Saturday, April 25, 2009

మరో చరిత్ర -1978సంగీతం::MS.విశ్వనాథ్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::కమలహాసన్,P.సుశీల


ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభంధ మౌనో
అప్పడి అన్నా ..అర్థం కాలేదా
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది..2
ఆహా..అప్పడియా..
పెద్ద అర్థమయినట్లు
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది

ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

వయసే వయసును పలుకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏయ్..నీ రొంబ..అళహాయిరుక్కే
ఆ....రొంబ....అంటే
ఎల్లలు ఏవీ ఒల్లలన్నది
నీదీ నాదోక లోకమన్నది
నీదీ నాదోక లోకమన్నది

ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

తొలిచూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొణ్ణు..అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాకా ఇది నిలకడైనది
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

పచ్చని కాపురం ~~1985
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్షాలు
నింగి నేల సాక్షాలు
ప్రేమకు మనమే తీరాలు

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

జ్ఞాపకమేదో నీడల్లె తారాడె
స్వప్నాలేవో నీ కళ్ళలో దాగె
కౌగిలింత లొన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వము నాదైనది
నేను దేహమల్లె నీవు ప్రాణమల్లె
ఏకమైన రాసలీల ళొన

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా

అంతం లేనీ ఈ రాగ బంధం లో
అంచున నిలిచీ నీ వైపె చుస్తున్న
పున్నమింట కట్టుకున్న పూల డోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు
ఆ ముద్దులే మోడైనవి
బాలచంద్రుడొస్తే నులు పోగులిస్తా
ఇంటి దీపమాయె జంట ప్రేమ

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్షాలు
నింగి నేల సాక్షాలు
ప్రేమకు మనమే తీరాలు

గోరంటాకు --1979
సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల

Falm Directed By::Daasarinaaraayana Rao
తారాగనం::శోభన్‌బాబు,M.ప్రభాకర్‌రెడ్డి,కనకాల దేవదాస్,J.V.రమణమూర్తి,చలాం.సావిత్రి,సుజాత,రమాప్రభ,వక్కలంక పద్మ.

పల్లవి::

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

చరణం::1


మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది


పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం


కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం

చరణం::2


కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం


కొమ్మ కొమ్మకో సన్నాయి...
కోటి రాగాలు ఉన్నాయి...
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి...

మరోచరిత్ర--1978
గానం::SP.బాలూ,రమోలా
సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ


కలిసి వుంటే కలదు సుఖము..కలసి వచ్చిన అదృష్టము
శభాష్ ...అహా..హా...హా...
కలిసి వుంటే...కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము
కన్నె మనసులూ..మూగ మనసులూ..ఆ..హా..ఆ..
అ..కన్నె మనసులూ..మూగ మనసులూ
తేనె మనసులూ..మంచి మనసులూ
అబ్బా..మ్ముహుహు..ఉహు..ఆ..అహా..మ్మూ..ఆ..
కలిసి వుంటే కలదు సుఖము..కలసి వచ్చిన అదృష్టము
ఇది కలిసి వచ్చిన అదృష్టము

మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు..ఆ..హా..
మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు..ఆయ్..
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి...ఆ ఛీ..ఏం కాదు
పక్కింటి అమ్మాయీ..ఈ..ఈ.. గడుసమ్మాయి..ఆ..
అమెరిక అమ్మాయీ రోజులు మారాయి..
ఆఆ డాండ..డాడ్డా..డడ..డద్దా..డాండ..డాడ్డా..డడ..
ఆ..హా..ఆ..హా..ఆ..హా..
కలిసి వుంటే కలదు సుఖము..కలసి వచ్చిన అదృష్టము
ఇది కలిసి వచ్చిన అదృష్టము

మంచి వాడు మామకు తగ్గ అల్లుడు..ఓ అలాగా..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...హా..హా.. అయ్యొ పిచ్చి వాడు
ఏయ్..మంచి వాడు మామకు తగ్గ అల్లుడూ..ఆ హా..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...మ్మ్..
ఈడు జోడు తోడూ నీడా నాడు నేడూ..అ హా..
ఈడు జోడు తోడూ నీడా నాడు నేడూ
ప్రేమించి చూడు పెళ్ళి చేసి చూడు...హమ్మ బాబొయ్
డాండ..డాడ్డా..డడ..హా హా హా..డాండ..డాడ్డా..డడ..
డాండా..డాండా..డాండడా..డనడాండ డాండ డాడడా
హా హా హా హా.....
కలిసి వుంటే కలదు సుఖము..కలసి వచ్చిన అదృష్టము
ఇది కలిసి వచ్చిన మ్మ్ మ్మ్ మ్మ్

మరోచరిత్ర ~~1978సంగీతం::MS,విశ్వనాథన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు

మరోచరిత్ర ~~1979సంగీతం::MS.విశ్వనాథన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::S.జానకి

శ్రీనివాస కల్యాణం--1987సంగీతం::K.V.మహాదేవన్
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు,P.సుశీల


తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..
తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..
మగడు లేనివేళ తుమ్మెదా..వచ్చి మొగమాటంపెడతాడె తుమ్మెదా..
మాటవరసకంట తుమ్మెదా..పచ్చిమోటుసరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానె తుమ్మెదా..వచ్చి హత్తుకపోయాడె తుమ్మెదా
తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..

ఎదురుపడితె తగలనీక దడికడతాడే
పొదచాటుకి పదపదమని సొదపెడతాడే..
ఎదురుపడితె తగలనీక దడికడతాడే
పొదచాటుకి పదపదమని సొదపెడతాడే..
ఒప్పనంటే ఒదలడమ్మా..ముప్పుతప్పదంటె బెదరడమ్మా
ఒప్పనంటే ఒదలడమ్మా..ముప్పుతప్పదంటె బెదరడమ్మా
చుట్టుపక్కలేమాత్రం చూడని ఆత్రం
పట్టువిడుపులేనిదమ్మ క్రిష్ణుని పంతం..
మగడు లేనివేళ తుమ్మెదా..వచ్చి మొగమాటంపెడతాడె తుమ్మెదా..
మాటవరసకంట తుమ్మెదా..పచ్చిమోటుసరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానె తుమ్మెదా..వచ్చి హత్తుకపోయాడె తుమ్మెదా
తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..తుమ్మెదా..తుమ్మెదా..

తానమాడువేళ తాను దిగబడతాడే
మానుమాటు చేసి చూడ ఎగపడతాడే
తానమాడువేళ తాను దిగబడతాడే
మానుమాటు చేసి చూడ ఎగపడతాడే
చెప్పుకొంటె సిగ్గుచేటూ..అబ్భ నిప్పులాంటిచూపు కాటూ
చెప్పుకొంటె సిగ్గుచేటూ..అబ్భ నిప్పులాంటిచూపు కాటూ
ఆదమరచివున్నావా కోకలు మాయం
ఆనక ఏమనుకొన్న రాదే సాయం..

మగడు లేనివేళ తుమ్మెదా..వచ్చి మొగమాటంపెడతాడె తుమ్మెదా..
మాటవరసకంట తుమ్మెదా..పచ్చిమోటుసరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానె తుమ్మెదా..వచ్చి హత్తుకపోయాడె తుమ్మెదా
తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..
తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..

మరోచరిత్ర ~~1979సంగీతం::MS.విశ్వనాథన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::S.జానకి


పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి
వెల్లువల్లే ఉరకలేసే

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు..2
తెరచాటొసగిన చెలులు శిలలకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకు
కోటి దండాలు శతకోటి దండాలు

నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
కోటి దండాలు శతకోటి దండాలు

భ్రమలో లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వేళలకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
మనకై వేచే ముందు నాళ్ళకు
కోటి దండాలు శతకోటి దండాలు
కోటి దండాలు శతకోటి దండాలు
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
కోటి దండాలు శతకోటి దండాలు

తోట రాముడు--1975::శివరంజని::రాగం


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4517
సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల


శివరంజని::రాగం 


ఓ బంగరు రంగుల చిలక..పలకవా..ఆ..
ఓ అల్లరి చూపుల రాజా..ఏమనీ..ఈ..
నామీద ప్రేమే ఉందనీ..నాపైన అలకే లేదనీ..

ఓ అల్లరి చూపుల రాజా..పలకవా..ఆ..
ఓ బంగరు రంగుల చిలకా..ఏమనీ..ఈ..
నామీద ప్రేమే వుందనీ..నాపైన అలకే లేదనీ..ఈ..
ఓ..ఓ...ఒహోహో..ఓ..ఓ..
ఆ..ఆ..ఆ..

:::1


పంజరాని దాటుకొనీ బంధనాలు తెంచుకొనీ
నీకోసం వచ్చా ఆశతో....ఓ...
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలిచావెందుకే.....
నీ చేరువలో నీచేతులలో పులకించేటందుకే...

ఓ బంగరు రంగుల చిలక..పలకవా..ఆ..
ఓ అల్లరి చూపుల రాజా..ఏమనీ..ఈ..
నామీద ప్రేమే ఉందనీ..నాపైన అలకే లేదనీ..

:::2


సన్నజాజి తీగుందీ..తీగమీద పూవుందీ
పువ్వులోని నవ్వే..నాదిలే...
కొంటె తుమ్మెదొచ్చిందీ..జుంటి తేనె కోరిందీ..
అందించే భాగ్యం..నాదిలే....
ఈ కొండల్లో..ఈ కోనల్లో..మనకెదురే లేదులే...

ఓ అల్లరి చూపుల రాజా..పలకవా..ఆ..
ఓ బంగరు రంగుల చిలకా..ఏమనీ..ఈ..
నామీద ప్రేమే వుందనీ..నాపైన అలకే లేదనీ..ఈ..