http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5140
సంగీతం::S.P.బాలసుబ్రహ్మణ్యం
గానం::S.జానకి
తారాగణం::జయసుధ,చంద్రమోహన్,శరత్‌బాబు,సుత్తివేలు,నూతన్‌ప్రసాద్
పల్లవి::
మ్మ్ హు హూ..ఆహహా..మ్మ్ హు హూ ఆహహా
మనసులకు..లాలిపాట
మన కథల..జాలిపాట
రెప్పలేని క౦టి పాపకే..నాపాపకి
దూరాన ఉన్న తల్లి..గారాల జోలపాట
మనసులకు..లాలిపాట
మన కథల..జాలిపాట
రెప్పలేని క౦టి పాపకే..నాపాపకి
దూరాన ఉన్న తల్లి..గారాల జోలపాట
మనసులకు..లాలిపాట
మన కథల..జాలిపాట
చరణం::1
ఏ దేవుడీ చేరాతలో..నాపాపగా నిన్ను చేసే
నాదేవుడే చేజేతులా..ఈ అమ్మనే బొమ్మ చేసే
నీదిక్కుగా నేను౦డగా..నాదివ్వె నీలోన మెరిసే
కన్నీటిలో కమలాలకై..ఏ తుమ్మెదో వేచి చూసే
నాగీతమోగీతమై..నా క౦టి జలపాతమై..ఈ
నీతల్లిగా జోల నేపాడనా నీడోల నేనూపనా
మనసులకు..లాలిపాట
మన కథల..జాలిపాట
జోజో లాలిజో..హాయి..జోజో లాలిజో
చరణం::2
ఏజన్మకీ స్త్రీ జన్మమే..నీకొద్దు నా చిట్టీ తల్లి
ఏకాకిలా ఓకాకిలా..మారి౦ది ఈకన్నతల్లి
ఈకోవెలా నాకో వెలా..తెచ్చి౦ది ఈనాడు తల్లి
నావెన్నెలే ఆవేదనై..పొ౦గి౦ది నాక౦ట మళ్ళి
వాల్మికి వారి౦చినా..ఆ..వగచి౦ది ఆజానకి..ఈ
నీ జోల కావాలి ఈ అమ్మకి..నాతల్లిగా జన్మకి
మనసులకు..లాలిపాట
మన కథల..జాలిపాట
రెప్పలేని క౦టి పాపకే..నాపాపకి
దూరాన ఉన్న తల్లి..గారాల జోలపాట
మనసులకు..లాలిపాట
మన కథల..జాలిపాట
జోజో లాలిజో..హాయి..జోజో లాలిజో