Thursday, April 16, 2009

అనుబంధం--1984సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

Film Directed By::A.Kodandaramireddy
తారాగణం::అక్కినేని,రాధిక,సుజాత,జగ్గయ్య,తులసి,ప్రభాకర రెడ్డి,కార్తీక్.
::::::::::::

జింజింతరారే...జింజింతారారే
చలిగాలీ సాయంత్రం..చెలరేగే సంగీతం
పొద్దువాలె వేళాయే..ముద్దుగుమ్మ రావే
ఇద్దరున్న కౌగిట్లో..ముద్దు తీర్చిపోవే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నాలో చూడూ దగ్గరైన ప్రాణాలు

జింజింతరారే...జింజింతారారే
చలిగాలీ చలగాటం..చెలరేగే ఉబలాటం
సందెపొద్దువేళాయే..చందమామ రావే
చీకటైన పొదరింట్లో..దీపమెట్టిపోవే
నన్నే తాకే అగ్గిపూలబాణాలు
నాకే సోకే కొంటేచూపు కోణాలూ

::::1


పూల వానల్లో నవ్వుల నావల్లే
నావంక వస్తుంటే..నాజూకు చూస్తుంటే
వెచ్చని వెలుగుల్లో..నచ్చిన వయసల్లే
వాటేసుకొంటుంటే..వైనాలు చూస్తుంటే
సూరీడేమో కొండలు దాటే..నాయీడేమో పొంగులు దాటే
నీ ముద్దు తాంబూలమిచ్చుకో..ఎర్రంగ వలపే పండించుకో
తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు..నిన్నేచేరే నిన్నలేని నడకివ్వు
జింజింతరారే...జింజింతారారే

::::2


కొండ కోనల్లో..ఎండ వానల్లో
మురిపాల పందిట్లో..ముద్దాడుకొంటుంటే
వేసవి చూపుల్తో..రాసిన జాబుల్తో
అందాల పందిట్లో..నిన్నల్లుకొంటుంటే
అల్లరికళ్ళు ఆరాతీసే..దూరాలన్ని చేరువచేసే
వడిచేరి పరువాలు పంచుకో..బిడియాలజడపింక దాచుకో
నింగి నేలా తోంగి చూసే సాక్షాలూ
నీకూ నాకూ పెళ్ళిచేసే చుట్టాలు

జింజింతరారే...జింజింతారారే
చలిగాలీ చలగాటం..చెలరేగే ఉబలాటం
పొద్దువాలె వేళాయే..ముద్దుగుమ్మ రావే
సందెపొద్దువేళాయే..చందమామ రావే
నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు
నన్నే తాకే అగ్గిపుల్లబాణాలు
జింజింతరారే...జింజింతారారే

అనుబంధం--1984
సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు

Film Directed By::A.Kodandaramireddy
తారాగణం::అక్కినేని,రాధిక,సుజాత,జగ్గయ్య,తులసి,ప్రభాకర రెడ్డి,కార్తీక్.

అతడు::


ఆనాటి ఆస్నేహమానందగీతం
ఆజ్ఞాపకాలన్నీ మథురాతిమథురం
ఈనాడు ఆహాయి లేదేలనేస్తం
ఆరోజులు మున్ముందిక రావేమిరా
హహ లేదురా..ఆ..సుఖం
రాదురా ఆగతం ఏమిటో జీవితం

ఒరెయ్ ఫూల్! గుర్తుందిరా
గోడలు దూకిన రోజులు
మోకాలికి తగిలిన దెబ్బలు
చీకట్లో పిల్లనుకుని..
ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్
పక్కనే పెళ్ళికావల్సిన పిల్లలున్నార్రా
నేర్చుకుంటార్రా హహహ

నేనూ మారలేదు నువ్వూ మారలేదు
కాలం మారిపోతే నేరం మనదేమికాదు
ఈనేల ఆనింగి ఆలాగె ఉన్నా
ఈగాలిమోస్తుంది మనగాథలెన్నో
నెమరేసుకుందాము ఆరోజులు
భ్రమలాగ ఉంటాయి..ఆలీలలు
ఆమనసులు ఆమమతలు ఏమాయెరా

ఒరెయ్ రాస్కెల్! జ్ఞాపకముందిరా
కాలేజిలో..క్లాసురూములో
ఓ పాపమీద..నువ్వు పేపరుబాల్ కొడితే
ఆపాప ఎడమకాలి చెప్పుతో..
ఒరెయ్ ఒరెయ్ ..ఒరెయ్ స్క్రౌండ్రర్
ఊరుకోరా పిల్లలు వింటారు
వింటే వింటార్రా పిల్లల పిల్లలకు
పిట్టకథగా చెప్పుకుంటారు అంతే
హహహహ..

ఆనాటి ఆస్నేహమానందగీతం
ఆజ్ఞాపకాలన్నీ మథురాతిమథురం
ఈనాడు ఆహాయి లేదేలనేస్తం
ఆరోజులు మున్ముందిక రావేమిరా

మనసే ఇచ్చినాను..మరణం తెచ్చినాను
చితిలో చూసినాను..చిచ్చైమండినాను
ఆగుండె మంటింక..ఆరేదికాదు
నేనుండి తనువెళ్ళి..బ్రతుకింకలేదు
తనశాపమే నాకు..తగిలిందిరా రేయ్
పసిపాపలే లేని..ఇల్లాయెరా
ఈకన్నుల కన్నీటికి..తుదియేదిరా

ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా పసిపిల్లాడిలా
ఛి ఛీ..ఊర్కో
ఈకన్నీళ్ళకు తుదియెక్కడరా
కర్చీఫ్‌తో తుడిచెయ్యడమేరా
హహ హహాహ..

ఆనాటి ఆస్నేహమానందగీతం
ఆజ్ఞాపకాలన్నీ మథురాతిమథురం
ఈనాడు ఆహాయి లేదేలనేస్తం
ఆరోజులు మున్ముందిక రావేమిరా

హహ రియల్లీ దోజ్ డేస్ ఆర్ మార్వలస్
కరెక్ట్ రా హహహాహహ
లాలాలలాలా లాలాలలాలా