Friday, September 10, 2010

మైనరు బాబు--1973




సంగీతం::T.చలపతిరావు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,P. సుశీల
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, S.V. రంగారావు

పల్లవి::

మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ
ఆశలు పండీ ఆకలితీరి
బ్రతుకులు మారే పండుగరోజూ         
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ

చరణం::1

గొప్ప గొప్పవాళ్ళ కెదురు నిలిచిన రోజూ
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజూ
గొప్ప గొప్పవాళ్ళ కెదురు నిలిచిన రోజూ
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజూ
జబ్బ చరిచిన రోజు రొమ్ము విరిచిన రోజూ
మనం గెలిచినరోజూ
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ

చరణం::2

కూలి యజమాని తేడాలెవుండవు
ఈ కులాల ఈ మతాల గొడవ లుండవు
అందరిదొకటే మాట అందరిదొకటే బాట
అందరిదొకటే మాట..అందరిదొకటే బాట
ఇకపై చూడు బరాటా..ఆ..లలలా..ఆఆఆ
లలలా..ఆఆఆ..లలలలా..ఆఆఆ  

పనిచేస్తే అన్నానికి లోటు వుండదూ
సోమరిపోతులకు నిలువ నీడవుండదూ
పనిచేస్తే అన్నానికి లోటు వుండదూ
సోమరిపోతులకు నిలువ నీడవుండదూ
ఇది సామ్యవాదయుగం..ఇటే నడుస్తుంది జగం
ఇక ఆగదులే ఆగదులే..జగన్నాధ రథం..హోయ్...
             
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ
ఆశలు పండీ ఆకలితీరి
బ్రతుకులు మారే పండుగరోజూ
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ

మైనరు బాబు--1973




సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::పిఠాపురం నాగేశ్వరరావు
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, S.V. రంగారావు

పల్లవి::

అంగట్లో అన్నీ వున్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ క్యాకరూం ఏం చేద్దాం ?
అంగట్లో అన్నీ వున్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ క్యాకరూం ఏం చేద్దాం ?

చరణం::1

బెజవాడ ప్రక్కనే కృష్ణ వుందీ
నిండా నీరు వుందీ బాగా పారుతుందీ
పట్టణంలో నీళ్ళపంపు లెన్నో వున్నా
పట్టుకుందామంటే బండిసున్నా 
నీల్లు నిండుసున్నా..నోళ్ళు ఎండునన్నా 
   
అంగట్లో అన్నీ వున్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ క్యాకరూం ఏం చేద్దాం ?

చరణం::2

ఏడుకొండలవాడా వెంకట్రమణా..గోవిందా గోవింద 
తిరుపతి వెంకన్న దయవుందీ..పైగా డబ్బు వుందీ
అయితే మన కేముందీ 
పూటకోక్క కాలేజి పుడుతుందీ
చదువులే చెప్పేస్తుందీ..డిగ్రీ లిచేస్తుందీ 
ఆ డిగ్రీలు మోసుకుని డిల్లీ దాకా వెల్లి..ఉద్యొగాలిమ్మంటే యెమవుతుందీ 
ఏమవుతుందీ..కాలు అరగుతుందీ..చొక్కా చిరుగుతుందీ
ఆకలి పెరుగుతుందీ..ఆయాసం మిగులుతుందీ
ఆకలి పెరుగుతుందీ..ఆయాసం మిగులుతుందీ
అప్పటికీ నువు అక్కడేవుంటే చిప్పచేతికే వస్తుందీ..చిప్పచేతికే వస్తుందీ 
           
అంగట్లో అన్నీ వున్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ క్యాకరూం ఏం చేద్దాం ?

చరణం::3

మైనరు బాబుకు లోటేముందీ 
దభ్భుకు లోటేముందీ..తిండికి లోటేముందీ
అందుకే పంతాలు మానేసి..పట్టింపులొదిలేసి
దర్జాగ ఇంటికి చేరుకుంటే..చేరుకుంటే ?
దొరుకుతుంది ఇడ్లి అయినా..గడుస్తుంది ఒక పూటైనా
నీ కోసం కాకున్నా..మా కోసం పదరా నాయనా 
నీ కోసం కాకున్నా..మా కోసం పదరానైనా
ఎంత చెప్పినా యిదిలిచుకొని..ఎక్కడికో పోతున్నాడే
ఇంటికి రానన్నాడే..వాట్ టుడూ