Monday, June 29, 2015

టైగర్--1979




సంగీతం::చెళ్ళపిళ్ళి సత్యం 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::Nandamoori Ramesh 
తారాగణం::N.T.R,రజనికాంత్,గుమ్మడి,సత్యనారాయణ,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,సారథి,సాక్షిరంగారావు,అంజలిదేవి,అన్నపూర్ణ,జయమాలిని,విజయలక్ష్మీ,రాధ,
సాలుజ,శుభాషిణి.

పల్లవి::

హ్హో..ఓఓఓ..ఏం దెబ్బతీసావు..ఏం ఎత్తు వేసావు
ఏం మాయచేసావబ్బీ..ఈ..నీ కన్నుల పిలుపు చూస్తూఉంటే  
కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది..కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది   

అహా..ఏం బాగా ఉన్నావు..ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..ఈ..నీ ఒంపులు సొంపులు చూస్తూఉంటే  
ఒకలాగున్నది..మతిపోతున్నది..అబ్భా..ఒకలాగున్నది..మతిపోతున్నది 

చరణం::1

అఓఓఓ..ఉరికేటి ఓ కొండవాగు..ఒక కొంతసేపైన ఆగు
ఆ ఊపు తగ్గించుకొంటే..ఏఏఏ..నీ ఒంటికి బాగు బాగు

నాదేమో నునుపైన సొగసు..నీదేమో కరుకరుకున్న వయసు 
నీతోటి సరితూగకుంటే..ఏఏఏ..నీరౌను నా బేలమనసు

అహ్హా..అహా..ఏం బాగా ఉన్నావు..ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..ఈ..

నీ కన్నుల పిలుపు చూస్తూఉంటే  
కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది..కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది 

చరణం::2

నీకుంది పదునైన పొగరు..లేదెవరు నీకింక ఎదురు 
నిను తలచుకుంటేనే చాలు..ఊఊఊ..గుండెల్లో ఒక తీపి అదురూ 

అరే..పడబోకు నావెంట వెంటా..ఉడికించకు ఓరకంటా..ఆ
పైటల్లె నను చూసుకుంటే..ఏఏఏ..పదిలంగ నీతోనే ఉంటా..ఆ

అహా..ఏం దెబ్బతీసావు..ఏం ఎత్తు వేసావు
ఏం మాయచేసావబ్బీ..ఈ..అహ్హా..
నీ కన్నుల పిలుపు చూస్తూఉంటే  
కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది..కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది  

ఏం బాగా ఉన్నావు..ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..ఈ..ఆహా
నీ ఒంపులు సొంపులు చూస్తూఉంటే  
ఒకలాగున్నది..మతిపోతున్నది..అబ్భా..ఒకలాగున్నది..మతిపోతున్నది 

Taigar--1979
Music::T.Challapilli Satyam
Lyrics::D.C.NarayanaReddi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Nandamoori Ramesh
Cast::N.T.R.Rajanikaanth,Gummadi,PrabhaakarReddi,SatyanaaraayaNa,Alluraamalingayya,Saarathi,SaakshiRangaaRao,Raadha,Saluja,Anjalidevi,Jayamaalini,Annapoorna,Subhaashini.

:::::::::::::::::::::::::::

hhO..OOO..Em debbateesaavu..Em ettu vEsaavu
Em maayachEsaavabbii..ii..nee kannula pilupu choostoounTE  
kalagaa unnadi..ulukEstunnaadi..kalagaa unnadi..ulukEstunnaadi   

ahaa..Em baagaa unnaavu..Em muddugunnaavu
Em chooputunnaavammii..ii..nee ompulu sompulu choostoounTE  
okalaagunnadi..matipOtunnadi..abbhaa..okalaagunnadi..matipOtunnadi 

::::1

aOOO..urikETi O konDavaagu..oka kontasEpaina Agu
A Upu tagginchukonTE..EEE..nee onTiki baagu baagu

naadEmO nunupaina sogasu..needEmO karukarukunna vayasu 
neetOTi saritoogakunTE..EEE..neerounu naa bElamanasu

ahhaa..ahaa..Em baagaa unnaavu..Em muddugunnaavu
Em chooputunnaavammii..ii..

nee kannula pilupu choostoounTE  
kalagaa unnadi..ulukEstunnaadi..kalagaa unnadi..ulukEstunnaadi 

::::2

neekundi padunaina pogaru..lEdevaru neekinka eduru 
ninu talachukunTEnE chaalu..UUU..gunDellO oka teepi aduruu 

arE..paDabOku naavenTa venTaa..uDikinchaku OrakanTaa..aa
paiTalle nanu choosukunTE..EEE..padilanga neetOnE unTaa..aa

ahaa..Em debbateesaavu..Em ettu vEsaavu
Em maayachEsaavabbii..ii..ahhaa..
nee kannula pilupu choostoounTE  
kalagaa unnadi..ulukEstunnaadi..kalagaa unnadi..ulukEstunnaadi  

Em baagaa unnaavu..Em muddugunnaavu
Em chooputunnaavammii..ii..aahaa
nee ompulu sompulu choostoounTE  
okalaagunnadi..matipOtunnadi..abbhaa..okalaagunnadi..matipOtunnadi

కన్నవారి కలలు--1974



సంగీతం::V. కుమార్
రచన::రాజశ్రీ 
గానం::P.సుశీల 
తారగణం::శోభన్‌బాబు,రామకృష్ణ,ప్రభాకరరెడ్డి,వాణిశ్రీ,లత,గీతాంజలి,గుమ్మడి

పల్లవి::

బాబూ..చిన్నారి బాబూ 
బాబూ..చిన్నారి బాబూ
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను  
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను
బాబూ చిన్నారి బాబూ

చరణం::1

మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా 
మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా
అతడు లేని నా బ్రతుకే చీకటిరా
ఆ చీకటిలో నీ నవ్వే దీపికరా 
బాబూ..చిన్నారి బాబూ

చరణం::2

అమ్మా అని ఒక్కసారి నువ్వంటే
నా అణువణువున ఆనంద గోదావరి  
అమ్మా అని ఒక్కసారి నువ్వంటే
నా అణువణువున ఆనంద గోదావరి
నాన్నేడని ముందు ముందు అడిగితే
నా గుండెల్లో కన్నీటి కావేరి 
బాబూ..చిన్నారి బాబూ

చరణం::3

నెలవంకలా నీవు పెరగాలి
నా కలలన్నీ నీ కళలై వెలగాలి  
నెలవంకలా నీవు పెరగాలి
నా కలలన్నీ నీ కళలై వెలగాలి
ఆ వెలుగే నా కంటి వెలుగు కావాలి
అది చూసి మీ నాన్న మురిసి పోవాలి  

బాబూ..చిన్నారి బాబూ         
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను 
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను
బాబూ చిన్నారి బాబూ

Sunday, June 28, 2015

ఎం.ఎల్.ఏ--1957



సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు  
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,S.జానకి
తారాగణం::జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,గిరిజ,రమణమూర్తి,పెరుమాళ్ళు,నాగభుషణం

పల్లవి::

నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా

నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా

చరణం::1

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
తలచినది ఒకటైతే
జరిగినది వేరొకటి
తలచినది ఒకటైతే
జరిగినది వేరొకటి
చితికినది నీ మనసు
అతుకుటకూ..లేరెవరూ 

నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా

చరణం::2

గుండెలలో..గునపాలే
గుచ్చరే నీవాళ్ళు
గుండెలలో..గునపాలే
గుచ్చరే నీవాళ్ళు
కన్నులలో..గోదారి
కాలువలే కట్టినది

నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా

M.L.A--1957
Music::Pendyala NaagaeSvararaavu  
Lyrics::Arudra
Singer's::Ghantasaala,S.Janaki
Cast::Jaggayya,Gummadi,Saavitri,Girija,Ramanamoorti,Perumaallu,Naagabhushanam

::::

nee ASa aDiyaasa
cheyijaarE maNipoosa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa

nee ASa aDiyaasa
cheyijaarE maNipoosa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa

:::1

O O O O O O O O O O
talachinadi okaTaitE
jariginadi vErokaTi
talachinadi okaTaitE
jariginadi vErokaTi
chitikinadi nee manasu
atukuTakuu..lErevaroo 

nee ASa aDiyaasa
cheyijaarE maNipoosa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa

:::2

gunDelalO..gunapaalE
guchcharE neevaaLLu
gunDelalO..gunapaalE
guchcharE neevaaLLu
kannulalO..gOdaari
kaaluvalE kaTTinadi

nee ASa aDiyaasa
cheyijaarE maNipoosa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa
bratukantaa amavaasa
lambaaDOLLa raamdaasaa

ఎం.ఎల్.ఏ--1957



సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు  
రచన::ఆరుద్ర
గానం::P. సుశీల,మాధవపెద్ది సత్యం, బృందం
తారాగణం::జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,గిరిజ,రమణమూర్తి,పెరుమాళ్ళు,నాగభుషణం.

పల్లవి::

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

నిరంతరం మా హృదంతరంలో 
నిండి వెలుగుజ్యోతి..ఈ
నిత్యసత్యకాంతి..ఈ

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

చరణం::1

ధర్మదేవత..నాల్గుపాదములు 
బ్రహ్మదేవుని..నాల్గువేదములు
ధర్మభూమిలో..మరల నిలిపి..ఈ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ధర్మభూమిలో..మరల నిలిపి..ఈ
నిర్మల బోధలు..చేసిన బాపూ..ఊఊఊఊ

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

చరణం::2

నీవు తీసిన..బాటలు దాటి 
నీతిని విడచి..నిన్నే మరచి 
నీవు తీసిన..బాటలు దాటి 
నీతిని విడచి..నిన్నే మరచి
నీ అనుచరులే మారెదరేమో
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
నీ అనుచరులే మారెదరేమో
నిదురనుండి లేపూ..బాపూ..ఊఊఊ

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు

చరణం::3

ఆశయాలకై..అశువుల బాసిన 
అమరమూర్తివయ్యా..నీవు 
ఆత్మబలముతో..ఆదర్శాలు 
అవనిలోన నిలుపు బాపూ..ఊఊఊ

నమో నమో..బాపూ..ఊ
మాకు..న్యాయమార్గమే చూపు 
మాకు..న్యాయమార్గమే చూపు
బాపూ..ఊఊఊఊఊఊ

M.L.A--1957
Music::Pendyala NaagaeSvararaavu  
Lyrics::Arudra
Singer's::P.Suseela,Maadhavapeddi Satyam,Brundam.
Cast::Jaggayya,Gummadi,Saavitri,Girija,Ramanamoorti,Perumaallu,Naagabhushanam

::::

namO namO..baapoo..UUU
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

namO namO..baapoo..UU
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

nirantaram maa hRdantaramlO 
ninDi velugujyOti..ee
nityasatyakaanti..ee

namO namO..baapoo..oo
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

:::1

dharmadevata..naalgupaadamulu 
brahmadEvuni..naalguvEdamulu
dharmabhoomilO..marala nilipi..ee
aa..aa..aa..aa..aa..aa..aa
dharmabhoomilO..marala nilipi..ee
nirmala bOdhalu..chEsina baapoo..UUU

namO namO..baapoo..oo
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

:::2

neevu teesina..baaTalu daaTi 
neetini viDachi..ninne marachi 
neevu teesina..baaTalu daaTi 
neetini viDachi..ninne marachi
nee anucharulE maaredaremO
O..O..O..O..O..O..O
nee anucharulE maaredaremO
niduranunDi lEpoo..baapoo..UUU

namO namO..baapoo..oo
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

:::3

aaSayaalakai..aSuvula baasina 
amaramoortivayyaa..neevu 
aatmabalamutO..aadarSaalu 
avanilOna nilupu baapoo..UUU

namO namO..baapoo..oo
maaku..nyaayamaargame choopu 
maaku..nyaayamaargame choopu

baapoo..UUUUU

రావణబ్రహ్మ--1986


Add caption


సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Kovelamudi Raghavendra Rao
తారాగణం::కృష్ణంరాజు,కైకాల.సత్యనారాయణ,గిరిబాబు,అల్లురామలింగయ్య,రావ్‌గోపాల్‌రావ్,చలపతి,మాడ,శ్రీలక్ష్మీ,శారద,లక్ష్మీ,రాధక,రాధ,సూర్యకాంతం,మమత.

పల్లవి::

ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం
శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం
సరసాల సరిగమలెన్నో..విసిరింది నీలో అందం
పరువాల ఘుమఘుమలన్నీ..ఇక పైన నాకే సొంతం
శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం

చరణం::1

వచ్చేవచ్చే ఒక హేమంతం..ఒళ్లోకొచ్చే ఒక సౌందర్యం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
నాలో పొంగే ఒక అనురాగం..తొలి కౌగిళ్లల్లో చలి సంగీతం
పొగమంచు పొదరిల్లైతే..చలిమంటతో అనుబంధం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
పొగమంచు పొదరిల్లైతే..చలిమంటతో అనుబంధం
హరివిల్లు ఇలకే వస్తే..అది నీకు నా ప్రియ హారం..మ్మ్

శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం
శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం

చరణం::2

వచ్చేవచ్చే ఒక వైశాఖం..మళ్ళీ వచ్చే ఒక మధుమాసం
ఓ..ఓ..ఓ..ఓ..విచ్చే నీలో ఒక మందారం..మనసిచ్చే నాకే తన సిందూరం
చిరునవ్వు సిగమల్లెలైతే..సిగమాయకే సింగారం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చిరునవ్వు సిగమల్లెలైతే..సిగమాయకే సింగారం
తిలకాల జలకాలాడే.. మన బంధమే సంసారం

శ్రావణ సంధ్యా రాగం..నా జీవన వీణా గానం
సరసాల సరిగమలెన్నో..విసిరింది నీలో అందం
పరువాల ఘుమఘుమలన్నీ..ఇక పైన నాకే సొంతం
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్

Raavanabrahma--1986
Music::G.V.raaghavulu
Lyricsa::Veturi
Singer's::S.P.Balu,P.Suseela
Film Directed By::Kovelamudi Raghavendra Rao
Cast::kRshNaMraaju,K.Satyanaarayana,Giribabu,Ravgopalrao.Alluraamalingayya,Mada,Chalapati,lakshmee,raadhaka,raadha,Sreelakshmii,Sooryakantam,Mamata.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

aaaa..aaaa..aaaa..aaaa..aaaa..aaaa..aaaa..aaaa..
SraavaNa sandhyaa raagam..naa jeevana veeNaa gaanam
SraavaNa sandhyaa raagan..naa jeevana veeNaa gaanam
sarasaala sarigamalennO..visirindi neelO andam
paruvaala ghumaghumalannii..ika paina naakE sontam
SraavaNa sandhyaa raagam..naa jeevana veeNaa gaanam

::::1

vachchEvachchE oka hEmantam..oLLOkochchE oka saundaryam
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa 
naalO pongE oka anuraagam..toli kaugiLLallO chali sangeetam
pogamanchu podarillaitE..chalimanTatO anubandham
aa..aa..aa..aa..aa..aa..aa 
pogamanchu podarillaitE..chalimanTatO anubandham
harivillu ilakE vastE..adi neeku naa priya haaram..mm^

SraavaNa sandhyaa raagam..naa jeevana veeNaa gaanam
SraavaNa sandhyaa raagam..naa jeevana veeNaa gaanam

::::2

vachchEvachchE oka vaiSaakham..maLLii vachchE oka madhumaasam
O..O..O..O..vichchE neelO oka mandaaram..manasichchE naakE tana sindooram
chirunavvu sigamallelaitE..sigamaayakE singaaram
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa
chirunavvu sigamallaitE..sigamaayakE singaaram
tilakaala jalakaalaaDE.. mana bandhamE samsaaram

SraavaNa sandhyaa raagam..naa jeevana veeNaa gaanam
sarasaala sarigamalennO..visirindi neelO andam
paruvaala ghumaghumalannii..ika paina naakE sontam
mm..mm..mm..mm..mm..mm..mm

జేబు దొంగ--1975



సంగీతం::చక్రవర్తి 
రచన::ఆరుద్ర 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,మంజుల,రాజబాబు,రోజారమణి,సత్యనారాయణ,రమాప్రభ

పల్లవి:: 

రాధా..ఆ..అందించు నీ లేత పెదవి 
ఏహే..ఏ..లాలించు తీరాలి తనివి 

గోపీ..ఈ..నాలోని అందాలు నీవి..ఈ 
ఓహో..నీ రాగ బంధాలు నావి..ఈ 
సరే..పదా..ఇటూ
మనసు పొంగినది..మధువులూరినవి 
మమత గుండెలో..నిండి పోయినవి 
రాధా..ఆ..అందించు నీ లేత పెదవి 
గోపీ..ఈ..నాలోని అందాలు నీవి..ఈ 

చరణం::1 

చెంపల్లోనా..కెంపులున్నవి
ఒంపుల్లోనా..వలపులున్నవి 
ఇంపు సొంపు..మధుర మధురమాయే 
చెంపల్లోనా..కెంపులున్నవి
ఒంపుల్లోనా..వలపులున్నవి 
ఇంపు సొంపు..మధుర మధురమాయే 

నీ పేరే..తియ్యనైనది
నీ రూపే..కమ్మనైనది 
నీ మనసే..చల్లనైనది
నీ తోడే..వెచ్చనైనది 
హే..ఏఏఏ..సొగసు ఉయ్యాలలూగిందీ 
ఓఓఓఓఓ..వయసు వయ్యార మొలికిందీ 

రాధా..ఆ..నాలోని అందాలు నీవి..ఈ 
గోపీ..ఈ..అందించు నీ లేత పెదవి..ఈ 

చరణం::2

మేను మేను..వీణలైనవి
మెల్లగ చేతులు..మీటుతున్నవి 
ఏదో గానం..మోగుతున్నదోయి 
మేను మేను..వీణలైనవి
మెల్లగ చేతులు..మీటుతున్నవి 
ఏదో గానం..మోగుతున్నదోయి 

చెలరేగే చిలిపి..ఊహలు
పులకించే పడుచు..గుండెలు 
చిగురించే..కొత్త ఆశలు
పెనవేసే..రెండు తనువులు 

ఓఓఓఓఓ..వలపు కెరటాల మునగాలి 
ఆహా..ఆఆఆఆ..మధుర ప్రణయాల తేలాలి 

రాధా..ఆ..అందించు నీ లేత పెదవి 
గోపీ..ఈ..నాలోని అందాలు నీవి 
సరే..పదా..ఇటు 
మనసు పొంగినది..మధువులూరినవి 
మమత గుండెలో..నిండి పోయినది 
రాధా..ఆ..నాలోని అందాలు నీవి..ఈ 
గోపీ..ఈ..అందించు నీ లేత పెదవి..ఈ 
రాధా..ఆఆఆఆ
గోపీ..ఈఈఈఈ
రాధా..ఆఆఆఆ
గోపీ..ఈఈఈఈ


Saturday, June 27, 2015

బంగారు గాజులు--1978




సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరీ 
Film Directed By::C.S.Rao 
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,కాంతారావు,గుమ్మడి,నాగభుషణం,
రేలంగి,పద్మనాభం,భారతి దేవి,గీతాంజలి,విజయనిర్మల,సూర్యకాంతం. 

పల్లవి::

జాజిరి జాజిరి జక్కల మామా..చించించున్ 
జింగిరి జింగిరి జిత్తుల మామా..చించించున్ 
కాకర చెట్టు మేకలు మేసే..చించించున్ 

జాజిరి జాజిరి జక్కల మామా..చించించున్ 
జింగిరి జింగిరి జిత్తుల మామా..చించించున్ 
కాకర చెట్టు మేకలు మేసే..చించించున్

చరణం::1

నీ దేశం బంగరు బర్మా..చించించాంచూం 
నీ భాసే తెలియదు..ఖర్మా
నీ దేశం బంగరు బర్మా..చించించాంచూం 
నీ భాసే తెలియదు..ఖర్మా

సరదాగా నిన్నుచూస్తేనే..తరించేను మా జన్మ
రతనాలే తెచ్చవో..ఇ..ఈ..జతగోరే వచ్చావో..ఇ..ఈ
రతనాలే తెచ్చవో..ఓఓఓ..జతగోరే వచ్చావో
మొజుంటే ముందుకు రావోయ్..చించించున్ 

జాజిరి జాజిరి జక్కల మామా..చించించున్ 
జింగిరి జింగిరి జిత్తుల మామా..చించించున్ 
కాకర చెట్టు మేకలు మేసే..చించించున్

చరణం::2

వంటింట్లో కుందేలుందీ..వాకిట్లో తోడేలుందీ
గురిపెట్టి చూచావంటే..గుండె ఝల్లు మంటుందీ
వంటింట్లో కుందేలుందీ..వాకిట్లో తోడేలుందీ
గురిపెట్టి చూచావంటే..గుండె ఝల్లు మంటుందీ
నీ మీసం బాగుందీ..ఇ..ఈ..నీ వేషం బాగుందీ
నీ మీసం బాగుందీ..ఈఈఈ..నీ వేషం బాగుందీ..ఈ
తొడగొట్టి దూసుకుపోవోయ్..చించించున్

జాజిరి జాజిరి జక్కల మామా..చించించున్ 
జింగిరి జింగిరి జిత్తుల మామా..చించించున్ 
కాకర చెట్టు మేకలు మేసే..చించించున్

చరణం::3


చెయ్ తిరిగిన మా బాసు..టం టుం టిం..చెయ్యడులే తిరకాసు
చెయ్ తిరిగిన మా బాసు..చెయ్యడులే తిరకాసు
చెల్లుతుందీ వరహాలుగా..అతనిచేతి అరకాసు
వ్యవహారం చేస్తావో..ఇ..ఈ..ఎగనామం పెడతావో..ఇ..ఈ 
వ్యవహారం చేస్తావో..ఎగనామం పెడతావో
ఏదైనా నీదేభారం...చించించున్ 

జాజిరి జాజిరి జక్కల మామా..చించించున్ 
జింగిరి జింగిరి జిత్తుల మామా..చించించున్ 
కాకర చెట్టు మేకలు మేసే..చించించున్


Bangaaru Gaajulu--1978
Music::T.ChalapatiRao
Lyrics::D.C.Naaraayana Reddi
Singer's::L.R.Iswari 
Film Directed By::C.S.Rao
Cast::A.N.R.KaantaaRao,Gummadi,Nagabhushanam,Padmanaabham,Relangi,BharatiDevi,Vijayanirmala,Geetaanjali,Sooryakaantam.

:::::::::::::::::::::::::::

jaajiri jaajiri jakkala maamaa..chinchinchun 
jingiri jingiri jittula maamaa..chinchinchun 
kaakara cheTTu mEkalu mEsE..chinchinchun 

jaajiri jaajiri jakkala maamaa..chinchinchun 
jingiri jingiri jittula maamaa..chinchinchun 
kaakara cheTTu mEkalu mEsE..chinchinchun

::::1

nee dESam bangaru barmaa..chinchinchaamchuum 
nee bhaasE teliyadu..kharmaa
nee dESam bangaru barmaa..chinchinchaamchuum 
nee bhaasE teliyadu..kharmaa

saradaagaa ninnuchoostEnE..tarinchEnu maa janma
ratanaalE techchavO..i..ii..jatagOrE vachchaavO..i..ii
ratanaalE techchavO..OOO..jatagOrE vachchaavO
mojunTE munduku raavOy..chinchinchun 

jaajiri jaajiri jakkala maamaa..chinchinchun 
jingiri jingiri jittula maamaa..chinchinchun 
kaakara cheTTu mEkalu mEsE..chinchinchun

::::2

vanTinTlO kundElundii..vaakiTlO tODElundii
guripeTTi chuuchaavanTE..gunDe jhallu manTundii
vanTinTlO kundElundii..vaakiTlO tODElundii
guripeTTi chuuchaavanTE..gunDe jhallu manTundii
nee meesam baagundii..i..ii..nee vEsham baagundii
nee meesam baagundii..iiiiii..nee vEsham baagundii..ii
toDagoTTi doosukupOvOy..chinchinchun

jaajiri jaajiri jakkala maamaa..chinchinchun 
jingiri jingiri jittula maamaa..chinchinchun 
kaakara cheTTu mEkalu mEsE..chinchinchun

::::3

chey tirigina maa baasu..Tam Tum Tim..cheyyaDulE tirakaasu
chey tirigina maa baasu..cheyyaDulE tirakaasu
chellutundii varahaalugaa..atanichEti arakaasu
vyavahaaram chEstaavO..i..ii..eganaamam peDataavO..i..ii 
vyavahaaram chEstaavO..eganaamam peDataavO
Edainaa needEbhaaram...chinchinchun 

jaajiri jaajiri jakkala maamaa..chinchinchun 
jingiri jingiri jittula maamaa..chinchinchun 
kaakara cheTTu mEkalu mEsE..chinchinchun

Friday, June 26, 2015

వియ్యాలవారి కయ్యాలు--1979



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::P.సుశీల,S.P.బాలు
 తారాగణం::కృష్ణ,జయప్రద,నాగభూషణం,రావు గోపాలరావు,సూర్యకాంతం,S.వరలక్ష్మి,జయమాలిని 

పల్లవి::

పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే 

పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే

చరణం::1

చల్లకొచ్చి ముంత దాచే చక్కని గుంట
నువ్ సల్లగుండ
రావే నా వెంట రాగాల పంట
పగలు రేయి పండించుకుంట..ఓ..ఓ..ఓ

అల్లరెందుకు అందాల విందుకు
పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే

చరణం::2

మాటలెందుకు మగసిరుంటే
పాటలెందుకు నీ పక్కనుంటే
అరుపులెందుకు నిన్నల్లుకుంటే
అర్ధరాత్రి ఎవరేనా వింటే..ఓ..ఓ..ఓ

హద్దులెందుకు ముద్దాడుకొందుకు
పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే

చరణం::3

పాత రోజులు గుర్తుకొచ్చే
కొత్త మోజులు పుట్టుకొచ్చే
బండబారిన పడుచుదనము
పడగ విప్పి పైపైకి వచ్చే
ఏ..ఏహె..ఏహె

అల్లరెందుకు అందాల విందుకు
పాలు పొంగే వయసే నీది
పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే
అది వలపు కంటే తీపిగుంటదిలే
అహ..అహ..హ..హ..హా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

Wednesday, June 24, 2015

మల్లెమొగ్గలు--1986




సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వీటూరి సుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు  
Film Directed By::V.Madhusooshana Rao
తారాగణం::రాజేష్,సాగరిక,Y.విజయ.

పల్లవి::

ఆఆఆఆఆ..ఆఆఆఅ..ఆఆఅ ఆ 
అ ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ..ఆ ఆ ఆ అ 
  
ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ
ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ

ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె
ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె
వేణువందుకే..ఏఏఏ..మోగిందమ్మ
వెన్నదాచకే..కన్నె గోపెమ్మ
వెన్నదాచకే..కన్నె గోపెమ్మ

ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ

చరణం::1

మువ్వగోపాలా..రారా అంటూ 
మువ్వగోపాలా..రారా అంటూ 
మువ్వ మువ్వ..కీ..ఈ..పిలుపేనమ్మ
ముద్దు గోవిందా..ఆ..రా రమ్మంటూ
ముగ్గు ముగ్గునా..ఆఆ..కవితేనమ్మ 
జారు పైటలా..ఆఆ..జావళి వింటే 
జాను తెనుగులే..ఏఏఏ..పండేనమ్మ
జాను తెనుగులే..ఏఏఏ..పండేనమ్మ

ఏరుపక్క మావూరమ్మ
ఊరుపక్క మాగాణమ్మ

ఏరుపక్క మావూరమ్మ
ఊరుపక్క మాగాణమ్మ

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
సువ్వి గోపాలా..సువ్వి అంటూ 
సువ్వి గోపాలా..సువ్వి అంటూ 
పాలపొంగులే..ఏఏఏ..పలికేనమ్మ
గుమ్మడెక్కడే..ఏఏఏ,,గుమ్మాఅంటూ 
చల్ల చిందులే..ఏఏఏ..సణిగేనమ్మ
కొమ్మ కొమ్మకీ..ఈఈఈ..కొత్త పల్లవి
కోకిలమ్మలే..ఏఏఏ..పాడేనమ్మ
కోకిలమ్మలే..ఏఏఏ..పాడేనమ్మ

ఏరుపక్క మావూరమ్మ
ఊరుపక్క మాగాణమ్మ

ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ

ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె
ఏరు కాళింది..ఊరు వ్రేపల్లె
వేణువందుకే..ఏఏఏ..మోగిందమ్మ
వెన్నదాచకే..కన్నె గోపెమ్మ
వెన్నదాచకే..కన్నె గోపెమ్మ

ఏరుపక్క..మావూరమ్మ
ఊరుపక్క..మాగాణమ్మ

Mallemoggalu--1986
Music::Ramesh Nayudu
Lyrics::Veetoorisundararammoorti
Singer's::S.P.Baalu.
Film Directed By::V.Madhusooshana Rao 
Cast::Rajesh,Saagarika,Y.Vijaya.

:::::::::::::::::::::::::

aaaaaaaaaa..aaaaaaaaaa..aaaaaaa aa 
a aa aa aa aa aaaaaaaaaaa..aaa aa aa a 
  
Erupakka..maavooramma
Urupakka..maagaaNamma

Erupakka..maavooramma
Urupakka..maagaaNamma

Eru kaaLindi..Uru vrEpalle
Eru kaaLindi..Uru vrEpalle
vENuvandukE..EEE..mOgindamma
vennadaachakE..kanne gOpemma
vennadaachakE..kanne gOpemma

Erupakka..maavooramma
Urupakka..maagaaNamma

::::1

muvvagOpaalaa..raaraa anTuu 
muvvagOpaalaa..raaraa anTuu 
muvva muvvakii..ii..pilupEnamma
muddu gOvindaa..aa..raa rammanTuu
muggu muggunaa..aaaaaa..kavitEnamma 
jaaru paiTalaa..aaaaaa..jaavaLi vinTE 
jaanu tenugulE..EEE..panDEnamma
jaanu tenugulE..EEE..panDEnamma

Erupakka maavooramma
Urupakka maagaaNamma

Erupakka maavooramma
Urupakka maagaaNamma

::::2

aa aa aa aa aa aa aa aa aa 
suvvi gOpaalaa..suvvi anTuu
suvvi gOpaalaa..suvvi anTuu 
paalapongulE..EEE..palikEnamma
gummaDekkaDE..EEE,,gummaaanTuu 
challa chindulE..EEE..saNigEnamma
komma kommakii..iiiiii..kotta pallavi
kOkilammalE..EEE..paaDEnamma
kOkilammalE..EEE..paaDEnamma

Erupakka maavooramma
Urupakka maagaaNamma

Erupakka..maavooramma
Urupakka..maagaaNamma
Eru kaaLindi..Uru vrEpalle
Eru kaaLindi..Uru vrEpalle
vENuvandukE..EEE..mOgindamma
vennadaachakE..kanne gOpemma
vennadaachakE..kanne gOpemma

Erupakka..maavooramma
Urupakka..maagaaNamma  

Tuesday, June 23, 2015

మండే గుండెలు--1979




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్యా-ఆత్రేయ
గానం::P.సుశీల, S.P.బాలు  
Film Directed By::K.Bapayya
తారాగణం::కృష్ణ,(ఘట్టమనేని శివరామ కృష్ణ),శోభన్‌బాబు,K.సత్యనారాయణ,
చంద్రమోహన్,గుమ్మడి వెంకటేశ్వరరావు,అల్లురామలింగయ్య,M.ప్రభాకర్ రెడ్డి,నూతన్‌ప్రసాద్,అంజలీదేవి,జయసుధ,జయప్రద,మాధవి. 

పల్లవి::

బంగారానికి సింగారానికి..కుదిరింది ఈనాడు బేరం
అసలిచ్చేసి..వడ్డీ కోసం..పడుతోంది పడరాని గారాం 

బంగారానికి.సింగారానికి..కుదిరింది.ఈనాడు బేరం
అసలిచ్చేది..వడ్డీ కోసం..పడుతోంది పడరాని గారాం 

బంగారానికి..సింగారానికి..కుదిరింది ఈనాడు బేరం..మ్మ్

చరణం::1

కాచే చెట్టుని కాచే వాడికే..కాయలు దక్కాలి
కన్నెబిడ్డను గట్టుకు చేర్చిన..కాళ్ళకి మొక్కాలి

కాచే చెట్టుని కాచే వాడికే..కాయలు దక్కాలి
కన్నెబిడ్డను గట్టుకు చేర్చిన..కాళ్ళకి మొక్కాలి

చేసిన మేలుకు చెమ్మగిల్లిన..కళ్ళను చూడాలి
చేసిన మేలుకు చెమ్మగిల్లిన..కళ్ళను చూడాలి
అది చెప్పలేని పెదవులు..పెట్టిన ముద్దులు పండాలి..ఈ

బంగారానికి సింగారానికి..కుదిరింది ఈనాడు బేరం..మ్మ్

చరణం::2

చీరల రంగులు ఎనైనా..దారంతోటే నేసేది
తీరని కోరిక ఏదైనా..మారాం చేసే గెలిచేది

వయసే గారాం పొయ్యేది..మనసే మారాం చేసేది
గాజుల చేతుల తాళం తోనే..కళ్యాణ మేళం మ్రోగేది

బంగారానికి సింగారానికి..కుదిరింది ఈనాడు బేరం..మ్మ్

చరణం::3

చిటపటలాడే చినుకులు కలిసే..వరదై వచ్చేది
చిరుబురులాడే చిలిపితనాలే..వలపుగ మారేది

చిటపటలాడే చినుకులు కలిసే..వరదై వచ్చేది
చిరుబురులాడే చిలిపితనాలే..వలపుగ మారేది

కొండకు పక్కన కోనుంటేనే..నిండుగ ఉండేది
కొండకు పక్కన కోనుంటేనే..నిండుగ ఉండేది

ఒకటికి పక్కన ఒకటుంటేనే..రెండొకటయ్యేది

బంగారానికి సింగారానికి..కుదిరింది ఈనాడు బేరం
అసలిచ్చేసి వడ్డీ కోసం..పడుతోంది పడరాని గారాం

బంగారానికి సింగారానికి..కుదిరింది ఈనాడు బేరం
కుదిరింది ఈనాడు బేరం..మ్మ్ 


Mande Gundelu--1979
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Baapayya 
Cast::Krishna,Sobhanbabu,K.Satyanarayana,Chandramohan,Gummadi,M.Prabhakar Reddi,Nootanprasaad,Alluraamalingayya,Jayasudha,Jayaprada,Maadhavi,Anjalidevi.

:::::::::::::::::::::::::

bangaaraaniki singaaraaniki..kudirindi iinaaDu bEram
asalichchEsi..vaDDii kOsam..paDutOndi paDaraani gaaraam 

bangaaraaniki.singaaraaniki..kudirindi.iinaaDu bEram
asalichchEdi..vaDDii kOsam..paDutOndi paDaraani gaaraam 

bangaaraaniki..singaaraaniki..kudirindi iinaaDu bEram..mm

::::1

kaachE cheTTuni kaachE vaaDikE..kaayalu dakkaali
kannebiDDanu gaTTuku chErchina..kaaLLaki mokkaali

kaachE cheTTuni kaachE vaaDikE..kaayalu dakkaali
kannebiDDanu gaTTuku chErchina..kaaLLaki mokkaali

chEsina mEluku chemmagillina..kaLLanu chooDaali
chEsina mEluku chemmagillina..kaLLanu chooDaali
adi cheppalaeni pedavulu..peTTina muddulu panDaali..ii

bangaaraaniki singaaraaniki..kudirindi iinaaDu bEram..mm

::::2

cheerala rangulu enainaa..daaramtOTe nEsEdi 
teerani kOrika Edainaa..maaraam chEsE gelichEdi

vayasE gaaraam poyyEdi..manasE maaraam chEsEdi
gaajula chEtula taaLam tOnE..kaLyaaNa mELam mrOgEdi

bangaaraaniki singaaraaniki..kudirindi iinaaDu bEram..mm

::::3

chiTapaTalaaDE chinukulu kalisE..varadai vachchEdi
chiruburulaaDE chilipitanaalE..valapuga maarEdi

chiTapaTalaaDE chinukulu kalisE..varadai vachchEdi
chiruburulaaDE chilipitanaalE..valapuga maarEdi

konDaku pakkana kOnunTEnE..ninDuga unDEdi
konDaku pakkana kOnunTEnE..ninDuga unDEdi

okaTiki pakkana okaTunTEnE..renDokaTayyEdi

bangaaraaniki singaaraaniki..kudirindi eenaaDu baeram
asalichchEsi vaDDii kOsam..paDutOndi paDaraani gaaraam

bangaaraaniki singaaraaniki..kudirindi iinaaDu bEram
kudirindi iinaaDu bEram..mm 

Monday, June 22, 2015

కన్నతల్లి--1972



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి 

పల్లవి::

కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    
విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ
కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    
విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ

చరణం::1

పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాధను చేస్తుందీ
పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాధను చేస్తుందీ
ప్రాపులేసి పసితీగకు తానే పందిరి వేస్తుందీ
ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ                
కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    

చరణం::2

మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలౌతుందీ
మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలౌతుందీ
మనిషినిమాకును ఒకటిగచేసి కొట్టుకుపోతుందీ
కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    

చరణం::3

ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుందీ
ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుందీ
ఎందరేగినా ఎన్నిజరిగినా ఎరగనట్టులే వుంటుందీ
ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ   
కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    

చరణం::4 
             
కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిదీ 
కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిదీ 
కాలనిదో కన్నతల్లిదో గెలుపన్నదే తెలియనిదీ   
కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ  

Sunday, June 21, 2015

మండే గుండెలు--1979




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్యా-ఆత్రేయ
గానం::P.సుశీల, S.P.బాలు  
Film Directed By::K.Bapayya
తారాగణం::కృష్ణ,(ఘట్టమనేని శివరామ కృష్ణ),శోభన్‌బాబు,K.సత్యనారాయణ,
చంద్రమోహన్,గుమ్మడి వెంకటేశ్వరరావు,అల్లురామలింగయ్య,M.ప్రభాకర్ రెడ్డి,నూతన్‌ప్రసాద్,అంజలీదేవి,జయసుధ,జయప్రద,మాధవి. 

పల్లవి::

ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం
ప్రతి హృదయం ఒక సింహాసనం..ఒక రాజు రాణి పఠాభిషేకం

ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం
ప్రతి హృదయం ఒక సింహాసనం..ఒక రాజు రాణి పఠాభిషేకం

ఇది ప్రేమసామ్రాజ్యం 

చరణం::1

ఈ జంటలలో మనమొక జంటై..ఒక గంటైనా ఉంటే చాలు
ఈ జంటలకే జేగంటలమై మనముంటాము పది కాలాలు

ఈ జంటలలో మనమొక జంటై..ఒక గంటైనా ఉంటే చాలు
ఈ జంటలకే జేగంటలమై మనముంటాము పది కాలాలు

అందుకే ఉన్నవి పొదరిల్లు..పొదరిల్లకు ఉన్నవి పోకిరి కళ్ళు

ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం

చరణం::2

ఈ పువ్వులలో జతపువ్వులమై చిరునవ్వులమై ఉందాము
ఈ పచ్చికలో మన మచ్చికలో నులి వెచ్చదనం చూదాము
వెచ్చదనాన్ని తెచ్చాము..అది మెచ్చుకునేందుకే వచ్చాము

ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం

చరణం::3

చిగురాకులో విరిరేకులలో ఎరుపై నునుపై ఉందాము
బిగి కౌగిలో తొలి మైకములో సగమూ సగమైపోదాము

చిగురాకులో విరిరేకులలో ఎరుపై నునుపై ఉందాము
బిగి కౌగిలో తొలి మైకములో సగమూ సగమైపోదాము

అందుకే ఉన్నది యవ్వనము..ఈ యవ్వనమందే అనుభవము

ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం
ప్రతి హృదయం ఒక సింహాసనం..ఒక రాజు రాణి పఠాభిషేకం

ఇది ప్రేమసామ్రాజ్యం..ఇది మన్మధ సామ్రాజ్యం 


Mande Gundelu--1979
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Baapayya 
Cast::Krishna,Sobhanbabu,K.Satyanarayana,Chandramohan,Gummadi,M.Prabhakar Reddi,Nootanprasaad,Alluraamalingayya,Jayasudha,Jayaprada,Maadhavi,Anjalidevi.

:::::::::::::::::::::::::

idi prEmasaamraajyam..idi manmadha saamraajyam
prati hRdayam oka simhaasanam..oka raaju raaNi paThaabhishEkam

idi prEmasaamraajyam..idi manmadha saamraajyam
prati hRdayam oka simhaasanam..oka raaju raaNi paThaabhishEkam

idi prEmasaamraajyam 

::::1

ii janTalalO manamoka janTai..oka ganTainaa unTE chaalu
ii janTalakE jEganTalamai manamunTaamu padi kaalaalu

ii janTalalO manamoka janTai..oka ganTainaa unTE chaalu
ii janTalakE jEganTalamai manamunTaamu padi kaalaalu

andukE unnavi podarillu..podarillaku unnavi pOkiri kaLLu

idi prEmasaamraajyam..idi manmadha saamraajyam

::::2

ii puvvulalO jatapuvvulamai chirunavvulamai undaamu
ii pachchikalO mana machchikalO nuli vechchadanam choodaamu
vechchadanaanni techchaamu..adi mechchukunEndukE vachchaamu

idi prEmasaamraajyam.. idi manmadha saamraajyam

::::3

chiguraakulalO virirEkulalO erupai nunupai undaamu
bigi kougililO toli maikamulO sagamuu sagamaipOdaamu

chiguraakulalO virirEkulalO erupai nunupai undaamu
bigi kougilO toli maikamulO sagamuu sagamaipOdaamu

andukE unnadi yavvanamu..ii yavvanamandE anubhavamu

idi prEmasaamraajyam..idi manmadha saamraajyam
prati hRdayam oka simhaasanamm..oka raaju raaNi paThaabhishEkam 

idi prEmasaamraajyam..idi manmadha saamraajyam

మండే గుండెలు--1979


సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్యా-ఆత్రేయ
గానం::P.సుశీల, S.P.బాలు  
Film Directed By::K.Bapayya
తారాగణం::కృష్ణ,(ఘట్టమనేని శివరామ కృష్ణ),శోభన్‌బాబు,K.సత్యనారాయణ,
చంద్రమోహన్,గుమ్మడి వెంకటేశ్వరరావు,అల్లురామలింగయ్య,M.ప్రభాకర్ రెడ్డి,నూతన్‌ప్రసాద్,అంజలీదేవి,జయసుధ,జయప్రద,మాధవి. 

పల్లవి::

స్నానాల గదిలో..సంగీతమొస్తుంది 
ఎవరికైనా...టడటడట్టా..ఆ    
చన్నీళ్ళు పడగానే..సంగతులు 
పలుకుతాయి..ఏ చవటకైనా

ఆ..ఉఊఊఉ.. 
జిల్లుజిల్లుమంటున్నాయ్..నీళ్ళు
చలి చలి అంటుంది..ఒళ్లు
జిల్లుజిల్లుమంటున్నాయ్..నీళ్ళు
చలి చలి అంటుంది..ఒళ్లు
చెలి వచ్చి ఇవ్వాలి..కౌగిళ్ళు
నులి వెచ్చనవుతాయి..చన్నీళ్లు 

అ..హ..హ..హ..హా 
జిల్లుజిల్లుమన్నాయా..నీళ్ళు
చలి చలి అంటోందా ఒళ్లు..అవును
జిల్లుజిల్లుమన్నాయా..నీళ్ళు..ఊ 
చలి చలి అంటోందా..ఒళ్లు 
ఎవరొచ్చి ఇచ్చారు..ఇన్నాళ్లు
నులి వెచ్చనైయ్యేటి..కౌగిళ్లు..ఊ

జిల్లుజిల్లుమంటున్నాయ్..నీళ్ళు
చలి చలి అంటోందా..ఒళ్లు..ఊ

చరణం::1

తలదాక మునిగాక..చలి తీరిపోతుంది కానీ..ఆహా
తలుపవతలేవున్న..చెలి వచ్చి ముంచేసి పోనీ..ఓహో 

తలదాక మునిగాక..చలి తీరిపోతుంది కానీ
తలుపవతలేవున్న..చెలి వచ్చి ముంచేసి పోనీ

హా..ఆఆఆ 
మునిగేది గంగని..ముంచేది రంభని అనుకొని
మునిగేది గంగని..ముంచేది రంభని అనుకొని
మునిగి చూడు అంటావు..చలి వొట్టి గిలిలాంటిదేనని  

జిల్లుజిల్లుమంటున్నాయ్..నీళ్ళు
చలి చలి అంటుంది..ఒళ్లు
ఎవరొచ్చి ఇచ్చారు..ఇన్నాళ్లు
నులి వెచ్చనైయ్యేటి..కౌగిళ్లు
జిల్లుజిల్లుమంటున్నాయ్..నీళ్ళు
చలి చలి అంటోందా..ఒళ్లు

చరణం::2

సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను..కళ్ళు..హహహ 
చెంబెక్కడున్నదో చెప్పేసి తలుపేసి..వెళ్ళు
మ్మ్..హు..మ్మ్ మ్మ్ హు 
సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను..కళ్ళు..అబ్బా
చెంబెక్కడున్నదో కావల్స్తేచెప్పేసి తలుపేసి..వెళ్ళు
ఆ హ్హ హ్హ హ్హ హ్హా హా ఆ 

మంటెక్కితే ఉన్న..మత్తంత దిగుతుంది నీకు..ఆహా
మంటెక్కితే ఉన్న..మత్తంత దిగుతుంది నీకు
తిక్కాకబోయి చక్కంగ వస్తుంది చూపు..అ హా హా హా

జిల్లుజిల్లుమంటున్నాయ్..నీళ్ళు
చలి చలి అంటుంది..ఒళ్లు
ఎవరొచ్చి ఇచ్చారు..ఇన్నాళ్లు
నులి వెచ్చనైయ్యేటి..కౌగిళ్లు
లలలలలలలాల..లలలల్లలాలాల

Mande Gundelu--1979
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Baapayya 
Cast::Krishna,Sobhanbabu,K.Satyanarayana,Chandramohan,Gummadi,M.Prabhakar Reddi,Nootanprasaad,Alluraamalingayya,Jayasudha,Jayaprada,Maadhavi,Anjalidevi.

:::::::::::::::::::::::::

snaanaala gadilO..sangeetamostundi 
evarikainaa...TaDaTaDaTTaa..aa  
channeeLLu paDagaanE..sangatulu 
palukutaayi..E chavaTakainaa

aa..uuuuuu.. 
jillujillumanTunnaay..neeLLu
chali chali anTundi..oLLu
jillujillumanTunnaay..neeLLu
chali chali anTundi..oLLu
cheli vachchi ivvaali..kougiLLu
nuli vechchanavutaayi..channeeLLu 

a..ha..ha..ha..haa 
jillujillumannaayaa..neeLLu
chali chali anTOndaa oLLu..avunu
jillujillumannaayaa..neeLLu..uu 
chali chali anTOndaa..oLLu 
evarochchi ichchaaru..innaaLLu
nuli vechchanaiyyETi..kaugiLLu..uu

jillujillumanTunnaay..neeLLu
chali chali anTOndaa..oLLu..uu

::::1

taladaaka munigaaka..chali teeripOtundi kaanii..aahaa
talupavatalEvunna..cheli vachchi munchEsi pOnii..OhO 

taladaaka munigaaka..chali teeripOtundi kaanii
talupavatalEvunna..cheli vachchi munchEsi pOnii

haa..aaaaaaaaa 
munigEdi gangani..munchEdi rambhani anukoni
munigEdi gangani..munchEdi rambhani anukoni
munigi chooDu amTaavu..chali voTTi gililaanTidEnani  

jillujillumanTunnaay..neeLLu
chali chali anTundi..oLLu
evarochchi ichchaaru..innaaLlu
nuli vechchanaiyyETi..kaugiLlu
jillujillumanTunnaay..neeLLu
chali chali anTOndaa..oLLu

::::2

sabbEsukunnaanu teravalEkunnaanu..kaLLu..hahaha 
chembekkaDunnadO cheppEsi talupEsi..veLLu
mm..hu..mm mm hu 
sabbEsukunnaanu teravalEkunnaanu..kaLLu..abbaa
chembekkaDunnadO kaavalstEcheppEsi talupEsi..veLLu
aa hha hha hha hhaa haa aa 

manTekkitE unna..mattanta digutundi neeku..aahaa
manTekkitE unna..mattanta digutundi neeku
tikkaakabOyi chakkanga vastundi choopu..a haa haa haa

jillujillumanTunnaay..neeLLu
chali chali anTundi..oLLu
evarochchi ichchaaru..innaaLlu
nuli vechchanaiyyETi..kaugiLlu
lalalalalalalaala..lalalallalaalaala

Tuesday, June 16, 2015

ప్రేమ--1989



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::వెంకటేష్,రేవతి. 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఈనాడే ఏదో అయ్యిందీ..ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ..ఆనంద రాగం మోగిందీ
అందాలా లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ..నాలో జరగందీ

చరణం::1

నింగీ నేలా ఏకం కాగా..ఈ క్షణమిలాగె ఆగిందీ
నింగీ నేలా ఏకం కాగా..ఈ క్షణమిలాగె ఆగిందీ
ఒకటే మాటన్నదీ..ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ..అదినా సొమ్మన్నదీ
పరువాలు మీటి..న న న న న
సెలయేటీ తోటి..న న న న న
పాడాలీ నేడు..న న న న న
కావాలీ తోడు..న న న న న న న న 
ఈనాడే ఏదో అయ్యిందీ..ఏనాడూ నాలో జరగందీ

చరణం::2

సూర్యుని మాపీ చంద్రుని ఆపీ..వెన్నెల రోజంత కాసిందీ
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ..వెన్నెల రోజంత కాసిందీ
పగలూ రేయన్నదీ..అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ..నిజమే కమ్మన్నదీ
ఎదలోనీ ఆశ..న న న న న
ఎదగాలి బాసై..న న న న న
కలవాలీ నీవు..న న న న న
కరగాలీ నేను..న న న న న న న న 

ఈనాడే ఏదో అయ్యిందీ..ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ
ఆనందరాగం మోగిందీ..అందాలా లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ..ఏనాడూ నాలో జరగందీ

వసంత కోకిల--1982



సంగీతం::ఇళయరాజా
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు 

పల్లవి::

ఈ లోకం అతి పచ్చన..తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా..మసలే మనసుంటే..
జతగా నడిచే..మనిషుంటే  
ఈ లోకం అతి పచ్చన..తోడుంటే నీ పక్కన

చరణం::1

ప్రేమకు లేదు వేరే అర్ధం..ప్రేమకు లేదు వేరే అర్ధం
ప్రేమకు ప్రేమే పరమార్ధం..ప్రేమకు ప్రేమే పరమార్ధం
ప్రేమించు ఆ ప్రేమకై జీవించూ..నవ్వుతూ నవ్వించూ
ఈ లోకం అతి పచ్చన..తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా..మసలే మనసుంటే
జతగా నడిచే..మనిషుంటే  
ఈ లోకం అతి పచ్చన..తోడుంటే నీ పక్కన

చరణం::2

ప్రతి నదిలోను అలలుంటాయి..ప్రతి నదిలోను అలలుంటాయి
ప్రతి ఎదలోను కలలుంటాయి..ప్రతి ఎదలోను కలలుంటాయి
ఏ కలలూ ఫలియించునో..శృతి మించునో కాలమే చెబుతుందీ
ఈ లోకం అతి పచ్చన..తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా..మసలే మనసుంటే
జతగా నడిచే..మనిషుంటే 
ఈ లోకం అతి పచ్చన..తోడుంటే నీ పక్కన

కలియుగ మహాభారతం--1979
















సంగీతం::సత్యం 
రచన::శ్రీ శ్రీ,వేటూరి
గానం::జానకి
Film Directed By Hanuman Prasad.
తారాగణం::నరసింహరాజు,హరిబాబు,యం.రంగారావు,నూతన్‌ప్రసాద్,పి.యల్.నారాయణ,నారా వెంకటేశ్వర రావు,మాధవి,కె.ఆర్.విజయ,జయవాణి,జయమాల, 

పల్లవి::

హా..చొ..చొచొ..చొచొ 
ఎంత కమ్మగ వుందోలమ్మా ఈ ముద్దూ
ఎంత మత్తుగ ఉందేటమ్మా ఈ పొద్దూ 

ఎంత కమ్మగ వుందోలమ్మా ఈ ముద్దూ
ఎంత మత్తుగ ఉందేటమ్మా ఈ పొద్దూ 
మెత్త మెత్త గా తాకిందీ..వెచ్చ వెచ్చగా రగిలిందీ
మెత్త మెత్త గా తాకిందీ..వెచ్చ వెచ్చగా రగిలిందీ

చరణం::1

బాసలేని రాసే ముద్దు..గుండెలోని ఊసే ముద్దు
వయసులోని ఏదని సెప్పె తీయనైన దొరికే ముద్దు
ఎన్ని ముద్దులో వున్నాయంట..వింత వింతగా ఉంటాయంట
ఎన్ని ముద్దులో వున్నాయంట..వింత వింతగా ఉంటాయంట
తడి తడి ముద్దులు..కాటేసె ముద్దులు..ఘటైన ముద్దులు ఓలమ్మీ..ఈ..ఈ..ఈ..
చొ..చొచొ..చొచొ 
ఎంత కమ్మగ వుందోలమ్మా ఈ ముద్దూ
ఎంత మత్తుగ ఉందేటమ్మా ఈ పొద్దూ 
మెత్త మెత్త గా తాకిందీ..వెచ్చ వెచ్చగా రగిలిందీ
మెత్త మెత్త గా తాకిందీ..వెచ్చ వెచ్చగా రగిలింది

అహా..చొ..చొచొ..చొచొ 
ఎంత కమ్మగ వుందోలమ్మా ఈ ముద్దూ
ఎంత మత్తుగ ఉందేటమ్మా ఈ పొద్దూ 

చరణం::2

సిన్నదానికి సిగ్గే ముద్దు..మగాడికి మగసిరి ముద్దు
ముచ్చటైన తొలిరాతిరి..ఆలూ మగలు పాడే ముద్దు
ముద్దు ముద్దుకో కథ ఉంది..మోజును పెంచే గుణముంది
ముద్దు ముద్దుకో కథ ఉంది..మోజును పెంచే గుణముంది 
ఆవింత కవింత కొండంత గిలిగింత..బ్రతుకంత పులకింత..మావో..ఓ..ఓ..ఓ..

అహా..చొ..చొచొ..చొచొ 
ఎంత కమ్మగ వుందోలమ్మా ఈ ముద్దూ
ఎంత మత్తుగ ఉందేటమ్మా ఈ పొద్దూ 
మెత్త మెత్త గా తాకిందీ..వెచ్చ వెచ్చగా రగిలిందీ
మెత్త మెత్త గా తాకిందీ..వెచ్చ వెచ్చగా రగిలింది

kaliyuga mahaabhaaratam--1979
sangeetam::Satyam 
rachana::Sree Sree,Vetoori
gaanam::S.jaanaki
Film Directed By::Hanuman Prasad
taaraagaNam::narasiMharaaju,haribaabu,yaM.rangaaraavu,nootan^prasaad,pi.yal.naaraayaNa,naaraa venkaTESwara raavu,maadhavi,ke.Ar.vijaya,jayavaaNi,jayamaala, 

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

haa..cho..chocho..chocho 
enta kammaga vundOlammaa ii mudduu
enta mattuga undETammaa ii podduu 

enta kammaga vundOlammaa ii mudduu
enta mattuga undETammaa ii podduu 
metta metta gaa taakindii..vechcha vechchagaa ragilindii
metta metta gaa taakindii..vechcha vechchagaa ragilindii

::::1

baasalEni raasE muddu..gunDelOni UsE muddu
vayasulOni Edani seppe teeyanaina dorikE muddu
enni muddulO vunnaayanTa..vinta vintagaa unTaayanTa
enni muddulO vunnaayanTa..vinta vintagaa unTaayanTa
taDi taDi muddulu..kaaTEse muddulu..ghaTaina muddulu Olammii..ii..ii..ii..
cho..chocho..chocho 
enta kammaga vundOlammaa ii mudduu
enta mattuga undETammaa ii podduu 
metta metta gaa taakindii..vechcha vechchagaa ragilindii
metta metta gaa taakindii..vechcha vechchagaa ragilindi

ahaa..cho..chocho..chocho 
enta kammaga vundOlammaa ii mudduu
enta mattuga undETammaa ii podduu 

:::2

sinnadaaniki siggE muddu..magaaDiki magasiri muddu
muchchaTaina toliraatiri..Aluu magalu paaDE muddu
muddu muddukO katha undi..mOjunu penchE guNamundi
muddu muddukO katha undi..mOjunu penchE guNamundi 
Avinta kavinta konDanta giliginta..bratukanta pulakinta..maavO..O..O..O..

ahaa..cho..chocho..chocho 
enta kammaga vundOlammaa ii mudduu
enta mattuga undETammaa ii podduu 
metta metta gaa taakindii..vechcha vechchagaa ragilindii

metta metta gaa taakindii..vechcha vechchagaa ragilindi


మొగుడు-పెళ్ళాలు--1985



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వీటూరి సుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::Jandyaala
తారాగణం::నరేష్,భానుప్రియ,శుభలేఖ సుధాకర్,

పల్లవి::

నువ్వు కాటుక..దిద్దకపోతే 
మలి సంధ్యకు..చీకటి రాదు
నీ కౌగిట..చేరకపోతే 
ఆ చీకటి..వెన్నెల కాదు

నా దోసిట..మల్లెలతో 
నీ వాకిట..నిలవకపోతే
వయసుకి..వేసవి రాదు 
వలపుల..చలి పోదు
వయసుకి..వేసవి రాదు 
వలపుల..చలి పోదు

నువ్వు కాటుక..దిద్దకపోతే 
మలి సంధ్యకు..చీకటి రాదు
నీ కౌగిట..చేరకపోతే 
ఆ చీకటి..వెన్నెల కాదు

నా దోసిట..మల్లెలతో 
నీ వాకిట..నిలవకపోతే
వయసుకి..వేసవి రాదు 
వలపుల..చలి పోదు
వయసుకి..వేసవి రాదు 
వలపుల..చలి పోదు

చరణం::1

నువ్వు తెల్ల..చీర కట్టుకుంటే 
వెన్నెలాయె..నా దారి
వెన్ను మీద..కన్ను మూస్తే 
వెల్లువాయె..గోదారి

పూల గుడికి..చేరుకుంది 
చిలిపి తేటి..పూజారి
తేనె..వెన్నెలభిషేకాలే 
చేసుకుంది..ఈ రేయి

నువ్వు ముగ్గులు..పెట్టకపోతే 
నా ఇంటికి..వేకువ రాదు
నీ పాదమే..తాకకపోతే 
ఆ ముగ్గుకు..మురిపెం లేదు

నా కన్నుల..ఆశలతో 
నీ ముద్దులు..కోరకపోతే
రాత్రికి జాబిలి..రాదు 
రేయి..తెల్లవారదు
రాత్రికి జాబిలి..రాదు 
రేయి..తెల్లవారదు 

నువ్వు కాటుక..దిద్దకపోతే 
మలి సంధ్యకు..చీకటి రాదు
నీ కౌగిట..చేరకపోతే 
ఆ చీకటి..వెన్నెల కాదు

నా దోసిట..మల్లెలతో 
నీ వాకిట..నిలవకపోతే
వయసుకి..వేసవి రాదు 
వలపుల..చలి పోదు
వయసుకి..వేసవి రాదు 
వలపుల..చలి పోదు

చరణం::2

చిలిపి..నవ్వులూదగానే 
సిగ్గు పూల..చైత్రాలు
వలపు..చూపు చూడగానే 
చీకటింటి..కావ్యాలు

వెచ్చనైన..ఊపిరంతా 
వేణువైన..లాహిరిలు
మోహనాన..ఊహలెన్నో 
మోవి దాచు..అల్లర్లో

ఎద హారతి..పట్టకపోతే 
నా దేవుడు..నిదరే పోడు
విరిశయ్యను..పరవకపోతే 
పరువానికి..పరువే లేదు

నా పచ్చని..గడపలలో 
నీ పాదాలు..కడగకపోతే
ప్రేమకు..పొద్దే పోదు 
బ్రతుకే..అర్ధం కాదు
ప్రేమకు..పొద్దే పోదు 
బ్రతుకే..అర్ధం కాదు

నువ్వు కాటుక..దిద్దకపోతే 
మలి సంధ్యకు..చీకటి రాదు
నీ కౌగిట..చేరకపోతే 
ఆ చీకటి..వెన్నెల కాదు

నా దోసిట..మల్లెలతో 
నీ వాకిట..నిలవకపోతే
వయసుకి..వేసవి రాదు 
వలపుల..చలి పోదు
వయసుకి..వేసవి రాదు 
వలపుల..చలి పోదు

Mogudu-Pellalu--1985
Music::Rameshnaayudu
Lyrics::Veturisundararaammoorti
Singer::S.P.Baalu,S.Janaki
Film Directed By::Jandyaala
Cast::Naresh,Bhaanupriya,Subhaleka Sudhaakar.

:::::::::::::::::::::::::

nuvvu kaaTuka..diddakapOtE 
mali sandhyaku..cheekaTi raadu
nee kaugiTa..chErakapOtE 
aa cheekaTi..vennela kaadu

naa dOsiTa..mallelatO nee 
vaakiTa..nilavakapOtE
vayasuki..vEsavi raadu 
valapula..chali pOdu
vayasuki..vEsavi raadu 
valapula..chali pOdu

nuvvu kaaTuka..diddakapOtE 
mali sandhyaku..cheekaTi raadu
nee kaugiTa..chErakapOtE 
aa cheekaTi..vennela kaadu

naa dOsiTa..mallelatO nee 
vaakiTa..nilavakapOtE
vayasuki..vEsavi raadu 
valapula..chali pOdu
vayasuki..vEsavi raadu 
valapula..chali pOdu

::::1

nuvvu tella..cheera kaTTukunTE 
vennelaaye..naa daari
vennu meeda..kannu moostE 
velluvaaye..gOdaari

poola guDiki..chErukundi 
chilipi tETi..poojaari
tEne..vennelabhishEkaalE 
chEsukundi..ii rEyi

nuvvu muggulu..peTTakapOtE 
naa inTiki..vEkuva raadu
nee paadamE..taakakapOtE 
aa mugguku..muripem lEdu

naa kannula..aaSalatO 
nee muddulu..kOrakapOtE
raatriki..jaabili raadu 
rEyi..tellavaaradu
raatriki..jaabili raadu 
rEyi..tellavaaradu 

nuvvu kaaTuka..diddakapOtE 
mali sandhyaku..cheekaTi raadu
nee kaugiTa..chErakapOtE 
aa cheekaTi..vennela kaadu

naa dOsiTa..mallelatO 
nee vaakiTa..nilavakapOtE
vayasuki..vEsavi raadu 
valapula..chali pOdu
vayasuki..vEsavi raadu 
valapula..chali pOdu

::::2

chilipi..navvuloodagaanE 
siggu poola..chaitraalu
valapu choopu..chooDagaanE 
cheekaTinTi..kaavyaalu

vechchanaina..uupirantaa 
vENuvaina..laahirilu
mOhanaana..uuhalennO 
mOvi daachu..allarlO

eda haarati..paTTakapOtE 
naa dEvuDu..nidarE pODu
viriSayyanu..paravakapOtE 
paruvaaniki..paruvE lEdu

naa pachchani..gaDapalalO 
nee paadaalu..kaDagakapOtE
prEmaku..poddE pOdu 
bratukE..ardham kaadu
prEmaku..poddE pOdu 
bratukE..ardham kaadu

nuvvu kaaTuka..diddakapOtE 
mali sandhyaku..cheekaTi raadu
nee kaugiTa..chErakapOtE 
aa cheekaTi..vennela kaadu

naa dOsiTa..mallelatO 
nee vaakiTa..nilavakapOtE
vayasuki..vEsavi raadu 
valapula..chali pOdu
vayasuki..vEsavi raadu 
valapula..chali pOdu

Monday, June 15, 2015

కన్నతల్లి--1972



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి 

పల్లవి::

తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
నన్ను కన్న తల్లివి..నువ్వూ
నా పున్నెము పండిన..పంటవు నువ్వూ   
తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
నన్ను కన్న..తల్లివి నువ్వూ
నా పున్నెము పండిన..పంటవు నువ్వూ
తీయ తీయని..నవ్వే నువ్వూ 

చరణం::1

దేవతలిచ్చిన..దీవెనలన్నీ
తెచ్చిన చల్లని..పాపవు నువ్వూ
దేవతలిచ్చిన..దీవెనలన్నీ
తెచ్చిన చల్లని..పాపవు నువ్వూ
తీరిపోని..పూర్వజన్మబంధమేదో
తీరిపోని..పూర్వజన్మబంధమేదో 
తీసుకొచ్చి నింపినావు..నా ఒడిలో    
తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
తీయ తీయని..నవ్వే నువ్వూ

చరణం::2

నింగిలోన..తారకలన్నీ
నీ కన్నులలో.మెరిసినవీ
నింగిలోన..తారకలన్నీ
నీ కన్నులలో..మెరిసినవీ
చందమామ..చలువంతా
చందమామ..చలువంతా
నీ నవ్వులలోనే..యిమిడినది 
ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ 
ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ       
తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
తీయ తీయని..నవ్వే నువ్వూ 

చరణం::3
       
నా యింటి దీపము..నిలిపినావు
నా కంటి పాపవై..వెలసినావు
నా యింటి దీపము..నిలిపినావు
నా కంటి పాపవై..వెలసినావు
కన్నతల్లి కలలకు..కమ్మని రూపం
కన్నతల్లి కలలకు..కమ్మని రూపం
యిచ్చిన బంగారు..బొమ్మవు నీవు   
తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
నన్ను కన్న..తల్లివి నువ్వూ 
నా పున్నెము పండిన..పంటవు నువ్వూ
తీయ తీయని..నవ్వే నువ్వూ..ఊఊ 

విజేత--1985



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు   
తారాగణం::చిరంజీవి,భానుప్రియ

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎంత ఎదిగి పోయావయ్యా..ఆ
ఎదను పెంచుకున్నావయ్యా..ఆ
స్వార్థమనే..చీకటి ఇంటిలో
త్యాగమనే..దీపం పెట్టి 
ఎంత ఎదిగి పోయావయ్యా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎదను పెంచుకున్నావయ్యా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

చరణం::1

ముక్కు పచ్చలారలేదు..నలుదిక్కులు చూడలేదు
ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా
మచ్చలేని చంద్రుడి మనసు..వెచ్చనైన సూర్యుడి మమతా
నీలోనే చూశామయ్యా..నీకు సాటి ఇంక ఎవరయ్య 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎంత ఎదిగి పోయావయ్యా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::2

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన 
నీకు నీవు రాసుకున్న నుదిటి గీత..భగవథ్గీత
Greater love hath no man than this 
that a man lay down his life for his people
అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట 
దేవుడు అనే వాడు ఒకడుంటే..దీవించక తప్పదు నిన్ను
జీవేన శరదాంశతం
భవామ శరదాంశతం
నందామ శరదాంశతం

మువ్వగోపాలుడు--1987




సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Kodi Ramakrishna
తారాగణం::బాలకృష్ణ,రావుగోపాలరావు,G.మారుతిరావు,శోభన,విజయశాంతి,జయచిత్ర,అనిత,కల్పనరాయ్,టెలిఫొనె సత్యనారాయణ.  

పల్లవి::

వేగుచుక్కా..ఆ..వెలగాపండా..ఆ.ఎన్నెల్లో వెండికొండా
వేగుచుక్కా..ఆ..వెలగాపండా..ఆ.ఎన్నెల్లో వెండికొండా 
పండు చూస్తే నిండుగుంది..ఈ..పట్టబోతే..ఏఏ..బెట్టుగుంది
పండు చూస్తే నిండుగుంది..ఈ..పట్టబోతే..ఏఏ..బెట్టుగుంది

పండు మీద..ఆ..కన్నుపడ్డా..ఆ..కొండమీది..ఈ..గండు చిలకా 
పండు మీద..ఆ..కన్నుపడ్డా..ఆ..కొండమీది..ఈ..గండు చిలకా 
ఎందుకంతా..ఆ..తొందరంటా..ఆ..మాగేదాకా..ఆ..ఆగమంటా
ఎందుకంతా..ఆ..తొందరంటా..ఆ..మాగేదాకా..ఆ..ఆగమంటా
మాగేదాకా..ఆ..ఆగమంటా

వేగుచుక్కా..ఆ..వెలగాపండా..ఆ.ఎన్నెల్లో వెండికొండా

చరణం::1

అచ్చట్లు లేక ముచ్చట్లు లేక..గుప్పెట్లో దాస్తే ఎట్టామరి
సందిట్లోకైనా కౌగిట్లోకైనా..పందిట్లోతంతూ కానీమరి
అచ్చట్లు లేక ముచ్చట్లు లేక..గుప్పెట్లో దాస్తే ఎట్టామరి
సందిట్లోకైనా కౌగిట్లోకైనా..పందిట్లోతంతూ కానీమరి
రేపే..ఏఏ..మన కల్యాణం..నేడే..ఏఏ..ముద్దు తాంబూలం 
పోనీ..ఈ..ఆషాడమాసం మరి రానీ..ఈ..వైశాఖమాసం

హహ్హా..వేగుచుక్కా..ఆ..వెలగాపండా..ఆ.ఎన్నెల్లో వెండికొండా 
పండు మీద..ఆ..కన్నుపడ్డా..ఆ..కొండమీది..ఈ..గండు చిలకా

చరణం::2

కడియాలు మోగా అడుగేసిరాగా..కదిలింది నాలో నాదస్వరం 
మలిసందే కాగా మనసూగి పోగా..మామిళ్ళతోపే బృందావనం 
కడియాలు మోగా అడుగేసిరాగా..కదిలింది నాలో నాదస్వరం 
మలిసందే కాగా మనసూగి పోగా..మామిళ్ళతోపే బృందావనం
నీరూ..ఊ..పే చంద్రరేఖా నీరా..ఆ..కా ఏరువాకా 
నీమా..ఆ..టే శుభలేఖ అది నిలవా..ఆ..లి కడదాకా

హహ్హా..వేగుచుక్కా..ఆ..వెలగాపండా..ఆ.ఎన్నెల్లో వెండికొండా 
పండు మీద..ఆ..కన్నుపడ్డా..ఆ..కొండమీది..ఈ..గండు చిలకా
లలలలా..ఆఆఆ..లలలలా..లలలలా..ఆఆఆ..లలలలా

Muvvagopaaludu--1987
Music::K.V.Mahadevan
Lyrics::D.C.NaaraayaNareDDi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Kodi Ramakrishna
Cast::Baalakrishna,RaogopalRao,G.Marutirao,Sobhana,Vijayasaanti,Jayachitra,anita,Kalpanaray,Teliphone Satyanarayana.

::::::::::::::::::::::

vEguchukkaa..aa..velagaapanDaa..aa.ennellO venDikonDaa
vEguchukkaa..aa..velagaapanDaa..aa.ennellO venDikonDaa 
panDu choostE ninDugundi..ii..paTTabOtE..EE..beTTugundi
panDu choostE ninDugundi..ii..paTTabOtE..EE..beTTugundi

panDu meeda..aa..kannupaDDaa..aa..konDameedi..ii..ganDu chilakaa 
panDu meeda..aa..kannupaDDaa..aa..konDameedi..ii..ganDu chilakaa 
endukantaa..aa..tondaranTaa..aa..maagEdaakaa..aa..aagamanTaa
endukantaa..aa..tondaranTaa..aa..maagEdaakaa..aa..aagamanTaa
maagEdaakaa..aa..aagamanTaa

vEguchukkaa..aa..velagaapanDaa..aa.ennellO venDikonDaa

::::1

achchaTlu lEka muchchaTlu lEka..guppeTlO daastE eTTaamari
sandiTlOkainaa kougiTlOkainaa..padiTlOtantoo kaaneemari
achchaTlu lEka muchchaTlu lEka..guppeTlO daastE eTTaamari
sandiTlOkainaa kougiTlOkainaa..padiTlOtantoo kaaneemari
rEpE..EE..mana kalyaaNam..nEDE..EE..muddu taamboolam 
pOnii..ii..aashaaDamaasam mari raanii..ii..vaiSaakhamaasam

hahhaa..vEguchukkaa..aa..velagaapanDaa..aa.ennellO venDikonDaa 
panDu meeda..aa..kannupaDDaa..aa..konDameedi..ii..ganDu chilakaa

::::2

kaDiyaalu mOgaa aDugEsiraagaa..kadilindi naalO naadaswaram 
malisandE kaagaa manasoogi pOgaa..maamiLLatOpE bRndaavanam 
kaDiyaalu mOgaa aDugEsiraagaa..kadilindi naalO naadaswaram 
malisandE kaagaa manasoogi pOgaa..maamiLLatOpE bRndaavanam
neeruu..uu..pE chandrarEkhaa neeraa..aa..kaa Eruvaakaa 
neemaa..aa..TE SubhalEkha adi nilavaa..aa..li kaDadaakaa

hahhaa..vEguchukkaa..aa..velagaapanDaa..aa.ennellO venDikonDaa 
panDu meeda..aa..kannupaDDaa..aa..konDameedi..ii..ganDu chilakaa
lalalalaa..aaaaaaaa..lalalalaa..lalalalaa..aaaaaaaa..lalalalaa