవ్ చూపావంటే
పిచ్చాస్పత్రిలో వేస్తారు
ఇ పల్లెల్లో మన పల్లెల్లో
ఇ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీవేషాలూ
చాలు నీ సరదాలు
ఇకచాల్లే..." ఐ లవ్ యు " ..

!! రావే రావే బాలా
హలో మైడియర్ లీల
ఇటురావే ఇటురావే
ఐ లవ్ యు !!

తప్పేమున్నది మేడం
నాతో షికారు రావడం
ఇక్కడ పుట్టినవాళ్ళం
ఎందుకు మనకీ మేళం
ఇ పల్లెల్లో మన పల్లెల్లో
ఇ పల్లెల్లో మనపల్లెల్లో
సాగవీవేషాలూ...
చాలునీ సరదాలు
ఇక చాల్లే..." ఐ లవ్ యు "
రావే రావే బాలా
పోవోయ్ పోవోయ్ బావా
రావే రావే బాలా
పోవోలవ్ యు.....ఇక చాల్లే..య్ పోవోయ్ బావా

నా తమ్ముడు--1971




















సంగీత::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆత్రేయ
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::జగ్గయ్య, శోభన్‌బాబు, భారతి, నాగభూషణం, అల్లు రామలింగయ్య

పల్లవి::

అలవాటు లేదని..మడి గట్టుకోకు
అలవాటు లేదని..మడి గట్టుకోకు 
అందాన్ని కాదని..చెడగొట్టుకోకు

చరణం::1

సొగసంత ఎగబోసు కొచ్చాను..నేను
వయసంత నిలవేసుకున్నావు..నీవు
సొగసంత ఎగబోసు కొచ్చాను..నేను
వయసంత నిలవేసుకున్నావు..నీవు
గుటకలు వేస్తూంది..నీ పిరికి మనసు
గుటకలు వేస్తూంది..నీ పిరికి మనసు
నీ గుట్టంత ఈ గడుసు పిల్లకే..తెలుసు 
అలవాటు లేదని..అలవాటు లేదని 
మడి గట్టుకోకు..అందాన్ని కాదని చెడగొట్టుకోకు 

చరణం::2

చిగురాకు పెదవుల్లో..చిమ్మింది ఎరుపు
వగలాడి కళ్ళల్లో..మెరిసింది మెరుపు
హ్హా..చిగురాకు పెదవుల్లో..చిమ్మింది ఎరుపు
వగలాడి కళ్ళల్లో..మెరిసింది మెరుపు
పదునైన పరువాన..పండించు వలపు..హ్హా
పదునైన పరువాన..పండించు వలపు
వదులుకున్నావంటె..వయసుకే చెరుపు..హాహాహా  
అలవాటు లేదని..మడి గట్టుకోకు 
అందాన్ని కాదని..చెడగొట్టుకోకు

చరణం::3

అనుభవం లేదంటె..నీ తప్పుకాదు
ఆశలే లేవంటే...నే నొప్పుకోను
అనుభవం లేదంటె..నీ తప్పుకాదు
ఆశలే లేవంటే...నే నొప్పుకోను
అలవాటు లేదని..అలవాటు లేదని 
మడి గట్టుకోకు..అందాన్ని కాదని చెడగొట్టుకోకు

కులగోత్రాలు--1962::కల్యాణి::రాగ


రచన::D.C.నారాయణ రెడ్డి 
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::P.సుశీల,ఘంటసాల

Director :: Kotayya Pratyagatma

రాగ::కల్యాణి

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా

!! చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా !!

నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
అహహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ ఆ

!! చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా !!

నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
అహహా ... అహా ఒహోహో .....
అహహా ఒహో.......అ ఆ ...

!! చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా !!

నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
అహహా...అహా ఒహోహో....హహా ఒహో...అ ఆ . .

!! చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో
తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా !!