Saturday, December 13, 2008

భక్త కన్నప్ప--1976:::మధ్యమావతి ::రాగం

చిమ్మటలోని ఈ ఆణి ముత్యం వింటూ--సాహిత్యాన్ని చూస్తూ పాడుకొందామా



సంగీతం::సత్యం,ఆది నారాయణరావు
రచన::ఆరుద్ర
గానం::V.రామక్రిష్ణ ,P.సుశీల


రాగం:::మధ్యమావతి ::::

ఆకాశం దించాల..నెలవంకా తుంచాల..సిగలో ఉంచాలా
ఆకాశం దించాల..నెలవంకా తుంచాల..సిగలో ఉంచాలా
చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కిలిగింతలు చాలు..
ఆకాశం నా ననడుమూ..నెలవంక నా నుదురూ..సిగలో నువ్వేరా...

పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే..తెస్తానే
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే..తీస్తానే

ఆ...పట్టు తేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా..వస్తుందా
అంతేనా..అంతేనా..
అవును..అంతేరా

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా...
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా...

సూరీడు ఎర్రదనం సింధూరం చేస్తానే..చేస్తానే
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే..దిద్దేనే
ఆ.....నీ వంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ..నా గూడూ
అంతేనా......అంతేనా..
అవును......

హహ.....మెరిసేటి చుక్కలనీ మెడలోన చుట్టాలా..తలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేర
ఆ..హా..హా..ఆ...ఆ..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..