Friday, September 20, 2013

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
















Happy Birthday to Nata Samraat ANR Garu

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 























 90 సంవత్సరాల కుర్రవాడు మన నాగేశ్వరుడి “అక్కినేని నాగేశ్వర రావు”


 గారి పుట్టిన రోజు నేడు.
.
తెలుగు సినీపరిశ్రమలో నిలువెత్తు శిఖరంగా ఎదిగిన బాలరాజు అయన.. 


 సుదీర్ఘకాలం వెండితెరను ఏలిన దసరాబుల్లోడు.. ప్రేమికుడంటే ఎలా 

ఉండాలో.. నటనానిర్వచనం ఇచ్చిన దేవదాసు ఆయన.. పద్మశ్రీ.

. పద్మభూషణ్.. ఇప్పుడు పద్మ అవార్డుల్లో అత్యున్నత పద్మవిభూషణ్ 

అవార్డు అందుకున్న తొలి తెలుగు సినీ వెలుగు ఆయన..

1940లో విడుదలయిన "ధర్మపత్ని" అక్కినేని నాగేశ్వరరావు నటించిన 


మొదటి చిత్రం. నలబయ్యవ దశకం ఏఎన్నార్‌ కెరీర్‌కి బీజం పడింది. "శ్రీ

 సీతారామ జననం, మాయలోకం, బాలరాజు, కీలుగుర్రం, లైలా మజ్ను 

వంటి సినిమాలతో ఎన్నార్‌ కెరీర్‌ ఊపందుకుంది.

ఇక యాభైయవ దశకం అక్కినేని దశను తిరగరాసింది. పౌరణిక


 సినిమాలతో పాటు సాంఘీక చిత్రాలు చేసిన ఏఎన్నార్‌ ఖాతాలో ఎన్నో

 సూపర్‌హిట్స్‌ చేరాయి. మాయల మరాఠి, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ,

 అల్లావుద్దీన్‌ అద్భుత దీపం, సతీసావిత్రి వంటి సినిమాలు ఆయనకు 

 మంచి పేరు తెచ్చిపెట్టాయి..
.
ఆరవయ్యో దశకంలోనూ మరెన్నో హిట్స్‌ అక్కినేని ఖాతాలో చేరాయి. 


పెళ్లికానుక, నమ్మినబంటు, ఇద్దరు మిత్రులు, మంచి మనుషుల

 గుండమ్మ కథ, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి , ప్రేమించి చూడు,

 అంతస్తులు, ఆత్మగౌరవం, ఆత్మబలం వంటి సినిమాలు ఏఎన్నార్‌ కెరీర్‌ను

ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాయి.

 డెభ్బయ్యవ దశకం కూడా అక్కినేని హవా వీచింది. డెబ్బయ్యవ దశకం


 ప్రారంభంలోనే వచ్చిన సినిమా దసరాబుల్లోడు. నాగేశ్వరరావు ఉల్లాసంగా 

ఉత్సాహంగా వేసిన స్టెప్పలకు ప్రేక్షకులు అదే రీతిలో స్టెప్పులేశారు. ఆనాటి 

ఏఎన్నార్‌ డాన్స్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌.

దసరాబుల్లోడు తర్వాత అక్కినేని నటించిన మరో భారీ హిట్‌ ప్రేమనగర్‌.


 తాజ్‌మహల్ కి చరిత్రలో గుర్తింపు ఉన్నట్లే తెలుగు చలనచిత్ర రంగంలో

"ప్రేమనగర్"కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నలభై ఏళ్ళ క్రితం వచ్చిన ఈ 

సినిమాలోని అక్కినేని నటనకు ప్రేక్షకులు జై కొట్టారు.

అక్కినేని నటనాజీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలు ఎన్నో


 ఎన్నెన్నో. డెభ్బయ్యవ దశకంలోనే వచ్చిన మరెన్నో సినిమాలు సూపర్‌ 

 హిట్‌ అయి అక్కినేనిని ఎవర్‌గ్రీన్‌ హీరోగా నిలబెట్టాయి. భక్తతుకారాం,

అందాల రాముడు, ప్రేమలు పెళ్ళిళ్లు వంటి సినిమాల్లో అక్కినేని నటనకు 

మంచి పేరు వచ్చింది.

భగ్న ప్రేమికుడిగా ఏఎన్నార్‌ నటించిన సినిమాలన్నీ సూపర్‌ హిట్సే.

  ప్రేమాభిషేకం, ప్రేమమందిరం, లైలా మజ్ను, దేవదాసు అనార్కలి.. వంటి 

సినిమాలు అక్కినేని కెరీర్‌ను ఆకాశానికెత్తేశాయి.

ఎన్టీఆర్‌, గుమ్మడి, ఎస్వీరంగరావు వంటి ఆనాటి అగ్రనటులుతో ఏఎన్నార్‌


 కలిసి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ మాయాబజార్. అభిమన్యుడిగా


అక్కినేని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. కలర్‌లోనూ వచ్చిన 

 ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది.

ఏఎన్నార్ తన తనయుడు నాగార్జునతో పోటీపడి 'రామదాసు' చిత్రంలో 


నటించారు.

ఈ రోజు మనం ఆయన పాటల తోటలో విహరిద్దామా మరి..



 Rachana::Aruna Ramesh