సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::ఘంటసాల,P.సుశీల
పల్లవి::
ప్రియురాల సిగ్గేలనే.ఏ..ఏ...ప్రియురాల సిగ్గేలనే
నీ మనసేలు మగవాని చేరి
ప్రియురాల సిగ్గేలనే
నాలోన ఊహించినా..నాలోన ఊహించినా
కలలీ నాడు ఫలియించె స్వామి..ఈ..నాలోన ఊహించినా
చరణం::1
ఏమి ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నెరిపినావు

మనసుదీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే
ప్రియురాల సిగ్గేలనే.ఏ..ఏ...ప్రియురాల సిగ్గేలనే
చరణం::2
ప్రేమలు తెలిసిన దేవుడవని విని నా మదిలోనా కొలిచితిని

స్వామివి నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని
నాలోన ఊహించినా..నాలోన ఊహించినా
కలలీ నాడు ఫలియించె స్వామి..ఈ..నాలోన ఊహించినా
చరణం::3
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా

ఇప్పుడేమన్నా ఒప్పనులే ఇక ఎవరేమన్నా తప్పదులే