Sunday, November 30, 2014

భారతంలో ఒక అమ్మాయి--1975



సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::శ్రీశ్రీ 
గానం::వాణిజయరాం
Film Directed By::Dasari Narayanarao
తారాగణం::మురళి మోహన్,చంద్రమోహన్,రాజసులోచన,సావిత్రి,రాజబాబు,కాంతారావు,M. ప్రభాకర్ రెడ్డి,కైకాల సత్యనారాయణ,జయమాలిని.

పల్లవి::

భారతంలో..మనభారతంలో
ఈభారతంలో..ఒక అమ్మాయి
యుగయుగాలుగా..తరతరాలుగా 
జరిగే కధలే..చెపుతోంది
భారతంలో..ఒక అమ్మాయి

చరణం::1

కీర్తి కోసమని నడిబజారులో..సతినే అమ్మాడొకరాజు 
ప్రజల మెప్పుకై పరమసాద్వినే..అడవికి తరిమాడింకొకరాజు 
తన వ్యసనానికి సొంతభార్యనే..పందెంకాసాడొకరాజు 
పెళ్ళి చేసుకొని పెళ్ళానివి..నువుకాదన్నడింకొకరాజు
భారతంలో..మనభారతంలో
ఈభారతంలో..ఒక అమ్మాయి

చరణం::2

ధనదాహంతో భార్యలమార్చే..దగాకోరులే ఈనాడు
పెనుకామంతో పడతులచెరిచే..ఖుషీదారులే ఈనాడు
పదవికి పడతిని పాచికచేసే..బడాచోరులే ఈనాడు
చేరదీసి శీలం బలికోరే..దురాచారులే ఈనాడు
భారతంలో..మనభారతంలో
ఈభారతంలో..ఒక అమ్మాయి

చరణం::3

జగం మారినా..యుగం మారినా 
మారలేదు..అమ్మాయి కధా 
తీరలేదు..అమ్మాయి వ్యధా 
ఈ మారని తీరని..కధలకు వ్యధలకు 
అంతం లేనే..లేదు 
వాడిన వనితల..మోడు బ్రతుకులకు 
వసంతకాలం రానేరాదు..వసంతకాలం రానేరాదు
భారతంలో..ఒక అమ్మాయి
భారతంలో..ఒక అమ్మాయి 
యుగ యుగాలుగా..తర తరాలుగా
యుగ యుగాలుగా..తర తరాలుగా
జరిగే కథలే..చెబుతోంది
భారతంలో..ఒక అమ్మాయి

Bharatamlo Oka Ammayi--1975
Music::Saluri Rajeswara Rao
Lyrics::Sri Sri
Singer's::Vanijayaram
Film Directed By::Dasari Narayanarao
Cast:: Murali Mohan,Chandramohan,Rajasulochana,Savithri,Rajababu,Kantharao,M Prabhakar Reddy,Kaikala Sathyanaryana,Jayamalini.

:::::::::

bhaaratamlO..manabhaaratamlO
ii bhaaratamlO..oka ammaayi
yugayugaalugaa..tarataraalugaa 
jarigE kadhalE..cheputOndi
bhaaratamlO..oka ammaayi

::::1

keerti kOsamani naDibajaarulO..satinE ammaaDokaraaju 
prajala meppukai paramasaadvinE..aDaviki tarimaaDinkokaraaju 
tana vyasanaaniki soNtabhaaryanE..pandemkaasaaDokaraaju 
peLLi chEsukoni peLLaanivi..nuvukaadannaDinkokaraaju
bhaaratamlO..manabhaaratamlO..ii bhaaratamlO..oka ammaayi

::::2

dhanadaahamtO bhaaryalamaarchE..dagaakOrulE iinaaDu
penukaamamtO paDatulacherichE..khusheedaarulE iinaaDu
padaviki paDatini paachikachEsE..baDaachOrulE iinaaDu
chEradeesi Seelam balikOrE..duraachaarulE iinaaDu
bhaaratamlO..manabhaaratamlO..ii bhaaratamlO..oka ammaayi

::::3

jagam maarinaa..yugam maarinaa 
maaralEdu..ammaayi kadhaa 
teeralEdu..ammaayi vyadhaa 
ii maarani teerani..kadhalaku vyadhalaku 
antam lEnE..lEdu 
vaaDina vanitala..mODu bratukulaku 
vasantakaalam raanEraadu..vasantakaalam raanEraadu
bhaaratamlO..oka ammaayi..bhaaratamlO..oka ammaayi 
yuga yugaalugaa..tara taraalugaa..yuga yugaalugaa tara taraalugaa
jarigE kathalE..chebutOndi..bhaaratamlO..oka ammaayi

Saturday, November 29, 2014

బుల్లెమ్మ బుల్లోడు--1972


















సంగీత::చెళ్ళపిళ్ళ సత్యం 
రచన:: రాజశ్రీ
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::చలం,సత్యనారాయణ,ధూళిపాళ,త్యాగరాజు,విజయలలిత,పండరీబాయి,బాలకృష్ణ 

పల్లవి::

కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా
కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు...కొసరే రాగాలు
కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా

చరణం::1

అల్లరి చేసే ఆశలు నాలో..పల్లవి పాడేనూ
తొలకరి వయసు గడసరి మనసు..నీ జతకోరేనూ 
అల్లరి చేసే ఆశలు నాలో..పల్లవి పాడేనూ
తొలకరి వయసు గడసరి మనసు..నీ జతకోరేనూ
చలిగాలి వీచే...గిలిగింత తోచే
కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా

చరణం::2

ఉరకలువేసే ఊహలు నాలో..గుసగుసలాడేనూ 
కథలను తెలిపే కాటుక కనులూ..కైపులు రేపేనూ
ఉరకలువేసే ఊహలు నాలో..గుసగుసలాడేనూ 
బిగువు ఇంకేలా...దరికి రావేలా
కురిసింది వానా నా గుండెలోనా..నీ చూపులే జల్లుగా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

Friday, November 28, 2014

సావాసగాళ్లు--1977



సంగీతం::J.V.రాఘవులు
రచన::కోసరాజురాఘవయ్య  
గానం::P.సుశీల,S.P.బాలు,మాధవపెద్ది పిఠాపురం   
Film Directed By::Boyina Subba Rao
తారాగణం::కృష్ణ,జయచిత్ర,కైకాల సత్యనారాయణ,గిరిబాబు,గుమ్మడి,ప్రభ,రమాప్రభ,అల్లురామలింగయ్య,
నాగేష్,గిరిజ,రాధాకుమారి,రావికొండలరావు,మమత,కల్పనారాయ్,కల్పన,వాణి.

పల్లవి::

బంగారు తల్లివి నీవమ్మా
నిను నమ్మినవారికి బాధలేవీ రానేరావమ్మా
మాఇలవేల్పువు నీవేనమ్మా..మహిమలుచూపే అంబవు
బంగారు తల్లివి నీవమ్మా
నిను నమ్మినవారికి బాధలేవీ రానేరావమ్మా 

చరణం::1

సూళ్ళూరుపేట చెంగాళమ్మవు..కొండపాటూరు పోలేరమ్మవు 
సూళ్ళూరుపేట చెంగాళమ్మవు..కొండపాటూరు పోలేరమ్మవు  
అద్దంకమ్మవు పెద్దింటమ్మవు..అనకాపల్లి నూకాలమ్మవు..ఏహే..ఏఏఏఏ 
అద్దంకమ్మవు పెద్దింటమ్మవు..అనకాపల్లి నూకాలమ్మవు
దొనకొండల గంగమ్మవు నీవు..బెజవాడ కనకదుర్గమ్మవు నీవు

బంగారు..ఘనక్ ఝనక్ తా
బంగారు..తల్లివి నీవమ్మా
నిను నమ్మినవారికి బాధలేవీ రానేరావమ్మా

చరణం::2

ఉగ్రంగా కన్నెత్తి చూశావంటే..గప్పుగప్పున చింత నిప్పులేరాలు
ఉగ్రంగా కన్నెత్తి చూశావంటే..గప్పుగప్పున చింత నిప్పులేరాలు 
సింహగర్జన నీవు చేశావంటే..సింహగర్జన నీవు చేశావంటే
ఫెళాఫెళా ఫెళాఫెళా పిడుగులేరాలు..అభయ హస్తంబిచ్చి ఆదరించావంటే....ఏఏఏఏ  
అభయ హస్తంబిచ్చి ఆదరించావంటే..జల్లుజల్లుగ సిరుల జల్లులేకురియు 

బంగారు..ఘనక్ ఝనక్ తా
బంగారు..తల్లివి నీవమ్మా
నిను నమ్మినవారికి బాధలేవీ రానేరావమ్మా 

చరణం::3

ఏటేటా కొలువులు చేయిస్తాము..ప్రభలు గట్టి గుడిచుట్టు తిప్పిస్తాము
ఏటేటా కొలువులు చేయిస్తాము..ప్రభలు గట్టి గుడిచుట్టు తిప్పిస్తాము 
ముడుపులు చెల్లిస్తాము..మొక్కులు తీరుస్తాము
ముడుపులు చెల్లిస్తాము..మొక్కులు తీరుస్తాము 
సంబరాలు చేయించి..సంబరాలు చేయించి..తందనాలు తొక్కుతాము 

తందానా..తందానా..తహ..తహ..తహ
బంగారు..ఘనక్ ఝనక్ తా
బంగారు..తల్లివి నీవమ్మా
నిను నమ్మినవారికి బాధలేవీ రానేరావమ్మా 
మాఇలవేల్పువు నీవేనమ్మా..మహిమలుచూపే అంబవు
బంగారు తల్లివి నీవమ్మా
నిను నమ్మినవారికి బాధలేవీ రానేరావమ్మా
.
Saavaasagaallu--1977
Music::J.V.Raaghavulu
Lyrics::KosaraajuRaaghavayya
Singer's::S.P.Baalu,P.Suseela,Maadhavapeddi PiThaapuram  
Film Directed By::Boyina Subba Rao
Cast::Krishna,Jayachitra,Kaikaala Satyanaaraayana,Giribaabu,Gummadi,Prabha,Ramaaprabha,
Alluraamalingayya,Naagesh,Girija,Raadhaakumaari,Raavikondalaraavu,Mamata,Kalpanaaraay^,Kalpana,Vaani.

::::::::: 

bangaaru tallivi neevammaa
ninu namminavaariki baadhalEvii raanEraavammaa
maailavElpuvu neevEnammaa..mahimaluchoopE ambavu
bangaaru tallivi neevammaa
ninu namminavaariki baadhalEvii raanEraavammaa 

::::1

sooLLoorupETa chengaaLammavu..konDapaaTooru pOlErammavu 
sooLLoorupETa chengaaLammavu..konDapaaTooru pOlErammavu  
addankammavu peddinTammavu..anakaapalli nookaalammavu..EhE..EEEE 
addankammavu peddinTammavu..anakaapalli nookaalammavu
donakonDala gangammavu neevu..bejavaaDa kanakadurgammavu neevu

bangaaru..ghanak jhanak taa
bangaaru..tallivi neevammaa
ninu namminavaariki baadhalEvii raanEraavammaa

::::2

ugrangaa kannetti chooSaavanTE..gappugappuna chinta nippulEraalu
ugrangaa kannetti chooSaavanTE..gappugappuna chinta nippulEraalu 
siMhagarjana neevu chESaavanTE..siMhagarjana neevu chESaavanTE
pheLaapheLaa pheLaapheLaa piDugulEraalu..abhaya hastambichchi AdarinchaavanTE....EEEE  
abhaya hastambichchi AdarinchaavanTE..jallujalluga sirula jallulEkuriyu 

bangaaru..ghanak jhanak taa
bangaaru..tallivi neevammaa
ninu namminavaariki baadhalEvii raanEraavammaa 

::::3

ETETaa koluvulu chEyistaamu..prabhalu gaTTi guDichuTTu tippistaamu
ETETaa koluvulu chEyistaamu..prabhalu gaTTi guDichuTTu tippistaamu 
muDupulu chellistaamu..mokkulu teerustaamu
muDupulu chellistaamu..mokkulu teerustaamu 
sambaraalu chEyinchi..sambaraalu chEyinchi..tandanaalu tokkutaamu 

tandaanaa..tandaanaa..taha..taha..taha
bangaaru..ghanak jhanak taa
bangaaru..tallivi neevammaa
ninu namminavaariki baadhalEvii raanEraavammaa 
maailavElpuvu neevEnammaa..mahimaluchoopE ambavu
bangaaru tallivi neevammaa
ninu namminavaariki baadhalEvii raanEraavammaa

కన్నెమనసులు--1966




సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::దాశరథి 
Film Directed By::Adoorti Subbaa Rao 
గానం::P.సుశీల
తారాగణం::రాంమోహన్,కృష్ణ,సంధ్య,సుకన్య,సంధ్యారాణి,గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం,తుంగల చలపతిరావు,కె.వి.చలం 

పల్లవి::

హుమ్..హుమ్..హుమ్..హుమ్  
సిత్రంగా ఉన్నది..ఈ ఏల
ఊగిందినా మనసు..ఉయ్యాలా
ఊగిందినా మనసు..ఉయ్యాలా

సిత్రంగా ఉన్నది..ఈ ఏల
ఊగిందినా మనసు..ఉయ్యాలా
ఊగిందినా మనసు..ఉయ్యాలా

చరణం::1

దూరాన ఓ ఏరు గలగలలాడింది..గంతులేసింది
ఏటి గాలికి పైట తొలిగిపోయింది..ఎగిరిపోయింది
దూరాన ఓ ఏరు గలగలలాడింది..గంతులేసింది
ఏటి గాలికి పైట తొలిగిపోయింది..ఎగిరిపోయింది  

ఎగిరిపోయిన పైట..ఏమి సెప్పిందో
పైటలా మా బావ..పెనవేసుకున్నాడు 

సిత్రంగా ఉన్నది..ఈ ఏల
ఊగిందినా మనసు..ఉయ్యాలా
ఊగిందినా మనసు..ఉయ్యాలా 

చరణం::2

దూరాన ఓ మబ్బు..తొంగి చూసింది
సల్లగా ఓ సిన్న..జల్లు కురిసింది
జల్లులో మా బావ..కళ్ళు కలిపాడు
సిగ్గు ముంచేసింది..బుగ్గ తుంచేశాడు

సిత్రంగా ఉన్నది..ఈ ఏల
ఊగిందినా మనసు..ఉయ్యాలా
ఊగిందినా మనసు..ఉయ్యాలా 

చరణం::3

దూరాన మా బావ ఒళ్ళు తడిసింది..ఒణికిపోయింది
ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది..సోలిపోయింది
దూరాన మా బావ ఒళ్ళు తడిసింది..ఒణికిపోయింది
ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది..సోలిపోయింది 

సెంత చేరి సైగ చేసి సేతులు జాపాడు
నా వలపులోని వేడి తాను పంచుకున్నాడు

సిత్రంగా ఉన్నది ఈ ఏల
ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
సిత్రంగా ఉన్నది ఈ ఏల
ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా 

Raamaapuramlo Seeta--1981
Music::J.V.Raaghavulu 
Lyrics::Arudra 
Film Directed By::Adoorti Subbaa Rao 
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Ramakrishna, Sujatha Mohan, Chandra Mohan, P.L. Narayana, Sakshi Ranga Rao, Bheemaraju, Chitti Babu, Ramaprabha, Pushpa Kumari, Mamatha, Jeeva, Seetha Latha

::::::::::::::::::::::::

humm..humm..humm..humm 
sitrangaa unnadi..ii Ela
Ugindinaa manasu..uyyaalaa
Ugindinaa manasu..uyyaalaa

sitrangaa unnadi..ii Ela
Ugindinaa manasu..uyyaalaa
Ugindinaa manasu..uyyaalaa

::::1

dooraana O Eru galagalalaaDindi..gantulEsindi
ETi gaaliki paiTa toligipOyindi..egiripOyindi
dooraana O Eru galagalalaaDindi..gantulEsindi
ETi gaaliki paiTa toligipOyindi..egiripOyindi 

egiripOyina paiTa..Emi seppindO
paiTalaa maa baava..penavEsukunnaaDu 

sitrangaa unnadi..ii Ela
Ugindi naa manasu..uyyaalaa
Ugindi naa manasu..uyyaalaa 

::::2

dooraana O mabbu..tongi choosindi
sallagaa O sinna..jallu kurisindi
jallulO maa baava..kaLLu kalipaaDu
siggu munchEsindi..bugga tunchESaaDu

sitrangaa unnadi..ii Ela
Ugindi naa manasu..uyyaalaa
Ugindi naa manasu..uyyaalaa 

::::3

dooraana maa baava oLLu taDisindi..oNikipOyindi
oNikipOyina oLlu vaalipOyindi..sOlipOyindi
dooraana maa baava oLLu taDisindi..oNikipOyindi
oNikipOyina oLlu vaalipOyindi..sOlipOyindi 

senta chEri saiga chEsi sEtulu jaapaaDu
naa valapulOni vEDi taanu pan chukunnaaDu

sitrangaa unnadi ii Ela
Ugindinaa manasu uyyaalaa
Ugindinaa manasu uyyaalaa
sitrangaa unnadi ii Ela
Ugindinaa manasu uyyaalaa
Ugindinaa manasu uyyaalaa

రామాపురంలో సీత--1981




సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆరుద్ర
గానం::S.P..బాలు,Pసుశీల
Film Directed By::D.Satyam 
తారాగణం::రామకృష్ణ,చంద్రమోహన్,సుజాత. 

పల్లవి::

మనసు మందారం..ముద్దరాలి వయసు వయ్యారం
చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం..ఆ బుగ్గే సింధూరం

మనసు మందారం..అందగాని వయసు వైభోగం
పరువమందు పదును తేరి..పలుకే బంగారం..ఈ కులుకే గారాబం

చరణం::1

నీ చిన్నెలు నీ వన్నెలు..జీవమున్న అమరావతి శిల్పం
నీ అందెల ఈ చిందులు..దేవలోక హావభావ నాట్యం

నీ చిన్నెలు నీ వన్నెలు..జీవమున్న అమరావతి శిల్పం
నీ అందెల ఈ చిందులు..దేవలోక హావభావ నాట్యం

దాగి..దాగి..దాగి..దోబూచులాడింది పొంగే సల్లాపం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

మనసు మందారం..అందగాని వయసు వైభోగం
చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం..ఆ బుగ్గే సింధూరం

చరణం::2

చిరునవ్వుల సిరివెన్నెల పందిరేసి..సంబరాలు జరిపే
నీ ఒంపులు నీ సొంపులు దోరవయసు..తోరణాలు నిలిపే

చిరునవ్వుల సిరివెన్నెల పందిరేసి..సంబరాలు జరిపే
నీ ఒంపులు..నీ సొంపులు దోరవయసు..తోరణాలు నిలిపే

ఊగి..ఊగి..ఊగి..ఉయ్యాలలూగింది ఉబికే ఉబలాటం..మ్మ్

ఆ..ఆ..మనసు మందారం..ముద్దరాలి వయసు వయ్యారం
చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం..ఆ బుగ్గే సింధూరం

మనసు మందారం..అందగాని వయసు వైభోగం
పరువమందు పదును తేరి పలుకే బంగారం..ఆ కులుకే గారాబం

Raamaapuramlo Seeta--1981
Music::J.V.Raaghavulu 
Lyrics::Arudra 
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::D.Satyam 
Cast::Ramakrishna, Sujatha Mohan, Chandra Mohan, P.L. Narayana, Sakshi Ranga Rao, Bheemaraju, Chitti Babu, Ramaprabha, Pushpa Kumari, Mamatha, Jeeva, Seetha Latha

::::::::::::::::::::::::

manasu mandaaram..muddaraali vayasu vayyaaram
chilipi sarasaalaaDagaanE siggE singaaram..aa buggE sindhooram

manasu mandaaram..andagaani vayasu vaibhOgam 
paruvamandu padunu tEri..palukE bangaaram..ii kulukE gaaraabam


::::1

nii chinnelu nii vannelu..jeevamunna amaraavati Silpam
nii andela ii chindulu..dEvalOka haavabhaava naaTyam

nii chinnelu nii vannelu..jeevamunna amaraavati Silpam
nii andela ii chindulu..dEvalOka haavabhaava naaTyam

daagi..daagi..daagi..dOboochulaaDindi pongE sallaapam..mm mm mm mm

manasu mandaaram..andagaani vayasu vaibhOgam
chilipi sarasaalaaDagaanE siggE singaaram..aa buggE sindhooram

::::2

chirunavvula sirivennela pandirEsi..sambaraalu jaripE
nii ompulu nii sompulu dOravayasu..tOraNaalu nilipE

chirunavvula sirivennela pamdirEsi..sambaraalu jaripE
nii ompulu..nii sompulu dOravayasu..tOraNaalu nilipE

Ugi..Ugi..Ugi..uyyaalaloogindi ubikE ubalaaTam..mm

aa..aa..manasu mandaaram..muddaraali vayasu vayyaaram
chilipi sarasaalaaDagaanE siggE singaaram..aa buggE sindhooram

manasu mandaaram..andagaani vayasu vaibhOgam
paruvamandu padunu tEri palukE bangaaram..aa kulukE gaaraabam

Thursday, November 27, 2014

మహాపురుషుడు--1981




సంగీతం::చక్రవర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి 
Film Directed By::Lakshmi deepak
గానం::G.ఆనంద్,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,మురళిమోహన్,జయసుధ,సుజాత.  

పల్లవి::

ప్రతి వసంత వేళలో..పలకరించు పూలలో
ప్రతి వసంత వేళలో..పలకరించు పూలలో
నీ రూపం చూసాను..నీ రూపం చూసాను 
అగుపించక అలరించే..పరిమళం లాగా
ప్రణయ పరిమళం లాగా..ఆ

ప్రతి ప్రభాత వేళలో..పరచిన కిరణాలలో 
ప్రతి ప్రభాత వేళలో..పరచిన కిరణాలలో 
నీ పిలుపే విన్నాను..నీ పిలుపే విన్నాను
కనిపించక వినిపించే..నాదంలాగా హృదయ నాదంలాగా..ఆ

ప్రతి వసంత వేళలో..పలకరించు పూలలో

చరణం::1

ఏ..చిగురాకులు..నిమిరినా
నీ..చేతి నునుపే..తోచింది
ఆ..ఆ..ఆ..ఏ..చిరుగాలిని..అడిగినా  
నీ..చిలిపి పేరే..అడిగింది..ఈ
ఏ..విరజాజి..విరిసిన..ఆ  
నీ..చిరునవ్వే..మొలిచింది

ఏ..మేఘం అడుగు..సాగిన 
ఏ..మేఘం అడుగు..సాగిన 
నీ..మనసే..మెరిసింది..ఈ
నీ..మనసే మెరిసింది..ఈ 

ప్రతి వసంత వేళలో..పలకరించు పూలలో
ప్రతి ప్రభాత వేళలో..పరచిన కిరణాలలో 
నీ రూపం చూసాను..ఆ..నీ పిలుపే విన్నానూ
అగుపించక అలరించే..పరిమళం లాగా..ఆ
ప్రణయ పరిమళం లాగా..ఆ
ప్రతి ప్రభాత వేళలో..పరచిన కిరణాలలో

చరణం::2

ఏ..తొలిపొద్దు..పొడిచినా
నీ..పులకరింత..పూచింది
ఆ..ఆ..ఏ నడిరేయి..తలచినా
నీ..గడుసు పైట..వీచింది 
ఏ..అద్దంలో..చూసినా..ఆ
మన ఇద్దరినే..చూపించి

ఏ..ఋతువు రూపు మారిన 
ఏ..ఋతువు రూపు మారిన 
మనవలపే నిలిచింది..ఈ
మనవలపే నిలిచింది..ఈ

ప్రతి ప్రభాత వేళలో..పరచిన కిరణాలలో 
ప్రతి వసంత వేళలో..పలకరించు పూలలో 
నీ పిలుపే విన్నాను..నీ రూపం చూసాను 
కనిపించక వినిపించే..ఏ..నాదంలాగా హృదయ నాదంలాగా..
ప్రతి వసంత వేళలో..పలకరించు పూలలో 

Mahaapurushudu--1981
Music::Chakravarti 
Lyrics::D.C.NaaraayanaReddi 
Film Directed By::Lakshmi Deepak
Singer's::G.Anand,P.Suseela
Cast::N.T.Raamaa Rao,Muralimuhan,Jayasudha,Sujaata.

::::::::::::::::::::::::

prati vasanta vELalO..palakarinchu poolalO
prati vasanta vELalO..palakarinchu poolalO
nee roopam choosaanu..nee roopam choosaanu 
agupinchaka alarinchE..parimaLam laagaa
praNaya parimaLam laagaa..aa

prati prabhaata vELalO..parachina kiraNaalalO 
prati prabhaata vELalO..parachina kiraNaalalO 
nee pilupE vinnaanu..nee pilupE vinnaanu
kanipinchaka vinipinchE..naadamlaagaa hRudaya naadamlaagaa..aa

prati vasanta vELalO..palakarinchu poolalO

::::1

E..chiguraakulu..nimirinaa
nee..chEti nunupE..tOchindi
aa..aa..aa..E..chirugaalini..aDiginaa  
nee..chilipi pErE..aDigindi..ii
E..virajaaji..virisina..aa  
nee..chirunavvE..molichindi

E..mEgham aDugu..saagina 
E..mEgham aDugu..saagina 
nee..manasE..merisindi..ii
nee..manasE merisindi..ii 

prati vasanta vELalO..palakarinchu poolalO
prati prabhaata vELalO..parachina kiraNaalalO 
nee roopam choosaanu..aa..nee pilupE vinnaanuu
agupinchaka alarinchE..parimaLam laagaa..aa
praNaya parimaLam laagaa..aa
prati prabhaata vELalO..parachina kiraNaalalO

::::2

E..tolipoddu..poDichinaa
nee..pulakarinta..poochindi
aa..aa..E..naDirEyi..talachinaa
nee..gaDusu paiTa..veechindi 
E..addamlO..choosinaa..aa
mana iddarinE..choopinchi

E..Rutuvu roopu maarina 
E..Rutuvu roopu maarina 
manavalapE nilichindi..ii
manavalapE nilichindi..ii

prati prabhaata vELalO..parachina kiraNaalalO 
prati vasanta vELalO..palakarinchu poolalO 
nee pilupE vinnaanu..nee roopam choosaanu 
kanipinchaka vinipinchE..E..naadamlaagaa hRudaya naadamlaagaa
prati vasanta vELalO..palakarinchu poolalO 

సావాసగాళ్లు--1977



సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల,బృందం  
Film Directed By::Boyina Subba Rao
తారాగణం::కృష్ణ,జయచిత్ర,కైకాల సత్యనారాయణ,గిరిబాబు,గుమ్మడి,ప్రభ,రమాప్రభ,అల్లురామలింగయ్య,
నాగేష్,గిరిజ,రాధాకుమారి,రావికొండలరావు,మమత,కల్పనారాయ్,కల్పన,వాణి.

పల్లవి::

తొక్కుడు బండబ్బీ..ఓ లబ్బరు బండబ్బీ
ఎక్కనోడు ఎక్కితే..ఎనకా ముందయిందంట
ఓ..రబ్బీ..ఎనకా ముందైయిందంట
తొక్కుడు బండబ్బీ..ఓ లబ్బరు బండబ్బీ
ఎక్కనోడు ఎక్కితే..ఎనకా ముందయిందంట
ఓ..రబ్బీ..ఎనకా ముందైయిందంట

చరణం::1

హోయ్..హోయ్..ఈ..హోయ్..హోయ్..ఈ
లలలలలా లాలలలలా లాలలలలలాలలా

చక్రాల్లో గాలుందా..పట్టి చూడు
బెల్లు చక్కంగా మోగుతుందా..కొట్టి చూడు 
చక్రాల్లో గాలుందా..పట్టి చూడు
బెల్లు చక్కంగా మోగుతుందా..కొట్టి చూడు 
హా..ఆ..ఆ..హాండిల్ ఎటుందో ఎత్తిచూడు 
హహాహా..హాండిల్ ఎటుందో ఎత్తిచూడు  
బ్రేకు పట్టేదొ పట్టందో లాగిచూడు 
గోవిందో..గోవిందా..గోవిందో..గోవిందా 
ఏకీలు కాకీలు..వూడొచ్చేరోయ్ 
ఏకీలు కాకీలు..వూడొచ్చేరోయ్  
నీ సైకులు మోకాలు..కసరెత్తేరోయ్

ఎక్కనోడు ఎక్కితే..ఎనకా ముందయిందంట
ఓ..రబ్బీ..ఎనకా ముందైయిందంట
తొక్కుడు బండబ్బీ..ఓ లబ్బరు బండబ్బీ
ఎక్కనోడు ఎక్కితే..ఎనకా ముందయిందంట
ఓ..రబ్బీ..ఎనకా ముందైయిందంట

చరణం::2

పిల్లోడు చూపులకు..గట్టోడే..ఆడపిల్లొక్క తావిస్తే ఆగలేడే
పిల్లోడు చూపులకు..గట్టోడే..ఆడపిల్లొక్క తావిస్తే ఆగలేడే 
ఆ ఆ ఆ..అడప తడప శివమెక్కి వస్తాడే
అడప తడప శివమెక్కి వస్తాడే..ఆడమంటె మద్దెల..ఓటిదంటాడే  

గోవిదో..గోవిందా..గోవిదో..గోవిందా
ఏమాటకామాట చెప్పాలిలే..ఏఏఏ
ఏమాటకామాట చెప్పాలిలే..ఏఏఏ
ఈ ఉఊరంత ఒప్పుకొన్న..మంచోడులే

ఎక్కనోడు ఎక్కితే..ఎనకా ముందయిందంట
ఓ..రబ్బీ..ఎనకా ముందైయిందంట 
తొక్కుడు బండబ్బీ..ఓ లబ్బరు బండబ్బీ
ఎక్కనోడు ఎక్కితే..ఎనకా ముందయిందంట
ఓ..రబ్బీ..ఎనకా ముందైయిందంట
ఎక్కనోడు ఎక్కితే..ఎనకా ముందయిందంట
ఓ..రబ్బీ..ఎనకా ముందైయిందంట

Saavaasagaallu--1977
Music::J.V.Raaghavulu
Lyrics::Achaarya Atreya
Singer's::P.Suseela , Brundam
Film Directed By::Boyina Subba Rao
Cast::Krishna,Jayachitra,Kaikaala Satyanaaraayana,Giribaabu,Gummadi,Prabha,
Ramaaprabha,Alluraamalingayya,Naagesh,Girija,Raadhaakumaari,Raavikondalaraavu,Mamata,Kalpanaaraay^,Kalpana,Vaani.

::::::::: 

tokkuDu banDabbii..O labbaru banDabbii
ekkanODu ekkitE..enakaa mundayindanTa
O..rabbii..enakaa mundaiyindanTa
tokkuDu banDabbii..O labbaru banDabbii
ekkanODu ekkitE..enakaa mundayindanTa
O..rabbii..enakaa mundaiyindanTa

::::1

hOy..hOy..ii..hOy..hOy..ii
lalalalalaa laalalalalaa laalalalalalaalalaa

chakraallO gaalundaa..paTTi chooDu
bellu chakkngaa mOgutundaa..koTTi chooDu 
chakraallO gaalundaa..paTTi chooDu
bellu chakkngaa mOgutundaa..koTTi chooDu 
haa..aa..aa..haanDil eTundO ettichooDu 
hahaahaa..haanDil eTundO ettichooDu  
brEku paTTEdo paTTandO laagichooDu 
gOvindO..gOvindaa..gOvindO..gOvindaa 
Ekeelu kaakeelu..vuuDochchErOy 
Ekeelu kaakeelu..vuuDochchErOy  
nee saikulu mOkaalu..kasarettErOy

ekkanODu ekkitE..enakaa mundayindanTa
O..rabbii..enakaa mundaiyindanTa
tokkuDu banDabbii..O labbaru banDabbii
ekkanODu ekkitE..enakaa mundayindanTa
O..rabbii..enakaa mundaiyindanTa

::::2

pillODu choopulaku..gaTTODE..ADapillokka taavistE AgalEDE
pillODu choopulaku..gaTTODE..ADapillokka taavistE AgalEDE 
aa aa aa..aDapa taDapa Sivamekki vastaaDE
aDapa taDapa Sivamekki vastaaDE..ADamanTe maddela..OTidanTaaDE  

gOvidO..gOvindaa..gOvidO..gOvindaa
EmaaTakaamaaTa cheppaalilE..EEE
EmaaTakaamaaTa cheppaalilE..EEE
ii uooranta oppukonna..manchODulE

ekkanODu ekkitE..enakaa mundayindanTa
O..rabbii..enakaa mundaiyindanTa 
tokkuDu banDabbii..O labbaru banDabbii
ekkanODu ekkitE..enakaa mundayindanTa
O..rabbii..enakaa mundaiyindanTa
ekkanODu ekkitE..enakaa mundayindanTa
O..rabbii..enakaa mundaiyindanTa

Wednesday, November 26, 2014

సావాసగాళ్లు--1977



సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల,బృందం  
Film Directed By::Boyina Subba Rao
తారాగణం::కృష్ణ,జయచిత్ర,కైకాల సత్యనారాయణ,గిరిబాబు,గుమ్మడి,ప్రభ,రమాప్రభ,అల్లురామలింగయ్య,
నాగేష్,గిరిజ,రాధాకుమారి,రావికొండలరావు,మమత,కల్పనారాయ్,కల్పన,వాణి.

పల్లవి::

జయచిత్ర::అమ్మల్లారా..అక్కల్లారా..గోంగూరకే
అనగనగ బ్రహ్మదేవుడు..గోంగూరకే
ఏనుగును చేయబోయి..గోంగూరకే
యాదమరచి మనిషినిచేసే..గోంగూరకే
ఆ ప్రాణి భూమ్మీద..గోంగూరకే
ఏదీగాక యాతనపడే..గోంగూరకే

చరణం::1

అమ్మమ్మో అటుచూడు..గోంగూరకే
కీలుగుర్రం కుర్రోడు..గోంగూరకే
కిఱ్రు కిఱ్రు మన్నాడు..గోంగూరకే   
తోలలేక గుర్రాన్ని..గోంగూరకే 
తూలి త్యూలి.....

" జయచిత్ర:: ఒ..ఒ..ఓఓఓఓ..
ఏమి శ్రీరామచంద్రప్రభో..ఆడపిల్లలమీదికి తోలుతున్నావ్
తమ కీలుగుర్రానికి..కనీసం బ్రేకులుకూడలేవా?

కృష్ణ::అబే..ఉన్నాయండీ..కాకపోతే
మీ గోంగూరపాటకి కంగారుపడి సరిగ్గా పళ్ళేదు

జయచిత్ర:: అలాగా అయితే కనీసం కాళ్ళకైన బ్రేకులు పడ్తాయో లేవో
తప్పుకోండి పాపం"

చరణం::2

జయచిత్ర::నోరులేని చిన్నోడు..గోంగూరకే
బ్రేకుల్లేని సైకిలెక్కి..గోంగూరకే
నీరులేని చెరువుకొచ్చి..గోంగూరకే
అడుగులేని కడవముంచి..గోంగూరకే
నీళ్ళాడి పోయాడంట..గోంగూరకే
నీళ్ళాడి పోయాడంట..గోంగూరకే

"అహాహాహాహా..పాపం కంగారు పడిపోయాదే
అయిన సీతా మీ ఇంట్లో అద్దెకుంటున్నమనిషేకదా
మర్యాదలేకుండ ఏదిపించటమేనా?

జయచిత్ర::ఏడిపించదలుచుకొంటే మన పరా చూడకూడదే
కలిపి కొట్టడమే..

చరణం::2

మ్మ్ హూ..సీత సీతా వాణి వస్తిందే పాట అందుకో

యచిత్ర::ఛఛ..ఆ బడాయికోరుతో చతురాడటం లడాయ్‌కోరి తెచ్చుకొన్నాట్టే
చూస్తూ ఉండండి..ఏదో కోతలు కోయడానికే వస్తుంది 

ప్రభ:: ఏయ్ సీతా..ఈ చీర ఎలా ఉందే?

జయచిత్ర::ఏ చీరా???

ప్రభ:: ఎర్రిమొహమా!! నే కట్టుకొన్న చీరే ఇది జపాన్‌లో తయారైంది
దీని ఖరీదెంతో తెలుసా?...500 వందలు

జయచిత్ర::ఒళ్ళు బైట ఏసుకొనేదానికి 500వందలు కర్చెందుకే!
చీరకట్టు మానేస్తే పోలా!!

ప్రభ::అంటే ఈ చీరలో ఒళ్ళు బైటేసుకొని తిరుగుతున్నాననేగా 
అవునులే గోనెబట్టలు కట్టుకొనే గోంగూరోళ్ళకి చీరలంటే ఏం తెలుస్తుంది
సింగారమంటే ఏం తెలుస్తుంది

జయచిత్ర::ఓసెస్..రాణి వెనుకటికి నీలాంటి ఒక మహారాణి ఏమందోతెలుసా
నేను దేవతావస్త్రాలు కట్టుకొన్నాను..ఇది పుణ్యాత్ములకే తప్ప పాపాత్ములకి
కనపడవంటు దిగంబరంగా వూరేగిందంట..హ్హ..అలాఉందే నీ యవ్వారం
ఇదిగో చూడు బట్టలు కట్టుకొనేది విలువ చూపించుకొనేదానికి కాదే
సిగ్గు దాచుకొనేదానికి 

ప్రభ::అంటే??..నేను సిగ్గిడిచి తిరుగుతున్నాననేగా నీ ఉద్దేశం  
ఉండుండు మా నాన్నతో చెప్పి నీ సిగ్గు కరిగించకపోతే నాపేరు రాణియేకాదు ఛిఛీ

జయచిత్ర::కరిగించావులే...ఇప్పుడందుకోండే తాళం"

జయచిత్ర::అమ్మమ్మో తిప్పులాడి..గోంగూరకే
పట్నంలో చదివింది..గోంగూరకే
పల్లెటూరుకొచ్చింది..గోంగూరకే
సన్నచీర కట్టింది..గోంగూరకే
పాపం సింగారమనుకోని..గోంగూరకే
సిగ్గంత బైటేసె..గోంగూరకే
సిగ్గంత బైటేసె..గోంగూరకే
హాహాహాహా 

Saavaasagaallu--1977
Music::J.V.Raaghavulu
Lyrics::Achaarya Atreya
Singer's::P.Suseela, 
Film Directed By::Boyina Subba Rao
Cast::Krishna,Jayachitra,Kaikaala Satyanaaraayana,Giribaabu,Gummadi,Prabha,Ramaaprabha,
Alluraamalingayya,Naagesh,Girija,Raadhaakumaari,Raavikondalaraavu,Mamata,Kalpanaaraay^,Kalpana,Vaani.

::::::::: 

ammallaaraa..akkallaaraa..gOngoorakE
anaganaga brahmadEvuDu..gOngoorakE
Enugunu chEyabOyi..gOngoorakE
yaadamarachi manishinichEsE..gOngoorakE
A praaNi bhoommeeda..gOngoorakE
Ediigaaka yaatanapaDE..gOngoorakE

::::1

ammammO aTuchooDu..gOngoorakE
keelugurram kurrODu..gOngoorakE
ki~rru ki~rru mannaaDu..gOngoorakE   
tOlalEka gurraanni..gOngoorakE 
tooli tyooli.....

" jayachitra:: o..o..OOOO..
Emi SreeraamachandraprabhO..ADapillalameediki tOlutunnaav
tama keelugurraaniki..kaneesam brEkulukooDalEvaa?

Krishna::abE..unnaayanDii..kaakapOtE
mee gOngoorapaaTaki kangaarupaDi sariggaa paLLEdu

jayachitra:: alaagaa ayitE kaneesam kaaLLakaina brEkulu paDtaayO lEvO
tappukOnDi paapam"


nOru lEni chinnODu..gOngoorakE
brEkullEni saikilekki..gOngoorakE
neerulEni cheruvukochchi..gOngoorakE
aDugulEni kaDavamunchi..gOngoorakE
neeLLaaDi pOyaaDanTa..gOngoorakE
neeLLaaDi pOyaaDanTa..gOngoorakE

"ahaahaahaahaa..paapam kangaaru paDipOyaadE
ayina seetaa mee inTlO addekunTunnamanishEkadaa
maryaadalEkunDa EdipinchaTamEnaa?

jayachitra::EDipinchadaluchukonTE mana paraa chooDakooDadE
kalipi koTTaDamE..

::::2

" mm huu..seeta seetaa vaaNi vastindE paaTa andukO

ayachitra::ChaCha..A baDaayikOrutO chaturaaDaTam laDaay^kOri techchukonnaaTTE
choostoo unDanDi..EdO kOtalu kOyaDaanikE vastundi 

prabha:: Ey seetaa..ii chiira elaa undE?

jayachitra::E chiiraa???

prabha:: errimohamaa!! nE kaTTukonna chiirE idi japaan^lO tayaaraindi
deeni khareedentO telusaa?...500 vandalu

jayachitra::oLLu baiTa EsukonEdaaniki 500vandalu karchendukE!
chiirakaTTu maanEstE pOlaa!!

prabha:: anTE ii chiiralO oLLu baiTEsukoni tirugutunnaananEgaa 
avunulE gOnebaTTalu kaTTukonE gOngoorOLLaki chiiralanTE Em telustundi
singaaramanTE Em telustundi

jayachitra::Oses..raaNi venukaTiki neelaanTi oka mahaaraaNi EmandOtelusaa
nEnu dEvataavastraalu kaTTukonnaanu..idi puNyaatmulakE tappa paapaatmulaki
kanapaDavanTu digambarangaa voorEgindanTa..hha..alaaundE nee yavvaaram
idigO chooDu baTTalu kaTTukonEdi viluva choopinchukonEdaaniki kaadE
siggu daachukonEdaaniki 

prabha:: anTE??..nEnu siggiDichi tirugutunnaananEgaa nee uddESam  
unDunDu maa naannatO cheppi nee siggu kariginchakapOtE naapEru raaNiyEkaadu ChiChii

jayachitra:: kariginchaavulE...ippuDandukOnDE taaLam"

ammammO tippulaaDi..gOngoorakE
paTnamlO chadivindi..gOngoorakE
palleToorukochchindi..gOngoorakE
sannachiira kaTTindi..gOngoorakE
paapam singaaramanukOni..gOngoorakE
sigganta baiTEse..gOngoorakE
sigganta baiTEse..gOngoorakE
haahaahaahaa 

సావాసగాళ్లు--1977



సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::Boyina Subba Rao
తారాగణం::కృష్ణ,జయచిత్ర,కైకాల సత్యనారాయణ,గిరిబాబు,గుమ్మడి,ప్రభ,రమాప్రభ,అల్లురామలింగయ్య,
నాగేష్,గిరిజ,రాధాకుమారి,రావికొండలరావు,మమత,కల్పనారాయ్,కల్పన,వాణి.

పల్లవి:: 

ఆఆఆఆఆ..ఆనంద మానందమాయెనే
అందాల బొమ్మకు..సిగ్గాయెనే
ఆఆఆఆఆ..ఆనంద మానందమాయెనే
ఆ సిగ్గు నీకెంతో..ముద్దాయెనే
ఆఆఆఆఆ..ఆనంద మానందమాయెనే..ఏఏఏఏ 
అందాల బొమ్మకు..సిగ్గాయెనే 

చరణం::1

ఆకులు రాలే కాలంలో..చిగురులు వేయుట చూచానే
ఆకులు రాలే కాలంలో..చిగురులు వేయుట చూచానే
ఆశ నిరాశైపోయే వేళకు..అందెలమెవరో తెచ్చారే
కొయ్య బొమ్మలు చేసేవాడికి..కుందనం ఎవరో ఇచ్చారే
ఆ కుందనానికి గుండెను పొదిగి..కోరికెలెవరో రేపారే
కోరికెలెవరో...రేపారే

ఆఆఆఆఆ..ఆనంద మానందమాయెనే..ఏఏఏఏ 
అందాల బొమ్మకు..సిగ్గాయెనే
ఆఆఆఆఆ..ఆనంద మానందమాయెనే..ఏఏ
ఆ సిగ్గు నీకెంతో..ముద్దాయెనే

చరణం::2 

వెచ్చవెచ్చని కౌగిలింతకు..కమ్మదనమూ వచ్చేనే
కమ్మకమ్మని కలలూ నేడు..కాళ్లు వచ్చీ నడిచేనే

వెచ్చవెచ్చని కౌగిలింతకు..కమ్మదనమూ వచ్చేనే
కమ్మకమ్మని కలలూ నేడు..కాళ్లు వచ్చీ నడిచేనే

కాళ్లు నాలుగు కలిసినపుడు..కాలమాగిపోవునే
కాళ్లు నాలుగు కలిసినపుడు..కాలమాగిపోవునే

ఆగిపోయిన కాలమునకు..అక్కసెంతో చెప్పలేనే
అక్కసెంతో...చెప్పలేనే

ఆఆఆఆఆ..ఆనంద మానందమాయెనే..ఏఏఏఏ 
అందాల బొమ్మకు..సిగ్గాయెనే
ఆఆఆఆఆ..ఆనంద మానందమాయెనే..ఏఏఏఏ 
ఆ సిగ్గు నీకెంతో..ముద్దాయెనే
ఆ సిగ్గు నీకెంతో..ముద్దాయెనే

Saavaasagaallu--1977
Music::J.V.Raaghavulu
Lyrics::Achaarya Atreya
Singer's::S.P.Baalu,P.Suseela 
Film Directed By::Boyina Subba Rao
Cast::Krishna,Jayachitra,Kaikaala Satyanaaraayana,Giribaabu,Gummadi,Prabha,Ramaaprabha,
Alluraamalingayya,Naagesh,Girija,Raadhaakumaari,Raavikondalaraavu,Mamata,Kalpanaaraay^,Kalpana,Vaani.

::::::::: 

aaaaaaaaaaaaa..aananda maanandamaayenE
andaala bommaku..siggaayenE
aaaaaaaaaaaaa..aananda maanandamaayenE..EEEE
aa siggu neekentO..muddaayenE
aaaaaaaaaaaaa..aananda maanandamaayenE
andaala bommaku..siggaayenE 

::::1

aakulu raalE kaalamlO..chigurulu vEyuTa choochaanE
aakulu raalE kaalamlO..chigurulu vEyuTa choochaanE
aaSa niraaSaipOyE vELaku..andelamevarO techchaarE
koyya bommalu chEsEvaaDiki..kundanam evarO ichchaarE
aa kundanaaniki gunDenu podigi..kOrikelevarO rEpaarE
kOrikelevarO...rEpaarE

aaaaaaaaaaaaa..aananda maanandamaayenE..EEEE
andaala bommaku..siggaayenE
aaaaaaaaaaaaa..aananda maanandamaayenE..EE
aa siggu neekentO..muddaayenE

::::2 

vechchavechchani kaugilintaku..kammadanamoo vachchEnE
kammakammani kalaloo nEDu..kaaLLu vachchee naDichEnE

vechchavechchani kaugilintaku..kammadanamoo vachchEnE
kammakammani kalaloo nEDu..kaaLLu vachchii naDichEnE

kaaLLu naalugu kalisinapuDu..kaalamaagipOvunE
kaaLLu naalugu kalisinapuDu..kaalamaagipOvunE
aagipOyina kaalamunaku..akkasentO cheppalEnE
akkasentO...cheppalEnE

aaaaaaaaaaaaa..aananda maanandamaayenE..EEEE
andaala bommaku..siggaayenE
aaaaaaaaaaaaa..aananda maanandamaayenE..EE
aa siggu neekentO..muddaayenE
aa siggu neekentO..muddaayenE

Tuesday, November 25, 2014

కక్ష--1980....




సంగీతం::చక్రవర్తి 
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.C.Guha Naadan 
తారాగణం::శోభన్‌బాబు,మురళిమోహన్,గుమ్మడి,అల్లురామలింగయ్య,కైకాల సత్యనరాయణ,మోహన్‌బాబు,జయచిత్ర,శ్రీదేవి,జమున.

పల్లవి::

కందిరీగ తో చెప్పాను రా
కోడెగాడు బుగ్గ ఈడు కుట్టొద్దని
కుట్టినా ఎవరికీ చెప్పొద్దూ అని
గోల చెయ్యొద్దని గొడవ చెయ్యొద్దని 
దొంగ చాటుగా వస్తానులే
బుగ్గ మీద కాటేసి పోతానులే 
అడిగితే చెప్పుకో కందిరీగ అని
కాటు వేసిందని బుగ్గ వచ్చిందని

కందిరీగ తో చెప్పాను రా
దొంగ చాటుగా వస్తాను రా

చరణం::1

ఉండుండి గుండె దడ దడ మంటోంది రా
ఆగాగి వయసు పెట పెట మంటోంది రా 
ఉండుండి గుండె దడ దడ మంటోంది
ఆగాగి వయసు పెట పెట మంటోంది
దాన్ని ఆపేది ఎట్టా ... దీన్ని అణిచేది ఎట్టా..2
ఊగూగి మనసు రెప రెప మంటున్నదే
ఉత్తిత్తినే ఒళ్ళు చిమ చిమ లాడింది లే 
ఊగూగి మనసు రెప రెప మంటుందే
ఉత్తిత్తినే ఒళ్ళు చిమ చిమ లాడింది 
దాన్ని తీర్చేది ఎట్టా..దీన్ని అర్చేది ఎట్టా
కందిరీగ తో చెప్పాను రా

చరణం::2

కళ్ళల్లో నీకు ఇల్లు ఒకటి కట్టాను రా
ఒళ్ళంతా కళ్లుగా నిన్ను ఎదురుచూశాను రా 
కళ్ళల్లో నీకు ఇల్లు ఒకటి కట్టాను
ఒళ్ళంతా కళ్లుగా నిన్ను ఎదురుచూశాను రా
అద్దె ఇవ్వొద్దు నువ్వు..పొద్దుకో ముద్దు ఇవ్వు..2
పొద్దుకో ముద్దని పద్దెవరు రాస్తారు లే
వద్దన్నకొద్దీ ముద్దెక్కువ అవుతుందిలే..2
నీకు నెల తప్పకుండ..అద్దె నేనిచ్చుకుంటా
కందిరీగ తో చెప్పాను రా

Kaksha--1980 
Mc::Chakravarti 
Lyrics::Achaarya-Atreya 
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::V.C.Guha Naadan 
Cast::SobhanBaabu,Muralimohan,Gummadi,Alluraamalingayya,Kaikaala Satyanaraayana,MohanBaabu,Jayachitra,Sreedevi,Jamuna.

:::::::::::::::::::::

kandireega tO cheppaanu raa
kODegaaDu bugga iiDu kuTToddani
kuTTinaa evarikii cheppoddoo ani
gOla cheyyoddani goDava cheyyoddani 
donga chaaTugaa vastaanulE
bugga meeda kaaTEsi pOtaanulE 
aDigitE cheppukO kandireega ani
kaaTu vEsindani bugga vachchindani

kandireega tO cheppaanu raa
donga chaaTugaa vastaanu raa

::::1

unDunDi gunDe daDa daDa manTOndi raa
aagaagi vayasu peTa peTa manTOndi raa 
unDunDi gunDe daDa daDa manTOndi
aagaagi vayasu peTa peTa manTOndi
daanni aapEdi eTTaa..deenni aNichEdi eTTaa..2

Ugoogi manasu repa repa manTunnadE
uttittinE oLLu chima chima laaDindi lE 

Ugoogi manasu repa repa manTundE
uttittinE oLLu chima chima laaDindi 
daanni teerchEdi eTTaa..deenni archEdi eTTaa
kandireega tO cheppaanu raa

::::2

kaLLallO neeku illu okaTi kaTTaanu raa
oLLantaa kaLlugaa ninnu eduruchooSaanu raa 
kaLLallO neeku illu okaTi kaTTaanu

oLLantaa kaLlugaa ninnu eduruchooSaanu raa
adde ivvoddu nuvvu..poddukO muddu ivvu..2
poddukO muddani paddevaru raastaaru lE
vaddannakoddii muddekkuva avutundilE..2
neeku nela tappakunDa..adde nEnichchukunTaa
kandireega tO cheppaanu raa

పసుపు పారాణి--1980




సంగీతం::రమేశ్ నాయుడు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,పండరీబాయి,రమాప్రభ,నిర్మల.

పల్లవి::

ఆ ముద్దబంతులు.. ఊఊఊఊ
ఆ ముద్దబంతులు పసుపు రాశులు 
పోసే వాకిళ్ల ముందు
ఆ ముద్దమందారు పారాణి 
దిగ బోసే లోగిళ్ల సందు
పసుపు పారాణితో పెళ్ళి జరిగేను
పసుపు పారాణితో పెళ్ళి జరిగేను
ఏడడుగులేసేను..ఏకమైయ్యేను 

ఆ ముద్దబంతులు పసుపు రాశులు 
పోసే వాకిళ్ల ముందు
ఆ ముద్దమందారు పారాణి 
దిగ బోసే లోగిళ్ల సందు

చరణం::1

తంగేడు పూలల్లే..పసుపు పూయాలి..ఈ..ఆ
తామర రేకల్లే..పారాణి రాయాలి
తంగేడు పూలల్లే..పసుపు పూయాలి
తామర రేకల్లే..పారాణి రాయాలి

పసుపు సున్నము..కలిపి పారాణి ఆయే
పసుపు సున్నము..కలిపి పారాణి ఆయే
పసుపు పారాణితో..ఇల్లాలు ఆయే

ఆ ముద్దబంతులు పసుపు రాశులు 
పోసే వాకిళ్ల..ముందు
ఆ ముద్దమందారు పారాణి 
దిగ బోసే..లోగిళ్ల సందు 

చరణం::2

ఉదయాన సూరీడు పసుపు పండించే..ఏఏఏ..ఆ..ఆ
అస్తమించే వేళ పారాణి పొంగించె..ఆ..ఆ
ఉదయాన సూరీడు పసుపు పండించే..ఆ..ఆ
అస్తమించే వేళ పారాణి పొంగించె..ఆ..ఆ

గడపలకు నిత్యమూ..పసుపు పారాణే
గడపలకు నిత్యమూ..పసుపు పారాణే
కాళ్ళకు పెళ్ళికే..పసుపు పారాణి

ఆ ముద్దబంతులు పసుపు రాశులు 
పోసే వాకిళ్ల ముందు
ఆ ముద్దమందారు..పారాణి 
దిగ బోసే లోగిళ్ల సందు

Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::P.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,Alluraamalingayya,Sujaata,nirmala,Ramaaprabha.

:::::::::::::::::::::::::::::::::::::::::::::

aa muddabantulu 
aa muddabantulu pasupu raaSulu 
pOsae vaakiLla mundu
aa muddamandaaru paaraaNi 
diga bOsE lOgiLla sandu
pasupu paaraaNitO peLLi jarigEnu
pasupu paaraaNitO peLLi jarigEnu
EDaDugulEsEnu..EkamaiyyEnu 

aa muddabantulu pasupu raaSulu 
pOsE vaakiLla mundu
aa muddamandaaru paaraaNi 
diga bOsE lOgiLla sandu

::::1

tangEDu poolallE..pasupu pooyaali
taamara rEkallE..paaraaNi raayaali
tangEDu poolallE..pasupu pooyaali
taamara rEkallE..paaraaNi raayaali

pasupu sunnamu..kalipi paaraaNaayE
pasupu sunnamu..kalipi paaraaNaayE
pasupu paaraaNitO..illaalu aayE

aa muddabantulu pasupu raaSulu 
pOsE vaakiLla..mundu
aa muddamandaaru paaraaNi 
diga bOsE..lOgiLla sandu 

::::2

udayaana sooreeDu pasupu panDinche..EEE..aa..aa
astaminchE vELa paaraaNi ponginche..aa..aa
udayaana sooreeDu pasupu panDinche..aa..aa
astaminchE vELa paaraaNi ponginche..aa..aa

gaDapalaku nityamuu..pasupu paaraaNE
gaDapalaku nityamuu..pasupu paaraaNE
kaaLLaku peLLikE..pasupu paaraaNi

aa muddabantulu pasupu raaSulu 
pOsE vaakiLla mundu
aa muddamandaaru..paaraaNi 
diga bOsE lOgiLla sandu

ప్రేమనగర్--1971























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, సత్యనారాయణ, గుమ్మడి, శాంతకుమారి, రాజబాబు

పల్లవి::

ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల వున్నావంటే..చూడకుండా ప్రాణ ముండదురా..ఆ  
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా 

చరణం::1

కూలికెళ్తే నాకే రారా..చేను వున్నాది
కూడు తింటే నాతో తినరా..తోడువుంటాది
కూలికెళ్తే నాకే రారా..చేను వున్నాది 
కూడు తింటే నాతో తినరా..తోడువుంటాది
ఇంకేడకైనా ఎల్లావంటే..ఏఏఏ..ఇంకేడకైనా ఎల్లావంటే 
నాది చుప్పనాతి మనసు..అది నీకు తెలుసు 
నాది చుప్పనాతి మనసు..అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా

చరణం::2
        
ఊరినిండా వయసు పిల్లలు..ఒంటిగున్నారు
వాటమైనవాడ్ని చూస్తే..వదలనంటారు
ఊరినిండా వయసు పిల్లలు..ఒంటిగున్నారు 
వాటమైనవాడ్ని చూస్తే..వదలనంటారు
నీ శపలబుద్ది సూపావంటే..ఏఏఏ.. 
మనిషి నాకు దక్కవింక..మంచిదాన్ని కాను ఆనక  
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా

 చరణం::3
    
పగటిపూట పనిలో పడితే..పలకనంటావు 
రాతిరేళ రహస్యంగా..రాను జడిసేవు 
పగటిపూట పనిలో పడితే..పలకనంటావు  
రాతిరేళ రహస్యంగా..రాను జడిసేవు 
నే తెల్లవార్లు మేలుకుంటే..నే తెల్లవార్లు మేలుకుంటే  
ఎఱ్ఱబడ్డ కళ్ళుచూసి..ఏమేమో అనుకొని 
ఎఱ్ఱబడ్డ కళ్ళుచూసి..ఏమేమో అనుకొని 
ఈది ఈది..కుళ్ళుకుంటాది       
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా 
చుట్టుపక్కల వున్నావంటే..చూడకుండా ప్రాణ ముండదురా..ఆ 
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా

Monday, November 24, 2014

బెబ్బులి--1980




సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
తారాగణం::కృష్ణంరాజు,ప్రభాకర్ రెడ్డి,జగ్గయ్య,సుజాత,జ్యోతిలక్ష్మి. 

పల్లవి::

కంచిపట్టు చీరలోనా..పొంచి పొంచి ఉన్న అందాలు
ఎంచి ఎంచి చూసుకోనా..ఏడు మల్లెలెత్తుదానా
ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా

కొండ చాటు కోన చూసి..కొంగు పట్టనా
గుండె చాటు కోరికుంది..విప్పి చెప్పనా

కంబమెట్టు చెరువు కాదా..కొమ్ము దూసి బేరాలు
ఆపరోయి సందకాడా..ఆరు ఊళ్ళ అందగాడా
ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా

రేపటేల కంటి మీద..రెప్ప కొట్టనా 
రెప్పమాటు చూపు మాట..విప్పి చెప్పనా

కంచిపట్టు చీరలోనా..పొంచి పొంచి ఉన్న అందాలు
ఎంచి ఎంచి చూసుకోనా..ఏడు మల్లెలెత్తుదానా 
ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా

చరణం::1

ఆ చీరంచు చూస్తుంటే..అల్లాడిమల్లాడి పోతుంటే
అది జీరాడి పారాడి..అవ్వాయి చువ్వాయి లొతుంటే

ఆ చీరంచు చూస్తుంటే..అల్లాడిమల్లాడి పోతుంటే
అది జీరాడి పారాడి..అవ్వాయి చువ్వాయి లొతుంటే

అర్ధరాతిరా నిద్దరుండదు..వద్ద చేరితే వయసు నిలవదు
కట్టుజారు పట్టు చీర..కట్టు చూడు బెట్టు చూడు
పట్టుకుంటే కందిపోనా

అరేరేరేరేరే..కంచిపట్టు చీరలోనా..ఆ
పొంచి పొంచి ఉన్న..అందాలు,,ఊ
ఎంచి ఎంచి చూసుకోనా..ఏడు మల్లెలెత్తుదానా..ఆ
ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా

చరణం::2

ఆ నూనూగు మీసాలు..నూరాడు రోసాలు చూస్తుంటే
అహ..నీ ఈడు జోడెక్కి..నా గుండె గూడెక్కి కూసుంటే

ఆ నూనూగు మీసాలు..నూరాడు రోసాలు చూస్తుంటే
అహ..నీ ఈడు జోడెక్కి..నా గుండె గూడెక్కి కూసుంటే

చుక్కలొచ్చినా వెన్నెలుండదు..వెన్నెలొచ్చినా చుక్క దక్కదు
పట్టుమాని బెట్టు తీసి..గట్టు మీద పెట్టకుంటే
నిన్నిడిసి పెడతానా

అరెరెరెరె..కంబమెట్టు చెరువు కాడా..కొమ్ము దూసి బేరాలు 
ఆపరోయి సందకాడా..ఆరు ఊళ్ళ అందగాడా..ఆ
ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా

కొండ చాటు కోన చూసి..కొంగు పట్టనా
రెప్పమాటు చూపు మాట..విప్పి చెప్పనా..హేయ్ 

కంచిపట్టు చీరలోనా..పొంచి పొంచి ఉన్న అందాలు
ఆపరోయి సందకాడా..ఆరు ఊళ్ళ అందగాడా
ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా

Bebbuli--1980
Music::J.V.Raaghavulu 
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.Baalu.P.Suseela
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::Krishnaraaju,Prabhakar Reddi,Jaggayya,Sujaata,Jyotilakshmi.

:::::::::::::::::::::::::::::::::::::

kanchipaTTu cheeralOnaa..ponchi ponchi unna andaalu
enchi enchi choosukOnaa..EDu mallelettudaanaa
aa..aa..aa..EDu mallelettudaanaa

konDa chaaTu kOna choosi..kongu paTTanaa
gunDe chaaTu kOrikundi..vippi cheppanaa

kambameTTu cheruvu kaadaa..kommu doosi bEraalu
aaparOyi sandakaaDaa..aaru ULLa andagaaDaa
aa..aa..aa..Aru ULLa andagaaDaa

rEpaTEla kanTi meeda..reppa koTTanaa 
reppamaaTu choopu maaTa..vippi cheppanaa

kanchipaTTu cheeralOnaa..ponchi ponchi unna andaalu
enchi enchi choosukOnaa..EDu mallelettudaanaa 
aa..aa..aa..EDu mallelettudaanaa

::::1

A cheeranchu choostunTE..allaaDimallaaDi pOtunTE
adi jeeraaDi paaraaDi..avvaayi chuvvaayi lotunTE

A cheeranchu choostunTE..allaaDimallaaDi pOtunTE
adi jeeraaDi paaraaDi..avvaayi chuvvaayi lotunTE

ardharaatiraa niddarunDadu..vadda chEritE vayasu nilavadu
kaTTujaaru paTTu cheera..kaTTu chooDu beTTu chooDu
paTTukunTE kandipOnaa

arErErErErE..kanchipaTTu cheeralOnaa..aa
ponchi ponchi unna..andaalu,,uu
enchi enchi choosukOnaa..EDu mallelettudaanaa..aa
aa..aa..aa..EDu mallelettudaanaa

::::2

A noonoogu meesaalu..nooraaDu rOsaalu choostunTE
aha..nii iiDu jODekki..naa gunDe gooDekki koosunTE

A noonoogu meesaalu..nooraaDu rOsaalu choostunTE
aha..nii iiDu jODekki..naa gunDe gooDekki koosunTE

chukkalochchinaa vennelunDadu..vennelochchinaa chukka dakkadu
paTTumaani beTTu teesi..gaTTu meeda peTTakunTE
ninniDisi peDataanaa

arererere..kanbameTTu cheruvu kaaDaa..kommu doosi bEraalu 
aaparOyi sandakaaDaa..Aru ULLa andagaaDaa..aa
aa..aa..aa..Aru ULLa andagaaDaa

konDa chaaTu kOna choosi..kongu paTTanaa
reppamaaTu choopu maaTa..vippi cheppanaa..hEy 

kanchipaTTu cheeralOnaa..ponchi ponchi unna andaalu
aaparOyi sandakaaDaa..Aru ULLa andagaaDaa
aa..aa..aa..Aru ULLa andagaaDaa

భార్యామణి--1984


సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం 
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::Vijayabaapaneedu
తారాగణం::శోభన్‌బాబు,గొల్లపూడి,నూతన్‌ప్రసాద్,గిరిబాబు,రమాప్రభ,జయసుధ.

పల్లవి::

సీతమ్మ నోచింది చిత్రాల నోము..ఆ..ఆ..ఆ
రామయ్య చేశాడు చిగురాకు పూజా..మ్మ్..మ్మ్

సీతమ్మ నోచింది చిత్రాల నోము..ఆ..ఆ..
రామయ్య చేశాడు చిగురాకు పూజా..మ్మ్..మ్మ్ 

సీతమ్మ నోచింది..చిత్రాల నోము
రామయ్య చేశాడు..చిగురాకు పూజా
సిరులున్న వాకిట..సీతమ్మ నిలిచే
సీతమ్మ సిగ్గులే..మొగ్గలై వెలసే
సీత ఇంటికి చాలు..రామ వాకిళ్లు
రాముడొస్తే ఎరుపు..సీత చెక్కిళ్లు

సీతమ్మ నోచింది చిత్రాల నోము..ఆ..ఆ..ఆ
రామయ్య చేశాడు చిగురాకు పూజా..మ్మ్..మ్మ్..మ్మ్

చరణం::1

నిదుర లేచే వేళ..ఉదయమాలక్ష్మి
జలకమాడే వేళ..జాహ్నవి దేవి
ఎదుటనున్నా ఓర్పు..ముద్ద మందారం
గృహలక్ష్మి దిద్దితే..కనక సింధూరం

నిదుర లేచే వేళ..ఉదయమాలక్ష్మి
జలకమాడే వేళ..జాహ్నవి దేవి
ఎదుటనున్నా ఓర్పు..ముద్ద మందారం
గృహలక్ష్మి దిద్దితే..కనక సింధూరం 

ఎదురు వస్తే చాలు..ఎదురులేరంట
మురిసి చూసే కన్ను..నిదురపోదంట

ఎదురు వస్తే చాలు..ఎదురులేరంట
మురిసి చూసే కన్ను..నిదురపోదంట

సీత మెట్టిన ఇల్లు..సిరికి నట్టిల్లు
ఆ హరికి పుట్టిల్లు..అవని హరివిల్లు  

సీతమ్మ నోచింది చిత్రాల నోము..ఆ..ఆ..ఆ
రామయ్య చేశాడు చిగురాకు పూజా..మ్మ్..మ్మ్..మ్మ్ 

చరణం::2

అన్నపూర్ణా దేవి..అందాల భరిణా
ఆ కంట చూడాలి..అమ్మలా కరుణా
వంటపనితో తాను..అలిసేది కొంత
ఇంటి పనితో తాను..సొలిసేది సుంత

అన్నపూర్ణా దేవి..అందాల భరిణా
ఆ కంట చూడాలి..అమ్మలా కరుణా
వంటపనితో తాను..అలిసేది కొంత
ఇంటి పనితో తాను..సొలిసేది సుంత

వయ్యారమున తాను..భూజాత పాటి
ఓర్పులోనా తాను..భూమాత సాటి

వయ్యారమున తాను..భూజాత పాటి
ఓర్పులోనా తాను..భూమాత సాటి 

లేమి అన్నది లేదు..నడుముకే కానీ
కాలు పెడితే కలిమి..కనకమాలక్ష్మి 

సీతమ్మ నోచింది చిత్రాల నోము..ఆ..ఆ..ఆ
రామయ్య చేశాడు చిగురాకు పూజా..మ్మ్..మ్మ్..మ్మ్

Bharyaamani--1984
Music::S..Baalasubramanyam
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.Jaanaki,S,P,Baalu
Film Directed By::Vijayabaapineedu
Cast::Sobhanbabu,Gollapoodi,Nootanprasaad,Giribaabu,Ramaaprabha,Jayasudha.

::::::::::::::::::::::::::::::::::

seetamma nOchindi chitraala nOmu..aa..aa..aa
raamayya chESaaDu chiguraaku poojaa..mm..mm

seetamma nOchindi chitraala nOmu..aa..aa..
raamayya chESaaDu chiguraaku poojaa..mm..mm 

seetamma nOchindi..chitraala nOmu
raamayya chESaaDu..chiguraaku poojaa
sirulunna vaakiTa..seetamma nilichE
seetamma siggulE..moggalai velasE
seeta inTiki chaalu..raama vaakiLlu
raamuDostE erupu..seeta chekkiLlu

seetamma nOchindi chitraala nOmu..aa..aa..aa
raamayya chESaaDu chiguraaku poojaa..mm..mm..mm

::::1

nidura lEchE vELa..udayamaalakshmi
jalakamaaDE vELa..jaahnavi dEvi
eduTanunnaa Orpu..mudda mandaaram
gRhalakshmi didditE..kanaka sindhooram

nidura lEchE vELa..udayamaalakshmi
jalakamaaDE vELa..jaahnavi dEvi
eduTanunnaa Orpu..mudda mandaaram
gRhalakshmi didditE..kanaka sindhooram

eduru vastE chaalu..edurulEranTa
murisi choosE kannu..nidurapOdanTa

eduru vastE chaalu..edurulEranTa
murisi choosE kannu..nidurapOdanTa

seeta meTTina illu..siriki naTTillu
aa hariki puTTillu..avani harivillu  

seetamma nOchindi chitraala nOmu..aa..aa..aa
raamayya chESaaDu chiguraaku poojaa..mm..mm..mm 

::::2

annapoorNaa dEvi..andaala bhariNaa
aa kanTa chooDaali..ammalaa karuNaa
vanTapanitO taanu..alisEdi konta
inTi panitO taanu..solisEdi sunta

annapoorNaa dEvi..andaala bhariNaa
aa kanTa chooDaali..ammalaa karuNaa
vanTapanitO taanu..alisEdi konta
inTi panitO taanu..solisEdi sunta

vayyaaramuna taanu..bhoojaata paaTi
OrpulOnaa taanu..bhoomaata saaTi

vayyaaramuna taanu..bhoojaata paaTi
OrpulOnaa taanu..bhoomaata saaTi 

lEmi annadi lEdu..naDumukE kaanii
kaalu peDitE kalimi..kanakamaalakshmi 

seetamma nOchindi chitraala nOmu..aa..aa..aa
raamayya chESaaDu chiguraaku poojaa..mm..mm..mm

పూజ--1975::మారుబిహాగ్::రాగం


















సంగీతం::రాజన్-నాగేద్ర
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,వాణిశ్రీ, సావిత్రి,కాంతారావు, సూర్యకాంతం,మిక్కిలినేని, రేలంగి

మారుబిహాగ్::రాగం
(హిందుస్తాని కర్నాటక )

పల్లవి::

మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయ వీణ..తిరిగి పాట పాడునా    
మనసులోని మమతల..మాసిపోయి కుములు వేళా
మిగిలింది..ఆవేదనా    
మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా

చరణం::1

నిప్పు రగిలి రేగు జ్వాల..నీళ్ల వలన ఆరునూ
నీళ్లలోనే జ్వాల రేగ..మంట ఎటుల ఆరునూ 
నీళ్లలోనే జ్వాల రేగ..మంట ఎటుల ఆరునూ
మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా 
మనసులోని మమతలన్నీ..మాసిపోయి కుములు వేళా
మిగిలింది..ఆవేదనా    
తీగ తెగిన హృదయ వీణ..తిరిగి పాట పాడునా    

చరణం::2

కడలిలోన ముసుగు వేళ..పడవ మనకు తోడురా 
పడవ సుడిని మునుగు వేళ..ఎవరు మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ..ఎవరు మనకు తోడురా
ఆటగాని కోరికేమో..తెలియలేని జీవులం
జీవితాల ఆటలోన..మనమంతా పాపులం

Saturday, November 22, 2014

శభాష్ వదినా--1972


















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి (sunitha)
తారాగణం::హరనాద్,K.R. విజయ,కృష్ణంరాజు, రాజబాబు,అనిత,రమాప్రభ,మాలతి.

పల్లవి::

వెచ్చ వెచ్చని..నీ ఒడిలో
కమ్మ కమ్మని..కధలెన్నో 
చెప్పుకుందమా..హ్హా..హ్హా
నిన్న మొన్నటి..కలలన్నీ
నేటినుంచీ నిజం..చేసి 
చూసుకుందామా..హో..హా..ఆ       

నిన్న మొన్నటి..కలలన్నీ..ఈ
నేటి నుంచీ నిజం..చేసి..ఈ 
చూసుకుందామా..హా..హా..హా..

చరణం ::1

నీ మాట ఏదో మత్తుజల్లి..మనసునే గమ్మత్తు చేసింది
ఆఆ..నీ చూపు నన్ను చుట్టు ముట్టి సోయగంతో కట్టివేసింది
కన్నెపిల్ల కట్టుబాటు..కౌగిలింతలో సడలిపోయింది
సడలిపోని రాగబంధం చల్లచల్లగ అల్లుకుంటుంది             

వెచ్చ వెచ్చని..నీ ఒడిలో..హ్హా
కమ్మ కమ్మని..కధలెన్నో 
చెప్పుకుందమా..హ్హా..హ్హా
హ్హా..నిన్న మొన్నటి..కలలన్నీ
నేటినుంచీ నిజం..చేసి..ఈ 
చూసుకుందామా..హో..హా..ఆ 

చరణం::2

నీ నీలికురుల వాలుజడలో..మల్లెపూవై వూయలూగాలి
నీ చిలిపినవ్వుల వెన్నెలందు..కలువనై నే పులకరించాలి
పడుచుదనం పందెమెట్టి..వలపుజూదం ఆడుకోవాలి
నాకునువ్వు నీకునేను..రోజురోజూ ఓడిపోవాలి  

హాయ్..వెచ్చ వెచ్చని..నీ ఒడిలో..హ్హా
కమ్మ కమ్మని..కధలెన్నో 
చెప్పుకుందమా..హ్హా..హ్హా
హ్హా..నిన్న మొన్నటి..కలలన్నీ
నేటినుంచీ నిజం..చేసి 
చూసుకుందామా..హో..హో..లాలలాలలా 
హ్హా..హ్హా..లాలలాలలా..