Thursday, May 14, 2015

కోటలో పాగ--1976సంగీతం::J.V.రాఘవులు
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల

పల్లవి::

ఆడుతా పాడుతా..ఆఆఆఆ 
కైపులో ముంచుతా..ఆఆఆఆ
కౌగిలిలోనా..ఊయలలూపి
వంపులు రేపి..కెంపులు తాపి 
హుషారు కలిగిస్తాలే..జగాలు మరిపిస్తాలే
హుషారు కలిగిస్తాలే..జగాలు మరిపిస్తాలే
ఆడుతా పాడుతా....ఆఆఆఆ
కైపులో ముంచుతా..ఆఆఆఆ

చరణం::1

రారాజువు నీవై..రాణిని చేస్తావా
బంగారు గద్దియలో..భాగం ఇస్తావా
రారాజువు నీవై..రాణిని చేస్తావా
బంగారు గద్దియలో..భాగం ఇస్తావా
రవ్వల మేడలలో..నవ్వుల వాడలలో
రవ్వల మేడలలో..నవ్వుల వాడలలో
రోజొక పండుగగ..నను కరిగిస్తావా 
రోజొక పండుగగ..నను కరిగిస్తావా..ఆ 
ఆడుతా..పాడుతా..ఆఆఆఆ
కైపులో..ముంచుతా..ఆఆఆఆ

చరణం::2

తిరుగేలేదోయీ..ఎదురే లేదోయీ
ఇద్దరమొకటైతే..అంతా మనదోయి
తిరుగేలేదోయీ..ఎదురే లేదోయీ
ఇద్దరమొకటైతే..అంతా మనదోయి
రేయీ పగలంటూ..లేనేలేదోయీ..ఈ
రేయీ పగలంటూ..లేనేలేదోయీ..ఈ
అందాల విందులతో..అలరించేనోయీ
అందాల విందులతో..అలరించేనోయీ..ఈ 
ఆడుతా..పాడుతా..ఆఆఆఆ
కైపులో..ముంచుతా..ఆఆఆఆ
కౌగిలిలోనా..ఊయలలూపి
వంపులు రేపి..కెంపులు తాపి 
హుషారు కలిగిస్తాలే..జగాలు మరిపిస్తాలే
హుషారు కలిగిస్తాలే..జగాలు మరిపిస్తాలే
ఆడుతా పాడుతా..ఆఆఆఆ
కైపులో ముంచుతా..ఆఆఆఆ

జీవితం--1950సంగీతం::R.సుదర్శనం
రచన::తోలేటి వెంకటరెడ్డి  
గానం::S.వరలక్ష్మి
తారాగణం::T. R. రామచంద్రన్,C.H. నారాయణరావు,Y.జయంతిమాల, S.వరలక్ష్మి
పల్లవి::

ఓఓఓఓఓ..ఒహొహొఓఓఓఒహొ..లాలాలాల
ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా 
మా పల్లెసీమా పల్లెసీమా

ఆనందమౌగా పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ 
మా పల్లెసీమాఆఆ.. పల్లెసీమా

చరణం::1

రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ 
నాట్యాలు చేయు మా పల్లెసీమలో..ఓఓ
రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ 
నాట్యాలు చేయు మా పల్లెసీమలో పల్లెసీమలో
మామంచి తీరు మా ఊరు
మామంచి తీరు మా ఊరు 
తీయని నీరు కోనేరు 
తీయని నీరు కోనేరు 

ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా 
మా పల్లెసీమా పల్లెసీమా

చరణం::2

దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ
దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ
మాతోడ కూడి మా తోవ చేరి
మాతోడ కూడి మా తోవ చేరి
మన దేశానికి సేవ చేయాలి 
మన దేశానికి సేవ చేయాలి

ఆనందమౌగా ఆనందమౌగా 
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ 
మా పల్లెసీమా..ఆ..పల్లెసీమా